
న్యూఢిల్లీ: రక్షణ శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం(స్టాండింగ్ కమిటీ) సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం నామినేట్ అయ్యారు. కాంగ్రెస్ మరో ఎంపీ అమర్‌సింగ్ కూడా ఇదే కమిటీకి నామినేట్ అయ్యారు. ఈ మేరకు లోక్‌సభ ఒక బులెటిన్ విడుదల చేసింది.
పరువు నష్టం కేసులో అనర్హత వేటు పడకముందు రాహుల్ గాంధీ రక్షణ శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘంలో సభ్యుడిగా వ్యవహరించారు. ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని ఆగస్టు 7న పునరుద్ధరించిన సంగతి తెలిసిందే. ఎన్సీపీ ఎంపీ ఫైజల్ పి.పి.మొహమ్మద్ లోక్‌సభ సభ్యతాన్ని కూడా పునరుద్ధరించారు. ఆయనను వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ స్టాండింగ్ కమిటీకి నామినేట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment