
లక్నో : సమాజ్‌వాదీ పార్టీ మాజీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు అమర్‌సింగ్ (64) మృతిచెందారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. శనివారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందుతూ కన్నుమూశారు. 2013 నుంచి కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. కొన్ని నెలల పాటు సింగపూర్‌లో వైద్య చికిత్స సైతం తీసుకున్నారు. అనంతరం ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 1956 జనవరి 27 ఉత్తరప్రదేశ్‌లోని అజమ్‌ఘర్‌లో జన్మించిన అమర్‌సింగ్.. 1996లో తొలిసారి రాజ్యసభకు ఎన్నికైయ్యారు. 2016లో చివరి సారిగా పెద్దల సభకు ఎస్పీ నుంచి నామినేట్ అయ్యారు. అమర్‌సింగ్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఎస్పీలో సీనియర్ నేతగా గుర్తింపు పొందిన అమర్‌సింగ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్‌కు అత్యంత సన్నిహితుడు.