ఆర్ఎల్డీలో చేరిన నటి జయప్రద | Jayapradha & Amar Singh join RLD, contest from bijnur | Sakshi
Sakshi News home page

ఆర్ఎల్డీలో చేరిన నటి జయప్రద

Published Mon, Mar 10 2014 2:57 PM | Last Updated on Sat, Sep 2 2017 4:33 AM

ఆర్ఎల్డీలో చేరిన నటి జయప్రద

ఆర్ఎల్డీలో చేరిన నటి జయప్రద

సినీనటి, ఎంపీ జయప్రద ఆర్ఎల్డీ పార్టీలో చేరారు. సమాజ్వాదీ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన సీనియర్ నాయకుడు అమర్ సింగ్తో కలిసి సోమవారం రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ అధ్యక్షుడు అజిత్ సింగ్ సమక్షంలో ఆపార్టీ తీర్థం పుచ్చుకున్నారు.  కాగా  ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బిజ్నూర్ నుంచి ఆర్ఎల్డీ తరఫున ఎంపీ పదవికి జయప్రద పోటీ చేయనున్నారు. ఇప్పటికే ఆర్ఎల్డీ - కాంగ్రెస్ మధ్య ఎన్నికల పొత్తు ఉన్నందున తనను తాను కాంగ్రెస్ సభ్యురాలిగా కూడా భావిస్తున్నట్లు ఈ సందర్భంగా జయప్రద వ్యాఖ్యానించారు.

అయితే, ఈసారి జయప్రద మళ్లీ టీడీపీలో చేరుతారని, రాష్ట్రం నుంచే పోటీ చేస్తారని కూడా గతంలో కొన్ని కథనాలు వినిపించాయి. దానికి తగ్గట్లే తిరుపతి వచ్చినప్పుడు, ఇతర సందర్భాల్లోను జయప్రద కూడా మళ్లీ సొంత రాష్ట్రానికి తిరిగి వస్తానన్న సూచనలిచ్చారు. మళ్లీ ఇప్పుడు కేంద్ర మంత్రి అజిత్సింగ్ నేతృత్వంలోని ఆర్ఎల్డీలో చేరి ఉత్తరప్రదేశ్ నుంచే బరిలోకి దిగడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement