Amar Singh
-
‘ఆప్’కు మరో షాక్.. హర్యానా అభ్యర్థి కాంగ్రెస్‌లో చేరిక
చండీగఢ్: హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి ఎదురుదెబ్బ తగిలింది. నీలోఖేరి (రిజర్వ్డ్) స్థానం నుంచి పోటీలోకి దిగిన ఆప్ అభ్యర్థి అమర్ సింగ్ ఉన్నట్టుండి కాంగ్రెస్‌లో చేరారు. పంజాబ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ప్రతాప్ సింగ్ బజ్వా సమక్షంలో అమర్ సింగ్ కాంగ్రెస్‌లో చేరారు.ఈ సందర్భంగా అమర్‌సింగ్‌ను కాంగ్రెస్‌లోకి స్వాగతిస్తున్నట్లు భాజ్వా ప్రకటించారు. ఎలాంటి షరతులు లేకుండా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం అమర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ మాత్రమే ఓడించగలదని, రాష్ట్రంలోని రైతులు, మహిళలు, దళితులు, మైనార్టీలకు బీజేపీ అన్యాయం చేస్తోందన్నారు. బీజేపీని ఓడించేందుకే తాను కాంగ్రెస్‌లో చేరానని పేర్కొన్నారు. నీలోఖేరి కాంగ్రెస్ అభ్యర్థి ధరంపాల్ గొండర్కు మద్దతు ప్రకటించానని, ఆయన తరపున ప్రచారం చేస్తానని తెలిపారు. హర్యానాలో కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ప్రత్యక్ష పోటీ ఉందని అన్నారు.బీజేపీ ప్రభుత్వాన్ని అధికారం నుండి తొలగించడమే తన లక్ష్యమని, తాను తన అభ్యర్థిత్వాన్ని కొనసాగిస్తే, ఓట్ల విభజన జరిగి, బీజేపీకి ప్రయోజనం చేకూరుతుందున్నారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకే కాంగ్రెస్‌లో చేరానని అమర్ సింగ్ పేర్కొన్నారు. కాగా ఫరీదాబాద్ ఆప్ అభ్యర్థి ప్రవేశ్ మెహతా సెప్టెంబర్ 28న బీజేపీలో చేరారు. అక్టోబర్ 5న హర్యానాలో ఓటింగ్ జరగనుండగా, అక్టోబర్ 8న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.ఇది కూడా చదవండి: డ్రోన్ల కలకలం.. ఆగిన మెట్రో రైళ్లు -
రక్షణ శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘంలో రాహుల్ గాంధీ!
న్యూఢిల్లీ: రక్షణ శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం(స్టాండింగ్ కమిటీ) సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం నామినేట్ అయ్యారు. కాంగ్రెస్ మరో ఎంపీ అమర్‌సింగ్ కూడా ఇదే కమిటీకి నామినేట్ అయ్యారు. ఈ మేరకు లోక్‌సభ ఒక బులెటిన్ విడుదల చేసింది. పరువు నష్టం కేసులో అనర్హత వేటు పడకముందు రాహుల్ గాంధీ రక్షణ శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘంలో సభ్యుడిగా వ్యవహరించారు. ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని ఆగస్టు 7న పునరుద్ధరించిన సంగతి తెలిసిందే. ఎన్సీపీ ఎంపీ ఫైజల్ పి.పి.మొహమ్మద్ లోక్‌సభ సభ్యతాన్ని కూడా పునరుద్ధరించారు. ఆయనను వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ స్టాండింగ్ కమిటీకి నామినేట్ చేశారు. -
అమర్‌సింగ్ కన్నుమూత
న్యూఢిల్లీ: రాజ్యసభ సభ్యుడు, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) మాజీ నేత అమర్‌సింగ్(64) కన్నుమూశారు. సింగపూర్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. 2011లో ఆయనకు కిడ్నీ మార్పిడి జరిగింది. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మరో కిడ్నీ మార్పిడి కోసం 8 నెలల క్రితం సింగపూర్‌లోని ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమించి శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య పంకజకుమారి, కుమార్తెలు దృష్టి, దిశ ఉన్నారు. అమర్‌సింగ్ మృతికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ సహా పార్టీలకతీతంగా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ‘అమర్‌సింగ్ మరణం ఎంతో విచారం కలిగించింది. ఆయన సమర్థుడైన పార్లమెంటేరియన్. బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులకు ప్రగాఢ సానుభూతి’అని రాష్ట్రపతి కోవింద్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రముఖుల సంతాపం అమర్‌సింగ్ కుటుంబసభ్యులకు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేశంలో సంభవించిన కీలక రాజకీయ పరిణామాలకు ప్రత్యక్ష సాక్షి అయిన అమర్‌సింగ్ గొప్ప ప్రజానాయకుడని ప్రధాని మోదీ కొనియాడారు. అందరితో కలివిడిగా మెలిగే అమర్‌సింగ్ మంచి రాజకీయ నేత, వ్యూహకర్త అని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ట్విట్టర్లో తన తండ్రి, పార్టీ వ్యవస్థాపకుడు ములాయంతో అమర్‌సింగ్ ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశారు. ఆయన కుటుంబసభ్యులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అమర్‌సింగ్ మృతికి కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ సంతాపం ప్రకటించారు. రాజకీయ నేపథ్యం లేకుండానే... 1956 జనవరి 27న∙ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్‌లో జన్మించిన అమర్‌సింగ్‌కు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. ఎస్పీ అధినేత ములాయం సింగ్‌కు అత్యంత సన్నిహితుడిగా పలుకుబడిగల నేతల్లో ఒకరిగా ఎదిగారు. 2008లో అప్పటి యూపీఏ ప్రభుత్వం అమెరికాతో కుదుర్చుకున్న అణు ఒప్పందానికి వ్యతిరేకంగా వామపక్షాలు యూపీఏ నుంచి వైదొలగడంతో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రమాదంలో పడింది. ఆ సమయంలో ఎస్పీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అమర్.. ఎస్పీ మద్దతుతో యూపీఏ ప్రభుత్వాన్ని కాపాడటంలో కీలకపాత్ర పోషించారు. యూపీ నుంచి రాజ్యసభకు తొలిసారిగా 1996లో ఎన్నికయ్యారు. 2003, 2016లో రాజ్యసభ సభ్యుడయ్యారు. 1996 నుంచి 2010లో బహిష్కరణకు గురయ్యే వరకు ఆయన ఎస్పీలో కీలక నేతగా కొనసాగారు. అనిల్ అంబానీ, అమితాబ్ బచ్చన్, ‘సహారా’ సుబ్రతా రాయ్ తదితరులతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. సినీనటి జయప్రద ఎస్పీలో చేరడం వెనుక అమర్ హస్తం ఉందని అంటుంటారు. అమితాబ్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయి. 2016లో ఆయన అమితాబ్ భార్య జయా బచ్చన్‌పై సంచలన వ్యాఖ్యలు చేయడంతో అంతరం పెరిగింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై ఆయన్ను సమాజ్‌వాదీ పార్టీ 2010లో బహిష్కరించింది. ఓటుకు నోటు కుంభకోణంలో 2011లో అరెస్టయ్యారు. అయినప్పటికీ, 2016లో ఎస్పీ మద్దతుతోనే స్వతంత్ర అభ్యర్ధిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2016లో తిరిగి పార్టీలో చేర్చుకున్న ములాయం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. అయితే, ఆ తర్వాత ఎస్పీ పగ్గాలు చేపట్టిన అఖిలేశ్ యాదవ్ 2017లో ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించారు. ఎస్పీ నుంచి దూరమైన అమర్‌సింగ్ ప్రధాని మోదీకి, బీజేపీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్కు దగ్గరయ్యారు. ఆజంగఢ్‌లో ఉన్న తమ పూర్వీ కుల ఆస్తులను ఆర్ఎస్ఎస్కు విరాళంగా అందజేస్తానని ప్రకటించారు. -
రాజ్యసభ సభ్యుడు అమర్‌సింగ్ కన్నుమూత
-
రాజ్యసభ సభ్యుడు అమర్‌సింగ్ కన్నుమూత
లక్నో : సమాజ్‌వాదీ పార్టీ మాజీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు అమర్‌సింగ్ (64) మృతిచెందారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. శనివారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందుతూ కన్నుమూశారు. 2013 నుంచి కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. కొన్ని నెలల పాటు సింగపూర్‌లో వైద్య చికిత్స సైతం తీసుకున్నారు. అనంతరం ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 1956 జనవరి 27 ఉత్తరప్రదేశ్‌లోని అజమ్‌ఘర్‌లో జన్మించిన అమర్‌సింగ్.. 1996లో తొలిసారి రాజ్యసభకు ఎన్నికైయ్యారు. 2016లో చివరి సారిగా పెద్దల సభకు ఎస్పీ నుంచి నామినేట్ అయ్యారు. అమర్‌సింగ్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఎస్పీలో సీనియర్ నేతగా గుర్తింపు పొందిన అమర్‌సింగ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్‌కు అత్యంత సన్నిహితుడు. -
అమితాబ్‌పై అమర్‌సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్, ఆయన కుటుంబం పట్ల ప్రవర్తించిన తీరుకు సమాజ్‌వాదీ పార్టీ మాజీ నాయకుడు అమర్‌సింగ్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ‘బిగ్ బి’ పట్ల అతిగా ప్రవర్తించానని ఒప్పుకున్నారు. ‘ఈరోజు నా తండ్రి వర్ధంతి సందర్భంగా అమితాబ్ బచ్చన్ నుంచి నాకు మెసేజ్ వచ్చింది. ఒకానొక సమయంలో మృత్యువు అంచుల వరకు వెళ్లొచ్చాను. చావుతో పోరాడి ఇప్పుడిలా ఉన్నాను. అమితాబ్‌బచ్చన్, ఆయన కుటుంబం పట్ల అనుచితంగా ప్రవర్తించినందుకు ఇప్పుడు పశ్చాత్తాపం చెందుతున్నాను. వారిని దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను’ అని అమర్‌సింగ్ ట్వీట్ చేశారు. మూత్రపిండం పాడవడంతో కొన్నేళ్ల క్రితం ఆయన శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఒకప్పుడు అమితాబ్‌కు ఆప్తుడిగా మెలిగారు. అయితే అమితాబే తమ స్నేహానికి ముగింపు పలికారని గతంలో అమర్ సింగ్ వెల్లడించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. 2017లో ఓ ఇంటర్వ్యూలో అమర్‌సింగ్ మాట్లాడుతూ.. అమితాబ్, జయబచ్చన్ వివాహ సంబంధం సవ్యంగా సాగడం లేదని, వారిద్దరూ వేర్వేరుగా నివసిస్తున్నారని వ్యాఖ్యానించి కలకలం రేపారు. జయబచ్చన్ సమాజ్‌వాదీ పార్టీ సభ్యత్వాన్ని అంగీకరించొద్దని తనను అమితాబ్ హెచ్చరించారని అప్పట్లో అమర్‌సింగ్ తెలిపారు. అంతేకాదు అమితాబ్ అప్పుల్లో ఉన్నప్పుడు తాను ఎంతో సహాయం చేశానని, తాను జైలులో ఉన్నప్పడు కనీసం చూడటానికి కూడా రాలేదని వాపోయారు. తనకు బెయిల్ వచ్చిన తర్వాతే చూడటానికి వచ్చారని, అప్పుటికే తన మనసు విరిగిపోయిందని.. అమితాబ్‌తో మాట్లాడటానికి మనసు రాలేదన్నారు. మనుషులు ఇంత అవకాశవాదులుగా ఉంటారా అని అమర్ సింగ్ వాపోయారు. అయితే అమితాబ్, ఆయన కుటుంబం పట్ల తానే అత్యుత్సాహం ప్రదర్శించానని తాజాగా అమర్‌సింగ్ విచారం వ్యక్తం చేశారు. (రిక్షా కార్మికుడికి ప్రధాని మోదీ సర్ప్రైజ్) -
వేడుకున్నా వదల్లే..
ట్రాఫిక్ పోలీసులకు చేతులెత్తి మొక్కుతూ.. కాళ్లావేళ్లా పడుతున్న ఈ పెద్దాయన పేరు అమర్‌సింగ్(55). మధ్యప్రదేశ్‌కు చెందిన ఈయన అక్కడ ఉపాధి లేక బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చి చింతల్ హెచ్ఎంటీ ప్రధాన రోడ్డులో చిన్న షెడ్డు వేసుకుని రగ్గులు, దుప్పట్లు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గురువారం జీడిమెట్ల ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ సర్కిల్ అధికారులు సంయుక్తంగా ఇక్కడ ఆక్రమణల తొలగింపు చేపట్టారు. పోలీసులను బతిమిలాడుతున్న అమర్‌సింగ్ ఈక్రమంలో రోడ్డు పక్కనున్న అమర్‌సింగ్ షెడ్డును కూడా తొలగిస్తుండగా.. తన బతుకు నాశనం చేయొద్దంటూ అక్కడున్న ట్రాఫిక్ ఎస్ఐ రమేష్‌సింగ్ కాళ్లపై పడి వేడుకున్నాడు. ఆయన పట్టించుకోకపోవడంతో అక్కడికి వచ్చిన ఇన్స్పెక్టర్ సత్యనారాయణ కాళ్లపై కూడా పడ్డాడు. అయినా అధికారులు కనికరం చూపకుండా అమర్‌సింగ్ షెడ్డును తొలగించి, సామగ్రిని జప్తు చేశారు. దాంతో బాధితుడు కన్నీళ్లు పెట్టుకోవడం మినహా మరేం చేయలేకపోయాడు. ఇతడి లాగే మరికొందరు బడుగుల బతుకును అధికారులు కూల్చివేశారు. బడాబాబుల ఆక్రమణలపై కన్నెత్తి చూడలేని అధికారులు తమ ఉనికిని చాటుకునేందుకు ఇలాంటి చిరుజీవులపై ప్రతాపం చూపుతున్నారని అక్కడి పరిస్థితిని గమనించిన కొందరు చెప్పుకోడం గమనార్హం. -
ఆ ఫోటోలు చూసి చనిపోవాలనుకున్న : జయప్రద
లక్నో : ‘అమర్ సింగ్‌ను నా గాడ్‌ఫాదర్‌గా భావిస్తున్నాను. కానీ జనాలు మాత్రం మా ఇద్దరి గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు’ అంటూ ప్రముఖ సినీనటి, మాజీ ఎంపీ జయప్రద ఆవేదన వ్యక్తం చేశారు. క్వీన్స్‌లైన్ లిటరేచర్ ఫెస్టివల్‌కు హాజరైన జయప్రద, రచయిత రామ్ కమల్‌తో మాట్లాడుతూ.. ‘సినీ రంగం నుంచి వచ్చాను.. ఎంపీగా గెలిచాను. కానీ సాధరణ మహిళలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను నేను ఎదుర్కొంటున్నాను. ఈ రోజు నేను రాజకీయాల్లో ప్రవేశించి.. రాణించగల్గుతున్నానంటే అందుకు కారణం అమర్ సింగ్. ఆయన నాకు గాడ్ ఫాదర్ లాంటి వారు. ఒకవేళ నేను ఆయనకు రాఖీ కట్టినా జనాలు తప్పుడు ప్రచారం మాత్రం ఆపరు. అందుకే వాటి గురించి పట్టించుకోవడం మానేశాను’ అని తెలిపారు. జయప్రద తొలుత సమాజ్‌వాదీ పార్టీలోనే ఉండేవారు. కానీ విబేధాల కారణంగా ఎస్పీ నుంచి బయటకు వచ్చి ఆమర్ సింగ్‌తో కలిసి ‘రాష్ట్రీయ్ లోక్ మాంచ్ పార్టీ’ స్థాపించారు. అప్పటి నుంచి వీరిద్దరి బంధం గురించి పుకార్లు ఎక్కువయ్యాయి. ఈ సందర్భంగా సీనియర్ ఎస్పీ నాయకుడు, రామ్‌పుర్ ఎమ్మెల్యే అజామ్ ఖాన్ మీద తీవ్ర ఆరోపణలు చేశారు. తన మీద యాసిడ్ పోస్తానంటూ అజామ్ ఖాన్ తనను బెదిరించారని తెలిపారు. కానీ ఈ బెదిరంపులకు తాను భయపడలేదన్నారు. ఈ విషయం గురించి చెప్తూ ‘నా ప్రాణానికి ప్రమాదం ఉందని నాకు తెలుసు. నేను ఇంటి నుంచి బయటికి వెళితే క్షేమంగా తిరిగి వస్తానో? లేదో కూడా మా అమ్మకు చెప్పలేకపోతున్నాను. ఏ ఒక్క రాజకీయ నాయకుడు నాకు మద్దతుగా నిలవలేదు. ములాయం సింగ్ కూడా ఈ విషయంలో ఎటువంటి సహాయం చేయలేదని విచారం వ్యక్తం చేశారు. అంతేకాక తన ఫోటోలను మార్ఫ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన రోజున తాను చనిపోవాలని నిర్ణయించకున్నట్లు జయప్రద తెలిపారు. ఆ సమయంలో అమర్‌సింగ్ డయాలసిస్ చికిత్సలో ఉన్నారని, ఏం చేయాలో పాలుపోక తాను తీవ్ర మానసిక క్షోభ అనుభవించానని చెప్పారు. ఆ సమయంలో ఎవరూ తనకు అండగా నిలవలేదన్నారు. డయాలసిస్ చేయించుకుని తిరిగి వచ్చిన అమర్‌సింగ్ మాత్రమే తనకు చేయూతనిచ్చారని ఆమె వివరించారు. అలాంటి వ్యక్తిని తాను గాడ్‌ఫాదర్‌గా భావిస్తున్నానని.. అందుకే పనికిమాలిన పుకార్లను పట్టించుకోవడం మానేసానని తెలిపారు. ఈ పురుషాధిక్య ప్రపంచంలో రాజకీయాలనే కాదు ఏ రంగంలోనైనా రాణించడం మహిళలకు నిజంగా ఓ యుద్ధంతో సమానమని ఆమె వర్ణించారు. అంతేకాక ఇటీవలే విడుదలైన మణికర్ణిక సినిమాలో కంగనా పాత్రలో తనను తాను చూసుకున్నానని చెప్పారు. అవసరాన్ని బట్టి ప్రతి మహిళ ఓ దుర్గాదేవిగా మారాలని పిలుపునిచ్చారు. -
సమాజ్‌వాది చీలిక వెనక అమిత్ షా!
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో మహా కూటమి ఆవిర్భవించక ముందే సమాజ్‌వాది పార్టీలో చీలిక రావడం విచారకర పరిణామమే. పార్టీ వ్యవస్థాపక నాయకుడు ములాయం సింగ్ యాదవ్ సోదరుడు శివపాల్ యాదవ్, తన అన్న కుమారుడు, పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ నాయకత్వంపై అసహనం వ్యక్తం చేస్తూ ‘సమాజ్‌వాది సెక్యులర్ ఫ్రంట్’ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు బుధవారం నాడు ప్రకటించారు. చీలికవైపు శివపాల్ యాదవ్‌ను ప్రోత్సహించిందీ తెరముందు నుంచి అమర్ సింగ్ అయితే, తెరవెనక నుంచి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అని నిస్సందేహంగా చెప్పవచ్చు! ఎందుకంటే శివపాల్ యాదవ్ తన నిర్ణయాన్ని ప్రకటించడానికి 24 గంటల ముందే అమర్ సింగ్ లక్నోలో ఏర్పాటు చేసిన ఓ విలేకరుల సమావేశంలో మాట్లాడుతో బీజీపీ పార్టీలో శివపాల్ యాదవ్‌కు సముచిత స్థానం కల్పించడం కోసం ఆ పార్టీ అధినాయకులతో మాట్లాడానని, అయితే చివరి నిమిషంలో శివపాల్ తన మనసు మార్చుకున్నారని చెప్పారు. శివపాల్ యాదవ్‌కు, అమర్ సింగ్‌కు మధ్యన మొదటి నుంచి సత్సంబంధాలు ఉన్న విషయం తెల్సిందే. శివపాల్ కారణంగానే అమర్ సింగ్ రెండోసారి సమాజ్‌వాది పార్టీలోకి వచ్చారు. శివపాల్ యాదవ్ బీజేపీలో చేరడానికి బదులు సమాజ్‌వాది పార్టీని ఏర్పాటు చేశారంటే ఇందులో ప్రముఖ వ్యూహకర్తగా పేరు పొందిన బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా హస్తం ఉండే ఉంటుందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. శివపాల్‌ను పార్టీలో చేర్చుకోవడానికి బదులు కొత్త పార్టీని ఆయనతో పెట్టిస్తే రానున్న ఎన్నికల్లో అఖిలేష్ పార్టీని దెబ్బతీయవచ్చని, తద్వారా ఎస్పీ–బీఎస్పీ కూటమి విజయావకాశాలను అడ్డుకోవచ్చని అమిత్ షా ఆలోచించి ఉంటారు. యూపీలోని రెండు లోక్‌సభ, ఒక అసెంబ్లీ సీట్లకు జరిగిన ఉప ఎన్నికల్లో ఎస్పీ–బీఎస్పీ పార్టీలు కలసి పోటీ చేయడం వల్ల ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. ముఖ్యంగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వరుసగా ఐదు సార్లు ప్రాతినిథ్యం వహించిన గోరఖ్‌పూర్ లోక్‌సభ స్థానాన్ని కైవసం చేసుకున్న విషయం తెల్సిందే. ఈ విజయోత్సాహంతో 2019లో జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఐక్యంగా పోటీ చేయాలని ఎస్పీ, బీఎస్పీ పార్టీలు నిర్ణయించుకోవడంతోపాటు కాంగ్రెస్ సహా ఇతర పార్టీలను కలుపుకొని మహా కూటమిని ఏర్పాటు చేయాలనుకున్నాయి. ఈలోగా శివపాల్ యాదవ్ రూపంలో పార్టీలో చీలిక రానుంది. పార్టీలో ఎంతో కాలం సీనియర్ నాయకుడిగా చెలామణి అయిన శివపాల్ యాదవ్‌కు పార్టీలో పలుకుబడి బాగానే ఉంది. అందుకనే 2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీలో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసిన శివపాల్ యాదవ్‌కే అఖిలేష్ తండ్రి ములాయం సింగ్ యాదవ్ మద్దతు ఇచ్చారు. పార్టీలో భిన్న శిబిరాలు ఏర్పడిన కారణంగా నాటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవాల్సి వచ్చిందని గ్రహించిన పార్టీలోని శిబిరాలు ఎన్నికల అనంతరం కనీసం బయటకు ఐక్యంగానే ఉంటూ వచ్చాయి. ఈ నేపథ్యంలో శివపాల్ తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ‘గత ఏడాది కాలంగా అఖిలేష్ యాదవ్‌లో మార్పు వస్తుందని ఎదురు చూశాను. ఆయనలో ఎలాంటి మార్పు కనిపించలేదు. పార్టీ సీనియర్ నాయకులను నిర్లక్ష్యం చేస్తూనే వస్తున్నారు. నాతో పాటు చాలా మంది సీనియర్ నాయకులు అలాగే ఫీలవుతున్నారు. నేను ఇక లాభం లేదనుకొని ఇప్పుడు బయటకు వచ్చాను. మిగతా వారు కూడా వస్తారు’ అని శివపాల్ యాదవ్ తెలిపారు. పార్టీ నుంచి బయటకు వచ్చిన తనకు తన అన్న ములాయం సింగ్ యాదవ్ దీవెనలు ఉన్నాయని అయన చెప్పారు. ఆయన దీవెనలు ఉన్నా లేకపోయినా, ఆయన పార్టీలో పలువురు నాయకులు, కార్యకర్తలు చేరుతారనడంలో సందేహం లేదు. అందుకే అమిత్ షా, పార్టీలో చేరడానికి తన వద్దకు ప్రతిపాదన తీసుకొచ్చిన శివపాల్ యాదవ్‌కు ఏదో విధంగా నచ్చచెప్పి కొత్త పార్టీ ఏర్పాటుకు పురిగొల్పి ఉంటారు. -
బీజేపీ మిత్రపక్షం నుంచి అమర్ సింగ్‌కు ఆహ్వానం
వారణాసి : సమాజ్‌వాదీ పార్టీ బహిష్కృ నేత అమర్ సింగ్‌ను తమ పార్టీలో చేర్చుకునేందుకు సిద్దంగా ఉన్నట్టు బీజేపీ మిత్రపక్షం సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ(ఎస్బీఎస్పీ) తెలిపింది. ఆయనకు ఇష్టమైతే 2019 ఎన్నికల్లో తమ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేయవచ్చని పేర్కొంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ లక్నోలో పర్యటించిన సందర్భంగా అమర్ సింగ్‌కు అనుకూల వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అమర్ సింగ్ స్పందిస్తూ ప్రధాని మోదీ, సీఎం యోగి అదిత్యనాథ్‌లకే తాను ఒటేస్తానని చెప్పడంతో ఆయన బీజేపీలోకి వెళ్లేందుకు సిద్దంగా ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. తాజాగా ఎస్బీఎస్పీ కూడా అమర్ సింగ్‌ను తమ పార్టీలోకి ఆహ్వానం పలకడం చూస్తుంటే ఆయన 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే తరఫున బరిలో నిలువనున్నట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎస్బీఎస్పీ అధ్యక్షుడు ఓం ప్రకాశ్ రాజ్‌బార్ మంగళవారం వారణాసిలో మీడియాతో మాట్లాడుతూ.. అమర్ సింగ్ ఒక పెద్ద నాయకుడు. ఒకవేళ ఆయనకు ఇష్టమైతే 2019 లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున అజాంఘడ్ లోక్‌సభ స్థానం(పొత్తులో భాగంగా తమ పార్టీకి వస్తే) నుంచి పోటీ చేయవచ్చన్నారు. అమర్‌సింగ్ వస్తే తమ పార్టీలోకి ఆహ్వానిస్తామని తెలిపారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల పంపకంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం అజాంఘడ్ ఎంపీగా ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ ఉన్నారు. మోదీ, యోగిలకే నా మద్దతు: అమర్‌సింగ్ -
అఖిలేశ్‌కు అమర్‌సింగ్ ఝలక్!
న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), బహుజన సమాజ్(బీఎస్పీ) పార్టీలపై బహిష్కృత ఎస్పీ నేత, రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఎస్పీ, బీఎస్పీలు కుల రాజకీయాలు చేస్తున్నాయని, ఈ పార్టీలు రెండూ ఒకే నాణానికి చెరో వైపు అని వ్యాఖ్యానించారు. ఆదివారం లక్నోలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి అమర్‌సింగ్ హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో మోదీ.. ‘కొందరు బహిరంగంగా పారిశ్రామికవేత్తలను కలవరు. కానీ, తెరవెనుక ఉండి కుట్రలు చేస్తారు. అలా పారిశ్రామికవేత్తలతో తెర వెనుక మంతనాలు జరిపేవారెవరో (ఎస్పీ, బీఎస్పీలనుద్దేశించి) అమర్ సింగ్‌కు తెలుసు’ అని వ్యాఖ్యానించిన నేపథ్యంలో అమర్‌సింగ్ సోమవారం స్పందించారు. నిబద్దతో కూడిన రాజకీయాల్లో మీరెవరికి మద్దతిస్తారని నన్నడిగితే బబువా(పిల్లాడు), బువా(అత్త)లకు కాకుండా మోదీ, యోగి ఆదిత్యనాథ్లకే నా ఓటు అని చెప్తానని అమర్‌సింగ్ వ్యాఖ్యానించారు. అమర్‌సింగ్ తరచుగా అఖిలేశ్ యాదవ్‌ను బబువా అని, బీఎస్పీ అధినేత మాయవతిని బువా అని పిలవడం తెల్సిందే. బీజేపీలో చేరతారా? నరేంద్ర మోదీ నాయకత్వాన్ని అభిమానిస్తున్నట్టు చెప్పడం ద్వారా బీజేపీలో చేరాలన్న ఆకాంక్షను అమర్‌సింగ్ బహిరంగంగా వ్యక్తపరిచారు. అంతేకాదు తన జీవితం మోదీకి అంకితమని ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. కాగా, కాంగ్రెస్‌లో చేరేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆయన కమలం పార్టీలోకి రావాలని చూస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. -
‘తెరచాటు వ్యక్తుల’తో బాబు రహస్య భేటీ!
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ వ్యవహారంలో ఊహించిందే జరుగుతోంది. లక్షల మంది డిపాజిటర్ల ఆశలను అడియాసలు చేసే దిశగా తెర వెనుక పావులు కదులుతున్నాయి. స్వయంగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దల పర్యవేక్షణలోనే ఇది జరుగుతుండటం గమనార్హం. ప్రత్యేక హోదా సాధన పేరుతో ఇటీవల ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడ ఆ సంగతి పక్కనపెట్టి అగ్రిగోల్డ్ వ్యవహారాల్లో తీరికలేకుండా గడిపారు. సుభాష్‌చంద్ర ఫౌండేషన్ చైర్మన్ సుభాష్ చందర్జీ, ప్రముఖ రాజకీయ నేత అమర్ సింగ్‌లతో చంద్రబాబు తను బస చేసిన చోట రహస్యంగా సమావేశమై మంతనాలు జరిపారు. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా తాజాగా వెలుగు చూశాయి. అగ్రిగోల్డ్ ఆస్తులను ఎలా దక్కించుకోవాలన్న అంశంపై మంతనాలు సాగించినట్లు సమాచారం. వెనక్కి తగ్గింది అందుకే.. తాము అనుకున్న పథకాన్ని అమలు చేసేందుకు అమర్‌సింగ్, సుభాష్‌లతో చంద్రబాబు భేటీ తరువాత సుభాష్ చంద్ర ఫౌండేషన్ కొత్త డ్రామాకు తెరలేపింది. అగ్రిగోల్డ్, దాని అనుబంధ సంస్థలను టేకోవర్ చేస్తామంటూ హైకోర్టు సాక్షిగా చెప్పిన ఆ సంస్థ అందులో భాగంగానే అకస్మాత్తుగా వెనక్కి తగ్గింది. అగ్రిగోల్డ్ ఆస్తులకు, అది చెల్లించాల్సిన అప్పులకు పొంతనే లేదని, అగ్రిగోల్డ్ టేకోవర్ తమకు ఆర్థికంగా ఎంతమాత్రం లాభసాటి కాదంటూ చేతులెత్తేసింది. ఇదే సమయంలో డిపాజిటర్ల పేరు చెప్పి అమర్‌సింగ్‌ను తెరపైకి తెచ్చింది. అమర్‌సింగ్ స్వయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మాట్లాడుతున్నారని కోర్టుకే చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం–తమ ఫౌండేషన్ సంయుక్తంగా అగ్రిగోల్డ్ స్థిరాస్తులను అభివృద్ధి చేసేలా అమర్‌సింగ్ చర్చలు జరుపుతున్నారని కూడా తెలిపింది. ప్రభుత్వం నుంచి వచ్చే స్పందనను బట్టి అగ్రిగోల్డ్ గ్రూపులో పెట్టుబడులపై పునరాలోచన చేస్తామంది. సుభాష్‌చంద్ర ఫౌండేషన్ అమర్‌సింగ్ పేరును తెరపైకి తేవడంపై న్యాయమూర్తులు సైతం ఒకింత విస్మయానికి గురయ్యారు. కోర్టులో ఉన్న డిపాజిటర్లు ఖంగుతిన్నారు. ఈ పరిస్థితిని సరిగ్గా అంచనా వేసిన హైకోర్టు... తెర వెనుక వ్యక్తులతో సంబంధం లేదని తేల్చి చెప్పింది. ప్రభుత్వం వైపు నుంచి కొన్ని విషయాలను నిర్ధారించుకునేందుకు వివరణ కోరింది. -
గొప్పింటి కష్టాలు
మహిళా క్రికెటర్లు ఎప్పుడో ఆడి గెలిచిన ఆటకు ఇప్పుడాయన ట్వీట్ చేశారని ఉమెన్ ప్లేయర్స్ హర్ట్ అవడంతో అమితాబ్ ‘సారీ’ చెప్పాల్సి వచ్చింది. బచన్స్ ఫ్యామిలీకి గ్రహాలు ఫర్గా ఉన్నట్లు లేవు! శ్రీదేవి చనిపోడానికి కొన్ని గంటల ముందు అమితాబ్ బచన్ ట్విట్టర్లో తాత్వికంగా.. ‘ఏదో జరగబోతోందని నా మనసుకు అనిపిస్తోంది’అని చిన్న ట్వీట్ పడేయడం పెద్ద టాపిక్ అయింది! అదయ్యాక.. ‘కంగ్రాట్స్.. ఉమెన్ క్రికెట్ చాంపియన్స్’ అని ఆయన ట్వీట్ చెయ్యడం కూడా ఇష్యూ అయింది. మహిళా క్రికెటర్లు ఎప్పుడో ఆడి గెలిచిన ఆటకు ఇప్పుడాయన ట్వీట్ చేశారని ఉమెన్ ప్లేయర్స్ హర్ట్ అవడంతో అమితాబ్ ‘సారీ’ చెప్పాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆయన చుట్టూ డాక్టర్లు ఉన్నారు! షూటింగ్లో కాస్ట్యూమ్స్ బరువు ఎక్కువై ఆయనకు నెక్ పెయిన్, బ్యాక్‌పెయిన్ వచ్చి ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఇక ఇక్కడ పాలిటిక్స్‌లో ఆయన భార్య జయాబచన్ కూడా ఉత్తి పుణ్యానికి మాటలు పడాల్సి వస్తోంది! సమాజ్‌వాదీ పార్టీలోంచి బీజేపీలోకి వెళ్తూ వెళ్తూ నరేశ్ అగర్వాల్ అనే ఆయన.. ‘డాన్స్ చేసుకునేవాళ్లతో నాకెందుకు పోటీ’ అని కామెంట్ చేసి మరీ వెళ్లాడు! జయ కారణంగానే తనకు రాజ్యసభ టిక్కెట్ రాలేదని ఆయన ఉక్రోషం. ఆ కామెంట్‌కు జయ హర్ట్ అవలేదు. రియాక్ట్ అవలేదు. ఆ తర్వాత సేమ్పార్టీ లీడర్ అమర్‌సింగ్ జయను కామెంట్ చేశారు. ఆమెకు మాస్ ఫాలోయింగ్ లేదట. జనంలో కలవలేదట. హోప్లెస్ అట. జయ పలక పట్టుకున్న స్కూల్ పిల్లలా టైమ్‌కి రాజ్యసభకు వచ్చి, లాంగ్ బెల్ కొట్టగానే ఎక్కడా ఆగకుండా ఇంటికి వెళ్లిపోతుందట. ఆమె కంటే హేమమాలిని చాలా బెటర్ అట. ఈ మాటలకు కూడా జయ రియాక్ట్ కాలేదు. ఇక అభిషేక్, ఐశ్వర్యలు ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో లోకానికి తెలియడం లేదు. వాళ్లిద్దరి పెళ్లికి ముందు అమితాబ్ ఫ్యామిలీ పెద్ద హోమం చేసింది. అలాంటి హోమం ఏదైనా మళ్లీ జరిగితే తప్ప ఈ పెద్దింటి వారికి చిన్నచిన్న చికాకులు తప్పేలా లేవు. -
శ్రీదేవి చనిపోయాక బోనీ ఫస్ట్ ఫోన్‌కాల్
సాక్షి, న్యూఢిల్లీ : నటి శ్రీదేవి చనిపోయిన రోజు ఏం జరిగిందన్న పూర్తి విషయాలు తేలితే తప్ప ఈ కేసు ఓ కొలిక్కి వచ్చేలా కనిపించటం లేదు. ఈ పరిస్థితుల్లో బోనీ కపూర్‌ను విచారణ చేపట్టాలని దుబాయ్ ప్రాసిక్యూషన్ అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే కేవలం ఆయన కాల్ డేటాను పరిశీలించిన అధికారులు.. కాల్ లిస్ట్‌లో ఎక్కువ సార్లు ఎంపీ అమర్ సింగ్ నంబర్ ఉన్నట్లు గుర్తించారు. దీనిపై ఓ జాతీయ మీడియా అమర్ సింగ్‌ను ఆరా తీసేందుకు ప్రయత్నించింది. ‘అర్ధరాత్రి 12గం.40ని. సమయంలో బోనీ కపూర్ నాకు కాల్ చేశారు. సెల్‌ఫోన్ సైలెంట్ మోడ్‌లో ఉండటంతో నేను గుర్తించలేకపోయా. తర్వాత నా ల్యాండ్ నంబర్‌కు ఫోన్ చేశారు. ‘బాబీ ఇక లేదు’ అని గద్గద స్వరంతో ఆయన నాకు చెప్పారు. అయితే అది మాట్లాడే తరుణం కాదనుకుని ఫోన్ పెట్టేశాను. బహుశా ఆ వార్త బోనీ మొదట చెప్పింది నాకే అయి ఉండొచ్చని భావిస్తున్నా’ అని అమర్ సింగ్ పేర్కొన్నారు. ‘శ్రీదేవి-బోనీ కుటుంబంతో నాకు అవినాభావ సంబంధం ఉంది. ఇది నిజంగా ఎవరూ ఊహించని ఘటన. అంతా సంతోషంగా ఉన్న సమయంలో ఇలా జరిగింది. వారికి ఎలాంటి అప్పులు లేవు. ఆర్థికంగా వారి పరిస్థితి ఇప్పుడు బాగానే ఉంది’ అని అమర్ సింగ్ తెలిపారు. ఇక్కడో ఆసక్తికర విషయం ఏంటంటే... శ్రీదేవి చనిపోయే ముందు రోజు బోనీ కపూర్, అమర్‌సింగ్‌లు లక్నోలో ఇన్వెస్టర్ల సమ్మిట్‌కు హజరు అయ్యారు. అయితే అక్కడ అమర్ సింగ్‌కు అవమానం జరగటంతో ఆయన బహిష్కరించి ఢిల్లీకి వెళ్లిపోగా.. బోనీ శ్రీదేవి సర్ప్రైజ్ డిన్నర్ కోసం దుబాయ్ వెళ్లినట్లు ఆ కథనం ఉటంకించింది. ఇక ఇప్పటిదాకా కేవలం ఆయన కాల్ డేటాను పరిశీలించిన దుబాయ్ పోలీసులు అసలు బోనీ కపూర్‌ను విచారణే చేపట్టలేదని ఖలీజ్ టైమ్స్ కథనం ప్రచురించింది. ఆదివారం మృతదేహానికి పరీక్షలు నిర్వహించే సమయంలో కేవలం ఎలా జరిగింది అన్న వివరణ తీసుకుని బోనీని హోటల్‌కు పంపించేశారంట. కేసు ప్రాసిక్యూషన్ విభాగానికి అప్పజెప్పిన నేపథ్యంలో నేడు ఇంటరాగేషన్ కోసం బూర్ దుబాయ్ పోలీస్ స్టేషన్‌కు రావాల్సిందిగా బోనీని కోరినట్లు సమాచారం. శ్రీదేవికి మద్యం అలవాటు లేదు -
‘శ్రీదేవికి మద్యం సేవించే అలవాటు లేదు’
న్యూఢిల్లీ : ప్రముఖ సినీనటి శ్రీదేవి మృతిపై రాజ్యసభ ఎంపీ అమర్ సింగ్ అనుమానం వ్యక్తం చేశారు. శ్రీదేవికి మద్యం సేవించే అలవాటు లేదని ఆయన తెలిపారు. అయితే కొన్ని సందర్భాల్లో ఆమె వైన్ మాత్రం తీసుకునేవారని అమర్ సింగ్ పేర్కొన్నారు. అలాంటప్పుడు శ్రీదేవి రక్త నమునాల్లో మద్యం అవశేషాలు ఎలా ఉంటాయని ఆయన ప్రశ్నించారు. ఆమె మృతిపై లోతైన విచారణ చేపట్టాలన్నారు. శ్రీదేవి మృతి ఘటనపై అబుదాబి యువరాజు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో తాను మాట్లాడినట్లు అమర్ సింగ్ తెలిపారు. అన్ని ఫార్మాలిటీలు పూర్తి చేసి, శ్రీదేవి మృతదేహాన్ని భారత్‌కు పంపిస్తామని హామీ ఇచ్చారన్నారు. ఆమె భౌతికకాయం సోమవారం రాత్రికి ముంబై చేరే అవకాశం ఉన్నట్లు అమర్ సింగ్ పేర్కొన్నారు. కాగా శ్రీదేవీ మృతిపై వస్తున్న అనుమానాలను నివృత్తి చేస్తూ యూఏఈ ఆరోగ్యశాఖ సోమవారం ఫోరెన్సిక్ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలో ప్రమాదవశాత్తు ఆమె కాలు జారి నీటి టబ్‌లో పడిపోవడం వల్లే మృతి చెందినట్టు పేర్కొంది. అయితే శ్రీదేవి శరీరంలో ఆల్కహాల్‌ను గుర్తించినట్టు యూఏఈ రిపోర్టు పేర్కొది. అయితే ఆమెకు గుండెపోటు వచ్చిందనే విషయాన్ని ఫోరెన్సిక్ నివేదికలో ప్రస్తావించలేదు. మరోవైపు శ్రీదేవి భర్త బోనీకపూర్‌ను దుబాయ్ పోలీసులు సుమారు మూడున్నర గంటల పాటు ప్రశ్నించారు. ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేశారు. కాగా ఈ కేసు విచారణను పోలీసులు...దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు బదిలీ చేశారు. -
అమర్‌సింగ్ నోట అగ్రిగోల్డ్ మాట!
విజయవాడ: అగ్రిగోల్డ్ బాధితులు అందరికీ న్యాయం చేస్తామని సమాజ్‌వాదీ పార్టీ ముఖ్య నేత, రాజ్యసభ ఎంపీ అమర్ సింగ్ తెలిపారు. కోర్టు ఆదేశాల ప్రకారం డిపాజిటర్లకు డబ్బులు చెల్లిస్తామని చెప్పారు. శనివారం విజయవాడ విచ్చేసిన ఆయన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ... అగ్రిగోల్డ్ బాధితులకు మేలు జరగాలని అమ్మవారిని వేడుకున్నట్టు వెల్లడించారు. పార్టీలకు అతీతంగా సమస్య పరిష్కారానికి అందరూ కృషి చేయాలని ఆయన అభిలషించారు. సోదరుడు సుభాష్ చంద్ర తన ఫౌండేషన్ ద్వారా అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావడం శుభ పరిణామమని పేర్కొన్నారు. లాభాపేక్షతో ఈ కార్యక్రమం చేపట్టలేదని, ప్రజల ఇబ్బందులు తీర్చటానికే ముందుకు వచ్చామని ఆయన స్పష్టం చేశారు. లక్షలాది ప్రజలకు సంబంధించిన అగ్రిగోల్డ్ సమస్య పరిష్కారానికి సీఎం చంద్రబాబుతో కలిసి కృషి చేస్తున్నామని తెలిపారు. సమస్య పరిష్కారానికి చంద్రబాబు, డీజీపీ సాంబశివరావు, కుటుంబరావు తదితర అధికారులు అందిస్తోన్న సహకారం మరువలేనిదన్నారు. ఏపీ అభివృద్ధికి తమ వంతు సాయం అందిస్తామని హామీయిచ్చారు. రాజకీయాలు మాట్లాడటానికి దేవాలయం వేదిక కాదని, మరోసారి వచ్చినపుడు రాజకీయాల గురించి మాట్లాడతానని అమర్‌సింగ్ అన్నారు. -
‘రాజకీయ వేశ్యలా వాడుకున్నారు’
సాక్షి, న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ మాజీ అధినేత ములాయం సింగ్ తనను ఒక రాజకీయ వేశ్యలా వాడుకునేందుకు ప్రయత్నించారంటూ.. అమర్ సింగ్ సంచలన ఆరోపణ చేశారు. చాలాకాలంగా క్రియాశీల రాజకీయాలకు, మీడియాకు దూరంగా ఉంటున్న అమర్‌సింగ్ తాజాగా ములాయంపై నిప్పులు చెరిగారు. కుటుంబంలో చిచ్చు రేగి అఖిలేశ్ యాదవ్ పార్టీ పగ్గాలు అందుకున్న సమయంలో ములాయం, రామ్‌గోపాల్ యాదవ్ ఎవరికీ తెలియకుండా నన్ను కలిసేందుకు ప్రయత్నించారని అమర్‌సింగ్ వెల్లడించారు. ఒకదశలో అఖిలేశ్‌కు భయపడిన ములాయం, రామ్‌గోపాల్ యాదవ్‌లు రాత్రి సమయంలో దొడ్డిదారిగుండా.. వచ్చి కలుస్తామని చెప్పారన్నారు. అంతేకాక తమ మధ్య జరిగే సమావేశాన్ని అత్యంత గోప్యంగా ఉంచాలని వారు కోరినట్లు అమర్‌సింగ్ తెలిపారు. ములాయంతో ఉంటే ఎటువంటి రాజకీయ భవిష్యత్ ఉండదని.. ఆయనకు అత్యంత సన్నిహితుడైన ఒక వ్యక్తి మంగళవారం తన వద్ద వాపోయారని చెప్పారు. ఇదిలా ఉండగా.. తాను ప్రస్తుతం సమాజ్‌వాదీ పార్టీలోనే కొనసాగుతున్నాని అమర్ సింగ్ ప్రకటించారు. అయితే పార్టీలో ఎటువంటి పాత్ర పోషించడం లేదని చెప్పారు. -
‘అఖిలేశ్‌తో అంతా గూండాలే.. పార్టీ బతకాలంటే..’
న్యూఢిల్లీ: కుటుంబ రాజకీయాలు పక్కకు పెట్టి నాయకత్వంపై సమాజ్‌వాది పార్టీ దృష్టిసారిస్తే బావుంటుందని సమాజ్‌వాది పార్టీ బహిష్కృత నేత అమర్ సింగ్ అన్నారు. నాయకత్వాన్ని ఎంచుకునే విషయంలో కుటుంబం వెలుపల నుంచి ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు. సమాజ్‌వాది పార్టీకి ములాయం సింగ్ యాదవ్ ఆత్మ అని ఆ విషయాన్ని అఖిలేశ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని విమర్శించారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ చేతిలో ఎస్పీ కాంగ్రెస్ కూటమి చావు దెబ్బతిన్న నేపథ్యంలో ఆదివారం అమర్ సింగ్ మీడియాతో మాట్లాడారు. బీజేపీలోగానీ, వామపక్ష పార్టీలో వారసత్వ రాజకీయాలకు అవకాశం ఉండదని వాజపేయి, అద్వానీలాంటి నేతలు అలాగే వచ్చారని గుర్తు చేశారు. ఎస్పీ బతకాలంటే నాయకత్వాన్ని వారసత్వం వెలుపలి నుంచి వెతికి చూడాల్సిందేనని అన్నారు. ‘ఎస్పీ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఎంతోమంది ఎస్పీ నేతలు పార్టీని వదిలి బీఎస్పీలో చేరారు. ఎస్పీ ప్రధాన ఆత్మ ములాయంగారు. కాంగ్రెస్ పార్టీ ఆ విషయాన్ని గుర్తించడంలో ప్రజల్లోకి ఆయన సెంటిమెంట్ తీసుకెళ్లడంలో విఫలమైంది. అఖిలేశ్‌తో ఉన్నవాళ్లంతా రౌడీలు, దందాలు చేసేవాళ్లు. చూద్దాం పార్టీ భవిష్యత్ ఏమవుతుందో’ అని అమర్ సింగ్ అన్నారు. -
పెళ్లిపెద్దపై నిప్పులు చెరిగిన డింపుల్ యాదవ్
తనకు అఖిలేష్ యాదవ్‌తో దగ్గరుండి పెళ్లి చేయించిన పెళ్లిపెద్ద అమర్‌సింగ్ మీద సీఎం భార్య డింపుల్ యాదవ్ నిప్పులు చెరిగారు. అలాంటి మనుషుల మాటలను తాను లెక్కచేసేది లేదని స్పష్టం చేశారు. కనీసం తన పిల్లలను టీవీలో కూడా అమర్ సింగ్ ముఖం చూడనిచ్చేది లేదని తెగేసి చెప్పారు. ఈసారి ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ గెలుస్తుందని తాను ఒకసారి ములాయం సింగ్ యాదవ్‌కు చెప్పినట్లు అమర్ సింగ్ అన్న విషయాన్ని ప్రస్తావించగా, అలాంటి మనుషులను తాను పట్టించుకోనని, టీవీలో ఆయన ముఖం వస్తే వెంటనే టీవీ కట్టేస్తానని, తన పిల్లలకు కూడా ఆయన ముకం టీవీలో చూపించబోనని డింపుల్ అన్నారు. అఖిలేష్ యాదవ్‌కు, ఆయన తండ్రి ములాయంకు మధ్య తగాదాలకు అమర్ సింగే ప్రధాన కారణమన్న వాదన ఒకటి ఉంది. అమర్‌ను మళ్లీ పార్టీలోకి తీసుకోవడాన్ని అఖిలేష్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాతే పార్టీలో ముసలం మొదలైంది. మైనర్‌పై సామూహిక అత్యాచారం చేశారన్న ఆరోపణలున్న గాయత్రీ ప్రజాపతిని కాపాడేందుకు సమాజ్‌వాదీ పార్టీ ప్రయత్నిస్తున్న విషయాన్ని ఆమెను అడగ్గా.. అది వాస్తవం కాదని, తాము చట్టాన్ని గౌరవిస్తామని, నేరం చేసినవాళ్లు ఎవరైనా జైలుకు వెళ్లాల్సిందేనని అన్నారు. ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. -
అదంతా ములాయం నాటకం: అమర్‌సింగ్
-
అదంతా ములాయం నాటకం: అమర్‌సింగ్
న్యూఢిల్లీ: యావద్దేశంలో ఆసక్తి రేకెత్తించిన సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) కుటుంబ కలహమంతా నాటకమేనా? పార్టీ సమావేశాల్లో మైకు లాక్కోవడం, ఆగ్రహావేశాలు.. తర్వాత కన్నీళ్లు, ఆలింగనాలతోసద్దుమణిగిన యాదవ పరి‘వార్’ అంతా తూచ్ వ్యవహారమేనా? అవుననే అంటున్నారు ఈ గొడవలకు కారకునిగా ఆరోపణలు ఎదుర్కొన్న పార్టీ సీనియర్ నేత, ములాయంకు అత్యంత సన్నిహితుడూ అయిన అమర్‌సింగ్. ఎస్పీ అంతర్గత వివాదమంతా ములాయం సింగ్ యాదవ్ పథకం ప్రకారం ఆడించిన నాటకమేనని, కొడుకు అఖిలేశ్‌కు లబ్ధి చేకూర్చేందుకు ఈ పని చేశారని అమర్ బాంబు పేల్చారు. ‘ములాయం, అఖిలేశ్ ఒక్కటిగానే ఉన్నారు, ఉంటారు’ అని అని సీఎన్ ఎన్–న్యూస్ 18కు ఇచ్చిన ఇంటర్వూ్యలో చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... ‘కొడుకు చేతిలో ఓడిపోవాలని ములాయం కోరిక. సైకిల్ (పార్టీ గుర్తు), కొడుకు, ఎస్పీ ఆయన బలహీనతలు. మరైతే ఎందుకీ నాటకం? ఇదంతా పథకం ప్రకారం ఆడించిన డ్రామా. మా అందరికీ పాత్రలు దక్కాయి. మమ్మల్ని వాడుకుంటున్నట్లు తర్వాత తేలింది.. ఎస్పీతో ఉన్న అనుబంధం నా బహిష్కరణతో(పార్టీ నుంచి) తెగిపోయింది.. ఇదంతా ప్రభుత్వ వ్యతిరేకత, శాంతిభద్రతల సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి పన్నిన ప్రణాళిక అని తెలుసుకున్నా.. దీనికి మాస్టర్ స్క్రిప్ట్ రైటర్ ములాయం. కాంగ్రెస్‌తో పొత్తు ములాయంకు ఇష్టం లేకపోతే ఆయన ప్రియాంక గాంధీతో అంతసేపు ఎందుకు సమావేశం అయ్యారు?’ అని పేర్కొన్నారు. -
ములాయంపై అమర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
లక్నో: సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్‌పై అమర్‌సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. సమాజ్‌వాది పార్టీ సంక్షోభం అంతా కూడా ములాయం సింగ్ ఆడిన ఓ డ్రామా అని వ్యాఖ్యానించారు. కొడుకు అఖిలేశ్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకే ఆ డ్రామా అడారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ, సమాజ్‌వాది పార్టీ పొత్తుకు కారణం ములాయం సింగే అని కూడా ఆయన ఆరోపించారు. అంతేకాదు, ములాయం సింగ్ పెద్ద స్క్రిప్ట్ రైటర్ కూడా అంటూ చతుర్లు విసిరారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు సరిగ్గా నెలరోజుల ముందు సమాజ్‌వాది పార్టీలో సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో తాను అసలు పదవినే ఆశించనని, పోటీ కూడా చేయననే ములాయం తనకు గుండెలాంటివాడని ఆయన ఏం చెబితే అది చేస్తానంటూ చెప్పిన అమర్ సింగ్ ఎన్నికలు జరుగుతున్న వేళ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
నా కొడుకుపై అంత కోపాన్ని చూపగలనా!?
దాదాపు నెలరోజులపాటు జరిగిన కుటుంబ ఆధిపత్యపోరులో నెగ్గి పార్టీపై పూర్తి పట్టు సాధించిన యూపీ సీఎం, ఎస్పీ జాతీయ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ స్వరం మార్చారు. అందరూ తనవారేనంటూ దగ్గరికి తీసుకుంటున్నారు. ఒకప్పుడు బద్ధ శత్రువుగా పరిగణించిన అమర్‌సింగ్‌ను ఉద్దేశించి సైతం 'అంకుల్' అంటూ ఆప్యాయంగా మాట్లాడారు. ఓ హిందీ చానెల్ నిర్వహించిన సదస్సులో మాట్లాడిన అఖిలేశ్ తన వర్గం, కుటుంబం అంతా ఒక్కటే అన్న సంకేతం ఇవ్వడానికి ప్రయత్నించారు. తండ్రి ములాయం సింగ్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ 'ఆయన సమాజ్‌వాదీ (సోషలిస్ట్). ఇంట్లో, బయటా ఒకేవిధంగా కోపాన్ని వ్యక్తం చేస్తారు' అని అన్నారు. కుటుంబ వివాదంలో తనకు కలిగిన భావోద్వేగాలను వ్యక్తంచేస్తూ.. 'నా కొడుకుపై నేనెప్పుడైనా ఈవిధంగా కోప్పడగలనా? అని అనుకున్నాను' అని పేర్కొన్నారు. ములాయం పలుసందర్భాల్లో బాహాటంగానే అఖిలేశ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. బహిరంగంగా అఖిలేశ్ పాలనను ఆయన విమర్శించారు కూడా. ఇక, తనను ఎస్పీ నుంచి గెంటేశారని అమర్‌సింగ్ ఒకవైపు ఆవేదన చెందుతుండగా.. ఆయన మంచి వ్యక్తి అని, తమ కుటుంబాన్ని ఎంతోగానో ప్రేమిస్తారని అఖిలేశ్ సాంత్వనపూరిత వ్యాఖ్యలు చేశారు. -
‘అమితాబ్, జయ వేర్వేరుగా ఉంటున్నారు’
ముంబై: సమాజ్ వాదీ పార్టీలో పరివార్ సంక్షోభానికి కారణమయ్యారని ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ మరో బాంబు పేల్చారు. బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్, ఆయన భార్య జయాబచ్చన్ మధ్య విభేదాలు ఏర్పడ్డాయని వెల్లడించారు. అంతేకాదు వారిద్దరూ వేర్వేరుగా నివసిస్తున్నారని తెలిపారు. అత్తాకోడళ్లు జయాబచ్చన్, ఐశ్వర్యరాయ్ కు పడడంలేదని అమర్ సింగ్ చెప్పినట్టు ‘ఏబీపీ మజ్హా’ వార్తా సంస్థ పేర్కొంది. ప్రతి విషయంలో గొడవలకు తానే కారణం అన్నట్టుగా మీడియా చూపుతుందని ఆయన వాపోతూ... ‘నేను అమితాబ్, జయబచ్చన్ లను కలిసే నాటికి వారిద్దరూ విడివిడిగా ఉంటున్నారు. ఒకరు ప్రతీక్షలో ఉంటే, మరొకరు జానక్ లో నివసిస్తున్నారు. జయ, ఐశ్వర్యరాయ్ మధ్య కూడా విభేదాలు వచ్చినట్టు ఊహాగానాలు వచ్చాయి. దీనికి నేను బాద్యుడిని కాద’ని అన్నారు. సమాజ్ వాదీ పార్టీలో చేరొద్దని జయను అమితాబ్ హెచ్చరించారని గతంలో అమర్ సింగ్ చెప్పారు. మొదట్లో అమర్ సింగ్ తో సన్నిహితంగా మెలగిన అమితాబ్ తర్వాత ఆయనను దూరం పెట్టారు. అమర్ సింగ్ వ్యాఖ్యలపై బచ్చన్ కుటుంబం ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి. -
'ప్రాణాలతో వెళ్లవని బెదిరించాడు'
న్యూఢిల్లీ: అఖిలేశ్‌పై తాను చేసిన ప్రశంసలు తేనెపూసిన మాటలు కావని బహిష్కృత నేత అమర్‌సింగ్ అన్నారు. సమాజ్‌వాదీ పార్టీలో పునరాగమనం కోసం తాను అఖిలేశ్‌ను పొగడ లేదని చెప్పారు. సైకిల్ గుర్తును ఎన్నికల కమిషన్(ఈసీ) అఖిలేశ్‌కు కేటాయిస్తూ చేసిన ప్రకటన అనంతరం అమర్‌సింగ్ అఖిలేశ్‌పై ప్రశంసల జల్లు కురిపించిన విషయం తెలిసిందే. పార్టీలో ముసలానికి కారణం అఖిలేశేనని అమర్‌సింగ్ గతంలో విమర్శించారు. పార్టీ నుంచి బహిష్కరణకు గురికావడం బాధను కలిగించిందని ఆయన చెప్పారు. బహిష్కరణకు గురైన తర్వాతి నుంచి రామ్‌గోపాల్ యాదవ్ తనను ఓడిపోయిన పోట్లగిత్తలా చూస్తున్నారని అన్నారు. అంతేకాకుండా తనను చంపేస్తానని పలు మార్లు రామ్‌గోపాల్ యాదవ్ బెదిరించినట్లు చెప్పారు. ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాణాలతో వెళ్లలేవని రామ్‌గోపాల్ యాదవ్ అన్నట్లు తెలిపారు. రాజ్యసభ ఎంపీ అయిన అమర్‌సింగ్‌కు ఈ మధ్య కాలంలోనే భద్రతను జెడ్ కేటగిరీకి పెంచారు. కేంద్ర రక్షణా సంస్ధల ఆదేశాల మేరకే అమర్‌సింగ్‌కు భద్రతను పెంచినట్లు ఓ అధికారి తెలిపారు.