
కొడుక్కి ఝలక్ ఇచ్చిన ములాయం
అఖిలేశ్ యాదవ్ కు ములాయం సింగ్ ఝలక్ ఇచ్చారు.
లక్నో: కొడుకు అభ్యంతరాలను తోసిరాజని సమాజ్ వాదీ పార్టీ అధినాయకుడు ములాయం సింగ్ యాదవ్ తనకు అత్యంత సన్నిహితుడైన అమర్ సింగ్ కు ప్రమోషన్ ఇచ్చారు. ఆయనను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఇటీవల పార్టీలో తలెత్తిన సంక్షోభానికి అమర్ సింగ్ కారణమంటూ పరోక్షంగా అఖిలేశ్ యాదవ్ విమర్శలు చేసినా ములాయం పట్టించుకోలేదు.
‘మిమ్మల్ని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించాం. యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీని బలోపేతం చేయడానికి పాటు పడాల’ని అమర్ సింగ్ కు రాసిన లేఖలో ములాయం పేర్కొన్నారు. క్లుప్తంగా హిందీలో రాసిన లేఖపై ములాయం సంతకంతో కూడిన ప్రకటన ఆయన యూపీ సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు శివపాల్ యాదవ్ ఈ-మెయిల్ నుంచి మీడియాకు అందింది.
2010లో పార్టీ నుంచి బహిష్కృతుడైన అమర్ సింగ్ ఇటీవల సొంతగూటికి తిరిగొచ్చారు. ఆయన పునరాగమనాన్ని పార్టీలోని సీనియర్ నాయకులు వ్యతిరేకించినా ములాయం లెక్కచేయకుండా రాజ్యసభ సభ్యత్వం కట్టబెట్టారు. ఇప్పుడు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించి కుమారుడికి ఝలక్ ఇచ్చారు. ‘బయటి వ్యక్తి’ కారణంగానే తమ పార్టీలో ఇటీవల సమస్యలు తలెత్తాయని అఖిలేశ్ పరోక్షంగా అమర్ సింగ్ పై విమర్శలు చేశా