Jaya Sudha
-
టాలీవుడ్ హీరోపై మనసు పడిన రాశీఖన్నా
నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ 2 టాక్ షోకు రోజురోజుకూ అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. తన మ్యానరిజం,చమత్కారంతో టీఆర్పీ రేటింగ్స్‌ను పరుగులు పెట్టిస్తున్నారు బాలయ్య. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే షో సెకండ్ సీజన్ కూడా సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతుంది. ఇప్పటికే 5 ఎపిసోడ్లు స్ట్రీమింగ్ కాగా, తాజాగా లేటెస్ట్ ప్రోమోను వదిలారు. అలనాటి హీరోయిన్స్ జయసుధ, జయప్రదలతో పాటు యంగ్ బ్యూటీ రాశీఖన్నాలు షోలో సందడి చేయనున్నారు. ఈ క్రమంలో నారీనారీ నడుమ మురారి అంటూ ముగ్గురు హీరోయిన్స్‌తో బాలయ్య అల్లరి ఏ విధంగా ఉంటుందో ప్రోమోలో చూపించారు. ఇక హీరోయిన్ రాఖీఖన్నా మనసులో చోటు సంపాదించుకున్న టాలీవుడ్ హీరో గురించి కూడా బయటపెట్టేశారు. నువ్వు నటించిన హీరోల్లో నీ క్రష్ ఎవరు అని బాలయ్య అడగ్గా ఏమాత్రం తడుముకోకుండా విజయ్ దేవరకొండ అంటూ ఓపెన్ కామెంట్స్ చేసింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట చక్కర్లు కొడుతుంది. -
బీజేపీలోకి సినీనటి జయసుధ
-
ఊపందుకున్న ఆపరేషన్ ఆకర్ష్.. బీజేపీలోకి జయసుధ?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ ఆకర్ష్‌ను వేగవంతం చేసింది. అందులో భాగంగా బీజేపీ జాయినింగ్ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేంద్ర.. మాజీ ఎమ్మెల్యే, సినీ నటి జయసుధతో మంగళవారం సమావేశమై పార్టీలో చేరికకు సంబంధించిన చర్చలు దాదాపు పూర్తిచేసినట్లు సమాచారం. ఒకవైపు సినీరంగ ప్రముఖులు, మరోవైపు మేధావి వర్గంపైనా బీజేపీ గురిపెట్టింది. ఈ నెల 21న అమిత్ షా సమక్షంలో పలువురు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్‌ల చేరికకు బీజేపీ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అటు ప్రజాసంఘాల మద్దతును కూడా కోరుతున్నారు. అమిత్ షా తెలంగాణ పర్యటన నేపథ్యంలో భారీగా పార్టీలో చేరికలకు ఈటల రాజేంద్ర ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, జయసుధ గతంలో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఆమె రాజకీయాలకు కొంత దూరంగా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఏ పార్టీలోనూ లేరు. సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలో జయసుధ కొంత పట్టుండటంతో ఆమెను పార్టీలోకి తీసుకొనేందుకు బీజేపీ ఆసక్తి కనబరుస్తోంది. ఈ నేపథ్యంలోనే అమిత్ షా పర్యటన సందర్భంగా పార్టీలో చేరాలని ఈటల రాజేంద్ర.. జయసుధను కోరినట్లు సమాచారం. చదవండి: ('అందుకోసమే బీజేపీ రాజగోపాల్ రెడ్డితో రాజీనామా చేయించింది') -
సహజనటి జయసుధకు కరోనా.. త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు
Jayasudha Tested Positive For Covid-19: కరోనా మహమ్మారి సినీ ఇండస్ట్రీని ఇంకా వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే పలువురు స్టార్స్ కరోనా బారిన పడ్డారు. తాజాగా సహజనటి జయసుధ కూడా కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆమె హోం ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఇక జయసుధకి కరోనా అని తెలియగానే ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ అభిమానులు సహా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
శోభన్‌బాబు చేసిన ఏకైక వ్యాపారం ఏంటో తెలుసా?
సృష్టిలో తియ్యనిది తల్లి ప్రేమ! ఒకరు కన్నతల్లి! మరొకరు తల్లి కాని తల్లి! ఇద్దరమ్మల ముద్దుల బిడ్డ మమతల కథ... ‘ఇల్లాలు’. శోభన్‌బాబు, జయసుధ, శ్రీదేవి నటించిన ఈ కుటుంబ కథాచిత్రం అప్పట్లో సూపర్ హిట్ సినిమా. ‘ఓ బాటసారీ ఇది జీవిత రహదారి..’, ‘అల్లరి కృష్ణుడు అందరి కృష్ణుడు ఎవ్వరి వాడమ్మా...’ లాంటి పాటలతో గుర్తుండిపోయిన సినిమా. లేడీ ఫ్యాన్స్ అమితంగా ఉన్న హీరో శోభన్‌బాబుకూ, నటనలో ఉన్నత శిఖరాలకు ఎగబాకుతున్న సమయంలో హీరోయిన్లు జయసుధ, శ్రీదేవికీ కెరీర్లో అది ఓ మైలురాయి సినిమా. 1981 ఏప్రిల్‌లో రిలీజైన ‘ఇల్లాలు’కు ఇప్పుడు 40 వసంతాలు. ఇల్లాలు.. భర్తకు ప్రేమమూర్తి. బిడ్డకుమాతృమూర్తి! సృష్టికే దేవతామూర్తి!!! భార్యాభర్తల అనుబంధానికీ, కుటుంబ బంధానికీ నిర్వచనమైన ఈ అంశాన్నే తెరపై సెంటిమెంట్ నిండిన కుటుంబకథగా చెప్పింది ‘ఇల్లాలు’ చిత్రం. బాబు ఆర్ట్స్ పతాకంపై జి. బాబు నిర్మాతగా, అట్లూరి పూర్ణచంద్రరావు సమర్పణలో, తాతినేని రామారావు దర్శకత్వంలో తయారైందీ సినిమా. ఈ ముగ్గురూ స్నేహితులు, వ్యాపార భాగస్వాములు. ఆ రకంగా ఇది ఆ ముగ్గురి సినిమా. ఇంకా గమ్మత్తేమిటంటే, శోభన్‌బాబు ఆర్థిక అండదండలతో ఏర్పాటైన అప్పటి ప్రముఖ పంపిణీ సంస్థ లక్ష్మీచిత్ర (నైజామ్‌లో శ్రీలక్ష్మీచిత్ర)యే ఈ చిత్రాన్ని విడుదల చేసింది. అలా మిత్రులందరి సమష్టి సినీ ప్రాజెక్టుగా ‘ఇల్లాలు’ ముందుకు నడిచింది. ఇద్దరు తల్లుల కథ – ‘ఇల్లాలు’! సంసారం సవ్యంగా సాగాలంటే, భార్యాభర్తల మధ్య ఉండాల్సింది అవగాహన. ఆ విషయాన్ని ఈ చిత్రం అర్థవంతంగా చెప్పింది. ఆస్తిపాస్తులతో, ధనవంతుల ఇంట్లో పుట్టిపెరిగిన, అహంకారపూరితమైన అమ్మాయి కల్పన (జయసుధ). సామాన్య జీవితాన్ని సాగిస్తున్న కథానాయకుడు కిరణ్ (శోభన్ బాబు)ను ప్రేమించి, పెళ్ళి చేసుకుంటుంది. ఓ బిడ్డ పుట్టాక, భర్తతో ఇమడలేనంటూ, అహంభావంతో కాపురాన్ని కాలదన్నుకుంటుంది. ఆ పరిస్థితుల్లో మరో అమ్మాయి జ్యోతి (శ్రీదేవి)ని పెళ్ళి చేసుకుంటాడు. అతని బిడ్డను కన్నతల్లిలా పెంచుతుంటుంది ఆమె. మొదటి భార్య కల్పన తాను పోగొట్టుకున్నదేమిటో గ్రహించి, వెనక్కివచ్చి తన కన్నబిడ్డను ఇమ్మని హీరోను అడుగుతుంది. కన్నపాశం, పెంచిన మమకారం మధ్య నడిచే ఈ చైల్డ్ సెంటిమెంట్ కథ విశేష ప్రేక్షకాదరణ పొందింది. అహంకారంతో కాపురాన్నీ, కన్నబిడ్డనూ కాదనుకున్న సెంటిమెంటల్ పాత్రలో జయసుధ, ఒద్దికైన ఇంటి ఇల్లాలుగా శ్రీదేవి, భర్త పాత్రలో శోభన్‌బాబు రాణించారు. సంసార సూత్రాలు గొల్లపూడి రచనలో వినిపిస్తాయి. హిందీ హిట్ కథకు ఇది రీమేకైనప్పటికీ, మూలాన్ని అనుసరిస్తూనే, మన నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేశారు. కథనంలోని ఇలాంటి మార్పులు, సెంటిమెంట్ బాగా పండించడం ‘ఇల్లాలు’ విజయానికి తోడ్పడ్డాయి. ఒకే దర్శకుడు – రెండు హిట్లు! ఆ ఏడాది మొదట్లో వచ్చిన శోభన్‌బాబు చిత్రాలు ‘పండంటి జీవితం’, ‘ఇల్లాలు’ – రెండింటికీ దర్శకుడు తాతినేని రామారావే. ఆయన దర్శకత్వంలో అంతకు ముందెప్పుడో అక్కినేనితో వచ్చిన ‘ఆలుమగలు’కే పాత్రలతో సహా కొన్ని కీలక మార్పులు చేసి, ‘పండంటి జీవితం’ అందించారాయన. ‘ఇల్లాలు’ ఏమో హిందీ సూపర్ హిట్ చిత్రం ‘అప్నాపన్’ (చుట్టరికం అని అర్థం – 1977)కు రీమేక్. జితేంద్ర, రీనారాయ్, సులక్షణా పండిట్ నటించగా దర్శక, నిర్మాత జె. ఓం ప్రకాశ్ రూపొందించిన ఆ చిత్రం పెద్ద హిట్. హిందీ మాతృకలో లక్ష్మీకాంత్ – ప్యారేలాల్ సంగీతంలో ‘ఆద్మీ ముసాఫిర్ హై...’ అంటూ మహమ్మద్ రఫీ, లతా మంగేష్కర్ పాడే పాట పెద్ద హిట్. తెలుగు రీమేక్‌లోనూ జేసుదాస్, ఎస్పీ శైలజ పాడిన సందర్భోచిత ఆత్రేయ రచన ‘ఓ బాటసారీ ఇది జీవిత రహదారి...’ మారుమోగిపోయింది. ఈ పాట సినిమాలో పలు సందర్భాల్లో పదే పదే వినిపిస్తూ, కథలోని మూడ్‌ను పెంచింది. తోటి హీరోల్లో... ఆయనదే రికార్డు! అప్పట్లో ‘ఇల్లాలు’ చిత్రం 6 కేంద్రాలలో (విజయవాడ, గుంటూరు, వైజాగ్, రాజమండ్రి, తెనాలి, హైదరాబాద్) డైరెక్టుగా వంద రోజులు ఆడింది. 2 కేంద్రాలలో (కాకినాడ, చీరాల) షిఫ్టుతో, రోజుకు మూడు ఆటలతో శతదినోత్సవం చేసుకుంది. అలా 8 కేంద్రాలలో రెగ్యులర్ షోలతో శతదినోత్సవం జరుపుకొన్న చిత్రమైంది. ఇవి కాక, మరో 4 కేంద్రాలలో నూన్ షోలతో – మొత్తంగా 12 కేంద్రాలలో ఈ ఫ్యామిలీ డ్రామా వంద రోజుల పండగ చేసుకుంది. 1981 ఆగస్టు 16న మద్రాసులోని చోళా హోటల్లో శతదిన ఘనమహోత్సవం జరిపారు. ప్రేక్షకాదరణతో ఆపైన ‘ఇల్లాలు’ రజతోత్సవమూ చేసుకుంది. బాక్సాఫీస్ లెక్క చూస్తే – ఇలా ఎనిమిది, అంతకు మించి కేంద్రాలలో రెగ్యులర్ షోలతో వంద రోజులు ఆడిన సినిమాలు శోభన్‌బాబు కెరీర్లో ఏకంగా పది ఉన్నాయి. ‘ఇల్లాలు’కు ముందు ఆయన కెరీర్లో 8 చిత్రాలు కనీసం 8 కేంద్రాల్లో వంద రోజులాడాయి. ‘సంపూర్ణ రామాయణం’ (10 కేంద్రాలు), ‘జీవన తరంగాలు’(12), ‘శారద’ (8), ‘మంచి మనుషులు’(11), ‘జీవనజ్యోతి’ (12), ‘జేబుదొంగ’(10), ‘సోగ్గాడు’ (19), ‘గోరింటాకు’ (8), తర్వాత ‘ఇల్లాలు’ (8 కేంద్రాలు) 9వ సినిమా అయింది. ఆ తర్వాత ‘దేవత’ చిత్రం (9 కేంద్రాలు) ఆ శతదినోత్సవ విజయాల జాబితాలో పదోది అయింది. గమ్మత్తేమిటంటే, తన సమకాలీన హీరోలలో అలాంటి శతదినోత్సవ చిత్రాలు అత్యధికంగా ఉన్నది శోభన్‌బాబుకే! ఇలా పది చిత్రాలతో శోభన్‌బాబు హయ్యస్ట్‌గా నిలిస్తే, ఆయన సమకాలీన హీరోల సెకండ్ హయ్యస్ట్ 4 చిత్రాలే కావడం గమనార్హం! ఆ రోజుల్లో హీరోల్లో శోభన్ బాబుకు మహిళాదరణ ఎక్కువ. ఆ కారణంగా ఆయన సినిమాలు బాగా ఆడేవి. ఎక్కువ రోజుల రన్ కూడా వచ్చేది. సమకాలీన హీరోలకు మించి ఆయనకు శతదినోత్సవ చిత్ర రికార్డుకు అది ఓ ప్రత్యేక కారణం. శోభన్‌బాబు ఈ పది శతదినోత్సవ చిత్రాల విజయయాత్ర సాగించిన 1972 – 1982 మధ్య కాలానికి సంబంధించి మొత్తం తెలుగు సినీపరిశ్రమ పరంగా గమనిస్తే – ఎన్టీఆర్ (15 చిత్రాలు) తరువాత శోభన్ బాబుదే (10 చిత్రాలు) అగ్రస్థానం. చివరకు సీనియర్ హీరోలతో సహా మిగతా హీరోలెవరూ శోభన్బాబులో సగం మార్కును కూడా దాటలేకపోయారు. అదీ ఆ కాలఘట్టంలో హీరో శోభన్బాబుకున్న సక్సెస్ స్టామినా! ముగ్గురు మిత్రుల ‘దీపారాధన’ ఒకపక్కన ‘ఇల్లాలు’ క్రిక్కిరిన ప్రేక్షకులతో ఆడుతుంటే, అదే సమయంలో... ఆ పక్కనే కూతవేటు దూరంలో... వేరే హాలులో శోభన్‌బాబు సినిమా ‘దీపారాధన’ సక్సెస్‌ఫుల్‌గా నడవడం ఆ రోజుల్లోని ఓ విశేషం. ‘బలిపీఠం’, ‘గోరింటాకు’ తరువాత దర్శకుడు దాసరి – శోభన్‌బాబుల కాంబినేషన్లో వచ్చిన మూడో సినిమా ఇది. స్నేహం విలువను చాటే ఈ సినిమా నిరుద్యోగులైన ముగ్గురు ప్రాణమిత్రుల (శోభన్, మోహన్‌బాబు, మురళీమోహన్) కథ. వారిలో ఒకరైన హీరోకు పెళ్ళి కావడం... ఎదురైన సంఘటనలు... త్యాగాలు... ఇలా సెంటిమెంటల్‌గా సాగే, సంభాషణల ప్రధానమైన సినిమా ఇది. ‘వచ్చే జన్మంటూ ఉంటే మీ భార్యగా కాకుండా, స్నేహితుడిగా పుట్టాలని కోరుకుంటున్నా’ అంటూ కన్నుమూసే త్యాగభరిత కథానాయికగా జయప్రద కనిపిస్తారు. చక్రవర్తి బాణీల్లో ‘సన్నగా సనసన్నగా...’, ‘తూరుపు తిరిగి దణ్ణం పెట్టు అన్నారండి మావారు...’ పాటలు అప్పట్లో పదే పదే వినిపించేవి. ‘దీపారాధన’ మధ్యతరగతి మహిళలను ఆకట్టుకుంది. ‘ఇల్లాలు’ తర్వాత రెండు రోజుల తేడాలో ‘దీపారాధన’ షిఫ్టులు, నూన్ షోలతో 10 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకొంది. వంద రోజుల్లో...3 వంద రోజులు నిజం చెప్పాలంటే, శోభన్ బాబుకు ఒకటికి మూడు శతదినోత్సవ చిత్రాలు అందించి, బాగా కలిసొచ్చిన సంవత్సరాల్లో ఒకటి – 1981. ఆ ఏడాది జనవరి 1న వచ్చిన ‘పండంటి జీవితం’ వంద రోజులు ఆడింది. అప్పట్లో విజయవాడ (కల్యాణచక్రవర్తి థియేటర్) సహా 4 కేంద్రాలలో ‘పండంటి జీవితం’ చిత్రాన్ని 98 రోజులకే ఎత్తేసి, 99వ రోజున ఏప్రిల్ 9న అదే శోభన్‌బాబు నటించిన కొత్త చిత్రం ‘ఇల్లాలు’ రిలీజ్ చేశారు. గమ్మత్తేమిటంటే, ‘ఇల్లాలు’ కూడా సూపర్ హిట్టయి, వంద రోజులు దాటేసింది. ఇంకా గమ్మత్తేమిటంటే, ‘ఇల్లాలు’ రిలీజయ్యాక రెండు రోజుల తేడాతో ఏప్రిల్ 11న శోభన్‌బాబు నటించినదే ‘దీపారాధన’ రిలీజైంది. ఒక పక్కన ‘ఇల్లాలు’ విపరీతమైన ఆదరణతో నడుస్తుండగానే, మరోపక్క ‘దీపారాధన’ కూడా హిట్టయింది. శతదినోత్సవమూ జరుపుకొంది. మొత్తానికి, వంద రోజుల వ్యవధిలో 3 వంద రోజుల సినిమాలు రావడం ఏ హీరోకైనా అరుదైన సంఘటన. ఆ మూడూ కుటుంబ కథలు, సెంటిమెంట్ చిత్రాలే తప్ప, మాస్ యాక్షన్ సినిమాలు కావు. అది గమనార్హం. అప్పట్లో శోభన్‌బాబు సినిమాకున్న మహిళాదరణకు అది ఓ నిదర్శనం. శోభన్‌బాబు చేసిన ఏకైక సినీ వ్యాపారం! అప్పట్లో దర్శకుడు తాతినేని రామారావు, నిర్మాణ సారథులు అట్లూరి పూర్ణచంద్రరావు, జి. బాబు, తరువాతి కాలంలో నిర్మాతగా పేరు తెచ్చుకున్న వై. హరికృష్ణ (మేనేజింగ్ పార్ట్నర్) – నలుగురూ కలసి చిత్రనిర్మాణం చేసేవారు. కేంద్రీకృత సినీ పంపిణీ వ్యవస్థ ఇంకా పట్టుసడలని సమయం అది. ఆ పరిస్థితుల్లో ఆ నలుగురూ, హరికృష్ణ మేనల్లుడైన కాట్రగడ్డ ప్రసాద్, హైదరాబాద్ ‘వెంకటేశా’ థియేటర్ బి.వి. రాజు, తర్వాత టి.టి.డి చైర్మనైన ఆదికేశవులునాయుడు భాగస్వాములుగా ‘లక్ష్మీచిత్ర’ అనే ఓ కొత్త పంపిణీ సంస్థను ప్రారంభించారు. హీరో శోభన్‌బాబు ఆర్థికంగా అండగా నిలిచారు. తన సతీమణికి అన్నగారైన గోపిని అందులో భాగస్వామిని చేశారు. ఒకరకంగా శోభన్‌బాబు సినీ వ్యాపారమంటూ చేసింది – ఈ పంపిణీ సంస్థలో చేతులు కలపడమొక్కటే! 1979 మార్చి 29న విజయవాడలో ‘లక్ష్మీచిత్ర’ కార్యాలయం ప్రారంభమైంది. ఆంధ్రాలో ‘లక్ష్మీచిత్ర’గా, నైజామ్‌లో ‘శ్రీలక్ష్మీచిత్ర’గా వ్యాపారం నడిచింది. శోభన్ హీరోగా నటించిన ‘కార్తీకదీపం’ తొలి ప్రయత్నంగా విడుదలైంది. అది సూపర్ హిట్. అక్కడ నుంచి ‘లక్ష్మీచిత్ర’ వెనుదిరిగి చూడలేదు. వరుసగా కొన్నేళ్ళు శోభన్ సినిమాలన్నీ ఆ సంస్థే పంపిణీ చేసింది. 1981 మొదట్లో రిలీజైన ‘పండంటి జీవితం’, ‘ఇల్లాలు’– లక్ష్మీచిత్ర రిలీజ్లే. శోభన్‌తో చిత్రాలు నిర్మించే స్థాయికి వై. హరికృష్ణ ఎదిగారు. కాట్రగడ్డ ప్రసాద్ ‘వసుధాచిత్ర’తో డిస్ట్రిబ్యూషన్ నడిపి, మేనమామ బాటలో నిర్మాత అయరు. ఇప్పుడు సౌతిండియన్ ఫిల్మ్‌ఛాంబర్ అధ్యక్షుడయ్యారు. మహిళలు మెచ్చిన అందాల నటుడు సినిమాల్లోనే కాదు... చదువుకొనే రోజుల నుంచి అందగాడు శోభన్ బాబుకు లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ. చదువుకొనే రోజుల్లో ఆఖరు నిమిషంలో కాలేజీ ఎన్నికల్లో అనుకోకుండా పాల్గొనాల్సి వచ్చినప్పుడు కూడా ఆయనకు లేడీ స్టూడెంట్స్ ఓట్లు మూకుమ్మడిగా పడ్డాయి. అనూహ్యంగా ఆయన గెలిచారు. ఆ సంగతి శోభన్‌బాబే స్వయంగా రాశారు. సినిమాల్లోకి వచ్చాక కూడా ఆయనకు మహిళా అభిమానులే ఎక్కువ. ‘శారద’, ‘జీవన తరంగాలు’, ‘జీవనజ్యోతి’ చిత్రాల రోజుల నుంచి ఆ ఫాలోయింగ్ అలా కొనసాగుతూ వచ్చింది. అందుకే, ఒక దశ దాటిన తరువాత నుంచి ఆయన తన ప్రధాన అభిమాన వర్గమైన మహిళా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొనే సినిమాలు చేసేవారు. మహిళలు మెచ్చే అంశాలు, సెంటిమెంట్ ఉండేలా చూసుకొనేవారు. 1979 నాటి ‘కార్తీక దీపం’ మొదలు ‘గోరింటాకు’, ‘ఇల్లాలు–ప్రియురాలు’, ‘శ్రావణసంధ్య’(’86) – ఇలా అన్నీ అశేష మహిళాదరణతో ఆయన కెరీర్‌ను అందంగా తీర్చిదిద్దినవే. మరణానంతరం కూడా ఇవాళ్టికీ ఆయనకు ఒక వర్గం అభిమానులు ఉన్నారంటే, దానికి ఆ కథలు, ఆ సినిమాలు అందించిన ఇమేజే కారణం. – రెంటాల జయదేవ -
వెండితెర సోగ్గాడు @45 ఇయర్స్
ఒక్కో హీరో కెరీర్లో ఒక్కో సినిమా ఉంటుంది... కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా. జనం మనసు దోచి, బాక్సాఫీస్‌ను కొల్లగొట్టిన సినిమా. కాలం మారినా... మరపురాని సినిమా. ఆంధ్రుల అందాల నటుడిగా, ఇద్దరు హీరోయిన్ల ముద్దుల ప్రియుడిగా చరిత్ర సష్టించిన హీరో శోభన్ బాబు కెరీర్లో అలాంటి ఓ స్పెషల్ సినిమా ‘సోగ్గాడు’. అది ఎంత స్పెషల్ అంటే, ‘వెండితెర సోగ్గాడు’ అంటే శోభన్ బాబే అనేటంతగా స్పెషల్. సరిగ్గా 45 ఏళ్ళ క్రితం 1975 డిసెంబర్ 19న రిలీజైన ‘సోగ్గాడు’ చిత్రంలోని ఉర్రూతలూపిన పాటలు, బాక్సాఫీస్‌ను ఊపేసిన వసూళ్ళు ఇవాళ్టికీ ఓ చెరిగిపోని చరిత్రే! గ్రామీణ నేపథ్యంలోని ఓ కథ గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని కేంద్రాలలో విజయఢంకా మోగించడం విశేషమే. శోభన్ బాబు హీరోగా, సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు అందించిన అలాంటి బాక్సాఫీస్ విశేషం ‘సోగ్గాడు’. ఊరంతా సోగ్గాడుగా పిలిచే శోభనాద్రి (శోభన్ బాబు), అతని మరదలు (జయసుధ), అనుకోకుండా నగరంలోని హోటల్ రూమ్‌లో అతను పెళ్ళాడిన అమ్మాయి (జయచిత్ర) మధ్య నడిచే కథ ఇది. కృష్ణాజిల్లా కోలవెన్ను, ఈడ్పుగల్లు, అలాగే రామానాయుడు తన స్వగ్రామం కారంచేడులో తొలిసారిగా షూటింగ్ చేసిన ఈ చిత్రం అప్పట్లో ఓ సెన్సేషనల్ హిట్. నిజజీవితంలోని తన బాబాయిని అనుకరిస్తూ, కోరమీసం, పంచెకట్టుతో, ఎడ్లబండి నడుపుతూ, ‘తస్సాదియ్యా’ అనే ఊతపదంతో ఆ రోజుల్లో శోభన్ బాబు చేసిన నటన, జయసుధ, జయచిత్రల గ్లామర్ అండగా ఆబాలగోపాలాన్ని అలరించిన సినిమా ఇది. స్టార్ డమ్ తెచ్చిన సూపర్ హిట్: శోభన్ బాబు కబడ్డీ ఆటగాడుగా కనిపించే ఈ చిత్రం అప్పట్లో ఎదురులేని ప్రజాదరణతో అఖండ విజయం సాధించింది. ‘సోగ్గాడు’ రిలీజవడానికి సరిగ్గా వారం ముందు... 1975 డిసెంబర్ 12న ఇదే చిత్ర దర్శకుడు కె. బాపయ్య డైరెక్షన్లోనే పెద్ద ఎన్టీఆర్ నటించిన ‘ఎదురులేని మనిషి’ వచ్చింది. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై నిర్మాత అశ్వినీదత్‌కు అదే తొలి సినిమా. ఎన్టీఆర్‌ను ఓ కొత్త పంథాలో చూపించిన ఆ సినిమా ఓ పక్కన ఆడుతుండగానే, సీనియర్ టాప్ హీరోతో పోటాపోటీగా శోభన్ బాబును నిలిపింది ‘సోగ్గాడు’. థియేటర్లలో విజయఢంకా మోగించిన ఈ చిత్రం విడుదలైన అనేక కేంద్రాలలో విజయ విహారం చేస్తూ, వసూళ్ళలో నూతన అధ్యాయం çసృష్టించింది. బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు నెలకొల్పింది. విడుదలైన 31 కేంద్రాలలో 50 రోజుల పండగ జరుపుకొంది. 19 కేంద్రాలలో వందల రోజుల పైగా ఆడింది. శోభన్ బాబు కెరీర్లో అత్యధిక కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకున్న చిత్రం ఇదే. వెరసి... సరికొత్త స్టార్ హీరోగా శోభన్ బాబు అవతరించడానికి తోడ్పడింది. తమిళ స్టార్ శివాజీగణేశన్ ముఖ్య అతిథిగా చిత్రయూనిట్ అంతా పాల్గొనగా, విజయవాడలో వందరోజుల వేడుక జరుపుకొన్న ఈ చిత్రం బాపయ్యను కూడా దర్శకుడిగా మరో మెట్టు పైన పెట్టింది. దర్శకులు బాపయ్య, కె. రాఘవేంద్రరావు కజిన్స్. గమ్మత్తేమిటంటే, ఈ సినిమా షూటింగ్ సమయంలో రాజమండ్రిలో బాపయ్య మరో యూనిట్‌తో బిజీగా ఉండడంతో, రాఘవేంద్రరావు స్వయంగా హైదరాబాద్‌లో కొన్ని షాట్లు, ఇండోర్ సీన్లు తీసిపెట్టారు. కెరీర్ బెస్ట్ ఇయర్: నిజానికి, శోభన్ బాబు కెరీర్లోనే ఓ మరపురాని సంవత్సరం – 1975. ఆ ఏడాది శోభన్ బాబు సినిమాలు ఏకంగా 8 రిలీజయ్యాయి (‘దేవుడు చేసిన పెళ్ళి, అందరూ మంచివారే, బాబు, జీవనజ్యోతి, బలిపీఠం, జేబుదొంగ, గుణవంతుడు, సోగ్గాడు’). వాటిలో 5 సూపర్ హిట్లు. అలా ఆ ఏడాది శోభన్ బాబుకు బాగా కలిసొచ్చింది. ఆయన స్టార్ అయిపోయారు. ఒకే ఏడాది ‘జీవన జ్యోతి, సోగ్గాడు’– ఈ రెండు సూపర్ హిట్లతో శోభన్‌బాబు ఇమేజ్ తార స్థాయికి చేరింది. ఈ సినిమాతోనే నటి జయచిత్ర తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయమయ్యారు. అప్పటికి వర్ధమాన నటి అయిన జయసుధ హీరో మరదలిగా సినిమాలో ఓ కీలక పాత్ర పోషించారు. తమిళ రచయిత బాలమురుగన్ అందించిన కథకు మోదుకూరి జాన్సన్ మాటలు, కె.వి. మహదేవన్ సంగీతంలో ఆచార్య ఆత్రేయ పాటలు ఆకట్టుకున్నాయి. గమ్మత్తేమిటంటే, నిజానికి ఈ చిత్రాన్ని నాగిరెడ్డి వారసుల విజయ కంబైన్స్, రామానాయుడు సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా సమర్పించినట్టు సినిమా టైటిల్ కార్డుల్లో ఉన్నా, పోస్టర్లు, పబ్లిసిటీలో మాత్రం విజయా కంబైన్స్ పేరు కనిపించదు. ఈ తెలుగు సూపర్ హిట్‌ను ఆ తరువాత హిందీలో జితేంద్ర, రేఖ జంటగా ‘దిల్ దార్’ పేరిట రీమేక్ చేశారు. అందరూ కోరిన అందాల నటుడు: ఆ రోజుల్లో ఎక్కడ విన్నా... మహదేవన్ బాణీల్లోని ‘సోగ్గాడు’ పాటలే. ‘సోగ్గాడు లేచాడు చూసి చూసి నీ దుమ్ము దులుపుతాడు...’ పాట వస్తూ ఉంటే, మాస్లో ఓ హిస్టీరియా. ఫ్యాన్స్ అయితే, తమ అభిమాన హీరో బాక్సాఫీస్ వద్ద జూలు విదిలించి, రికార్డుల దుమ్ము దులుపుతున్నాడని కేరింతలు కొట్టారు. ఈ సినిమాలోని ‘ఏడుకొండలవాడా వెంకటేశా.. ఓరయ్యో ఎంతపని చేశావు తిరుమలేశా’ అనే పాట రేడియోలో కొన్నేళ్ళు ఓ అభిమాన జనరంజక గీతం. అలాగే, ‘అవ్వా బువ్వా కావాలంటే అయ్యేదేనా అబ్బాయి’ పాట. ‘చలివేస్తోంది... చంపేస్తోంది...’ పాట కుర్రకారు మదిలో గిలిగింతలు పెట్టింది. ‘సోగ్గాడు’తో పతాక స్థాయికి చేరిన ఇమేజ్‌తో... పెళ్ళి కావాల్సిన అమ్మాయిలకు ఇలాంటి అబ్బాయి కావాలనే కోరిక పుట్టింది. కన్నవాళ్ళకు అలాంటి కొడుకు కావాలనే ప్రేమ వచ్చింది. తోడబుట్టినవాడు శోభన్ బాబు లాంటి తమ్ముడైతే బాగుండనే అభిమానం వెల్లువెత్తింది. ఆ తరువాత దాదాపు రెండు దశాబ్దాల పాటు ఇద్దరు ప్రేయసుల మధ్య నలిగే అందాల నటుడిగా శోభన్ బాబు తెలుగుతెరను ఏలారు. అదీ ‘సోగ్గాడు’గా శోభన్‌బాబు చేసిన మేజిక్. – రెంటాల జయదేవ -
ఈ రోజుకు హ్యాపీ.. రేపు ఏంటీ? – జయసుధ
దిశ ఘటనలో సత్వర న్యాయం జరిగినందుకు ఈ రోజుకు హ్యాపీగా ఉన్నాం. కానీ రేపు ఏంటనే భయం అందరిలో ఉంది. నిర్భయ ఘటనలో ఏడేళ్లయినా శిక్ష పడలేదు. ‘ఉన్నావ్’లో ఏకంగా బాధితురాలిని నడిరోడ్డుపైనే కాల్చేశారు. అసలు మహిళలపై హింసకు కారణమవుతున్న అంశాలపై లోతైన చర్చ, ఆ దిశగా నివారణ చర్యలు తక్షణం చేపట్టాలి. ముఖ్యంగా దేశంలో సగభాగం ఉన్న మహిళలకు ప్రధాని మోదీ ఈ విషయంలో ఏ రకమైన భరోసానిస్తారో స్పష్టం చేయాలి. మహిళలపై హింస నివారణకు కుటుంబం, పాఠశాలల నుండే మొదలు కావాలి. మహిళల ఇబ్బందుల విషయంలో పోలీసుల తీరులో సమూల మార్పు, కోర్టులు సత్వర తీర్పులు వెలువరించే దిశగా అన్ని వ్యవస్థలు పనిచేయాలి. అప్పుడే మహిళలు, కుటుంబాలు రోజూ హ్యాపీగా ఉండే పరిస్థితి ఉంటుంది. -
శ్రీ ఎదుటివారిని నొప్పించేది కాదు
-
నేను శ్రీ అనీ పప్పీ అనీ పిలిచేదాన్ని..
జయసుధ, జయప్రద, శ్రీదేవి.. ఒకానొక సమయంలో ఈ ముగ్గురు నాయికలూ ఇండస్ట్రీని రూల్ చేశారు. ఆ రోజుల్లో మీ మధ్య బాగా పోటీ ఉండేదా? జయసుధ: శ్రీదేవి, నేను కలిసి దాదాపు 8,9 వరకూ సినిమాలు చేశాం. నాకు ఎవ్వరితో పోటీ ఉండేది కాదు. ఎందుకంటే నేను ఎవ్వరితో కంపేర్ చేసుకోను కాబట్టి. శ్రీదేవి అంత అందంగా కనిపించాలి అనుకుంటే పోటీ ఉండేది. నేను అలా చేసేదాన్ని కాదు. నేను శ్రీదేవి అంత హైట్ కాదు. ఆమె ఫిగర్ నాకు లేదు. నేను చేయతగ్గదల్లా నా పాత్రను నేను బాగా చేయడమే. నా క్యారెక్టర్ ఏంటని మాత్రమే చూసుకునేదాన్ని. మా ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘ప్రేమాభిషేకం’ పెద్ద హిట్. ఆ తర్వాత ‘అనురాగ దేవత, గజదొంగ’ సినిమాలు వంటి చాలా సినిమాలు ఉన్నాయి. శ్రీదేవిగారు కాంపిటీషన్లో ఉన్న హీరోయిన్లతో బాగుండేవారా? జయసుధ:ఆమె చాలా సాఫ్ట్ అండి. నేనైనా సెట్లోకి వచ్చి అదీ ఇదీ మాట్లాడేదాన్ని. మేం కూడా సాఫ్ట్... బట్ తను అసలు మాట్లాడదు. ఇప్పుడని కాదు.. చిన్నప్పటి నుంచి చాలా సిగ్గు తనకి. నాకు తన ఆరేళ్ల వయసు అప్పటి నుంచి తెలుసు. నాకంటే ఐదారేళ్లు చిన్న అంతే. మద్రాసులో మా ఇళ్లు దగ్గర దగ్గర ఉండేవి. వాళ్ల ఇంటికి వెళ్లితే డోర్ పక్కన నుంచొని తొంగి చూసేది. వాళ్ల అమ్మగారు బాగా మాట్లాడేవారు. శ్రీదేవి కూడా అందరితో కలిసిమెలిసి ఉండేది కానీ సిగ్గు, మొహమాటం ఎక్కువ. చైల్డ్ ఆర్టిస్ట్‌గా వచ్చింది కదా. మామూలుగా అయితే అలాంటి వాళ్లు ఫుల్‌గా మాట్లాడతారు లేదా క్వైట్‌గా ఉంటారు. శ్రీదేవి రెండో రకం. శ్రీదేవిగారికి ప్రతీదీ వాళ్ల అమ్మే చూసుకునేవారు. అందుకేనేమో ఆమె రిజర్వ్‌గా ఉండేవారు..అలా అంటే షూటింగ్ సమయాల్లో మా నాన్నని దాటి నాతో ఎవ్వరూ మాట్లాడటానికి వీలు లేదు. ఆ అమ్మాయికి బిగినింగ్‌లో వాళ్ల అమ్మ చూసుకునేవారు. ఆ తర్వాత స్టార్ అయ్యాక అన్నీ తనే చూసుకునేది. కానీ ఎందుకో తక్కువ మాట్లాడేది.. ఇప్పుడు ఇద్దరు హీరోయిన్లు ఒకే సినిమా చేస్తున్నారంటే ఎవరెవరు ఎలాంటి కాస్ట్యూమ్ వేసుకుంటున్నారో, ఎవరి క్యారెక్టర్ లెంగ్త్ ఎంతో తెలుసుకుంటుంటారని ఇండస్ట్రీలో అంటుంటారు. అప్పట్లో అలా ఉండేదా? జయసుధ:అప్పుడూ ఉండేది. కానీæ క్యారెక్టర్ విషయంలో ఉండేది. ఆవిడ ఏ వేషం వేస్తుంది నేను ఏం వేస్తున్నాను అని. అంతే కానీ వేరే ఎందులోనూ ఉండేది కాదు. శ్రీదేవి తన క్యారెక్టర్ ఏంటి? తన డ్రెస్ ఏంటి? ఏం చేయాలి? అని ఆలోచించేది తప్ప వేరే ఏదీ పట్టించుకునేది కాదు. చాలా ప్రొఫెషనల్. చిన్నప్పుడు మనకు ఒక పని చేయమని అప్పజెప్పితే ఎలా చేస్తామో అలాగే ఉండేది తన మనస్తత్వం. సెట్లో తనకు ఇబ్బందిగా ఏదైనా అనిపిస్తే.. ఆ విషయాన్ని డిప్లొమాటిక్‌గా చెప్పేది. ఎదుటివారిని నొప్పించని మనస్తత్వం శ్రీదేవిది. మీరిద్దరు ఒకరినొకరు ఏమని పిలుచుకునేవాళ్లు? జయసుధ: నేను శ్రీ అనీ పప్పీ అనీ పిలిచేదాన్ని. తను మాత్రం నన్ను జయసుధగారు అనే పిలిచేది. నేను తన కంటే ముందు హీరోయిన్ అయ్యాను కాబట్టి అలా పిలిచేది. హిందీ సినిమాల్లో శ్రీదేవిగారి సక్సెస్ గురించి? జయసుధ:అప్పటికే హేమమాలినీ డ్రీమ్ గాళ్ అనిపించుకున్నారు. బట్ శ్రీదేవి ఈజ్ డిఫరెంట్. తనొక సెన్సేషన్. ఆ రోజుల్లో పెద్ద స్టార్డమ్ చూశారు. హిందీ, తమిళం, తెలుగు ఎక్కడికి వెళ్లినా సూపర్ సక్సెస్ అయ్యారు. తను హిందీలో బిజీగా ఉంటే ఆవిడ చేయాల్సిన కొన్ని తెలుగు పిక్చర్స్ నేను చేయాల్సి వచ్చింది. రామారావుగారితో శ్రీదేవి చేయాల్సిన ‘సరదా రాముడు’ నేను చేశాను. శ్రీదేవి హిందీకి వెళ్లడం వల్ల అలా జరిగింది. వాస్తవానికి శ్రీదేవి పెద్ద హీరోయిన్ అవుతుందని రామారావుగారితో తను ‘వేటగాడు’ చేసినప్పుడే ఆయన భార్య బసవ తారకమ్మగారు చెప్పారు. ‘వేటగాడు’ సినిమా రిలీజ్‌కు ముందు ప్రివ్యూ వేశారు. ఆ సమయంలో నేను, రామారావుగారు ఏదో సినిమా షూటింగ్లో ఉన్నాం. ‘ఈ అమ్మాయి చాలా పెద్ద హీరోయిన్ అవుతుంది. చాలా ముద్దు ముద్దుగా ఉంది’ అని తారకమ్మగారు రామారావుగారితో అన్నారట. ఆ విషయాన్ని రామారావుగారు మాతో చెప్పారు. అప్పుడు కూడా మాకు ఎవరో కొత్త హీరోయిన్ వస్తున్నారు అనే ఆలోచన, అసూయ అనేదే లేదు. ఎవరి సినిమాలు వాళ్లకు ఉండేవి. ఎవరి స్టైల్ వాళ్లకు ఉంది. శ్రీదేవిగారి కూతుళ్లతో మీకు పరిచయం ఉందా? జయసుధ:ఎప్పుడో నాలుగేళ్ల ముందు కలిశాను. మహేశ్వరి వాళ్ల బ్రదర్ మార్యేజ్లో కలిశాం. ఆ తర్వాత వాళ్ల అమ్మాయి సినిమాలో యాక్ట్ చేయబోతుందనగా కలిశాం. ఆ సినిమా బాగా రావాలని డిస్కస్ చేశాం. జాన్వీ సక్సెస్ అవ్వాలని అంటుండేది. ఎంత సెలబ్రిటీ అయినా ఒక కూతురికి తల్లే కదా. వాళ్ల ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా మమ్మల్ని కచ్చితంగా పిలుస్తుంది. మేం చైన్నైలో ఉన్నప్పుడు తన ప్రతి పుట్టినరోజుకు వాళ్ల అమ్మగారు పిలిచేవారు. అసలు శ్రీదేవితో నా పరిచయమే తన బర్త్‌డేస్ వల్ల.తన కుమార్తెను సిల్వర్ స్క్రీన్ పై చూసుకోలేకపోయారు...అవును. అది చాలా బాధపడాల్సిన విషయమే. శ్రీదేవి మరణం తీరని లోటు. -
హాఫ్ సెంచరీ పూర్తి చేస్తా!
‘‘నాకు సంతోషంగానూ, కొంచెం భయంగానూ ఉంది. నేను నటించిన ‘శతమానం భవతి’, ‘హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య’ చిత్రాలు రెండూ సంక్రాంతికి రిలీజవు తున్నాయి. 45 ఏళ్ల నా ప్రయాణంలో కాస్త భయపడుతూ ఆనంద పడటం ఇదే తొలిసారి’’ అన్నారు జయసుధ. ఆర్. నారాయణమూర్తి హీరోగా చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వంలో చదలవాడ పద్మావతి నిర్మించిన ‘హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య’ లో ఆమె హీరోయిన్గా నటించారు. ఈ 14న రిలీజవుతోన్న ఈ సినిమా గురించి జయసుధ మాట్లాడుతూ – ‘‘58 ఏళ్ల వయసులో మిడిల్ ఏజ్డ్ హీరోయిన్గా నటించా. జయసుధ, నారాయణమూర్తిల జోడి ఎలా ఉంటుందనే ఆసక్తి చాలామందిలో ఉంది. అందుకు తగ్గట్టుగానే ఆసక్తికరంగా ఉంటుందీ సినిమా. ఫస్టాఫ్‌లో సరదాగా, సెకండాఫ్‌లో హీరోతో పోటా పోటీగా ఉండే పాత్ర చేశా. చదలవాడ శ్రీనివాసరావుగారు నటీనటుల నుంచి మంచి నటన రాబట్టుకున్నారు. నటిగా 45 ఏళ్లు పూర్తి చేసుకున్నా. దేవుడి దయతో హాఫ్ సెంచరీ పూర్తి చేస్తా’’ అన్నారు. -
సమస్యలపై కానిస్టేబుల్ పోరాటం
సమాజంలో జరుగుతున్న సమస్యలపై పోరాడే పాత్రల్లో పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తిని సోలోగా చూస్తుంటాం. అయితే, ఈ సారి ఆయన రొటీన్‌కు భిన్నంగా హీరోయిన్‌తో.. అదీ సహజనటి జయసుధతో స్టెప్పులేస్తే ఎలా ఉంటుంది? ఊహిస్తేనే సినిమా ఎప్పుడు చూద్దామా? అని ఆత్రుతగా ఉంది కదూ. అయితే.. మీరు సంక్రాంతి వరకూ ఆగాల్సిందే. నారాయణమూర్తి, జయసుధ ముఖ్యపాత్రల్లో చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వంలో చదలవాడ పద్మావతి నిర్మించిన ‘హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య’ పోస్ట్ ప్రొడక్షన్ జరపుకొంటోంది. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘నిజాయతీ పరుడైన హెడ్ కానిస్టేబుల్ ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? వాటిని ఎలా అధిగమించాడన్నదే కథ. నారాయణమూర్తి, జయసుధ కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ వారంలో పాటలు, సంక్రాంతికి సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘సమాజంలోని ప్రధాన సమస్య ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ఆ సమస్య ఏంటన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. నా గత చిత్రాలకంటే ఇందులో వైవిధ్యంగా కనిపిస్తా. మా చిత్రం చూసి ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు’’ అని నారాయణమూర్తి చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ‘వందేమాతరం’ శ్రీనివాస్, కెమెరా: కె.సుధాకర్‌రెడ్డి, సమర్పణ: చదలవాడ తిరుపతిరావు. -
ఈ కామర్స్ వెబ్ సైట్‌ని ప్రారంభించిన దాసరి
-
విగ్గు కాదు...
నలుగురు సినిమావాళ్లు కలుసుకుంటే వారి మధ్య సినిమా మాటలు, షూటింగ్‌ల ముచ్చట్లే దొర్లుతాయి. ఇక పాతతరం నటులైతే అలనాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూనే ఉంటారు. నిన్నటితరం సినీతారలు మురళీమోహన్, జయసుధ శనివారం మాదాపూర్ ‘లామార్స్ హెయిర్ సొల్యూషన్స’ ప్రారంభోత్సవంలో కలుసుకున్నప్పుడు వారి మధ్య ఇలాంటి సంభాషణే సాగింది. పాత సినిమాల్లో తాము విగ్గు ధరించిన సందర్భాలు, అవతలి వారికి అసలైన జుట్టో, విగ్గో తెలియక తికమక పడ్డ సరదా జ్ఞాపకాలను వారు గుర్తుచేసుకున్నారు. -
ఫ్యామిలీ బడ్జెట్
ఇంటి బడ్జెట్ ను నిర్వహించే గృహిణుల ముందు ఎంతటి ఆర్థిక మంత్రులైనా బలాదూరే! ప్రభుత్వ బడ్జెట్లో విశేషంఏముంటుంది? ముందుగా ఖర్చుల చిట్టా తయారు చేసుకోవడం, దానికి తగ్గ ఆదాయాన్ని రాబట్టుకోవడానికి ప్రజల ‘పన్ను’లూడగొట్టడం తప్ప! ఖర్చులకు తగ్గట్టుగా ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రభుత్వానికి సుంకాల వంటి వంకలు చాలానే ఉంటాయి. సామాన్యుల బడ్జెట్ అలా కాదు కదా! ఆదాయానికి తగినట్లుగానే ఖర్చులకు కత్తెర వేసుకోవాలి. సర్కారు వారి దయ వల్ల ‘ప్రత్యక్షం’గా.. ‘పరోక్షం’గా ‘పన్ను’పోటును పంటి బిగువున భరించాలి. నిత్యావసరాల ‘ధరా’ఘాతానికి విలవిల్లాడుతూనే బతుకు బండిని నెట్టుకు రావాలి. సంసారమంటే అంతటితోనే సరిపోతుందా? కానే కాదు! ఎప్పటికప్పుడు వచ్చిపడే అవసరాలుంటాయి, ఆపదలు ఉంటాయి. అనుకోకుండా జబ్బుచేస్తే చాలు, డబ్బు మంచినీళ్ల ప్రాయంగా ఖర్చయిపోతుంది. నెలాఖరుకి చేతిలో చిల్లిగవ్వ మిగలడమే గగనం. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో ఇంటిని నడిపేందుకు గృహిణులు అక్షరాలా ‘ఫ్యామిలీ సర్కస్’ చేస్తున్నారు. మిడిల్‌క్లాస్ పిసినారులం.. నా పేరు ప్రమీల. ఎస్సార్ నగర్లో ఉంటాం. మొన్న నాగార్జున ఇంటర్వ్యూలో నెలకు నాలుగు వేలు సంపాదించేవారు కూడా ఉన్నారట అని బాధపడటం చూశాను. మా అబ్బాయికి నాలుగు వేలే వస్తాయి. వాడికి పెళ్లయ్యింది. పిల్లలు. నేనూ. అందరం కలసి సొంతింట్లో ఉంటాం. కానీ నాలుగు వేలతో బతగ్గలమా? నేను స్కూల్ టీచర్‌గా పని చేస్తూ ఆరు వేలు తెస్తున్నాను. చిన్న పోర్షన్ అద్దెకిస్తే మూడువేలు వస్తున్నాయి. అంతా కలిపి పదిహేను వేలు కూడా కావు. కానీ మాకు కనీసం పదిహేను వేలు కావాలి. సరుకులకు ఐదారు వేలు. కాయగూరలకు మూడు వేలు. పాలకు 1,500, కరెంటు బిల్లు 1,500, పేపరు కేబులూ.. మంచినీళ్లు కూడా కొనుక్కోవాలి. అదో 500. మా అబ్బాయికి, నాకు పెట్రోలు ఖర్చు ఐదారువేలు దాటుతోంది. పైగా నేను ఆస్తమా పేషెంటుని. నెలకు వెయ్యి ఖర్చు చేయకపోతే ఊపిరాడదు. ఇక పిల్లలకు జ్వరం, జలుబు అంటే నాలుగైదు వందలు పోతాయి. ఇవి కాకుండా పండుగలు, బంధువులు వస్తే గుడ్లు తేలేయాల్సిందే. సినిమాలకు, షికార్లకు వెళ్లకుండా ప్రతి రూపాయిని అత్యవసరానికి ఖర్చు పెట్టుకుంటూ మహా పిసినారుల్లా బండిలాగాల్సి వస్తోంది. లేదంటే ఏడాది తిరిగే లోపు ఇంటి ఖర్చులకే లక్షల అప్పులు చేసి అవి తీర్చలేక జబ్బులు తెచ్చుకుంటున్నవారున్నారు. ఆడవాళ్లు ప్రతి ఒక్క ఖర్చు దగ్గరా మగవారితో పోట్లాడుతూ ఇంటిని రావణకాష్టం చేసుకోవడం కూడా చూస్తున్నాను. ఇవి బతుకులా అండీ.. ఎప్పటికి మనం బాగుపడగలం. బంధువుల్ని ఇంటికి రాకుండా ఆపగలమేమో .. చెప్పా పెట్టకుండా వచ్చే రోగాల్ని ఆపగలమా? జాలి, కనికరం లేకుండా గుంజే డాక్టర్లను మార్చగలమా. ఏదో బతికేస్తున్నాం కానీ.. నా మటుకు ఇది పెద్ద వండరేనండీ. ప్రభుత్వాలు మన చేత చేయిస్తున్న సర్కస్ ఇది. - ప్రమీల, టీచర్, ఎస్సార్ నగర్ ఇవాళ జీతమొస్తే... నిన్నే అయిపోతుందండీ చెప్పాలంటే కొంచెం సిగ్గుగా ఉంటుందండీ. ఐదు వేలంటే.. అదొక జీతమా అండీ? ఎన్నిసార్లు లెక్కెట్టినా ఐదే ఉండే ఆ వెయ్యి కాగితాల్ని చూసి ఒక్కోసారి ఏడుపొచ్చేస్తదండీ. మా ఆయన వాచ్మెన్ అండీ. మాదాపూర్ అయ్యప్పకాలనీలో అపార్ట్మెంట్లోనండీ. అందులోనే మాకో గదిచ్చారు. నేనూ మా ఆయన. మాకిద్దరు ఆడపిల్లలండీ. ఒకదానికి పెళ్లయ్యిందండీ. ఇంకోదానికి ఎప్పుడూ ఒళ్లు బాగోదండీ. మా ఆయన ఐదు సంపాదిస్తాడు. అదే మూలకండీ? నేనూ ఒళ్లొంచి నాలుగిళ్లలో పని చేసి ఒక మూడు వేలు సంపాదిస్తానండీ. అంటే మొత్తం ఎనిమిది. వాచ్మెన్ గాబట్టి ఇంటద్దె, కరెంటు లేకపోయినా మిగతావన్నీ ఆ ఎనిమిదితోనే సరిపెట్టుకోవాలండీ. కానీ ఎలాగండీ? బ్రహ్మదేవుడిక్కూడా సాధ్యపడదండీ. ఇంటి సరుకులకే మూడు వేలా? కాయగూరలకు వెయ్యి. ఆసుపత్రికి నెలకీ, రెండు నెలలకీ వెయ్యో.. రెండు వేలో దోసిట్లో పోసి రావలసిందే కదండీ. ఇంక ఎవరైనా చుట్టాలొస్తే చికెనో మటనో అంటారు. ఏమున్నా లేకపోయినా మర్యాదలు తప్పవు కదండీ. అదో ఖర్చు. పెళ్లి చేసి పంపాక చేతులు దులుపుకున్నట్టు కాదుగదండీ. ఆడపిల్ల అమ్మగారింటికి రాకుండా ఎట్టా కుదురుద్దండీ? అప్పుడప్పుడు మా పెద్దమ్మాయి వస్తూపోతుండాల్సిందే. మనమరాలికి అంతో ఇంతో ఖర్చు పెట్టాల్సిందే. ఆ మధ్యన ఊరి నుంచి చుట్టాలొచ్చి సిన్మాకెల్దాం అన్నారు. మనింటికొచ్చిన చుట్టాలతోటి మనం టికెట్టు పెట్టిస్తామా? అయ్యో.. వొదినా ఈ ఊళ్లో టికెట్లు మూడ్రోజుల ముందే ఇచ్చేస్తారు అని తప్పించుకున్నామండీ. అసలు మాటేమిటంటే అండీ.. ఈ బతుకులో సినిమా సాధ్యమా అండీ. ఊరుగాని ఊళ్లో బతుకుతున్నాం. సొంత ఊరి నుంచి ఎప్పుడు ఏ కబురొస్తుందో అని ఎప్పుడూ ఒకే దడండీ. ఒక మంచికైనా.. ఒక చెడ్డకైనా పోవాల్సిందే కదా. పోవాలంటే ఎవరి దగ్గరైనా చార్జీలకు చేయి సాపాల్సిందే కదా. ఆదాయం పది రూపాయలు పెరిగితే .. ఖర్చులు పాతిక రూపాయలు పెరుగుతున్నాయి. పోనీ ఈ పని కాదు ఇంకో పని చేసుకుందాం అంటే.. బయట అద్దెలు చూశారు గదండీ. అవి అద్దెలు కాదండీ మాలాంటోళ్లని మింగేసే అగ్గిగుండాలు. ఇదండీ మా బతుకు. ఎవరితో చెప్పుకుంటామండీ. మీతో చెప్పుకుందామంటే మీకేమైనా తక్కువ బాదుంటాదా అండీ! - లక్ష్మి, వాచ్మెన్ భార్య, మాదాపూర్ మినిమమ్ 25 థౌజండ్స్ ఈ సిటీలో ఓ సామాన్యుడు అప్పు లేకుండా బతకాలంటే తక్కువలో తక్కువ పాతికవేలు కావాలి. అంతకు తక్కువ సంపాదిస్తున్నాడంటే అతడు అశాంతితో ఉన్నాడనే. నేను చూస్తున్నాను కదా.. మా ఇంట్లో ఎంత జాగ్రత్తగా చేసినా నెలకు పాతిక వేలు అవుతోంది. నా పేరు సునంద. క్యాటరింగ్ వ్యాపారం చేస్తున్నాను. భర్త చనిపోయాడు. ఈ మధ్యనే కోడలు కూడా అనారోగ్యంతో కన్నుమూసింది. పిల్లలు, మనవలతో ఇంట్లో ఐదుగురం ఉంటాం. ఇంటి అద్దె ఆరువేల రూపాయలు. రేషన్ పది వేలవరకూ అవుతుంది. కాయగూరలు మూడు వేలు, కరెంటు బిల్లు రెండు వేల రూపాయలు. పాలకు 1,500. పేపరు, కేబుల్, వాటర్ బిల్లులు 600 వరకూ ఉంటాయి. జ్వరం, జలుబులైతే నెలకు ఐదారొందలవుతుంది. ఏదైనా చిన్న చిన్న వైద్యాల అవసరం పడిందంటే నెలకు రెండు మూడు వేలకు పైగా ఆసుపత్రి ఖర్చు ఉంటుంది. ఇవి కాకుండా పండుగలపుడు, బంధువులొచ్చినపుడు ఖర్చు నాలుగైదు వేలకు తక్కువవదు. మా ఇంట్లో సినిమాలకు, షికార్లకు పెద్దగా వెళ్లం కాబట్టి సరిపోతుంది. లేదంటే వాటి బిల్లులు కూడా తక్కువగా లేవు. మా పక్కింటివారు ఎప్పుడు ఐమాక్స్ వెళ్లొచ్చినా వెయ్యి నుంచి పదిహేను వందలవుతుందని చెబుతుంటారు. ఇక ఏడాదికి నాలుగైదు సార్లయినా షాపింగ్ తప్పదు. అలాంటివాటికి పొదుపు చేసిన డబ్బునే వాడుతుంటాం. ఒక్కోసారి బడ్జెట్ దాటితే మాత్రం వచ్చే నెల లోటు బడ్జెట్‌కి సిద్ధపడాలి. - సునంద, క్యాటరర్, సనత్‌నగర్. రెండు పదుల పేదవాడు... మొన్నటివరకూ పాతికవేల జీతమంటే ఉన్నవాడి కింద జమకట్టేవారు. ఇప్పుడది పేదవాడి బడ్జెట్‌గా మారిపోవడం చూస్తుంటే.. భవిష్యత్తు ఇంకెంత భయంకరంగా ఉంటుందోనని భయమేస్తుంది. భర్త చేతినిండా సంపాదిస్తున్నా.. ఇచ్చిన రూపాయిని ఎలా ఖర్చుపెట్టాలో, ఎంత ఖర్చు పెట్టాలో తెలియక అయోమయంలో పడుతున్న మహిళల ఇబ్బంది గురించి నాకు బాగా తెలుసు. నేను సినిమాల్లో ఉన్నా.. రాజకీయాల్లో ఉన్నా.. ఇంటి సరుకులు స్వయంగా వెళ్లి కొనుక్కుంటాను. వంట సరుకులకు ఒకో నెల పదివేలవుతుంది. ఉన్నట్టుండి బిల్లు పదిహేనువేలు వస్తుంది. చెప్పాపెట్టకుండా.. పెరిగే ధరలు మాకే ఇబ్బంది కలిగిస్తే.. సామాన్య మహిళల సంగతేంగాను. ఆ మధ్యనెవరో చెప్పారు.. ఉల్లిపాయల ధర పెరిగినపుడు ఉల్లివాడటం తగ్గించేస్తే సరి అని. నాకు నిజమేననిపించింది. అంతకంటే ఏం చేయగలం. ఉల్లిపాయ లేకుండా కూరలు వండితే వచ్చే నష్టమేమీ లేదు కదా! ధరలను ఎలాగూ నియంత్రించలేం. కనీసం ఖర్చుల్లోనైనా రూపాయి, రెండు రూపాయలు మిగుల్చుకునే ప్రయత్నం చేసుకోవాలి. చీటికీ మాటికీ ఆస్పత్రి బాటపట్టకుండా పిల్లల ఆరోగ్యాలను కాపాడుకోవాలి. ఎంత జాగ్రత్తగా ఉన్నా.. అకస్మాత్తుగా వచ్చే జబ్బులు వస్తూనే ఉంటాయి. పెద్ద జబ్బుల వైద్యం ఖర్చు భరించే శక్తి సామాన్యులకు కాదు కదా.. ఓ మోస్తరువారు కూడా తట్టుకోలేకపోతున్నారు. పేదలు, సామాన్యుల వైద్యం కోసం, ఆహారం కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోతే.. పేదవాడికి మిగిలేది అర్ధాకలి, అర్ధాయుష్షు! విద్యను కూడా లక్షలు పోసి కొనుక్కునే పరిస్థితి పేదవాడ్ని మరింత కుంగదీస్తోంది. - జయసుధ, మాజీ ఎమ్మెల్యే -
టీఆర్ఎస్ వైపు జయసుధ చూపు!
మాజీ మంత్రి ద్వారా కేసీఆర్‌కు రాయబారం మల్కాజ్గిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తానని ప్రతిపాదన సాక్షి, హైదరాబాద్: సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు, సికింద్రాబాద్ ఎమ్మెల్యే జయసుధ టీఆర్ఎస్లో చేరడానికి రంగం సిద్దం చేసుకుంటున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇటీవలే టీఆర్ఎస్లో చేరిన మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, సీనియర్ శాసన సభ్యుడి ద్వారా ఆమె టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావుకు ఈ మేరకు వర్తమానం పంపినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీలో ప్రత్యర్థివర్గాలు తనకు వ్యతిరేకంగా పనిచేస్తుండటం, గత ఎన్నికల సమయంలో ఉన్నట్టుగా పార్టీలో పెద్ద దిక్కు లేకపోవడంతో నియోజకవర్గంలో పరిస్థితులు ప్రతికూలంగా మారాయని జయసుధ భావిస్తున్నారు. దీంతో టీఆర్ఎస్లో చేరేందుకు మాజీ మంత్రి ద్వారా కేసీఆర్‌కు రాయబారం పంపినట్లు తెలిసింది. మల్కాజ్గిరి లోక్‌సభ స్థానం టిక్కెట్ ఇవ్వాలని ఆమె కోరినట్లు సమాచారం. మల్కాజ్గిరి లోక్‌సభ పరిధిలోని అన్ని శాసన సభ నియోజకవర్గాల్లో సెటిలర్లతో పాటు, మైనారిటీవర్గాలకు చెందిన ఓటర్లు కూడా గణనీయంగాఉండటం వల్ల గెలుపు అవకాశాలు ఉంటాయని జయసుధ వివరించినట్టు తెలిసింది. గత మూడు నాలుగు వారాలుగా ఈ ప్రతిపాదనపై మంతనాలు జరుగుతున్నా, చర్చలు ఒక కొలిక్కి రాలేదని తెలిసింది. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత కేసీఆర్, జయసుధ ఒక నిర్ణయానికి వస్తారని సమాచారం. టీఆర్ఎస్ ఎంపీ, సినీ నటి విజయశాంతి ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారు. జయసుధను పార్టీలో చేర్చుకుంటే టీఆర్ఎస్కు చెందిన ఒక ఎంపీని చేర్చుకున్న కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పినట్టుగా ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలిసింది. హైదరాబాద్ - సికింద్రాబాద్ జంటనగరాల్లో టీఆర్ఎస్కు బలం లేదన్న కారణంతో ఇక్కడ పోటీ చేయడానికి ఎవరూ ఆసక్తి చూపడంలేదన్న ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో జయసుధ వంటి ప్రముఖ వ్యక్తి పార్టీలో చేరితే తెలంగాణవ్యాప్తంగా సానుకూల వాతావరణం ఏర్పడుతుందని టీఆర్ఎస్ భావిస్తోంది. -
ఆదుకునే హస్తం కోసం..!
అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి సాయం కోరుతున్న పేద తండ్రి సాక్షి, హైదరాబాద్: అరుదైన వ్యాధితో పేద కుటుంబంలో జన్మించిన ఒక చిన్నారి ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తోంది. సికింద్రాబాద్ మాణికేశ్వర్‌నగర్ వడ్డెరబస్తీకి చెందిన సైదులు, సుజాత నలుగురు కుమార్తెల్లో మూడవ అమ్మాయి సాయినీ (8). పుట్టుకతోనే మెదడుకు సంబంధించిన హైడ్రో సెఫాలస్ అనే వ్యాధి బారిన పడింది. మెదడులో తయారైన సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ (సీఎస్ఎఫ్) అనే ద్రవం చిన్న నాళం ద్వారా వెన్నుపూసలోకి చేరి అక్కడినుంచి రక్తంలో కలిసిపోవాల్సి ఉంటుంది. అయితే సాయినీలో ఆ నాళం మూసుకుపోవడంతో ఆ ద్రవం మెదడులోనే విస్తరిస్తోంది. దాంతో మెదడు పరిమాణం నానాటికీ పెరిగిపోతుంది. వైద్యపరిభాషలో హైడ్రో సెఫాలస్ అని పిలిచే ఈ వ్యాధిని సాయినీ పుట్టిన వెంటనే వైద్యులు గుర్తించారు. శస్త్రచికిత్స చేస్తే ఫలితం ప్రతికూలంగా వచ్చే అవకాశాలున్నాయని డాక్టర్లు చెప్పడంతో సాయినీ తల్లిదండ్రులు ఆపరేషన్‌కు నిరాకరించారు. అప్పటినుంచి సాయినీ మెదడు పెరుగుతూనే ఉంది. ఎనిమిదేళ్ల వయసున్న సాయినీ తన ఈడు పిల్లలాగే వినడం, మాట్లాడడం, ఆలోచించడం చేయగలదు. అయితే, మెదడు బరువు కారణంగా కూర్చోలేదు, నిల్చోలేదు. పరిమాణం మరింత పెరిగితే మెదడు సక్రమంగా పనిచేయలేదు. దీంతో గుండె, ఊపిరితిత్తులకు మెదడుతో సంబంధం తెగిపోతుంది. క్రమంగా ఊపిరితీసుకోవడం కష్టమై, ప్రమాదకర పరిస్థితికి దారి తీస్తుందని గాంధీ ఆస్పత్రి వైద్యులు వివరించారు. తాత, నానమ్మలే దిక్కు: సాయినీ తండ్రి సైదులు భవననిర్మాణ కార్మికుడు. కొద్దినెలల క్రితం భవనంపై నుంచి కిందపడి గాయపడ్డాడు. తల్లి అంతకుముందే మరణించింది. తాత లింగయ్య, నాయనమ్మ లక్ష్మమ్మలే కూలి చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నామని, పాపకు వికలాంగ పింఛను కోసం సంబంధిత కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నామని వారు చెప్పారు. చిలకలగూడలో ఇటీవల జరిగిన రచ్చబండకు తాత, నాయనమ్మతో కలిసి సాయినీ వచ్చింది. స్థానిక ఎమ్మెల్యే జయసుధ ఎత్తుకుని వైద్యం చేయిస్తానని హామి ఇచ్చారు. కానీ ఆ పాపకు మొదట ఆర్థిక సాయం అత్యవసరమని ఎమ్మెల్యే గుర్తించలేకపోయారు. -
సినిమా మెచ్చిన పనివాడు.
-
స్టయిల్ బ్రాండ్ రజనీకాంత్!
తమిళనాట 1975లో ‘అపూర్వరాగంగళ్’ అనే సినిమా వచ్చింది. కమల్‌హాసన్, శ్రీవిద్య, మేజర్ సుందరరాజన్, జయసుధ అందులో ప్రధాన పాత్రధారులు. ఆ సినిమాలోని ఓ కీలక సన్నివేశం. శ్రీవిద్య, కమల్‌హాసన్‌లకు పెళ్లి ఖాయమవుతుంది. శ్రీవిద్య ఇల్లంతా పెళ్లి హడావిడి. ఇంతలో ఆ ఇంటి గేట్ తెరుచుకుంటుంది. ఎదురుగా నల్లగా, మాసిపోయిన గడ్డంతో దేశదిమ్మరిలా ఓ వ్యక్తి. చూడ్డానికే వికారంగా ఉంటాడు. అంతే... అక్కడ పడింది ఇంటర్వెల్ కార్డ్. ప్రేక్షకుల్లో ఒకటే క్యూరియాసిటీ. ‘కథ మాంచి రసకందాయంలో ఉండగా... వీడెవడ్రా బాబూ... అపూర్వరాగంలో అపశ్రుతిలా’ అని. కానీ... ఆ వ్యక్తే... ఆ వ్యక్తే... తమిళ సినిమా రూపు రేఖలు మారుస్తాడని, ప్రాంతీయ సినిమా స్థాయిని వందకోట్ల రూపాయల స్థాయికి తీసుకెళ్తాడని, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకులకు ఆరాధ్యుడవుతాడని, స్టార్డమ్ అనే పదానికి పర్యాయపదంగా నిలుస్తాడని ఎవరూ ఊహించి ఉండరు. ఆయన ఎవరో, ఆయన పేరేంటో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదేమో! ఆయనో సమ్మోహనాస్త్రం: హిందీ సినిమా అంటే.. దేశం మొత్తం విడుదలవుతుంది. పైగా హిందీ మన జాతీయభాష. సో.. బాలీవుడ్లో నంబర్‌వన్ స్టార్ అంటే ఆ వ్యక్తి ఆలిండియా సూపర్‌స్టార్ అన్నమాట. ఉదాహరణకు అమితాబ్. కానీ... ఓ ప్రాంతీయ భాషా నటుడైన రజనీని ఇప్పుడందరూ ఆలిండియా సూపర్‌స్టార్ అంటున్నారు. అలా అనిపించుకోవడం ఆయనకెలా సాధ్యమైంది? దానికి సమాధానం ఒక్కటే. రజనీ అంటే ఓ సమ్మోహనాస్త్రం. దానికి భాషతో నిమిత్తం లేదు. ఒక్కసారి ఆ అస్త్ర ప్రయోగం జరిగిందంటే.. ఎవరైనా వశం కావాల్సిందే. మిస్సిండియాలు, మిస్ వరల్డులైనా సరే.. ఆయన స్టయిల్ ముందు వెలవెలబోవాల్సిందే. గొప్ప నటుడు కూడా: నటనలో, నడకలో, నవ్వులో, డైలాగు విరుపులో... ఏదో తెలీని మేజిక్. జనాలకు ఓ మెరుపును చూస్తున్న ఫీలింగ్. అదే రజనీకాంత్. ప్రస్తుతం ఆయన స్టయిల్ ఓ బ్రాండ్‌గా మారిపోయింది. అయితే... కేవలం రజనీకాంత్‌ని ఆ స్టయిలే సూపర్‌స్టార్‌ని చేసిందా? అనడిగితే.. చాలామంది అవుననే అంటారు. కానీ అది నిజం కాదు. రజనీకాంత్ గొప్ప నటుడు కూడా. ఆయన అభినయ సామర్థ్యానికి స్టయిల్ అనేది ఓ ఆభరణం అయ్యింది అంతే. రజనీ గొప్ప నటుడు కాబట్టే ‘రాఘవేంద్రస్వామి’ లాంటి యోగీంద్రుని పాత్ర పోషించి మెప్పించగలిగారు. తమిళనాట ఎన్నో ఛాలెంజింగ్ పాత్రలు చేశారాయన. ఓ నటుడు గొప్పతనం బయటపడేది ఆ నటుడు ఎదుర్కొన్న పోటీని బట్టే. మరి రజనీకి పోటీ ఎవరు? అనంటే.. వచ్చే సమాధానం ‘కమల్‌హాసన్’. అంతటి మహానటుడు పోటీగా ఉన్నా... ఢీకొని మరీ... తమిళనాట నంబర్‌వన్ అయిన రజనీని గొప్ప నటుడు కాదని ఎలా అనగలం? తెలుగు సినిమాతో అనుబంధం: రజనీని తెలుగు ప్రేక్షకులకు చేరువ చేసిన సినిమా? అంటే... కొందరు ‘దళపతి’ అని, ఇంకొందరు ‘బాషా’ అని అంటారు. కానీ నిజానికి రజనీ ఏనాడో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. తెలుగు సినిమాతో ఆయన బంధం 37 ఏళ్ల నాటిది. కె.బాలచందర్ ‘అంతులేనికథ’ తో తెలుగు ప్రేక్షకులకు తొలిసారి పరిచయమయ్యారు. ఎన్టీఆర్‌తో కలిసి ‘టైగర్’, కృష్ణతో కలిసి అన్నాదమ్ముల సవాల్, రామ్ రాబర్ట్ రహీం, శోభన్‌బాబుతో ‘జీవనతరంగాలు’, చిరంజీవితో ‘కాళీ’ చిత్రాల్లో నటించారాయన. చిలకమ్మ చెప్పింది, తొలిరేయి గడిచింది, ఆమెకథ, వయసు పిలిచింది, ఇద్దరూ అసాధ్యులే, అందమైన అనుభవం, మాయదారి కృష్ణుడు, నా సవాల్, న్యాయం మీరే చెప్పాలి, అమ్మ ఎవరికైనా అమ్మే... ఎలా ఎన్నో తెలుగు సినిమాల్లో తనదైన ముద్ర కనబరిచారు. ఒకానొక దశలో తెలుగు, తమిళ సినిమాల్లో సమాంతరంగా నటించారు. ఓ విధంగా తెలుగులో అత్యధిక చిత్రాల్లో నటించిన తమిళ హీరో రజనీకాంతే అని చెప్పాలి. అదీ రజనీ లైఫ్ స్టయిల్: నేటితో సూపర్‌స్టార్‌కి 63 ఏళ్లు నిండాయి. ఈ వయసులో కూడా యువతరాన్ని ప్రభావితం చేస్తున్నారాయన. బాలీవుడ్ సూపర్స్టార్లకు సైతం ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారు. దేశంలోనే అత్యధిక పారితోషికంగా తీసుకునే కథానాయకుడు కూడా రజనీనే. వందేళ్ల భారతీయ సినిమా చరిత్రలో ఏ ప్రాంతీయ నటుడూ సాధించని క్రెడిట్ ఇది. కేవలం సినిమాల వల్లే రజనీకాంత్ ఈ స్థాయికి రాలేదు. ప్రవర్తన కూడా ఆయన ఎదుగుదలలో కీలక పాత్ర పోషించింది. సూపర్స్టార్లకే తలమానికంగా ఎదిగినా, తెరవెనుక ఇవేమీ పట్టనట్లే కనిపిస్తారాయన. సగటు మనిషి ఆహార్యం, సాధారణ జీవితం, నిరంతరం ఆధ్యాత్మిక చింతన, ధారాళమైన దానగుణం.. ఇదీ రజనీకాంత్ లైఫ్ స్టయిల్. తన సినిమా వల్ల నష్టపోయిన పంపిణీదారులకు డబ్బు వెనక్కు ఇచ్చి ఆదుకునే ఉదార స్వభావుడు. గుళ్లో ప్రసాదం కోసం లైన్లో నిలబడ్డ చిన్ననాటి రోజుల్ని కూడా ఇప్పటికీ మరచిపోరు. ఒక స్టార్‌గానే కాదు... ఒక వ్యక్తిగా కూడా ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయుడు రజనీకాంత్. ఇలాంటి పుట్టిన రోజులు ఆయన ఇంకెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిద్దాం.