
జయ'పద్మ' కోసం అమర్ సింగ్..
దేశ అత్యున్నత పద్మ అవార్డుల ఎంపిక గురించి తెలుసుకుంటే విస్తుపోవాల్సిందే.
దేశ అత్యున్నత పద్మ అవార్డుల ఎంపిక గురించి తెలుసుకుంటే విస్తుపోవాల్సిందే. ఈ ఏడాది అవార్డుల కోసం సిఫారసుల జాబితా పరిశీలిస్తే.. బంధు పక్షపాతం, పైరవీలు, ఒకే చాలా పేర్లు సూచించడం ఇలా ఎన్ని విషయాలు తెలుస్తాయి. సమాచార హక్కు చట్టం ద్వారా హోం శాఖకు 1300 ప్రతిపాదనలు వచ్చినట్టు వెల్లడైంది.
ప్రముఖ నటి, ఎంపీ జయప్రద కోసం ఆమె సన్నిహితుడు, సమాజ్వాదీ పార్టీ మాజీ నాయకుడు అమర్సింగ్ సిఫారసు చేశారు. ఈ మేరకు హోం శాఖకు లేఖ రాశారు. ఇక కాంగ్రెస్ సీనియర్ నేత మోతీలాల్ వోరా, కేంద్ర మంత్రి రాజీవ్ శుక్లా, ఎంపీ టి.సుబ్బిరామి రెడ్డి పలువురి పేర్లను ప్రతిపాదించారు. భారతరత్న అవార్డు గ్రహీత, ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ తన సోదరి ఉషా మంగేష్కర్తో పాటు మరో ఇద్దరి పేర్లను సిఫారసు చేయడం గమనార్హం. పద్మవిభూషణ్ ఉస్తాద్ అంజాద్ అలీ ఏకంగా తన కుమారులు అమాన్, అయాన్తో పాటు మరో ఆరుగురిని ప్రతిపాదించారు. మరికొందరు కేంద్ర మంత్రులు, అవార్డు గ్రహీతలు, నాయకుల వరుస ఇలాగే ఉంది.