అమర్ సింగ్ ఆస్తి వంద కోట్లు!! | Amar Singh, wife assets worth about Rs 100 crores | Sakshi
Sakshi News home page

అమర్ సింగ్ ఆస్తి వంద కోట్లు!!

Published Fri, Apr 11 2014 4:08 PM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM

అమర్ సింగ్ ఆస్తి వంద కోట్లు!! - Sakshi

అమర్ సింగ్ ఆస్తి వంద కోట్లు!!

అమర్ సింగ్.. వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండే ఈయన ఆస్తి ఎంతో తెలుసా? అచ్చంగా వంద కోట్లు!! ఫతేపూర్ సిక్రీ స్థానం నుంచి రాష్ట్రీయ లోక్దళ్ తరఫున లోక్సభకు పోటీ చేస్తున్న అమర్సింగ్.. తనకు, తన భార్యకు కలిపి వంద కోట్ల ఆస్తి ఉందని ప్రకటించారు. బ్యాంకు డిపాజిట్లు, షేర్లలో పెట్టుబడి, మ్యూచువల్ పండ్లు, బీమా పాలసీలు కలిపి రూ. 41.34 కోట్ల చరాస్తులు ఉన్నాయన్నారు.

ఓ భాగస్వామ్య సంస్థలో రూ. 12.23 కోట్ల పెట్టుబడి, లెక్సస్, మారుతి స్విఫ్ట్ కార్లు, 8.68 లక్షల విలువైన బంగారం, 28 కిలోల వెండి పాత్రలు ఉన్నాయి. ఇంకా ఫర్నిచర్, వాచీలు, పెయింటింగులు.. వీటన్నింటి విలువ రూ. 64.40 లక్షలు. ఆయన భార్యకు రూ. 21.95 కోట్ల చరాస్తులున్నాయి. తనకు చేతిలో పది లక్షల నగదు, తన భార్యకు ఐదు లక్షల నగదు ఉన్నట్లు అమర్ సింగ్ ప్రకటించారు. ఆయనకు బెంగళూరు, నోయిడా, లక్నో లాంటి ప్రాంతాల్లో ఇళ్లు, భూములు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement