Rampur City
-
హైకోర్టులో జయప్రదకు ఎదురుదెబ్బ
మాజీ ఎంపీ, సినీ నటి జయప్రదను మార్చి 6వ తేదీలోపు అరెస్ట్ చేయాలని రామ్‌పుర్ ట్రయల్ కోర్టు తాజాగా ఆదేశించింది. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన కేసులో ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ కోర్టు ఆమెకు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. తనపై జారీచేసిన నాన్ బెయిలబుల్ వారెంటును నిలిపివేయాలని కోరుతూ జయప్రద దాఖలు చేసిన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు తాజాగా కొట్టివేసింది. దీంతో ఆమెకు ఎదురుదెబ్బ తగిలినట్లైంది. (ఇదీ చదవండి: ముందస్తు బెయిల్ కోసం క్రిష్ పిటిషన్ .. విదేశాలకు 'సైంధవ్' నిర్మాత కుమారుడు) 2019 నుంచి కోర్టు విచారణకు హాజరు కావాలని పలుమార్లు జడ్జి ఆదేశించినా ఆమె హాజరు కాలేదు.. దీంతో ఆమెను పరారీలో ఉన్న వ్యక్తిగా గతంలో కోర్టు ప్రకటించింది. ఆపై నాన్ బెయిలబుల్ వారెంటును కోర్టు జారీ చేసింది. ఈ వారెంటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం తాజాగా విచారించి కొట్టివేసింది. త్వరలో మరిన్ని వాస్తవాలతో తాము మరో పిటిషన్ దాఖలు చేస్తామని జయప్రద తరపు న్యాయవాది కోరడంతో న్యాయమూర్తి అంగీకరించారు. కేసు ఏంటి..? 2019 లోక్‌సభ ఎన్నికల్లో జయప్రద బీజేపీ తరఫున రాంపూర్ నుంచి జయప్రద బరిలో నిలిచారు. ఆ సమయంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత ఆమె ఓ రోడ్డును ప్రారంభించడంతో స్వార్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అప్పటి నుంచి ఈ కేసు రాంపూర్‌లోని ఎంపీ- ఎమ్మెల్యే కోర్టులో పెండింగ్‌లో ఉంది. వ్యక్తిగతంగా హాజరుకావాలని కోర్టు ఆదేశించినా ఆమె రాకపోవడంతో నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. -
నటి జయప్రద ఎక్కడ.. వెతుకుతున్న ఢిల్లీ పోలీసులు
మాజీ ఎంపీ, సినీ నటి జయప్రదపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన కేసులో ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ కోర్టు ఆమెకు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసు విషయంలో పలుమార్లు విచారణ జరిగింది. కానీ ఆమె కోర్టుకు హాజరు కాలేదు. 2019లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన రెండు కేసుల్లో ఆమె నిందితురాలిగా ఉన్నారు. విచారణకు హాజరు కావాలని పలుమార్లు జడ్జి ఆదేశించినా హాజరు కాలేదు. దీంతో ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. నవంబర్ 8న ఈ కేసుపై విచారణ జరగాల్సి ఉండగా.. జయప్రద కోర్టుకు హాజరు కాలేదు. ఈ అంశంపై ప్రోసక్యూషన్ ఆఫీసర్ అమర్నాథ్ తివారీ మాట్లాడుతూ.. జయప్రదకు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసినా ఆమె నవంబర్ 8న కోర్టుకు హాజరు కాలేదన్నారు. దీంతో న్యాయస్థానం ఈ కేసు విచారణను నవంబర్ 17కు వాయిదా వేసింది ఆ సమయంలో కూడా ఆమె కోర్టు రాలేదు. ఆపై డిసెంబర్ నెలలో హాజరు కావాలని హెచ్చరించినా కూడా ఆమె అందుబాటులోకి రాలేదు. ఈ విషయాన్ని కోర్టు సీరియస్‌గా పరిగణలోకి తీసుకుంది. జనవరి 10లోగా ఆమెను కోర్టు ముందు ప్రవేశపెట్టాలని పోలీసులను ఆదేశించింది. దీంతో రామ్‌పూర్ ఎస్పీ ఆమెను వెతకడానికి ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేశారు. అయితే ఆ బృందం కూడా ఆమె ఆచూకీని కనిపెట్టలేకపోతుంది. ప్రస్తుతం ఆమె ఎక్కడ ఉన్నారో తెలియడం లేదు. జయప్రద కోసం పోలీసులు ముమ్మరంగా వెతికే పనిలో ఉన్నారు. గత ఎన్నికల్లో రాంపూర్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన జయప్రద.. సమాజ్‌వాద్ పార్టీ అభ్యర్థి అజాం ఖాన్ చేతిలో ఓటమి పాలయ్యారు. కేసు ఏంటి..? 2019 లోక్‌సభ ఎన్నికల్లో జయప్రద బీజేపీ తరఫున రాంపూర్ నుంచి జయప్రద బరిలో నిలిచారు. ఆ సమయంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత ఆమె ఓ రోడ్డును ప్రారంభించడంతో స్వార్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అప్పటి నుంచి ఈ కేసు రాంపూర్‌లోని ఎంపీ- ఎమ్మెల్యే కోర్టులో పెండింగ్‌లో ఉంది. వ్యక్తిగతంగా హాజరుకావాలని కోర్టు ఆదేశించినా ఆమె రాకపోవడంతో నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. -
ఇదో వెరైటీ పెళ్లి!
రాంపూర్: హీరోయిన్ కు పెళ్లి కుదురుతుంది. తర్వాత ఆమె హీరోతో ప్రేమలో పడి చివరి అతడినే పెళ్లాడుతోంది. ఇలాంటి సినిమాలు చాలానే చూసేవుంటారు. అయితే సినిమాకు ఏమాత్రం తీసిపోని వెరైటీ పెళ్లి ఉత్తప్రదేశ్ లోని రాంపూర్ లో జరిగింది. అసలు ఏం జరిగిందంటే... మొర్దాబాద్ కు చెందిన జుగల్ కిశోర్(23), రాంపూర్ కు చెందిన ఇందిర(23)తో పెళ్లి కుదిరింది. 'వరమాల' కార్యక్రమం వరకు పెళ్లితంతు సవ్యంగానే సాగింది. ఇక్కడే కథ కొత్త మలుపు తిరిగింది. మూర్ఛరోగంతో బాధపడుతున్న కిశోర్ వధువుకు వరమాల వేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వరుడుకు ఉన్న రోగాన్ని దాచిపెట్టిన పెళ్లికొడుకు, అతడి కుటుంబ సభ్యులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. తనను మోసం చేసిన వరుడికి బుద్ధి చెప్పేందుకు అదే పెళ్లి పందిరిలో మరొకరిని పెళ్లాడింది. తన వివాహానికి అతిథిగా వచ్చిన హర్పాల్ సింగ్ అనే యువకుడిని వరించింది. హర్పాల్ మొదట ఆశ్చర్యానికి గురైనా తర్వాత అంగీకరించాడు. ఇక ఆలస్యంగా చేయకుండా ఇందిర, హర్పాల్ అక్కడిక్కడే దండలు మార్చుకున్నారు. వేదపండితుల మంత్రోచ్ఛారణ నడుమ ఏడు అడుగులు నడిచారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన కిశోర్ ను బంధువులు ఆస్పత్రికి తరలించారు. అతడు వెంటనే కోలుకుని తిరిగొచ్చేప్పటికి ఇందిర మరొకరి భార్య అయింది. కిశోర్ బతిమాలినా, భయపెట్టిన ఇందిర నిబ్బరంగానే ఉంది. మనసు మాత్రం మార్చుకోలేదు. చేసేది లేక స్థానిక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పెద్దలు జోక్యం చేసుకోవడంతో ఫిర్యాదు ఉపసంహరించుకోవడంతో పెళ్లి కథ సుఖాంతమైంది.