jayaprada
-
చిన్నప్పుడే ఇంత అందంగా ఉన్న స్టార్ హీరోయిన్ బర్త్‌డే.. (ఫోటోలు)
-
జయప్రద జైలు శిక్షరద్దు చేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: తన సినిమా థియేటర్లో పనిచేసిన ఉద్యోగులకు ఈఎస్ఐ కంట్రిబ్యూషన్ చెల్లించని కేసులో సీనియర్ నటి జయప్రదకు పడిన ఆరు నెలల జైలు శిక్షను సుప్రీంకోర్టు రద్దు చేసింది. జస్టిస్ అభయ్ ఓకా, ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. థియేటర్ యాజమాన్యం రూ. 9లక్షల80వేలను ఈఎస్ఐ కంట్రిబ్యూషన్ కింద జమ చేసినందున కోర్టు శిక్షను రద్దు చేసింది. చెన్నైలోని జయప్రదకు చెందిన సినీ థియేటర్లో జయప్రద, ఆమె ఇద్దరు సోదరులు వాటాదారులుగా ఉన్నారు. ఈ థియేటర్ 10 ఏళ్ల క్రితమే మూతపడింది. అయితే ఈ థియేటర్లో పనిచేసిన ఉద్యోగుల జీతాల నుంచి ఈఎస్ఐ పేరుతో కోతలు విధించి తమ వద్ద జమ చేయలేదని ఈఎస్ఐకార్పొరేషన్(ఈఎస్ఐసీ) కేసు పెట్టింది. ఈ కేసును విచారించిన చెన్నైలోని మెట్రోపాలిటన్ కోర్టు గత ఏడాది ఆగస్టులో జయప్రదకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అనంతరం ఈ కేసులో ఆమె అప్పీల్‌కు వెళ్లగా సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఇదీ చదవండి..ఈడీ విచారణకు కేజ్రీవాల్ మరోసారి డుమ్మా -
హైకోర్టులో జయప్రదకు ఎదురుదెబ్బ
మాజీ ఎంపీ, సినీ నటి జయప్రదను మార్చి 6వ తేదీలోపు అరెస్ట్ చేయాలని రామ్‌పుర్ ట్రయల్ కోర్టు తాజాగా ఆదేశించింది. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన కేసులో ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ కోర్టు ఆమెకు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. తనపై జారీచేసిన నాన్ బెయిలబుల్ వారెంటును నిలిపివేయాలని కోరుతూ జయప్రద దాఖలు చేసిన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు తాజాగా కొట్టివేసింది. దీంతో ఆమెకు ఎదురుదెబ్బ తగిలినట్లైంది. (ఇదీ చదవండి: ముందస్తు బెయిల్ కోసం క్రిష్ పిటిషన్ .. విదేశాలకు 'సైంధవ్' నిర్మాత కుమారుడు) 2019 నుంచి కోర్టు విచారణకు హాజరు కావాలని పలుమార్లు జడ్జి ఆదేశించినా ఆమె హాజరు కాలేదు.. దీంతో ఆమెను పరారీలో ఉన్న వ్యక్తిగా గతంలో కోర్టు ప్రకటించింది. ఆపై నాన్ బెయిలబుల్ వారెంటును కోర్టు జారీ చేసింది. ఈ వారెంటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం తాజాగా విచారించి కొట్టివేసింది. త్వరలో మరిన్ని వాస్తవాలతో తాము మరో పిటిషన్ దాఖలు చేస్తామని జయప్రద తరపు న్యాయవాది కోరడంతో న్యాయమూర్తి అంగీకరించారు. కేసు ఏంటి..? 2019 లోక్‌సభ ఎన్నికల్లో జయప్రద బీజేపీ తరఫున రాంపూర్ నుంచి జయప్రద బరిలో నిలిచారు. ఆ సమయంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత ఆమె ఓ రోడ్డును ప్రారంభించడంతో స్వార్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అప్పటి నుంచి ఈ కేసు రాంపూర్‌లోని ఎంపీ- ఎమ్మెల్యే కోర్టులో పెండింగ్‌లో ఉంది. వ్యక్తిగతంగా హాజరుకావాలని కోర్టు ఆదేశించినా ఆమె రాకపోవడంతో నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. -
మాజీ ఎంపీ జయప్రదకు షాక్
-
నటి జయప్రద ఎక్కడ.. వెతుకుతున్న ఢిల్లీ పోలీసులు
మాజీ ఎంపీ, సినీ నటి జయప్రదపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన కేసులో ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ కోర్టు ఆమెకు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసు విషయంలో పలుమార్లు విచారణ జరిగింది. కానీ ఆమె కోర్టుకు హాజరు కాలేదు. 2019లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన రెండు కేసుల్లో ఆమె నిందితురాలిగా ఉన్నారు. విచారణకు హాజరు కావాలని పలుమార్లు జడ్జి ఆదేశించినా హాజరు కాలేదు. దీంతో ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. నవంబర్ 8న ఈ కేసుపై విచారణ జరగాల్సి ఉండగా.. జయప్రద కోర్టుకు హాజరు కాలేదు. ఈ అంశంపై ప్రోసక్యూషన్ ఆఫీసర్ అమర్నాథ్ తివారీ మాట్లాడుతూ.. జయప్రదకు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసినా ఆమె నవంబర్ 8న కోర్టుకు హాజరు కాలేదన్నారు. దీంతో న్యాయస్థానం ఈ కేసు విచారణను నవంబర్ 17కు వాయిదా వేసింది ఆ సమయంలో కూడా ఆమె కోర్టు రాలేదు. ఆపై డిసెంబర్ నెలలో హాజరు కావాలని హెచ్చరించినా కూడా ఆమె అందుబాటులోకి రాలేదు. ఈ విషయాన్ని కోర్టు సీరియస్‌గా పరిగణలోకి తీసుకుంది. జనవరి 10లోగా ఆమెను కోర్టు ముందు ప్రవేశపెట్టాలని పోలీసులను ఆదేశించింది. దీంతో రామ్‌పూర్ ఎస్పీ ఆమెను వెతకడానికి ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేశారు. అయితే ఆ బృందం కూడా ఆమె ఆచూకీని కనిపెట్టలేకపోతుంది. ప్రస్తుతం ఆమె ఎక్కడ ఉన్నారో తెలియడం లేదు. జయప్రద కోసం పోలీసులు ముమ్మరంగా వెతికే పనిలో ఉన్నారు. గత ఎన్నికల్లో రాంపూర్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన జయప్రద.. సమాజ్‌వాద్ పార్టీ అభ్యర్థి అజాం ఖాన్ చేతిలో ఓటమి పాలయ్యారు. కేసు ఏంటి..? 2019 లోక్‌సభ ఎన్నికల్లో జయప్రద బీజేపీ తరఫున రాంపూర్ నుంచి జయప్రద బరిలో నిలిచారు. ఆ సమయంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత ఆమె ఓ రోడ్డును ప్రారంభించడంతో స్వార్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అప్పటి నుంచి ఈ కేసు రాంపూర్‌లోని ఎంపీ- ఎమ్మెల్యే కోర్టులో పెండింగ్‌లో ఉంది. వ్యక్తిగతంగా హాజరుకావాలని కోర్టు ఆదేశించినా ఆమె రాకపోవడంతో నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. -
హీరోయిన్ జయప్రద అరెస్ట్‌కి రంగం సిద్ధం.. అసలేం జరిగిందంటే?
ఒకప్పటి తెలుగు స్టార్ హీరోయిన్ జయప్రద అరెస్ట్‌కి రంగం సిద్ధమైంది. ఇందుకోసం ఉత్తరప్రదేశ్ పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. అసలు ఇంతకీ ఏం జరిగింది? హీరోయిన్ కమ్ పొలిటిషన్ అయిన జయప్రద ఏం తప్పు చేసింది? (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్) తెలుగు, తమిళ, హిందీ భాషల్లో హీరోయిన్గా చేసిన జయప్రద.. 1994లో తెలుగుదేశం పార్టీలే చేరింది. కొన్నాళ్ల తర్వాత ఈ పార్టీని వీడి, సమాజ్ వాదీ పార్టీలో చేరింది. 2004 నుంచి 2014 వరకు ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పనిచేసింది. 2019 నుంచి బీజేపీలో కొనసాగుతోంది. అయితే 2019లో ఎన్నికల సందర్భంగా జయప్రద.. నిబంధనలు ఉల్లంఘించారు. దీంతో ఈమెపై నాన్ బెయిలబుల్ వారెంట్స్ జారీ అయ్యాయి. ఈ కేసులో భాగంగా కోర్టు సమన్లు జారీ చేసినా సరే విచారణ నిమిత్తం న్యాయస్థానం ఎదుట జయప్రద.. హాజరు కాలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం.. ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసి, ఆమెని అరెస్ట్ చేయాలని ఉత్తరప్రదేశ్ పోలీసులని ఆదేశించింది. ఈ క్రమంలోనే మహిళా ఇన్స్పెక్టర్ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో స్పెషల్ టీమ్ ఏర్పాటు చేశారు. ఇదంతా చూస్తుంటే జయప్రద అరెస్ట్ త్వరలో జరగడం గ్యారంటీ అనిపిస్తుంది. (ఇదీ చదవండి: Bigg Boss 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ షాకింగ్ డెసిషన్.. వాళ్లపై రివేంజ్!?) -
ESI అవకతవకల కేసులో సినీనటి జయప్రదకి జైలుశిక్ష
-
అంత పెద్ద హీరో పక్కన నన్ను హీరోయిన్ గా పెట్టారు
-
అప్పుడు ఎన్టీఆర్ కు నేను సపోర్ట్ చేసి ఉంటే బాగుండేది..తప్పు చేశాను
-
గర్వం లేని మనిషి ఆ వ్యక్తి అంటున్న జయప్రద
-
ఒక ముఖ్యమంత్రిని అలా చేయడం చాలా తప్పు అనిపించింది
-
ఆ స్టార్ హీరోల మధ్య తేడా ఇదే అనిపించింది: నటి జయప్రద
-
జయప్రద అంటే చాలా ఇష్టం..!
-
జయప్రద థ్రిల్లర్ మూవీ 'సువర్ణ సుందరి' .. రిలీజ్ డేట్ ఫిక్స్
సీనియర్ నటి జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘సువర్ణసుందరి’. సురేంద్ర మాదారపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ చిత్రాన్ని ఎమ్.ఎల్. లక్ష్మీ నిర్మించారు. డాక్టర్ ఎమ్వీకే రెడ్డి సమర్పణలో ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై తెరకెక్కించారు. కరోనా ప్రభావంతో వాయిదా పడిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 3న భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. దర్శకుడు సురేంద్ర మాట్లాడుతూ..' కరోనాలో నిలిచిపోయిన మా మూవీ రిలీజ్‌కు ఇదే సరైన సమయం. ఎందుకంటే ఈ మధ్య వచ్చిన బింబిసారా, కార్తికేయ-2, మసూద చిత్రాలకు ఆడియన్స్ మంచి హిట్ అందించారు. అలాంటి జానర్లో వస్తున్న మా సువర్ణ సుందరి మూవీకి కూడా మంచి విజయాన్ని ఇస్తారనే నమ్మకంతో ఉన్నాం. ఫిబ్రవరి 3న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం. మీరంతా సక్సెస్ ఇస్తారని ఆశిస్తున్నా.' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో ఇంద్ర, రామ్, సాయికుమార్, కోట శ్రీనివాసరావు, నాగినిడు, అవినాష్,సత్యప్రకాశ్ తదితరులు నటించారు. -
‘సువర్ణ సుందరి’ సరికొత్త అనుభూతిని ఇస్తుంది: దర్శకుడు సురేంద్ర
జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం ‘సువర్ణ సుందరి’. చరిత్ర భవిష్యత్తును వెంటాడుతుంది అనేది ట్యాగ్‌లైన్. మాదారపు సురేంద్ర దర్శకత్వంలో ఎమ్.ఎల్. లక్ష్మి నిర్మించిన ఈ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ మూవీ ఫిబ్రవరి 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు సురేంద్ర మాట్లాడుతూ – ‘‘గతానికి భవిష్యత్తుకు మధ్య వారధిలా జయప్రదగారి పాత్ర ఉంటుంది. కరోనా పరిస్థితుల కారణంగా సినిమా లేట్‌గా విడుదలవుతోంది. విజువల్ పరంగా కావొచ్చు, కంటెంట్ పరంగా కావొచ్చు.. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చే చిత్రం ఇది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, సహనిర్మాత: శ్రీకాంత్ పండుగుల. -
రామ్‌పూర్ ప్రత్యేక కోర్టులో జయప్రద
బరేలి: ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్ ప్రత్యేక కోర్టుకు సినీనటి, బీజేపీ నాయకురాలు జయప్రద హాజరయ్యారు. 2019నాటి ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులో ఆమె కోర్టు ఎదుట గత మూడున్నరేళ్లుగా గైర్హాజర్ కావడంతో గత నెలలో కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. బుధవారం ఆమె కోర్టులో హాజరుకావడంతో న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. ‘‘మాజీ ఎంపీ , బీజేపీ నాయకురాలు జయప్రద కోర్టు ఎదుట హాజరై బెయిల్ దరఖాస్తును సమర్పించారు. దీంతో కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది’’ అని ప్రభుత్వం తరఫున లాయర్ తెలిపారు. స్థానిక అధికారుల అనుమతి లేకుండా 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో జయప్రద ఎన్నికల ర్యాలీ నిర్వహించడంతో రెండు వేర్వేరు పోలీసు స్టేషన్లలో ఆమె రెండు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. -
కంగనాకు పద్మశ్రీ.. సీనియర్లం మాకు లేదా?
నందమూరి బాలకృష్ణ సారథ్యంలో అన్‌స్టాపబుల్ రెండో సీజన్ కూడా పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఇటీవల ఈ షోలో ముగ్గురు హీరోయిన్స్ సందడి చేశారు. అలనాటి హీరోయిన్స్ జయప్రద, జయసుధలతో పాటు మరో కథానాయిక రాశీ ఖన్నా ఆరో ఎపిసోడ్‌కు విచ్చేశారు. వీరిని ఇరుకున పెట్టే ప్రశ్నలడుగుతూ వాటికి సమాధానాలు రాబట్టాడు. ఈ క్రమంలో పద్మ అవార్డుల ప్రస్తావన రాగా.. ఈ విషయంలో తమకు అన్యాయం జరిగిందని అభిప్రాయపడ్డారు జయసుధ, జయప్రద. 'కంగనా రనౌత్ అద్భుత నటి. పట్టుమని పది సినిమాలు చేసిందో లేదో అప్పుడే ఆమెకు పద్మ శ్రీ ఇచ్చారు. కానీ మా విషయంలో అలా జరగలేదు. ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ప్రభుత్వం నుంచి ఇప్పటికీ మాకు ఎలాంటి గుర్తింపు దక్కలేదు. అంతెందుకు, గిన్నిస్ రికార్డుకెక్కిన మహిళా డైరెక్టర్ విజయ నిర్మలను కూడా ప్రభుత్వం గుర్తించలేదు. ఇలాంటి సందర్భాల్లోనే కేంద్రం దక్షిణాది చిత్రపరిశ్రమ పట్ల వివక్ష చూపిస్తుందనిపిస్తుంది' అని జయసుధ చెప్పుకొచ్చింది. జయప్రద మాట్లాడుతూ.. అవార్డులు అడిగి తీసుకోవడం మాకిష్టం లేదు. మా ప్రతిభను, సీనియారిటీని గుర్తించి గౌరవించాలనుకున్నాం అని పేర్కొంది. చదవండి: థియేటర్లు అమ్మేశారు, ఆస్తులు పోయాయి.. కమెడియన్ కూతురు బతిమాలినా రాలేదు, నటిపై ఫైర్ -
జయప్రదకు ఎన్టీఆర్ చలనచిత్ర పురస్కారం
ప్రముఖ నటి జయప్రదని ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కారం వరించింది. హీరో బాలకృష్ణ గౌరవ అధ్యక్షతన, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో తెనాలిలో ఎన్టీఆర్ శతజయంతి మహోత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 27 సాయంత్రం నాజర్‌పేట ఎన్వీఆర్ కన్వెన్షన్ సెంటర్లో రచయిత సాయిమాధవ్ బుర్రా సభా నిర్వహణలో ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కార మహోత్సవ సభ జరగనుంది. ఈ వేడుకలో జయప్రదకు ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కారాన్ని ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ అందించనున్నారు. అలాగే ఈ నెల 28న ‘అడవి రాముడు‘ సినిమాను ప్రదర్శించనున్నారు. జయప్రద, రామకృష్ణ, దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి ప్రేక్షకులతో కలిసి ఈ సినిమాను వీక్షించనున్నారు. -
స్టార్ నటుడు చెంప చెళ్లుమనిపించిన జయప్రద? క్లారిటీ ఇచ్చిన దలీప్ తాహిల్
నటి జయప్రద గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు, హిందీ, తమిళంలో ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఆమె రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటోంది. ఇదిలా ఉంటే ఆమె స్టార్ నటుడు దలీప్ తాహిల్ చెంప చెళ్లుమనిపించిందంటూ తరచూ బాలీవుడ్లో వార్తల చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఈ వార్తలపై తాజాగా నటుడు దలీప్ తాహిల్ స్పందించాడు. ఈ సందర్భంగా జయప్రద తనని కొట్టినట్లు వస్తున్న వార్తలపై ఆయన వివరణ ఇచ్చాడు. 1986లో అమితాబ్ బచ్చన్-జయప్రద జంటగా ‘ఆఖ్రే రాస్తా’ మూవీ తెరకెక్కింది. ఈ సినిమాలో దలిప్ తాహిర్ విలన్‌గా చేశాడని, ఇందులో ఆయన జయప్రదను అత్యాచారం చేసే ఓ సన్నివేశం ఉందట. ఈ సీన్ షూటింగ్ సమయంలో తనతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో జయప్రద ఆయనను చెంప దెబ్బ కొట్టినట్లు ఓ వార్త ప్రచారంలో ఉంది. తాజాగా దీనిపై ఆయన వివరణ ఇచ్చాడు. ‘‘జయప్రదతో కలిసి ఓ అభ్యంతరకర సన్నివేశంలో నటించానని, ఆ సీన్ షూటింగ్ సమయంలో ఆమె నన్ను కొట్టినట్లు కొంత కాలంగా ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలను నేను కూడా విన్నాను. నేను కొంచెం దూకుడుగా వెళ్లానని, ఆమె నా చెంప చెళ్లు మనిపించినట్టు అందులో ఉంది. అసలు నేను జయప్రదతో కలిసి ఏ సినిమాలోనూ నటించనేలేదు. ఇది వాస్తవం. ఆమెతో కలిసి నటించాలనే ఆసక్తి ఉన్నా, ఆ అవకాశం మాత్రం రాలేదు. అలాంటప్పుడు ఇక అలాంటి సీన్ చేసే అవకాశమే లేదు కదా? ఈ కథనాలు రాసే వ్యక్తి పట్ల నాకు శత్రుత్వం లేదు. కానీ ఆ సీన్ చూపిస్తే సంతోషిస్తాను. సోషల్ మీడియాలో అసలు లేనివి కూడా పుట్టిస్తున్నారు’’ అంటూ దలీప్ తాహిల్ అసహనం వ్యక్తం చేశాడు. చదవండి: నాకు స్ఫూర్తినిచ్చిన అంశాలన్నీ మీతోనే వెళ్లిపోయాయి నాన్నా: మహేశ్ ఎమోషనల్ ఘనంగా అలీ కూతురు హల్దీ ఫంక్షన్, ఫొటోలు వైరల్ -
కృష్ణంరాజుకు జయప్రద నివాళి.. వెక్కెక్కి ఏడ్చిన నటి
‘రెబల్’ స్టార్ కృష్ణం రాజు మృతిపై సీనియర్ నటి, బీజేపీ నాయకురాలు జయప్రద భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించిన ఆమె అనంతరం మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతరమయ్యారు. ఆయన మనతో లేరు అనేది తాను నమ్మలేకపోతున్నానని అన్నారు. ‘ఎప్పుడు కనిపించిన జయప్రద ఎలా ఉన్నావంటూ చాలా అప్యాయంగా పలకరించేవారు. ఆయన పిలుపు ఇప్పటికీ నా చేవుల్లో మారుమ్రోగుతుంది. ఎన్నో అద్భుతమైన సినిమాలు, పాత్రలు చేసి ప్రజల హృదయాల్లో ఆయన నిలిచిపోయారు. ఆయన అనారోగ్యంతో తరచూ ఆస్పత్రికి వెళుతు వస్తున్నారని తెలుసు, ఎప్పటిలాగే ఈసారి కూడా ఆస్పత్రికి నుంచి ఆయన తిరిగి వస్తారనుకున్నాం’ అంటూ ఆమె వెక్కెక్కి ఏడ్చారు. చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన రజనీకాంత్ కూతురు అలాగే ఆమె మాట్లాడుతూ.. ‘ఆయనతో కలిసి నటించే అద్భుతమైన అవకాశాన్ని నాకు ఆ భగవంతుడు కల్పించాడు. తాండ్ర పాపరాయుడు, భక్త కన్నప్ప వంటి ఎన్నో చిత్రాలు చేసి ఈ రోజు రెబల్ స్టార్‌గా నిలిచారు. ఆయన కూతుళ్లు ఇంకా చిన్నపల్లలు. వారికి, ఆయన సతిమణికి ఆ దేవుడు ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నా. ఆయన నటుడిగా, రాజకీయ వేత్తగా, కేంద్రమంత్రి ఆయన ఎదిగిన ఎత్తులు సాధారణమైనవి కాదు. ఎలాంటి మచ్చ లేకుండా ఆయన రారాజుగా వెళ్లిపోయారు’ అంటూ జయప్రద భావోద్వేగానికి లోనయ్యారు. కాగా ఇటీవల అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరిన కృష్ణంరాజు ఆదివారం(సెప్టెంబర్ 11న) తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. చదవండి: చిరుతో ‘విక్టరి’ వెంకటేశ్ సరదా సన్నివేశం? ఏ సినిమాలో అంటే..! -
రాజమండ్రి నా స్వస్థలం.. ఇక్కడి నుండే రాజకీయాల్లోకి వెళ్లా: జయప్రద
-
సీనియర్ నటి జయప్రద ఇంట తీవ్ర విషాదం
సీనియర్ నటి జయప్రద ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె తల్లి నీలవేణి(85) అనారోగ్యంతో ఈ రోజు(మంగళవారం) మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో నేడు సాయంత్రం ఆమె తుదిశ్వాస విడిచారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఢిల్లీలో నివసిస్తున్న నటి జయప్రద.. తల్లి మరణవార్త తెలిసి హుటాహుటిన హైదరాబాద్ బయల్దేరినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు జయప్రదకు తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా అందం, అభినయంతో తెలుగు చిత్రసీమలో స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పిన జయప్రద ‘భూమికోసం’ చిత్రంతో తెలుగు తెరపై మెరిశారు. తన సినీ కెరీర్లో జయప్రద మొత్తం(తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలి, మరాఠి) 300లకు పైగా చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత ఆమె రాజకియాల్లోకి ప్రవేశించారు. ప్రస్తుతం జయప్రద బీజేపీ పార్టీలో యాక్టివ్‌గా ఉన్నారు. -
పార్టీ ఆదేశిస్తే.. ఎక్కడి నుంచైనా పోటీ చేస్తా: యోగి
లక్నో: బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే ఉత్తరప్రదేశ్‌లోని ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నిటినీ అమలు చేశానన్నారు. సీఎంగా అన్ని బాధ్యతలను సక్రమంగా నెరవేర్చాననీ, ఈ విషయంలో లేశమాత్రమైనా పశ్చాత్తాపం లేదని వ్యాఖ్యానించారు. శనివారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. మథురలో కృష్ణ మందిరం నిర్మిస్తామని ఎన్నికల వేళ బీజేపీ కొత్త నివాదం అందుకోవడం, మథుర అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని యోగిని స్థానిక ఎంపీ జయప్రద ఆహ్వానించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో అయోధ్య, మథుర, లేదా సొంత జిల్లా గోరఖ్‌పూర్‌లలో ఎక్కడి నుంచి పోటీ చేస్తారని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ పైవిధంగా సమాధానమిచ్చారు. ప్రస్తుతం యోగి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. యూపీ సీఎంగా కొనసాగిన వారిలో ములాయం సింగ్ ఆఖరిసారిగా 2003లో అసెంబ్లీకి పోటీ చేశారు. ఆయన తర్వాతి సీఎంలు మాయావతి, అఖిలేశ్, యోగి ఎమ్మెల్సీలుగా కొనసాగడం గమనార్హం. వచ్చే ఎన్నికల్లో తను పోటీ చేసే అవకాశాల్లేవని ఇటీవల ప్రకటించిన మాజీ సీఎం అఖిలేశ్..ఆ విషయం పార్టీయే నిర్ణయిస్తుందంటూ ఆ తర్వాత మాటమార్చారు. కాశీ, అయోధ్యల్లో మాదిరిగా మథుర పుణ్యక్షేత్రంలో వివిధ అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయని యోగి అన్నారు. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారంటూ అడిగిన ప్రశ్నకు ఆయన..‘ఒవైసీ ఒవైసీయే. ఆయన నోటి నుంచి రామకథ వినాలని మీరు ఆశిస్తున్నారా?’ అని వ్యంగ్యంగా అన్నారు. -
బంగార్రాజుకు స్నేహితురాలిగా సీనియర్ నటి?
‘సోగ్గాడే చిన్ని నాయనా’లో బంగార్రాజుగా మంచి జోష్ ఉన్న పాత్రలో నాగార్జున చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇది తండ్రి పాత్ర. ఇందులో తనయుడి పాత్రనూ ఆయనే చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ‘సోగ్గాడే...’కి ప్రీక్వెల్‌గా ‘బంగార్రాజు’ రూపొందనుంది. మొదటి భాగంలో కనిపించినట్లుగానే ఇందులోనూ పలువురు కలర్‌ఫుల్ తారలు కనిపిస్తారట. వాళ్లల్లో జయప్రద ఒకరనే ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో ఉన్న ఒక కీలక పాత్రకు జయప్రదను సంప్రదించారట చిత్రదర్శకుడు కల్యాణ్‌కృష్ణ. మరి.. బంగార్రాజుకు స్నేహితురాలిగా జయప్రద కనిపిస్తారా? లేక వేరే ఏదైనా పాత్రా అనేది తెలియాల్సి ఉంది. జయప్రద ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, డేట్స్ కూడా కేటాయించారని టాక్. ‘సోగ్గాడే..’లో నాగ్‌కి జోడీగా నటించిన రమ్యకృష్ణ ఈ చిత్రంలోనూ ఆ పాత్రను చేస్తారని తెలిసింది. నాగచైతన్య కూడా ఈ సినిమాలో నటించనున్నారు. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందట. షూటింగ్ ఆరంభించడమే ఆలస్యం అని సమాచారం. -
‘బంగార్రాజు’తో ఒకప్పటి స్టార్ హీరోయిన్ రీఎంట్రీ !
‘కింగ్’ నాగార్జున అక్కినేని-రమ్యకృష్ణ జంటగా డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ తెరకెక్కించిన హిట్ మూవీ ‘సోగ్గాడే చిన్నినాయన’. ఎలాంటి అంచనాలు లేకుండా 2016లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో డైరెక్టర్ కల్యాణ్ దీనికి సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే బంగార్రాజును సెట్స్‌పైకి తీసుకురానున్నట్లు డైరెక్టర్ ప్రకటించినప్పటి నుంచి దీనికి సంపాదించిన అప్డేట్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అయితే ఇందులో అక్కినేని వారసులు నాగచైతన్య, అఖిల్ నటిస్తుండగా చైకి జోడిగా సమంత నటిస్తున్నట్లు ఇటీవల వార్తలు వినిపించాయి. ఆ తర్వాత సమంత కాదని తమిళ హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్‌ను అనుకుంటున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా బంగార్రాజు నుంచి మరో అసక్తికిర అప్డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. తాజా సమచారం ప్రకారం ఈ మూవీలో ఓ కీలక పాత్ర కోసం ఒకప్పటి స్టార్ హీరోయిన్ జయప్రదను చిత్రం బృందం సంప్రదించినట్లు సమాచారం. డైరెక్టర్ కల్యాణ్ ఆమెను కలిసి పాత్రను వివరించగా అది నచ్చడంతో జయప్రద గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేగాక ఈ మూవీ కోసం డెట్స్ కూడా ఇచ్చినట్లు టాలీవుడ్లో టాక్. కాగా కొంతకాలంగా జయప్రద తెలుగు తెరపై కనిపించడం లేదు. చాలా గ్యాప్ తర్వాత ‘బంగార్రాజు’ మూవీతో టాలీవుడ్‌కు రీఎంట్రీ ఇవ్వడం నిజంగా ఆమె అభిమానులకు పండగే. అలాగే దీనితో పాటు జయప్రద ఓ వెబ్ సిరీస్‌తో కూడా త్వరలో ఓటీటీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో కూడా నాగార్జునకు జోడిగా నటి రమ్యకృష్ణ నటించనుంది. చదవండి: నాగార్జున యాక్షన్ మూవీ: జూన్‌లో ప్రారంభం