Jaya Prada
-
'ప్రభాస్' ఫౌజిలో... జయప్రద
ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజి’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ తమిళనాడులోని మధురై, కారైకుడి లొకేషన్స్లోప్రారంభమైంది. అయితే ప్రభాస్ పాల్గొనని సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందని తెలిసింది. కాగా ఈ సినిమాలో జయప్రద ఓ కీలక పాత్రలో నటిస్తున్నారని, ఆల్రెడీ మధురై షెడ్యూల్లో ఆమె జాయిన్ అయ్యారని, ఇమాన్వి–జయప్రదల కాంబినేషన్లో కొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరిగిందని సమాచారం. అక్టోబరు చివర్లో ఈ సినిమా చిత్రీకరణలో ప్రభాస్ కూడా పాల్గొంటారట. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్. -
పుట్టిన రోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జయప్రద (ఫొటోలు)
-
హైకోర్టులో జయప్రదకు ఎదురుదెబ్బ
మాజీ ఎంపీ, సినీ నటి జయప్రదను మార్చి 6వ తేదీలోపు అరెస్ట్ చేయాలని రామ్‌పుర్ ట్రయల్ కోర్టు తాజాగా ఆదేశించింది. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన కేసులో ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ కోర్టు ఆమెకు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. తనపై జారీచేసిన నాన్ బెయిలబుల్ వారెంటును నిలిపివేయాలని కోరుతూ జయప్రద దాఖలు చేసిన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు తాజాగా కొట్టివేసింది. దీంతో ఆమెకు ఎదురుదెబ్బ తగిలినట్లైంది. (ఇదీ చదవండి: ముందస్తు బెయిల్ కోసం క్రిష్ పిటిషన్ .. విదేశాలకు 'సైంధవ్' నిర్మాత కుమారుడు) 2019 నుంచి కోర్టు విచారణకు హాజరు కావాలని పలుమార్లు జడ్జి ఆదేశించినా ఆమె హాజరు కాలేదు.. దీంతో ఆమెను పరారీలో ఉన్న వ్యక్తిగా గతంలో కోర్టు ప్రకటించింది. ఆపై నాన్ బెయిలబుల్ వారెంటును కోర్టు జారీ చేసింది. ఈ వారెంటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం తాజాగా విచారించి కొట్టివేసింది. త్వరలో మరిన్ని వాస్తవాలతో తాము మరో పిటిషన్ దాఖలు చేస్తామని జయప్రద తరపు న్యాయవాది కోరడంతో న్యాయమూర్తి అంగీకరించారు. కేసు ఏంటి..? 2019 లోక్‌సభ ఎన్నికల్లో జయప్రద బీజేపీ తరఫున రాంపూర్ నుంచి జయప్రద బరిలో నిలిచారు. ఆ సమయంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత ఆమె ఓ రోడ్డును ప్రారంభించడంతో స్వార్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అప్పటి నుంచి ఈ కేసు రాంపూర్‌లోని ఎంపీ- ఎమ్మెల్యే కోర్టులో పెండింగ్‌లో ఉంది. వ్యక్తిగతంగా హాజరుకావాలని కోర్టు ఆదేశించినా ఆమె రాకపోవడంతో నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. -
జయప్రద ను తక్షణమే అరెస్టు చేయండి..
-
జయప్రదను అరెస్ట్ చేయండి..
రామ్‌పూర్(యూపీ): గత లోక్‌సభ ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్ బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగినపుడు ఎన్నికల నిబంధనావళిని ఉల్లంఘించిన కేసులో మాజీ ఎంపీ, నటి జయప్రదను అరెస్ట్‌చేయాలని అక్కడి రామ్‌పూర్ కోర్టు పోలీసులను ఆదేశించింది. అరెస్ట్‌చేసి మార్చి నెల ఆరోతేదీన తమ ఎదుట ప్రవేశపెట్టాలని సూచించింది. 2019లో ఎన్నికల ప్రవర్తనానిబంధనావళి ఉల్లంఘనపై కేమారి, స్వార్ పోలీస్స్టేషన్లలో జయప్రదపై రెండు కేసులు నమోదయ్యాయి. ఈ కేసు విషయమై తమ ముందు హాజరుకావాలని ప్రత్యేక ఎంపీ – ఎమ్మెల్యే కోర్టు జయప్రదకు సూచించింది. అయినా ఆమె రాకపోవడంతో ఇప్పటివరకు ఏడుసార్లు నాన్ – బెయిలబుల్ వారెంట్లు జారీఅయ్యాయి. ఇంత జరిగినా ఆమె కోర్టుకు రాకపోవడంతో జయను ‘పరారీలో ఉన్న వ్యక్తి’గా జడ్జి ప్రకటించారు. -
జయప్రద అరెస్ట్ కు రంగం సిద్ధం...
-
జయప్రదను వెంటనే అరెస్ట్ చేయండి
లక్నో: సీనియర్ నటి, మాజీ ఎంపీ జయప్రదను అరెస్టు చేయాలంటూ ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఆమెపై ఇదివరకే రెండు కేసులు నమోదు కాగా, ఆమె విచారణకు హాజరు కావడం లేదు. అందుకే ఆమెను అరెస్ట్ చేసి తమ ఎదుట హాజరు పర్చాలని కోర్టు ఆదేశించింది. జయప్రద 2019 లోక్‌సభ ఎన్నికల్లో భాజపా తరఫున రాంపూర్ నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఈ క్రమంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ కౌమరి, స్వార్ పోలీస్ స్టేషన్లలో ఆమెపై రెండు కేసులు నమోదయ్యాయి. ఈ రెండు కేసులు రాంపూర్ ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉన్నాయి. అయితే, విచారణలో భాగంగా అనేక సార్లు నోటీసులు జారీ చేసినా ఆమె స్పందించలేదు. ఇప్పటివరకు ఏడుసార్లు వారెంట్ జారీ చేసినా, పోలీసులు అరెస్ట్ చేయలేదని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దీంతో న్యాయస్థానం ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణ ఈనెల 27కు వాయిదా వేసింది. -
ఆమె కోసం స్టార్ హీరోలే వెయిట్ చేసేవారు.. కానీ నిజ జీవితంలో మాత్రం!
Jaya Prada: సీనియర్ హీరోయిన్ జయప్రద పరిచయం అక్కర్లేని పేరు. ఏపీలోని రాజమండ్రిలో కృష్ణ, నీలవేణి దంపతులకు జన్మించింది. టాలీవుడ్‌తో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం చిత్రాల్లో నటించారు. దాదాపు 300కు పైగా సినిమాల్లో నటించిన ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. జయప్రద అసలు పేరు లలితా రాణి. భూమి కోసం' సినిమాతో తన కెరీర్‌ను ప్రారంభించిన జయప్రద ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. అప్పటి ప్రముఖ తమిళ దర్శకుడు కె. బాలచందర్ తెరకెక్కించిన అంతులేని కథ చిత్రం ద్వారా ఆమె పేరు జయప్రదగా మారిపోయింది. అప్పట్లో జయప్రదకు తెలుగులో కంటే హిందీ చిత్రాల్లోనే ఎక్కువ అవకాశాలు వచ్చాయి. తెలుగు , హిందీ భాషల్లో రెండు దశాబ్దాల పాటు స్టార్ హీరోయిన్గా రాణించింది. తెలుగు నేలపై పుట్టి బాలీవుడ్లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది. జితేంద్ర, రిషీ కుమార్ వంటి అగ్ర హీరోలే అప్పట్లో ఆమె డేట్స్ కోసం వేయిట్ చేసే వారంటే ఆమె రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ లాంటి దిగ్గజాల సరసన నటించింది. ఆ తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసి అక్కడ కూడా దిగ్విజయంగా విజయ యాత్రను కొనసాగించింది. దాదాపు అప్పటి స్టార్ హీరోలందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకున్న జయప్రద.. తన వైవాహిక జీవితంలో కష్టాలను అనుభవించింది. (ఇది చదవండి: సారీ చెప్పిన హీరో లారెన్స్.. ఆ గొడవపై కామెంట్స్!) నిర్మాత శ్రీకాంత్ నహతాతో ప్రేమ పెళ్లి జయప్రద ఫేమ్‌లో ఉన్నప్పుడే అప్పట్లో ప్రముఖ నిర్మాత శ్రీకాంత్ నహతాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 22 ఫిబ్రవరి 1986న ముంబైలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్లో వీరి పెళ్లి జరిగింది. అయితే శ్రీకాంత్‌కు అప్పటికే పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. మొదటి భార్యతో విడాకులు తీసుకోకుండానే రెండో పెళ్లి చేసుకోవడంతో అప్పట్లో వీరి వివాహం వివాదానికి దారి తీసింది. జయప్రదను పెళ్లాడిన తర్వాత కూడా శ్రీకాంత్ తన మొదటి భార్యతోనే ఉంటున్నాడు. అంతే కాదు శ్రీకాంత్ రెండో పెళ్లి తర్వాత మొదటి భార్య మూడో బిడ్డకు జన్మనిచ్చింది. ఆత్మహత్యాయత్నం 1990లో జయప్రద విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆ సమయంలో ఆమె బెంగళూరులో నివాసముండేవారు. విషం తాగిన జయప్రదను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అప్పట్లో జయప్రదపై ఆత్మహత్యాయత్నం కేసు కూడా నమోదు చేశారు. శ్రీకాంత్‌తో వివాహమైన తర్వాత మొదటి భార్య చంద్ర తన భర్తను వదిలేయాలని జయప్రదపై ఒత్తిడి తెచ్చింది. అందుకే జయప్రద విషం మింగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిందన్న వార్త అప్పట్లో వైరలైంది. అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్నా జయప్రద తన భర్తతో సంతోషంగా జీవితాన్ని గడపలేకపోయింది. కొన్నిసార్లు కలిసినప్పటికీ మొదటి భార్యకు, కుటుంబానికి వారిద్దరూ భయపడేవారట. దీనికి తోడు జయప్రద, శ్రీకాంత్‌లకు సంతానం కలగలేదు. ఆ బాధతో పాటు జయప్రద సంతానం లేదని చాలా బాధపడేది. అందువల్లే తన సోదరి కొడుకు సిద్ధార్థ్‌ను ఆమె దత్తత తీసుకున్నారు. జీవితమంతా వివాదాలే.. అయితే ప్రస్తుతం జయప్రదకు సినిమాల కంటే రాజకీయాల్లోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. గతంలో ఆమె ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా జయప్రద ఎన్నో వివాదాలను ఎదుర్కొన్నారు. ఆత్మహత్యాయత్నం జరిగిన కొన్నేళ్ల తర్వాత జయప్రదకు సంబంధించిన మార్ఫింగ్ చేసిన ఫోటోలు వైరల్ అయ్యాయి. అప్పుడు కూడా ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు జయప్రద ఇటీవల ఓ కార్యక్రమంలో చెప్పారు. అంతే కాకుండా సమాజ్‌వాదీ పార్టీకి చెందిన అమర్‌సింగ్‌తో జయప్రదకు రిలేషన్ ఉందంటూ రూమర్స్ కూడా వచ్చాయి. (ఇది చదవండి: పెళ్లికి ముందే పూజలు తెగ చేస్తున్న ఆ హీరోయిన్) 6 నెలల జైలు శిక్ష 2019లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కేసులో ఇటీవలే జయప్రదకు చెన్నైలోని ఎగ్మోర్ కోర్టు జయప్రదకు 6 నెలల జైలు శిక్ష విధించింది. జయప్రద తన సినిమా థియేటర్ల కార్మికుల జీతాల నుంచి ఈఎస్ఐ సొమ్మును ఇప్పటికీ చెల్లించలేదని కార్మికులు రాష్ట్ర కార్మిక బీమా శాఖకు ఫిర్యాదు చేశారు. జయప్రద సినీ జీవితంలో సక్సెస్ అయినప్పటికీ.. వ్యక్తిగత జీవితంలో మాత్రం ఫెయిల్యూర్ అవడం పట్ల ఆమె అభిమానులు బాధపడుతూనే ఉన్నారు. -
జయప్రదకు బిగ్ షాక్.. జైలు శిక్ష విధించిన కోర్టు..
సాక్షి, చెన్నై: సీనియర్ సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదకు బిగ్ షాక్ తగిలింది. ఆమెకు చెన్నై కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పును వెల్లడించింది. అలాగే, జరిమానా కూడా విధించింది. వివరాల ప్రకారం.. తమిళనాడులోని ఎగ్మోర్ కోర్టు జయప్రదకు ఆరు నెలలు జైలు శిక్ష విధించింది. అయితే, చెన్నైకి చెందిన రామ్ కుమార్, రాజబాబుతో కలిసి జయప్రద అన్నారోడ్డులో ఓ సినిమా థియేటర్‌ను నడిపించారు. కాగా, ఈ సినిమా థియేటర్లో పనిచేసే కార్మికులు నుంచి వసూలు చేసిన ఈఎస్ఐ మొత్తాన్ని చెల్లించలేదని కార్మిక బీమా కార్పోరేషన్ కోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై కోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. అయితే, దీనిపై విచారణ జరిపిన కోర్టు.. జయప్రదతో పాటుగా మరో ముగ్గురికి ఎగ్మోర్ కోర్టు ఆర్నెళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించింది. అలాగే, ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున జరిమానా విధించింది. ఇదిలా ఉండగా.. జయప్రద తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమే. ఆమె.. తెలుగు సహా పలు భాషల చిత్రాల్లో నటించారు. రెండు దశాబ్దాల పాటు స్టార్ హీరోయిన్గా తన మార్క్ నటనతో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసి అక్కడ కూడా దిగ్విజయంగా విజయ యాత్రను కొనసాగించారు. நடிகை ஜெயப்பிரதாவுக்கு 6 மாதம் சிறை#JayaPrada | #Jail pic.twitter.com/GKUcmO6ViJ — Kumudam Reporter (@ReporterKumudam) August 11, 2023 -
13 ఏళ్లకే సినిమాల్లోకి.. తొలి పారితోషికం రూ.10, ఎవరో గుర్తుపట్టారా?
కాటుక కళ్లతో, ముసిముసి నవ్వులు నవ్వుతున్న ఈ హీరోయిన్ను గుర్తుపట్టారా? ఈమె ఒక క్లాసికల్ డ్యాన్సర్.. టాలీవుడ్లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ స్టార్ హీరోయిన్గా వెలుగొందింది. గ్లామర్, యాక్టింగ్.. రెండింటిలోనూ బెస్ట్ అనిపించుకుంది. ఈపాటికే ఆమె ఎవరో తెలిసిపోయుంటుంది. అవును, ఆమె అచ్చతెలుగందం, అందాల తార జయప్రదనే! 15 ఏళ్లకే హీరోయిన్ రాజమండ్రికి చెందిన జయప్రద అసలు పేరు లలిత రాణి. 'భూమి కోసం' (1974) చిత్రంలో మొదటిసారి తెర మీద రెండు మూడు నిమిషాల సేపు కనిపించింది. ఈ చిత్రంలోని ఓ పాట మధ్యలో ఒక వితంతువు తనను చెరబట్టే కామందును హతమారుస్తుంది. ఆ వితంతువు చంద్రమ్మ మరెవరో కాదు జయప్రదనే. ఈ సినిమా చేసే సమయానికి ఆమె వయసు 13 కాగా తను అందుకున్న పారితోషికం రూ.10. ఈ చిత్రంతోనే ఆమె తన పేరు మార్చుకుని జయప్రదగా మారింది. తన పెదవిపై ఉండే పుట్టుమచ్చ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. దీని తర్వాత ఆమె చేసిన పెద్ద చిత్రం అంతులేని కథ. అప్పుడామె వయసు 15 ఏళ్లు. షూటింగ్లో రజనీకాంత్, జయప్రదల మధ్య సన్నివేశంలో జయప్రద నటనకు కె.బాలచందర్ సంతోషంతో క్లాప్స్ కొట్టారట! 300కు పైగా సినిమాలు.. జయప్రద 'అడవి రాముడు' సినిమాతో కమర్షియల్ హీరోయిన్గా మారింది. ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి.. హరి.. అంటూ ఆమె తన అందాలు చూపిస్తూ కళ్లతోనే కొంటెగా మాట్లాడింది. తెలుగులో స్టార్ హీరోయిన్గా గుర్తింపు అందుకున్న ఆమెకు బాలీవుడ్‌లోనూ అవకాశాలు తలుపు తట్టాయి. అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, రాకేశ్ రోషన్, జితేంద్ర వంటి బడా స్టార్స్‌తో నటించింది జయప్రద. హిందీలో జితేంద్ర- జయప్రదలది ఎక్కువ హిట్ కాంబినేషన్‌గా చెప్పుకుంటారు. 'సిరిసిరిమువ్వ', 'భద్రకాళి', 'అడవిరాముడు', 'యమగోల', 'అందమైన అనుభవం', 'సాగర సంగమం', 'దేవత', 'మేఘసందేశం'.. ఇవి కాక.. తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ, ఇంగ్లిష్ భాషల్లో మొత్తం మూడు వందలకు పైగా సినిమాలు చేసింది. ఆమె నటనా కౌశల్యానికి గానూ ఎన్నో అవార్డులు, రివార్డులు ఆమెకు కుప్పలుతెప్పలుగా వచ్చిపడ్డాయి. హీరోలతో సమాన పారితోషికం తీసుకునే స్థాయికి ఎదిగింది. ముగ్గురు పిల్లల తండ్రితో పెళ్లి కెరీర్లో ఆకాశమంత విజయాలను చూసిన ఆమె వ్యక్తిగత జీవితం మాత్రం వివాదాల మేళవింపుగా మిగిలిపోయింది. జయప్రద అప్పటికే పెళ్లై, ముగ్గురు పిల్లల తండ్రైన నిర్మాత శ్రీకాంత్ నహతాను ప్రేమించింది. అతడు మొదటి భార్యకు విడాకులివ్వకుండానే జయప్రదను పెళ్లాడాడు. అప్పట్లో ఈ విషయం పతాక శీర్షికల్లో నిలిచింది. వీరికి పిల్లలు లేరు. పెళ్లి తర్వాత కూడా జయప్రద సినిమాలు చేసింది. కానీ నెమ్మదిగా దర్శకనిర్మాతలు తనను పక్కన పెడుతూ రావడంతో సినిమాల సంఖ్యను తగ్గిస్తూ వచ్చింది. ఆమె చివరగా 2019లో సువర్ణ సుందరి సినిమా చేసింది. చాలాకాలంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజైంది. చదవండి: నా భర్తను ద్వేషిస్తున్నా.. ఎందుకంటే 5 నిమిషాలు కూడా మాట మీద నిలబడడు -
అతని ఆట ఇక ముగిసింది: జయప్రద
లక్నో: బీజేపీ నేత, రాంపూర్ మాజీ ఎంపీ జయప్రద.. సమాజ్ వాదీ సీనియర్ ఆజాంఖాన్ పై విమర్శలతో విరుచుకుపడ్డారు. ఆయన ఎన్నో పాపాలు చేశారని, చేసిన తప్పులకు ఆయన తప్పక శిక్ష అనుభవిస్తారని పేర్కొన్నారు. ఆదివారం మీరట్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ మాజీ నటి మాట్లాడుతూ.. రాజకీయాల్లో పార్టీల మధ్య వైవిధ్యాలు, విభేధాలు సహజం. కానీ, అధికారం ఉంది కదా అని మహిళలను అగౌరవపరచడం, పేదలకు అన్యాయం చేయడం సరికాదు. అజాం ఖాన్ ఆయన వారసుడు అబ్దుల్లా ఖాన్ లకు మహిళలను గౌరవించడం ఏమాత్రం తెలియదు. ఆజాం ఖాన్ ఆట ముగిసింది. చేసిన పాపాలకు వాళ్లు అనుభవించకతప్పదు అని జయప్రద పేర్కొన్నారు. ఇక వచ్చే ఏడాదిలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల గురించి ప్రస్తావించిన ఆమె.. నరేంద్ర మోదీ నాయకత్వంలో మరోసారి బీజేపీ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాంపూర్ కూడా బీజేపీ వశం అవుతుందని జోస్యం చెప్తున్నారామె. ఇదిలా ఉంటే.. జయప్రద, ఆజాంఖాన్ గతంలో పరస్పర విమర్శలతో వివాదాల్లో చిక్కుకున్నారు. 2019 ఎన్నికల్లో జయప్రద రాంపూర్ నుంచి లోక్ సభ ఎన్నికల బరిలో దిగగా.. ఆజాం ఖాన్ ‘ఖాకీ అండర్ వేర్‘ అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారమే రేపాయి. మరోవైపు ఆ టైంలో ఆయనపై కేసు కూడా నమోదు అయ్యింది. కిందటి ఏడాది జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో రాంపూర్ సదర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆజాం ఖాన్. అయితే.. 2019 లోక్ సభ ప్రచారం సందర్భంగా విద్వేష పూరిత ప్రసంగం చేసిన కేసులో ఆజాంఖాన్ కు మూడేళ్ల శిక్ష పడింది. దీంతో చట్ట ప్రతినిధుల నిబంధనల ప్రకారం.. ఆయనపై అనర్హత వేటు పడింది. తాజాగా ఇక ఆయన తనయుడు అబ్దుల్లా ఖాన్ కు(ఆజాంఖాన్ కు కూడా) తాజాగా 2008 నాటి కేసులో కోర్టు రెండేళ్ల శిక్ష విధించగా.. ఎమ్మెల్యే పదవిని అనర్హతతో కోల్పోయారాయన. -
‘సువర్ణ సుందరి’మూవీ రివ్యూ
టైటిల్: సువర్ణ సుందరి నటీనటులు: జయప్రద, పూర్ణ, సాక్షి, ఇంద్ర, రామ్, సాయికుమార్, కోట శ్రీనివాసరావు, నాగినిడు, అవినాష్,సత్యప్రకాశ్ తదితరులు నిర్మాణ సంస్థ: ఎస్ టీమ్ పిక్చర్స్ నిర్మాత: ఎమ్.ఎల్. లక్ష్మీ రచన,దర్శకత్వం: సురేంద్ర మాదారపు సంగీతం: సాయి కార్తీక్ సినిమాటోగ్రఫీ: యెల్లుమహంతి ఈశ్వర్ ఎడిటింగ్: ప్రవీణ్ పూడి విడుదల తేది: ఫిబ్రవరి 3, 2023 కథేంటంటే.. ఈ సినిమా కథంతా.. సువర్ణ సుందరి అనే విగ్రహం చుట్టూ తిరుగుతుంది. 300 ఏళ్ల క్రితం కర్ణాటకలోని కాలక్కల్ సంస్థానంలో త్రినేత్రి అమ్మవారి విగ్రహాలను తయారు చేసే ఓ వ్యక్తి ఆ విగ్రహంలో దుష్టశక్తిని నింపుతాడు. దాని కారణంగా ఆ రాజ్యమే నాశనం అవుతుంది. దీంతో గ్రామస్తులంతా సువర్ణ సుందరి విగ్రహాన్ని భూస్థాపితం చేస్తారు. అయితే 300 ఏళ్ల తర్వాత ఓ వ్యక్తి పొరపాటున ఆ విగ్రహాన్ని బయటకు తీయడంతో అతని ఫ్యామిలీ అంతా చనిపోతుంది. స్వాతంత్రానంతరం ఆ విగ్రహం ఓ పాత బంగ్లా చేరుతుంది. ఆ బంగ్లాలోకి దిగిన కలెక్టర్ భార్య అంజలి(పూర్ణ)కి ఆ విగ్రహం దొరుకుతుంది. ఆమె సువర్ణ సుందరిని టచ్ చేయగానే దుష్టశక్తి ఆమెలో చేరిపోతుంది. దీంతో తన భర్తను, మామను అంజలి చంపేస్తుంది. తన కూతురు విశాలాక్షి (జయ ప్రద)ను కాపాడుకునేందుకు అంజలి ఆ విగ్రహంతో ఆత్మాహుతి చేసుకుంటుంది. కానీ మళ్లీ అంజలి కొన్నేళ్ల తరువాత జన్మిస్తుంది. అలా మళ్లీ అంజలి చేతికే ఆ విగ్రహం దొరుకుతుంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలేంటి? తన తల్లిని కాపాడుకునేందుకు విశాలాక్షి చేసే ప్రయత్నం ఏంటి? సాక్షి (సాక్షి చౌదరి)కి ఆ విగ్రహంతో ఉన్న సంబంధం ఏంటి? ఈ కథలో పోలీస్ ఆఫీసర్ గుణ (సాయి కుమార్) పాత్ర ఏంటి? విగ్రహం వెనుకున్న రహస్యం ఏంటనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. పురాతన బంగ్లా, సంస్థానం.. అందులో దుష్టశక్తి ఉండడం..దాని వల్ల ప్రజలకు హానీ కలగడం..ఈ తరహా కథలను మనం చూశాం. కానీ సువర్ణ సుందరి కథలో కొత్తదనం ఏంటంటే విగ్రహంలోనే దుష్టశక్తి ఉండడం. అది ఎవరి దగ్గర ఉంటే వాళ్లు రాక్షసుల్లా మారిపోవడం.. చుట్టుపక్కల వాళ్లను చంపి ఆ రక్తంతో దాహం తీర్చుకోవడం..ఇది వినడానికే ఆసక్తికరంగా ఉంది కదా.. దర్శకుడు సురేంద్ర అంతే ఆసక్తిగా తెరపై చూపించాడు. కథలో లోపాలు ఉన్నప్పటికీ గ్రాఫిక్స్‌తో వాటిని కప్పిపుచ్చారు. ఫస్టాఫ్ అంతా సువర్ణ సుందరీ విగ్రహం చుట్టే సాగుతుంది. కొన్ని సీన్స్ భయపెడతాయి. మిగతావి సాదాసీదాగా సాగుతాయి. కథ ముందుకు వెళ్తున్న కొద్దీ కాస్త నిదానంగా సాగినట్టు అనిపిస్తుంది. సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. సువర్ణ సుందరి నేపథ్యం తెలిశాక ప్రేక్షకులు ఆశ్యర్యపోతారు. అయితే దర్శకుడు ఎంచుకున్న పాయింట్ గొప్పగా ఉన్నా..మేకింగ్ విషయంలో కాస్త తడబడ్డాడు. కథని ఇంకాస్త బలంగా రాసుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. హారర్ చిత్రాలను ఇష్టపడే వారికి సువర్ణ సుందరి నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. ఈ చిత్రంలో అంజలి రెండు గెటప్పుల్లో కనిపిస్తుంది. ప్రజెంట్ సీన్లలో మోడ్రన్‌గా కనిపిస్తే.. ప్లాష్‌బ్యాక్ సీన్లలో ఎంతో నిండుగా, హుందాగా కనిపిస్తారు. సాక్షి అయితే సెకండాఫ్‌లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ సీన్లో మెప్పిస్తుంది. జయప్రద మరోసారి తన అనుభాన్ని తెరపై చూపించారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఆమె నటన అదిరిపోతుంది. పోలీసు పాత్రలో సాయి కుమార్ ఎప్పటిమాదిరే ఒదిగిపోయాడు. చర్చ్ ఫాదర్‌గా కోట శ్రీనివాసరావు, రాజగురువుగా నాగినీడు, మహారాజుగా అవినాష్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాయి కార్తీక్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు పర్వాలేదు. యెల్లుమహంతి ఈశ్వర్ సినిమాటోగ్రఫీ, విజువల్స్ బాగున్నాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
టాలీవుడ్ హీరోపై మనసు పడిన రాశీఖన్నా
నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ 2 టాక్ షోకు రోజురోజుకూ అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. తన మ్యానరిజం,చమత్కారంతో టీఆర్పీ రేటింగ్స్‌ను పరుగులు పెట్టిస్తున్నారు బాలయ్య. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే షో సెకండ్ సీజన్ కూడా సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతుంది. ఇప్పటికే 5 ఎపిసోడ్లు స్ట్రీమింగ్ కాగా, తాజాగా లేటెస్ట్ ప్రోమోను వదిలారు. అలనాటి హీరోయిన్స్ జయసుధ, జయప్రదలతో పాటు యంగ్ బ్యూటీ రాశీఖన్నాలు షోలో సందడి చేయనున్నారు. ఈ క్రమంలో నారీనారీ నడుమ మురారి అంటూ ముగ్గురు హీరోయిన్స్‌తో బాలయ్య అల్లరి ఏ విధంగా ఉంటుందో ప్రోమోలో చూపించారు. ఇక హీరోయిన్ రాఖీఖన్నా మనసులో చోటు సంపాదించుకున్న టాలీవుడ్ హీరో గురించి కూడా బయటపెట్టేశారు. నువ్వు నటించిన హీరోల్లో నీ క్రష్ ఎవరు అని బాలయ్య అడగ్గా ఏమాత్రం తడుముకోకుండా విజయ్ దేవరకొండ అంటూ ఓపెన్ కామెంట్స్ చేసింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట చక్కర్లు కొడుతుంది. -
నటి జయప్రదకు షాక్, మాజీ ఎంపీపై నాన్ బెయిలబుల్ వారెంట్
సీనియర్ నటి, బీజేపీ నాయకురాలు జయప్రదపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయ్యింది. ఉత్తరప్రదేశ్ రాంపూర్ ప్రత్యేక కోర్టు జయప్రదపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి షాక్ ఇచ్చింది. ఎన్నికల సమయంలో ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కేసులకు సంబంధించి ఆమెకు వారెంట్ ఇచ్చినట్లు ప్రభుత్వ న్యాయవాది అమర్నాథ్ తివారీ తెలిపారు. వివరాలు.. 2019లో లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎన్నికల నియయావళిని ఉల్లంఘించినందుకు గాను ఆమెపై వేర్వేరుగా రెండు కేసు నమోదయ్యాయి. చదవండి: తొలిసారి కూతురిని చూసి ఎమోషనలైన సింగర్ రేవంత్, వీడియో వైరల్ ఈ కేసుల విచారణ సమయంలో జయప్రద వరుసగా కోర్టుకు హాజరుకాకపోవడం కోర్టు ఆమె తీరుపై ఆగ్రం వ్యక్తం చేసింది. ఈ కారణంగానే జయప్రదపై తాజాగా రాంపూర్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది. అంతేకాదు వచ్చే మంగళవారం విచారణ సందర్భంగా జయప్రదని కోర్టులో హజరుపరచాలని రాంపూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసును కోర్టు ఆదేశించినట్లు న్యాయవాది అమర్నాథ్ తెలిపారు. ఇక ఈ కేసు తదుపరి విచారణను జనవరి 9వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. చదవండి: భారీగా రెమ్యునరేషన్ పెంచిన విజయ్.. తలైవాను అధిగమించాడా? కాగా 2019 ఏప్రిల్ 18న పిపారియా మిశ్రా గ్రామలో జరిగిన ఓ బహిరంగ సభకు సంబంధించి వీడియో నిఘా బృందం ఇన్ఛార్జ్ కుల్దీప్ భట్నాగర్ నమోదు చేశారు. అలానే.. స్వర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నూర్పూర్ గ్రామంలో రోడ్డు ప్రారంభోత్సవానికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో 2019 ఏప్రిల్ 19న ఫ్లయింగ్ స్క్వాడ్ మేజిస్ట్రేట్ నీరజ్ కుమార్ జయప్రద మీద మరో కేసు నమోదు చేశారు. ఈ ఎన్నికల్లో రాంపూర్ నియోజకవర్గం నుంచి పోటీచేసిన జయప్రద.. సమాజ్ వాదీ పార్టీకి చెందిన అజం ఖాన్ చేతిలో లక్ష ఓట్ల తేడాతో ఓడిపోయారు. -
సీనియర్ నటి జయప్రదకు అరుదైన పురస్కారం
సీనియర్ నటి జయప్రదకు అరుదైన గౌరవం లభించింది. ఆమె ఎన్టీఆర్ చలన చిత్ర శతాబ్ది పురస్కారానికి ఎంపికైంది. ఎన్టీఆర్ శతజయంతి మహోత్సవాల సందర్భంగా అవార్డ్ అందకోనున్నారు. ఈనెల 27న ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కార మహోత్సవ సభ జరగనుంది. నందమూరి బాలకృష్ణ, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో ఏడాది పాటు ఎన్టీఆర్ శతజయంతి మహోత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఉత్సవాల్లో భాగంగా తెనాలిలో ప్రముఖ రైటర్ డాక్టర్ సాయి మాధవ్ బుర్ర సభా నిర్వహణలో ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కార గ్రహీత అవార్డును ప్రఖ్యాత సినీ నటి జయప్రద అందుకోనున్నారు. ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ గారి చేతుల మీదుగా ఆమెకు పురస్కారాన్ని అందించబోతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జయప్రకాశ్ నారాయణ, దర్శకుడు కోదండరామిరెడ్డి, ఎన్టీఆర్ అభిమాన సత్కార గ్రహీత డాక్టర్ మైధిలి అబ్బరాజు, మాజీ మంత్రి నెట్టెం రఘురాం పాల్గొననున్నారు. ఈ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా తెనాలి పెమ్మసాని (రామకృష్ణ) థియేటర్లో ఏడాది పొడవునా ఎన్టీఆర్ చలన చిత్రాలు ప్రదర్శింపబడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈనెల 28న "అడవి రాముడు" సినిమాను ప్రదర్శిస్తునారు. ఈ చిత్రాన్ని నందమూరి రామకృష్ణ, జయప్రద, కోదండరామిరెడ్డి ప్రేక్షకులతో కలిసి చూడనున్నారు. -
స్టార్ నటుడు చెంప చెళ్లుమనిపించిన జయప్రద? క్లారిటీ ఇచ్చిన దలీప్ తాహిల్
నటి జయప్రద గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు, హిందీ, తమిళంలో ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఆమె రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటోంది. ఇదిలా ఉంటే ఆమె స్టార్ నటుడు దలీప్ తాహిల్ చెంప చెళ్లుమనిపించిందంటూ తరచూ బాలీవుడ్లో వార్తల చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఈ వార్తలపై తాజాగా నటుడు దలీప్ తాహిల్ స్పందించాడు. ఈ సందర్భంగా జయప్రద తనని కొట్టినట్లు వస్తున్న వార్తలపై ఆయన వివరణ ఇచ్చాడు. 1986లో అమితాబ్ బచ్చన్-జయప్రద జంటగా ‘ఆఖ్రే రాస్తా’ మూవీ తెరకెక్కింది. ఈ సినిమాలో దలిప్ తాహిర్ విలన్‌గా చేశాడని, ఇందులో ఆయన జయప్రదను అత్యాచారం చేసే ఓ సన్నివేశం ఉందట. ఈ సీన్ షూటింగ్ సమయంలో తనతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో జయప్రద ఆయనను చెంప దెబ్బ కొట్టినట్లు ఓ వార్త ప్రచారంలో ఉంది. తాజాగా దీనిపై ఆయన వివరణ ఇచ్చాడు. ‘‘జయప్రదతో కలిసి ఓ అభ్యంతరకర సన్నివేశంలో నటించానని, ఆ సీన్ షూటింగ్ సమయంలో ఆమె నన్ను కొట్టినట్లు కొంత కాలంగా ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలను నేను కూడా విన్నాను. నేను కొంచెం దూకుడుగా వెళ్లానని, ఆమె నా చెంప చెళ్లు మనిపించినట్టు అందులో ఉంది. అసలు నేను జయప్రదతో కలిసి ఏ సినిమాలోనూ నటించనేలేదు. ఇది వాస్తవం. ఆమెతో కలిసి నటించాలనే ఆసక్తి ఉన్నా, ఆ అవకాశం మాత్రం రాలేదు. అలాంటప్పుడు ఇక అలాంటి సీన్ చేసే అవకాశమే లేదు కదా? ఈ కథనాలు రాసే వ్యక్తి పట్ల నాకు శత్రుత్వం లేదు. కానీ ఆ సీన్ చూపిస్తే సంతోషిస్తాను. సోషల్ మీడియాలో అసలు లేనివి కూడా పుట్టిస్తున్నారు’’ అంటూ దలీప్ తాహిల్ అసహనం వ్యక్తం చేశాడు. చదవండి: నాకు స్ఫూర్తినిచ్చిన అంశాలన్నీ మీతోనే వెళ్లిపోయాయి నాన్నా: మహేశ్ ఎమోషనల్ ఘనంగా అలీ కూతురు హల్దీ ఫంక్షన్, ఫొటోలు వైరల్ -
‘మా ఇద్దరిని కలపడానికి ఓ గదిలో పెట్టి తాళం వేశారు’
అందాల తార శ్రీదేవి బాల నటిగా ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత ఇండియాలోనే టాప్ హీరోయిన్గా నిలిచారు. అప్పటికే టాలీవుడ్లో టాప్ హీరోయిన్లుగా వెలుగొందుతున్న జయప్రద, జయసుధలకు.. అటు బాలీవుడ్లో మాధురీ దీక్షిత్‌కు గట్టి పోటీ ఇచ్చారు శ్రీదేవి. ఆ తర్వాత ఆమె ఇండియాలోనే నంబర్ వన్ హీరోయిన్గా ఎదిగారు. ఇక శ్రీదేవికి, జయప్రదకు మధ్య ఉన్న కోల్డ్ వార్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మర్యాదపూర్వకంగా పలకరించుకోవడం కానీ.. కనీసం ఒకరిని ఒకరు చూసుకోవడం కానీ చేసేవారు కాదు. ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి ఎందరో ప్రయత్నించినప్పటికి ఫలితం లేకుండా పోయింది. తాజాగా వీరిద్దరి మధ్య నడిచిన కోల్డ్ వార్‌కు సంబంధించిన విశేషాలు మరోసారి తెర మీదకు వచ్చాయి. ఈ సారి ఏకంగా జయప్రదనే దీనిపై స్పందించారు. ఇండియన్ ఐడల్ 12కు గెస్ట్‌గా వచ్చారు జయప్రద. ఈ వేదిక మీద ఆమె తనకు, శ్రీదేవికి మధ్య నడిచిన కోల్డ్ వార్‌ను మరోసారి గుర్తు చేసుకున్నారు. జయప్రద మాట్లాడుతూ.. ‘‘ఇలా చెప్పడానికి నేనేం బాధపడటం లేదు. అలా అని మేం ఇద్దరం ఎప్పుడైనా గొడవ పడ్డామా అంటే అది లేదు. కాకపోతే మా ఇద్దరి మధ్య కెమస్ట్రీ మ్యాచ్ కాలేదు. పైగా అప్పటికే మేం ఇద్దరం టాప్ హీరోయిన్లం. నేనేందుకు తగ్గాలంటే.. నేనేందుకు తగ్గాలి అని ఇద్దరం ఫీల్ అయ్యే వాళ్లం. ఎలా ఉండేవాళ్లం అంటే మా ఇద్దరి మధ్య ఐ కాంటాక్ట్ కూడా ఉండేది కాదు’’ అంటూ గుర్తు చేసుకున్నారు. ‘‘ఇక ప్రతి విషయంలో మేం ఒకరి మీద ఒకరం పోటీ పడుతుండేవాళ్లం. డ్రెస్సులు, డ్యాన్స్‌లు ఇలా అన్ని విషయాల్లో ఒకరిపై ఒకరం పై చేయి సాధించాలని ట్రై చేసే వాళ్లం. తెర మీద మంచి అక్కాచెల్లళ్లలా కనిపించినప్పటికి.. వాస్తవంగా కనీసం పరిచయం ఉన్నవారిలా కూడా ఉండేవాళ్లం కాదు. మేం ఇద్దరం ఎదురుపడిన ప్రతిసారి దర్శకులు, తోటి నటులు మమ్మల్ని ఒకరిని ఒకరికి పరిచయం చేసేవారు. అప్పుడు మాత్రం హలో అని పలకరించుకుని ముందుకు వెళ్లిపోయేవాళ్లం’’ అంటూ చెప్పుకొచ్చారు జయప్రద. ఇక తమ ఇద్దరిని కలపడానికి చాలా మంది ప్రయత్నించారని.. వారిలో రాజేశ్ కుమార్, జితేంద్ర ఖన్నా కూడా ఉన్నారని గుర్తు చేసుకున్నారు జయప్రద. ‘‘ఒకసారి షూటింగ్ లంచ్ టైంలో రాజేశ్ కుమార్, జితేంద్ర మా ఇద్దరిని ఒకే రూమ్‌లో పెట్టి తాళం వేశారు. దాదాపు గంటసేపు అలానే ఉంచారు. అలా అయినా మేం ఒకరితో ఒకరం మాట్లాడుకుంటామని భావించారు. గంట తర్వాత తలుపు తీసి చూస్తే.. మేం ఇద్దరం ఆ పక్క ఒకరం.. ఈ పక్క ఒకరం కూర్చుని ఉన్నాం. ఆ తర్వాత ఇద్దరం బయటకు వెళ్లిపోయాం’’ అని చెప్పుకొచ్చారు జయప్రద. చదవండి: 'అమ్మాయ్... చింపి.. చింపి.. చంపి పడేశావ్' ఆ నటి గొంతు నాకన్నా ఘోరంగా ఉంది -
స్టార్ స్టార్ సూపర్ స్టార్- జయప్రద
-
అందాల తార జయప్రద గురించి ఈ విషయాలు తెలుసా..?
ఆమె ఆరేసుకుంటే ప్రేక్షకుడు మనసు పారేసుకున్నాడు. ఈమెతోనే రజనీకాంత్ ‘ఇంక ఊరేల.. సొంత ఇల్లేల ఓ చెల్లెలా’ అన్నది. కమలహాసన్ కళ మద్యపు మురుక్కాలవలో పారుతుంటే ఈమె కదూ దానిని ‘సాగర సంగమం’ చేయించింది. ‘భారతీయ వెండితెర మీద అంత అందమైన ముఖం మరొకటి లేదు’ అని సత్యజిత్ రే పొగిడిన ఏకైక తెలుగు అందం జయప్రదది. ఆమె రాజకీయ ప్రస్థానం ఒకదారి. ఆమె నటనదే ప్రేక్షకుల గుండెదారి. జయప్రద... జయసుధ.. శ్రీదేవి తెలుగు సినీ జగత్తును ఏలిన ఈ ముగ్గురు హీరోయిన్లు ఒకటి రెండు సంవత్సరాల తేడాతో స్టార్లు అయ్యారు. తెలుగు మాట, తెలుగు ఆట, తెలుగు సౌందర్యం తెర మీద చూపారు. శ్రీదేవి గ్లామర్‌లో బెస్ట్. జయసుధ యాక్టింగ్‌లో బెస్ట్. జయప్రద ఇటు గ్లామర్, అటు యాక్టింగ్ రెంటిలోనూ బెస్ట్ అనిపించుకున్నారు. రాజమండ్రికి చెందిన లలిత రాణి ‘భూమి కోసం’ (1974)లో మొదటిసారి తెర మీద రెండు మూడు నిమిషాల సేపు కనిపించారు. ఒక పాట మధ్యలో ఒక వితంతువు తనను చెరబట్టే కామందును హతమారుస్తుంది. ఆ వితంతువు జయప్రద. మొట్టమొదటి వేషం అలాంటిది ఎవరూ వేయరు. కాని జయప్రద చేశారు. ఆ సినిమాలోనే పేరు మార్చుకుని అప్పట్లో ‘జయ’ ట్రెండ్ నడుస్తున్నందున జయప్రదగా మారారు. ఆమె పెదవి మీద పుట్టుమచ్చ ఉంటుంది. వెండితెర మీద ఒక అందమైన పుట్టుమచ్చగా ఆమె ప్రేక్షకులకు నచ్చింది. తరం మారుతున్నప్పుడు కొత్త తరం వస్తుంది. వాణిశ్రీ, లక్ష్మి, మంజుల, లత... వీరు సీనియర్లు అవుతున్న కొద్దీ కొత్తవాళ్లు కావాల్సి వచ్చారు. జయప్రద ఆ సమయంలోనే మద్రాసులో అడుగుపెట్టారు. ఏకంగా కె.బాలచందర్ దృష్టిలో పడ్డారు. ఆమె తమిళంలో తీసిన ‘అవల్ ఒరు తోడర్ కథై’లో సుజాత చేసిన పాత్రను జయప్రదకు ఆఫర్ చేశారాయన. సుజాతకు అప్పటికి తెలుగు రాదు. అచ్చతెలుగు అమ్మాయి ఉంటేనే బాగుంటుందని బాలచందర్ ఆలోచన. అందుకు జయప్రద సరైనది అని ఆయన భావించారు. ఒక మధ్యతరగతి గంపెడు సంసారాన్ని తన భుజాల మీద మోసే, తన కలలను చిదిమేసుకుని కుటుంబం కోసం బతికే ఒక సగటు ఆడపిల్ల కథ అది. దాని బరువు ఎక్కువ. జయప్రదది ఆ సమయానికి చిన్న వయసు. కాని ఆమె ఆ పాత్రను అర్థం చేసుకొని పోషించడంతో... ఒక్క కేరెక్టర్లోనే ప్రేమ, కోపం, ఆర్తి, అసహనం చూపడంతో జయప్రద స్టార్ అయ్యారు. ఆ సినిమాయే తెలుగులో రజనీకాంత్‌కు కూడా తొలి సినిమా. ఆ సినిమాలో ‘దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి పాట’... ఏసుదాస్‌కు, జయప్రదకు, రజనీకాంత్‌కు నేటికీ మిగిలిపోయింది. కె.బాలచందర్ దర్శకత్వంలో ఆమె ‘47 రోజులు’, ‘అందమైన అనుభవం’ చేశారు. కేన్సర్ పేషెంట్‌గా చేయడానికి ఎవరు ఒప్పుకుంటారు? జయప్రద తప్ప. ‘అడవి రాముడు’తో కె.రాఘవేంద్రరావు జయప్రదను కమర్షియల్ హీరోయిన్ను చేశారు. అప్పటికే జయప్రద కుటుంబం ఎన్.టి.ఆర్కు పరిచయం ఉంది. కొన్నాళ్ల క్రితం సెలవుల్లో వచ్చి ఆయన దగ్గర కూచుని కబుర్లు చెప్పిన స్కూల్ గర్ల్ ఇప్పుడు ఆయన పక్కనే హీరోయిన్ అయ్యింది. వేటూరి రాయగా కె.వి.మహదేవన్ స్వరపర్చగా బాలూ, సుశీల పాడిన ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను’ పాట జయప్రదను సకల ప్రేక్షకులకు పరిచయం చేసేసింది. జయప్రద అంటే ఒక సుందరమైన సౌందర్యవంతమైన రూపం. ప్రేక్షకులు అలానే కోరుకున్నారు. ఆమె నేటికీ అలానే ఉన్నారు. ఇప్పుడు ఆమె ఒక తెలుగు సినిమా లో నటిస్తున్నారు. మరోసారి జయప్రద జయప్రదంగా మన ముందుకు రావాలని కోరుకుందాం. – సాక్షి ఫ్యామిలీ -
విమర్శలు... వ్యంగ్యాస్త్రాలు
‘బాలీవుడ్ డ్రగ్స్ మత్తులో ఉంది’ అని నటుడు, యంపీ రవికిషన్ చేసిన వ్యాఖ్యలు ఓ కొత్త వివాదానికి దారి తీసిన విషయం, ఆయన మాటల్ని నటి, యంపీ జయా బచ్చన్ ఖండించిన విషయం తెలిసిందే. జయ మాటలకు ఇండస్ట్రీ నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఆమె మాటలు కరెక్ట్ అని చాలామంది అన్నారు. కొందరు కొట్టిపారేశారు. కంగనా రనౌత్ అయితే అస్సలు ఏకీభవించలేదు. జయ కామెంట్స్‌ను తిప్పి కొట్టారు. అయితే కంగనా మాట్లాడిన విషయాన్ని ఊర్మిళ తప్పుబట్టారు. ఇదంతా బుధవారం వరకూ జరిగిన మాటల యుద్ధం. జయా బచ్చన్ వ్యాఖ్యలకు గురువారం వ్యంగ్యంగా బదులిచ్చారు నటుడు రణ్వీర్ షోరే. తన మీద ఊర్మిళ చేసిన కామెంట్స్‌ను తిప్పికొట్టారు కంగనా రనౌత్. ఈ విషయాల గురించి జయప్రద, పూజా భట్ మాట్లాడారు. క్యూట్ గాళ్ నిధీ అగర్వాల్ కూడా ‘నెపోటిజమ్’ గురించి మాట్లాడారు. ఆ విశేషాలు. ఊర్మిళ కేవలం శృంగార తార! – కంగనా ‘డ్రగ్స్ హిమాచల్ ప్రదేశ్‌లోనే మొదలయ్యాయి. ముందు నీ ప్రాంతాన్ని శుభ్రం చేసుకో’ అని కంగనా రనౌత్‌కు కౌంటర్ ఇచ్చారు నటి ఊర్మిళ. ఈ కౌంటర్‌కి ఘాటుగా సమాధానం ఇచ్చారు కంగనా. ‘ఊర్మిళగారి ఇంటర్వ్యూ చూశాను. నా గురించి, నా ప్రయాణం గురించి తక్కువ చేస్తూ మాట్లాడారామె. ఇదంతా నేను రాజకీయాల్లో సీట్ కోసం చేస్తున్నాను అని అంటున్నారామె. ఊర్మిళ సాఫ్ట్ పోర్న్ స్టార్ (శృంగార తార). ఆమె యాక్టింగ్‌కి ఆమె పాపులర్ అవ్వలేదు. మరి దేనికి పాపులరయ్యారు? అంటే... సాఫ్ట్ పోర్న్ చేయడం వల్లే కదా. ఆమెకే టికెట్ వచ్చినప్పుడు నాకెందుకు రాదు?’ అని కౌంటర్ ఇచ్చారు కంగనా. అయితే కంగనా చేసిన ఈ వ్యాఖ్యలకు బాలీవుడ్లో పలువురు ప్రముఖులు ఊర్మిళకు మద్దతుగా ట్వీట్ చేశారు. మా దగ్గర ఉన్న ప్రతిదీ మా కష్టార్జితమే! – రణ్వీర్ షోరే ‘ఇండస్ట్రీలో పని చేస్తూ ఇండస్ట్రీనే తప్పుపట్టడమంటే అన్నం పెట్టిన చేతినే నరకడం వంటిది’ అన్నారు జయా బచ్చన్. ఈ కామెంట్‌ను కంగనా తిప్పి కొట్టిన సంగతి తెలిసిందే. తాజాగా నటుడు రణ్వీర్ షోరే కూడా స్పందించారు. ‘ఖరీదైన ప్లేట్లలో మీ పిల్లలకు మీరు భోజనం సమకూరుస్తారు. మాకు మాత్రం చివాట్లు. మా భోజనాన్ని మేమే తయారుచేసుకుని బాక్స్ కట్టుకొని పనికి వెళ్తాం. మాకు ఎవ్వరూ ఎప్పుడూ ఏదీ ఇవ్వలేదు. మా దగ్గర ఏముందో అది మాదే. దాన్ని మా నుంచి ఎవ్వరూ లాక్కోలేరు. ఒకవేళ తీసుకునే వీలుంటే దాన్ని కూడా వాళ్ల పిల్లలకే పెడతారు’ అని ఇన్సైడర్స్ వర్సెస్ అవుట్ సైడర్స్ (బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్లు/బయటినుంచి వచ్చినవాళ్లు) టాపిక్‌ను చెప్పకనే చెబుతూ ట్వీట్ చేశారు రణ్వీర్ షోరే. వాళ్ల గురించీ ఆలోచించండి – పూజా భట్ ప్రస్తుతం డ్రగ్స్ పై జరుగుతున్న చర్చ గురించి నటి, దర్శక–నిర్మాత పూజా భట్ కూడా మాట్లాడారు. తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశారామె. ‘‘ప్రస్తుతం అందరూ బాలీవుడ్లో డ్రగ్స్ ఉన్నాయి. బాలీవుడ్లోనే ఉన్నాయి.. వాటిని తొలగించాలి అని అంటున్నారు. కన్న కలల్ని సాధించలేక, ఆశలన్నీ కూలిపోయి జీవితాన్ని భారంగా గడుపుతూ కలల వెనక పరిగెత్తేవాళ్లు కూడా మత్తు పదార్థాల వెనక పరిగెడుతున్నారు. దారిద్య్రంలో ఉంటూ జీవించడమే భారంగా అనిపించి, మత్తులో తేలుతూ ఈ భారాన్నంతా తేలిక చేసుకుంటున్నవాళ్ల గురించి కూడా ఆలోచించండి. వాళ్లను మామూలు మనుషుల్లా మార్చే ప్రయత్నాలు చేయండి’’ అన్నారు పూజా భట్. నెపోటిజమ్ నా ప్రయాణాన్ని ఆపలేదు – నిధీ అగర్వాల్ ‘అవును.. బాలీవుడ్లో నెపోటిజమ్ (బంధుప్రీతి) ఉంది. ఎప్పటికీ ఉంటుంది. అది ఉన్నంత మాత్రాన అవుట్‌సైడర్‌గా నా ప్రయాణం ఆగిపోదు’ అన్నారు ‘ఇస్మార్ట్ శంకర్’ హీరోయిన్ నిధీ అగర్వాల్. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘మా నాన్నగారు వ్యాపారవేత్త. నేను సినిమాల్లో హీరోయిన్ అవ్వాలని వచ్చాను. ఒకవేళ నేనూ మా నాన్నగారి వ్యాపారంలో ఉంటే ఆయన వారసురాలిగా నన్నే సీఈఓని చేస్తారు. అలానే ఇండస్ట్రీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్లకు కొన్ని ప్లస్ పాయింట్లు ఉంటాయి. వాళ్లను గైడ్ చేసేవాళ్లు ఉంటారు. ఎలాంటి నిర్ణయాలు శ్రేయస్కరమో సూచిస్తుంటారు. దీనివల్ల నేను (అవుట్‌సైడర్) స్టార్‌ని అవ్వలేనని కాదు. కొంచెం సమయం పడుతుందేమో కానీ కచ్చితంగా స్టార్‌ని అవుతాను. కష్టపడితే, ప్రేక్షకులు ఆదరిస్తే కచ్చితంగా ఎవ్వరైనా ఇండస్ట్రీలో ఎదగగలరు’’ అన్నారు నిధీ అగర్వాల్. జయా జీ రాజకీయం చేస్తున్నారు – జయప్రద డ్రగ్స్ వివాదం గురించి ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు జయప్రద మాట్లాడుతూ – ‘‘రవికిష¯Œ గారు మాట్లాడిన పాయింట్‌తో నేను ఏకీభవిస్తాను. ఆయన భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. యువతను డ్రగ్స్ బారినపడకుండా కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ విషయం మీద మనందరం పోరాటం చేయాలి. జయా బచ్చన్‌గారు మా అందరికంటే పెద్దావిడ.. ఆమె మీద మా అందరికీ గౌరవం ఉంది. కానీ ఆమె ఈ విషయాన్ని (డ్రగ్స్) రాజకీయం చేస్తున్నారనిపించింది’’ అన్నారు. -
జయప్రదకు నాన్ బెయిలబుల్ వారెంట్
లక్నో: సీనియర్ నటి, బీజేపీ నాయకురాలు జయప్రదకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు రాంపూర్ కోర్టు ఆమె నోటీసులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి ఏప్రిల్ 20న విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. కాగా గతంలో సమాజ్‌వాదీ పార్టీ నుంచి ఎంపీగా గెలుపొందిన జయప్రద.. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. కాషాయ పార్టీ తరఫున రాంపూర్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన జయప్రద.. ఎస్పీ అభ్యర్థి ఆజంఖాన్ చేతిలో ఓటమి పాలయ్యారు. దాదాపు లక్ష ఓట్ల తేడాతో పరాజయం చెందారు. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా జయప్రద ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ అప్పట్లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో శనివారం ఆమెకు స్థానిక కోర్టు వారెంట్ జారీ చేసింది. కాగా ఎన్నికల ప్రచారంలో ఆజంఖాన్ జయప్రదపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ‘అమ్రపాలి (నృత్యకారిణి), నాచ్ నే వాలీ’అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. జయప్రద పార్టీ మారిన సమయంలో.. ‘జయప్రదను నేనే రాంపూర్‌కు తెచ్చాను. ఎవ్వరూ ఆమె శరీరాన్ని తాకకుండా నేను జాగ్రత్తలు తీసుకున్నాననేందుకు మీరే సాక్ష్యం. ఆమె అసలు రూపం తెలుసుకునేందుకు మీకు 17 ఏళ్లు పట్టింది. కానీ ఆమె ఖాకీ నిక్కర్ వేసుకుంటుందనే విషయాన్ని నేను 17 రోజుల్లోనే తెలుసుకున్నాను’ అంటూ దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. A non bailable warrant has been issued by a Rampur court against veteran actor and BJP leader Jaya Prada in a violation of model code of conduct case of 2019. Next hearing is on April 20. (file pic) pic.twitter.com/CA3xesRwlU — ANI UP (@ANINewsUP) March 7, 2020 -
‘ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడితే మంచిది’
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల ప్రచారం ప్రారంభమైన నాటి నుంచి పార్టీలతో సంబంధం లేకుండా నాయకులు మహిళా నేతల గురించి అడ్డమైన చెత్త వాగుడు వాగుతున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ విషయంపై ఇంతవరకూ అధికార పార్టీతో సహా ఇతర పార్టీ ముఖ్య నాయకులేవరూ స్పందించలేదు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయంపై స్పందించడమే కాక.. నాయకులు కాస్తా బుర్ర పెట్టి స్పృహలో ఉండి మాట్లాడితే మంచిదంటూ సూచించారు. ఏఎన్‌ఐకిచ్చిన ఇంటర్వూలో ఆమె ఈ విధంగా మాట్లాడారు. ‘చర్చలో భాగమైనా కాకపోయిన ఓ మహిళ గురించి కామెంట్ చేయడం చాలా ఈజీ. ఓ వర్గానికి చెందిన వారి గురించి వ్యక్తిగత విమర్శలు చేయడం చాలా సులువు. ఇలాంటివి చూసినప్పుడు కనీస ఆలోచన లేకుండా ఇంత నిర్లక్ష్యంగా ఎలా మాట్లాడతారు అనిపిస్తుంటుంది. అందుకే అందరికి చెప్పేదొకటే.. మాట పెదాలను దాటకముందే దాని గురించి కాస్తా బుర్ర పెట్టి ఆలోచిస్తే మంచిది. ఇలాంటి మాటలు మాట్లాడి మన ముందు తరాలకు ఏం సందేశం ఇస్తున్నాం అనే విషయాన్ని మైండ్‌లో ఉంచుకుని మాట్లాడితే మంచిద’ని సూచించారు. ఎస్పీ నాయకుడు ఆజం ఖాన్.. జయప్రద గురించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీని గురించి దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోన్నప్పటికి.. ఆ పార్టీ నాయకులు ములాయం సింగ్ కానీ, అఖిలేష్ యాదవ్ కానీ స్పందించకపోవటం గమనార్హం. అదే విధంగా కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్‌ని పరామర్శించటం గురించి నిర్మలా సీతారామన్‌ని ప్రశ్నించగా.. ‘నేను విమానాశ్రయానికి తిరిగి వెళ్తున్నాను. ఆ సమయంలో ఆస్పత్రిలో ఉన్న శశి థరూర్‌ని పరామర్శిస్తే బాగుంటుంది అనిపించిది. అందుకే ఆస్పత్రికి వెళ్లాను. దీని గురించి నా పార్టీకి చెందిన వ్యక్తులతో సహా ఎవరికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు’ అని నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రచారంలో భాగంగా శశి థరూర్‌కి ఆలయంలో తులాభారం నిర్వహిస్తుండగా ప్రమాదం జరిగిన సంగతి తెలిసిదే. -
నేను చస్తే.. నీ కళ్లు చల్లబడతాయా?: జయప్రద
లక్నో : తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు.. ఒకప్పటి తన స్నేహితుడు, ప్రస్తుత ప్రత్యర్థి ఆజంఖాన్‌పై సినీ నటి, బీజేపీ నాయకురాలు జయప్రద మండిపడ్డారు. ప్రజాస్వామ్యం, మహిళల రక్షణ కోసం ఆజంఖాన్‌ను ఎన్నికల్లో పోటీచేయనివ్వద్దన్నారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను చచ్చిపోతే.. నీవు సంతృప్తి పడతావా?’ అంటూ ఆజంఖాన్ ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించారు. ‘నన్ను భయపడితే రాంపూర్ వదిలి వెళ్తానని అనుకుంటున్నావ్.. కానీ ఎన్ని చేసినా నేను ఇక్కడి నుంచి వెళ్లే ముచ్చటే లేదు. ఇలాంటి వ్యక్తిని ఎన్నికల్లో అనుమతించకూడదు. ఒక వేళ ఇతను గెలిస్తే ప్రజాస్వామ్యం ఏమవుతోంది. మహిళల పరిస్థితి ఏంటి?’ అని ప్రశ్నించారు. ఇక 2004లో సమాజ్‌వాదీ పార్టీ తరఫున రాంపూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి జయప్రద ఎంపీగా గెలుపొందారు. అప్పట్లో ఆమె విజయానికి ఆజంఖాన్ కృష్టి చేశారు. అనంతరం వీరి మధ్య విభేదాలు తలెత్తడంతో ఆమె పార్టీని వీడారు. ఇటీవల బీజేపీలో చేరిన జయప్రద ప్రస్తుతం ఆ పార్టీ తరఫున రాంపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ స్థానం నుంచి ఎస్పీ అభ్యర్థిగా ఆజంఖాన్ బరిలోకి దిగారు. దీంతో వీరి మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరింది. ఆదివారం ఓ ఎన్నికల ప్రచారసభలో ఆజంఖాన్ మాట్లాడుతూ.. ‘జయప్రదను నేనే రాంపూర్‌కు తీసుకొచ్చాను. ఎవ్వరూ ఆమె శరీరాన్ని తాకకుండా, పల్లెత్తు మాట అనకుండా నేను జాగ్రత్తలు తీసుకున్నాననేందుకు మీరే(మీడియా) సాక్ష్యం. ఆమె అసలు రూపం తెలుసుకునేందుకు మీకు 17 ఏళ్లు పట్టింది. కానీ ఆమె ఖాకీ నిక్కర్ వేసుకుంటుందనే విషయాన్ని నేను 17 రోజుల్లోనే తెలుసుకున్నాను.’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈవ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మహిళల మనోభావాలు కించపరిచేలా ఉన్నాయని ఆజంఖాన్‌పై కేసు కూడా నమోదైంది. మహిళా కమిషన్ సైతం ఆజం ఖాన్ వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి అతనికి నోటీసులు జారీ చేసినట్టు పేర్కొంది. (జయప్రదపై ఆజం దిగజారుడు వ్యాఖ్య) -
‘ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతుంది.. భీష్ముడిలా ఉండకండి’
న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ అభ్యర్థి జయప్రదపై ఎస్పీ నాయకుడు ఆజం ఖాన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ విషయమై ట్విటర్ వేదికగా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ములాయం సింగ్ యాదవ్ భాయ్.. మీరు సమాజ్‌వాదీ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. మీ దగ్గరల్లోని రాంపూర్‌లో ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతోంది. అయితే మీరు మాత్రం భీష్ముడి మాదిరి మౌనం వహించి పోరాపాటు చేయవద్ద’ని పేర్కొన్నారు. అంతేకాకుండా జయప్రదపై ఆజం ఖాన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను కూడా షేర్ చేశారు. మరోవైపు ఒక మహిళ మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసినందుకు ఆజం ఖాన్‌పై సోమవారం రాంపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. ఈ ఘటనపై జయప్రద కూడా స్పందించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఆజం ఖాన్ హద్దులు మీరి ప్రవర్తించారని విమర్శించారు. ఒకవేళ ఆజం ఖాన్ గెలిస్తే మహిళల పరిస్థితి ఎంటని ప్రశ్నించారు. మహిళకు సమాజంలో రక్షణ ఉండదని తెలిపారు. ఆజం ఖాన్‌కు నోటీసులు జారీ చేసిన మహిళ కమిషన్ జాతీయ మహిళ కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ.. ఆజాం ఖాన్ గతంలో పలుమార్లు మహిళలపై అసభ్య పదజాలం ఉపయోగించారని అన్నారు. ఆజం ఖాన్ ఈ ఎన్నికల్లో మహిళ నాయకురాళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇది రెండోసారి అని తెలిపారు. అందుకే అతడి పై కఠిన చర్యలు తీసుకోవాలని తాము ఎన్నికల సంఘానికి లేఖ రాశామని చెప్పారు. ఆజం ఖాన్ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకోని అతని నోటీసులు జారీ చేసినట్టు వెల్లడించారు. ఆదివారం ఓ ఎన్నికల ప్రచారసభలో ఆజం ఖాన్ మాట్లాడుతూ.. ‘జయప్రదను నేనే రాంపూర్‌కు తెచ్చాను. ఎవ్వరూ ఆమె శరీరాన్ని తాకకుండా నేను జాగ్రత్తలు తీసుకున్నాననేందుకు మీరే సాక్ష్యం. ఆమె అసలు రూపం తెలుసుకునేందుకు మీకు 17 ఏళ్లు పట్టింది. కానీ ఆమె ఖాకీ నిక్కర్ వేసుకుంటుందనే విషయాన్ని నేను 17 రోజుల్లోనే తెలుసుకున్నాన’ని అన్నారు. అయితే ఆజం ఖాన్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. -
జయప్రదపై ఆజం దిగజారుడు వ్యాఖ్య
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో మరో దిగజారుడు వ్యాఖ్య వినిపించింది. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ నియోజకవర్గం నుంచి ఎస్పీ తరఫున పోటీ చేస్తున్న ఆజం ఖాన్, తన ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. గతంలో పదేళ్లపాటు రాంపూర్‌కు జయప్రద ఎస్పీ తరఫున ప్రాతినిధ్యం వహించగా, ఇటీవలే ఆమె బీజేపీలో చేరి ప్రస్తుతం ఆమె అదే స్థానం నుంచి బీజేపీ తరఫున బరిలో నిలిచారు. దీనిపై ఆజం ఖాన్ మాట్లాడుతూ ‘జయప్రదను నేనే రాంపూర్‌కు తెచ్చాను. ఎవ్వరూ ఆమె శరీరాన్ని తాకకుండా నేను జాగ్రత్తలు తీసుకున్నాననేందుకు మీరే సాక్ష్యం. ఆమె అసలు రూపం తెలుసుకునేందుకు మీకు 17 ఏళ్లు పట్టింది. కానీ ఆమె ఖాకీ నిక్కర్ వేసుకుంటుందనే విషయాన్ని నేను 17 రోజుల్లోనే తెలుసుకున్నాను’ అని ఖాన్ ఓ ఎన్నికల సభలో వ్యాఖ్యానించారు. ఆరెస్సెస్‌తో జయ ప్రద సంబంధాలపై చర్చ లేవనెత్తేందుకే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆజంఖాన్ వ్యాఖ్యలు అపకీర్తికరమైనవనీ, ఆయనకు అతి త్వరలోనే నోటీసులు పంపనున్నామని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ తెలిపారు. ఆయనను పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని ఎన్నికల సంఘాన్ని కూడా తాము కోరతామన్నారు.