హాఫ్‌ సెంచరీ పూర్తి చేస్తా! | Jayasudha completed 45 years as actress | Sakshi
Sakshi News home page

హాఫ్‌ సెంచరీ పూర్తి చేస్తా!

Published Sun, Jan 8 2017 11:56 PM | Last Updated on Tue, Sep 5 2017 12:45 AM

హాఫ్‌ సెంచరీ పూర్తి చేస్తా!

హాఫ్‌ సెంచరీ పూర్తి చేస్తా!


‘‘నాకు సంతోషంగానూ, కొంచెం భయంగానూ ఉంది. నేను నటించిన ‘శతమానం భవతి’, ‘హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకట్రామయ్య’ చిత్రాలు రెండూ సంక్రాంతికి రిలీజవు తున్నాయి. 45 ఏళ్ల నా ప్రయాణంలో కాస్త భయపడుతూ ఆనంద పడటం ఇదే తొలిసారి’’ అన్నారు జయసుధ. ఆర్‌. నారాయణమూర్తి హీరోగా చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వంలో చదలవాడ పద్మావతి నిర్మించిన ‘హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకట్రామయ్య’ లో ఆమె హీరోయిన్‌గా నటించారు.

ఈ 14న రిలీజవుతోన్న ఈ సినిమా గురించి జయసుధ మాట్లాడుతూ – ‘‘58 ఏళ్ల వయసులో మిడిల్‌ ఏజ్డ్‌ హీరోయిన్‌గా నటించా. జయసుధ, నారాయణమూర్తిల జోడి ఎలా ఉంటుందనే ఆసక్తి చాలామందిలో ఉంది. అందుకు తగ్గట్టుగానే ఆసక్తికరంగా ఉంటుందీ సినిమా. ఫస్టాఫ్‌లో సరదాగా, సెకండాఫ్‌లో హీరోతో పోటా పోటీగా ఉండే పాత్ర చేశా. చదలవాడ శ్రీనివాసరావుగారు నటీనటుల నుంచి మంచి నటన రాబట్టుకున్నారు. నటిగా 45 ఏళ్లు పూర్తి చేసుకున్నా. దేవుడి దయతో హాఫ్‌ సెంచరీ పూర్తి చేస్తా’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement