ఒకే వేదికపై ములాయం, అమర్ సింగ్!
లక్నో: ఎంతో సన్నిహితంగా ఉండి బద్దశత్రువులుగా మారిని ఇద్దరు రాజకీయ నేతలు మళ్లీ ఒకే వేదికపై కనిపించనున్నారు. ఒకప్పుడు సమాజ్ వాదీ పార్టీలో కీలక నేతగా వ్యవహరించిన అమర్ సింగ్, పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ లు మంగళవారం ఓకే సభ పాల్గొననున్నారు.
లక్నోలో నిర్వహించే జననేశ్వర్ మిశ్రా పార్క్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని ములాయం స్వయంగా ఆహ్వానించారని రాష్ట్రీయ లోకదళ్ ఎంపీ అమర్ సింగ్ తెలిపారు. ములాయం ఆహ్వానాన్ని స్వీకరించి రేపు కార్యక్రమానికి హాజరవుతున్నాని అమర్ సింగ్ తెలిపారు. అయితే సమాజ్ వాదీ పార్టీలో చేరేది మాత్రం లేదని ఓ ప్రశ్నకు అమర్ సింగ్ సమాధానమిచ్చారు.