'బాస్' రూటులో జయప్రద?
లక్నో: అమర్ సింగ్ సమాజ్ వాదీ పార్టీలోకి తన పునరాగమాన్ని ఘనంగా చాటారు. పార్టీలో బడా నేతలు వ్యతిరేకించినప్పటికీ పెద్దల సభ సీటు దక్కించుకుని సత్తా చాటారు. ఆయనతో పాటు సమాజ్ వాది పార్టీకి దూరమైన ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ జయప్రద కూడా మళ్లీ ఎస్ పీ గూటికి చేరే అవకాశాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
క్రియాశీల రాజకీయల్లోకి మళ్లీ అడుగు పెట్టేందుకు జయప్రద ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమర్ సింగ్ సొంతగూటికి చేరడంతో ఆమెకు అనుకూలించే పరిణామం. తనకు మెంటర్, ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్ అయిన అమర్ సింగ్ మార్గాన్నే ఆమె అనుసరించే అవకాశముంది. ఆయన సొంత గూటికి చేరుకుని రాజ్యసభ సభ్యత్వం దక్కించుకోవడంతో జయప్రద ఆయన బాటలోనే ప్రయాణిస్తారని భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు ఆమె చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆమె మళ్లీ యూపీ వైపు మళ్లనున్నారని తెలుస్తోంది. అమర్ సింగ్ పునరాగమనాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఆజాంఖాన్, రాంగోపాల్ యాదవ్.. జయప్రద రాకకు మోకాలడ్డే అవకాశముంది. అయితే 'బాస్' అమర్ సింగ్ తలచుకుంటే జయప్రదకు మళ్లీ యూపీ పాలిటిక్స్ లో మెరుస్తారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.