ములాయంపై అమర్‌ సింగ్‌ సంచలన వ్యాఖ్యలు | mulayam singh is a big script writer: amar singh | Sakshi
Sakshi News home page

ములాయంపై అమర్‌ సింగ్‌ సంచలన వ్యాఖ్యలు

Published Tue, Feb 21 2017 5:37 PM | Last Updated on Sat, Aug 25 2018 4:30 PM

ములాయంపై అమర్‌ సింగ్‌ సంచలన వ్యాఖ్యలు - Sakshi

ములాయంపై అమర్‌ సింగ్‌ సంచలన వ్యాఖ్యలు

లక్నో: సమాజ్‌ వాది పార్టీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌పై అమర్‌సింగ్‌ సంచలన ఆరోపణలు చేశారు. సమాజ్‌వాది పార్టీ సంక్షోభం అంతా కూడా ములాయం సింగ్‌ ఆడిన ఓ డ్రామా అని వ్యాఖ్యానించారు. కొడుకు అఖిలేశ్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకే ఆ డ్రామా అడారని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ, సమాజ్‌వాది పార్టీ పొత్తుకు కారణం ములాయం సింగే అని కూడా ఆయన ఆరోపించారు.

అంతేకాదు, ములాయం సింగ్‌ పెద్ద స్క్రిప్ట్‌ రైటర్‌ కూడా అంటూ చతుర్లు విసిరారు. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలకు సరిగ్గా నెలరోజుల ముందు సమాజ్‌వాది పార్టీలో సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో తాను అసలు పదవినే ఆశించనని, పోటీ కూడా చేయననే ములాయం తనకు గుండెలాంటివాడని ఆయన ఏం చెబితే అది చేస్తానంటూ చెప్పిన అమర్‌ సింగ్‌ ఎన్నికలు జరుగుతున్న వేళ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement