Raashi Khanna Reveals She Has Crush On Vijay Devarakonda - Sakshi
Sakshi News home page

Raashi Khanna : నేను నటించిన హీరోల్లో అతనిపై క్రష్‌ ఉంది.. ఓపెన్‌ అయిన రాశీ

Published Thu, Dec 22 2022 1:54 PM | Last Updated on Thu, Dec 22 2022 2:54 PM

Raashii Khanna Reveals She Has Crush On Vijay Devarakonda - Sakshi

నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ 2 టాక్ షోకు రోజురోజుకూ అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. తన మ్యానరిజం,చమత్కారంతో టీఆర్పీ రేటింగ్స్‌ను పరుగులు పెట్టిస్తున్నారు బాలయ్య. ఆహాలో స్ట్రీమింగ్‌ అవుతున్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే షో సెకండ్‌ సీజన్‌ కూడా సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతుంది. ఇప్పటికే 5 ఎపిసోడ్‌లు స్ట్రీమింగ్‌ కాగా, తాజాగా లేటెస్ట్‌ ప్రోమోను వదిలారు.

అలనాటి హీరోయిన్స్‌ జయసుధ, జయప్రదలతో పాటు యంగ్‌ బ్యూటీ  రాశీఖన్నాలు షోలో సందడి చేయనున్నారు. ఈ క్రమంలో నారీనారీ నడుమ మురారి అంటూ ముగ్గురు హీరోయిన్స్‌తో బాలయ్య అల్లరి ఏ విధంగా ఉంటుందో ప్రోమోలో చూపించారు.

ఇక హీరోయిన్‌ రాఖీఖన్నా మనసులో చోటు సంపాదించుకున్న టాలీవుడ్‌ హీరో గురించి కూడా బయటపెట్టేశారు. నువ్వు నటించిన హీరోల్లో నీ క్రష్‌ ఎవరు అని బాలయ్య అడగ్గా ఏమాత్రం తడుముకోకుండా విజయ్‌ దేవరకొండ అంటూ ఓపెన్‌ కామెంట్స్‌ చేసింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట చక్కర్లు కొడుతుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement