
అసలు కారకుడు అమర్ ఏమన్నారంటే..
లక్నో: సమాజ్‌వాదీ పార్టీలో చెలరేగిన కల్లోలానికి అసలు కారకుడంటూ అఖిలేశ్ వర్గం నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అమర్ సింగ్ మొత్తం వ్యవహారంపై ఆచితూచి స్పందించారు. 'చీకటి చిక్కగా ఉంటేనే పొద్దు రసవత్తరంగా ఉంటుందంటూ' పార్టీ ఎదుర్కొన్న తీవ్ర సంక్షోభం గురించి కవిత వినిపించారు. అఖిలేశ్ యాదవ్‌ను సస్పెండ్ చేస్తూ ములాయం నిర్ణయాన్ని ప్రకటించిన నిమిషం(శుక్రవారం సాయంత్రం) నుంచి ఎవ్వరికీ కనిపించకుండా తిరిగిన అమర్‌సింగ్.. శనివారం మధ్యాహ్నం మీడియా ముందుకు వచ్చారు. పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలు దురదృష్టకరమైనవని వ్యాఖ్యానించిన ఆయన.. కార్యకర్తలంతా నేతాజీ(ములాయం) వెన్నంటి ఉండాలని పిలుపునిచ్చారు. చివరికి కథ సుఖాంతం కావడాన్ని స్వాగతించారు.
'ములాయం మరోసారి రాజకీయ పరిపక్వతను ప్రదర్శించారు. పార్టీగానీ, కుటుంబంగానీ ఎట్టి పరిస్థితుల్లో చీలిపోకుండా కాపాడుకుంటానన్న ప్రతిజ్ఞను నూటికినూరుశాతం నిలబెట్టుకున్నారు. నిజమే, చీకటి ఎంత చిక్కగా ఉంటే, తొలిపొద్దు అంత రంజకంగా ఉంటుంది' అని అమర్ సింగ్ చమత్కరించారు. (చదవండి: ములాయం అమర ప్రేమ రహస్యం) అఖిలేశ్, రాంగోపాల్ లపై ములాయం శుక్రవారం విధించిన బహిష్కరణను శనివారం ఉదయానికి ఎత్తేయడంతో పరి'వార్' కాస్తా టీ కప్పులో తుఫానుగా ముగిసింది.
ఎస్పీ పరిణామాలపై సమగ్ర కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
1. ములాయం ఎపిసోడ్ అంతా నాటకమేనా!
2. ములాయం-అఖిలేష్ వివాదంలో మరో ట్విస్ట్
3. ఎస్పీ సంక్షోభం.. చిచ్చురేపింది చిన్న కోడలేనా?
4. అఖిలేశ్ నివాసం వద్ద హైడ్రామా!
5. నాన్నకు ప్రేమతో.. అఖిలేశ్ ఉద్వేగ ప్రసంగం!