'40 ఏళ్ల మహిళను దిగ్విజయ్ పెళ్లాడితే తప్పేంటి?'
న్యూఢిల్లీ: 40 ఏళ్ల మహిళను 68 ఏళ్ల వ్యక్తి పెళ్లాడితే తప్పేంటని ఆర్ఎల్డీ నేత అమర్ సింగ్ ప్రశ్నించారు. రాజకీయనేతల వ్యక్తిగత విషయాలను రాజకీయం చేయవద్దని అమర్ సింగ్ అభిప్రాయపడ్డారు.
రాజకీయనేతల వ్యక్తిగత జీవితాలపై బహిరంగ చర్చ పెట్టకూడదని దిగ్విజయ్ సింగ్, టీవీ జర్నలిస్ట్ అమృతారాయ్ వివాహ వార్తపై ఆయన స్పందించారు.
నరేంద్రమోడీ, దిగ్విజయ్ సింగ్ ల వైవాహిక జీవితాలపై ప్రజావేదికల మీద చర్చ పెట్టడం సమంజసం కాదని అమర్ సింగ్ అన్నారు. దేశంలో నరేంద్రమోడీ హవాలేదని అమర్ ఓప్రశ్నకు సమాధానమిచ్చారు.
సమాజ్ వాదీ నుంచి బయటకు వచ్చిన తర్వాత రాష్ట్రీయ లోకసభ అభ్యర్తిగా ఫతేపూర్ సిక్రీ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు.