
ఒకప్పటి హీరోయిన్, ప్రస్తుతం రాజకీయ నాయకురాలు అయిన జయప్రద ఇంట్లో విషాదం నెలకొంది. హైదరాబాద్ లో ఉంటున్న ఈమె సోదరుడు గురువారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో జయప్రద సోదరుడి మరణం గురించి పంచుకున్నారు.
(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు)
'నా అన్నయ్య శ్రీ రాజాబాబు మరణవార్తని మీకు తెలియజేస్తున్నందుకు బాధగా ఉంది. (ఫిబ్రవరి 27) మధ్యాహ్నం 3:26 గంటలకు హైదరాబాద్ లోని తన నివాసంలో కన్నుమూశారు. దయచేసి ఆయన గురించి ప్రార్థించండి. మరిన్ని వివరాలు త్వరలో చెబుతాను' అని జయప్రద తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు.
జయప్రద విషయానికొస్తే 14 ఏళ్లకే నటిగా కెరీర్ ప్రారంభించారు. 1976 నుంచి 2005 వరకు దాదాపు 300కి పైగా సినిమాల్లో నటించారు. మరోవైపు రాజకీయాల్లోనూ ఉన్నారు. 1994లో తొలుత తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీ నాయకులతో గొడవల కారణంగా రెండేళ్లకే బయటకొచ్చి, సమాజ్ వాదీ పార్టీలో చేరారు. ప్రస్తుతానికైతే బీజేబీలో కొనసాగుతున్నారు. అలానే ప్రభాస్ 'ఫౌజీ'లోనూ ప్రస్తుతం నటిస్తున్నారు.
(ఇదీ చదవండి: నాన్న ఫోన్ చేసేసరికి ప్రభాస్ భయపడ్డాడు: మంచు విష్ణు)