చండీగఢ్: హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి ఎదురుదెబ్బ తగిలింది. నీలోఖేరి (రిజర్వ్‌డ్) స్థానం నుంచి పోటీలోకి దిగిన ఆప్ అభ్యర్థి అమర్ సింగ్ ఉన్నట్టుండి కాంగ్రెస్‌లో చేరారు. పంజాబ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ప్రతాప్ సింగ్ బజ్వా సమక్షంలో అమర్ సింగ్ కాంగ్రెస్‌లో చేరారు.
ఈ సందర్భంగా అమర్‌సింగ్‌ను కాంగ్రెస్‌లోకి స్వాగతిస్తున్నట్లు భాజ్వా ప్రకటించారు. ఎలాంటి షరతులు లేకుండా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం అమర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ మాత్రమే ఓడించగలదని, రాష్ట్రంలోని రైతులు, మహిళలు, దళితులు, మైనార్టీలకు బీజేపీ అన్యాయం చేస్తోందన్నారు. బీజేపీని ఓడించేందుకే తాను కాంగ్రెస్‌లో చేరానని పేర్కొన్నారు. నీలోఖేరి కాంగ్రెస్ అభ్యర్థి ధరంపాల్ గొండర్‌కు మద్దతు ప్రకటించానని, ఆయన తరపున ప్రచారం చేస్తానని తెలిపారు. హర్యానాలో కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ప్రత్యక్ష పోటీ ఉందని అన్నారు.
బీజేపీ ప్రభుత్వాన్ని అధికారం నుండి తొలగించడమే తన లక్ష్యమని, తాను తన అభ్యర్థిత్వాన్ని కొనసాగిస్తే, ఓట్ల విభజన జరిగి, బీజేపీకి ప్రయోజనం చేకూరుతుందున్నారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకే కాంగ్రెస్‌లో చేరానని అమర్ సింగ్ పేర్కొన్నారు. కాగా ఫరీదాబాద్ ఆప్ అభ్యర్థి ప్రవేశ్ మెహతా సెప్టెంబర్ 28న బీజేపీలో చేరారు. అక్టోబర్ 5న హర్యానాలో ఓటింగ్ జరగనుండగా, అక్టోబర్ 8న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
ఇది కూడా చదవండి: డ్రోన్ల కలకలం.. ఆగిన మెట్రో రైళ్లు
Comments
Please login to add a commentAdd a comment