మాజీ ఎంపీ, సినీ నటి జయప్రదను మార్చి 6వ తేదీలోపు అరెస్ట్ చేయాలని రామ్‌పుర్ ట్రయల్ కోర్టు తాజాగా ఆదేశించింది. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన కేసులో ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ కోర్టు ఆమెకు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. తనపై జారీచేసిన నాన్ బెయిలబుల్ వారెంటును నిలిపివేయాలని కోరుతూ జయప్రద దాఖలు చేసిన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు తాజాగా కొట్టివేసింది. దీంతో ఆమెకు ఎదురుదెబ్బ తగిలినట్లైంది.
(ఇదీ చదవండి: ముందస్తు బెయిల్ కోసం క్రిష్ పిటిషన్ .. విదేశాలకు 'సైంధవ్' నిర్మాత కుమారుడు)
2019 నుంచి కోర్టు విచారణకు హాజరు కావాలని పలుమార్లు జడ్జి ఆదేశించినా ఆమె హాజరు కాలేదు.. దీంతో ఆమెను పరారీలో ఉన్న వ్యక్తిగా గతంలో కోర్టు ప్రకటించింది. ఆపై నాన్ బెయిలబుల్ వారెంటును కోర్టు జారీ చేసింది. ఈ వారెంటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం తాజాగా విచారించి కొట్టివేసింది. త్వరలో మరిన్ని వాస్తవాలతో తాము మరో పిటిషన్ దాఖలు చేస్తామని జయప్రద తరపు న్యాయవాది కోరడంతో న్యాయమూర్తి అంగీకరించారు.
కేసు ఏంటి..?
2019 లోక్‌సభ ఎన్నికల్లో జయప్రద బీజేపీ తరఫున రాంపూర్ నుంచి జయప్రద బరిలో నిలిచారు. ఆ సమయంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత ఆమె ఓ రోడ్డును ప్రారంభించడంతో స్వార్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అప్పటి నుంచి ఈ కేసు రాంపూర్‌లోని ఎంపీ- ఎమ్మెల్యే కోర్టులో పెండింగ్‌లో ఉంది. వ్యక్తిగతంగా హాజరుకావాలని కోర్టు ఆదేశించినా ఆమె రాకపోవడంతో నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయింది.
Comments
Please login to add a commentAdd a comment