Dalip Tahil Reacts To Rumours Of Jaya Prada Slapping Him During Shooting, Deets Inside - Sakshi
Sakshi News home page

Actress Jaya Prada: దలీప్‌ తాహిల్‌ చెంప చెళ్లుమనిపించిన జయప్రద? క్లారిటీ ఇచ్చిన నటుడు

Published Thu, Nov 24 2022 5:39 PM | Last Updated on Thu, Nov 24 2022 7:41 PM

Dalip Tahil Reacts to Rumours Of Jaya Prada Slapping Him During Shooting - Sakshi

నటి జయప్రద గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు, హిందీ, తమిళంలో ఎన్నో సినిమాల్లో నటించి స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఆమె రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటోంది. ఇదిలా ఉంటే ఆమె స్టార్‌ నటుడు దలీప్‌ తాహిల్‌ చెంప చెళ్లుమనిపించిందంటూ తరచూ బాలీవుడ్‌లో వార్తల చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఈ వార్తలపై తాజాగా నటుడు దలీప్‌ తాహిల్‌ స్పందించాడు. ఈ సందర్భంగా జయప్రద తనని కొట్టినట్లు వస్తున్న వార్తలపై ఆయన వివరణ ఇచ్చాడు. 

1986లో అమితాబ్‌ బచ్చన్‌-జయప్రద జంటగా ‘ఆఖ్రే రాస్తా’ మూవీ తెరకెక్కింది. ఈ సినిమాలో దలిప్‌ తాహిర్‌ విలన్‌గా చేశాడని, ఇందులో ఆయన జ‍యప్రదను అత్యాచారం చేసే ఓ సన్నివేశం ఉందట. ఈ సీన్‌ షూటింగ్‌ సమయంలో తనతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో జయప్రద ఆయనను చెంప దెబ్బ కొట్టినట్లు ఓ వార్త ప్రచారంలో ఉంది. తాజాగా దీనిపై ఆయన వివరణ ఇచ్చాడు. ‘‘జయప్రదతో కలిసి ఓ అభ్యంతరకర సన్నివేశంలో నటించానని, ఆ సీన్‌ షూటింగ్‌ సమయంలో ఆమె నన్ను కొట్టినట్లు కొంత కాలంగా ప్రచారం జరుగుతుంది.

ఈ వార్తలను నేను కూడా విన్నాను. నేను కొంచెం దూకుడుగా వెళ్లానని, ఆమె నా చెంప చెళ్లు మనిపించినట్టు అందులో ఉంది. అసలు నేను జయప్రదతో కలిసి ఏ సినిమాలోనూ నటించనేలేదు. ఇది వాస్తవం. ఆమెతో కలిసి నటించాలనే ఆసక్తి ఉన్నా, ఆ అవకాశం మాత్రం రాలేదు. అలాంటప్పుడు ఇక అలాంటి సీన్ చేసే అవకాశమే లేదు కదా? ఈ కథనాలు రాసే వ్యక్తి పట్ల నాకు శత్రుత్వం లేదు. కానీ ఆ సీన్ చూపిస్తే సంతోషిస్తాను. సోషల్ మీడియాలో అసలు లేనివి కూడా పుట్టిస్తున్నారు’’ అంటూ దలీప్‌ తాహిల్‌ అసహనం వ్యక్తం చేశాడు. 

చదవండి: 
నాకు స్ఫూర్తినిచ్చిన అంశాలన్నీ మీతోనే వెళ్లిపోయాయి నాన్నా: మహేశ్‌ ఎమోషనల్‌
ఘనంగా అలీ కూతురు హల్దీ ఫంక్షన్‌, ఫొటోలు వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement