ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజి’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ తమిళనాడులోని మధురై, కారైకుడి లొకేషన్స్‌లోప్రారంభమైంది. అయితే ప్రభాస్ పాల్గొనని సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందని తెలిసింది.
కాగా ఈ సినిమాలో జయప్రద ఓ కీలక పాత్రలో నటిస్తున్నారని, ఆల్రెడీ మధురై షెడ్యూల్‌లో ఆమె జాయిన్ అయ్యారని, ఇమాన్వి–జయప్రదల కాంబినేషన్‌లో కొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరిగిందని సమాచారం. అక్టోబరు చివర్లో ఈ సినిమా చిత్రీకరణలో ప్రభాస్ కూడా పాల్గొంటారట. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్.
Comments
Please login to add a commentAdd a comment