అమిత్ షాకు చెక్ పెట్టేందుకు... | Amar Singh meets Samajwadi Party chief Mulayam Singh Yadav | Sakshi
Sakshi News home page

అమిత్ షాకు చెక్ పెట్టేందుకు...

Published Tue, Aug 19 2014 11:36 AM | Last Updated on Sat, Sep 2 2017 12:07 PM

అమిత్ షాకు చెక్ పెట్టేందుకు...

అమిత్ షాకు చెక్ పెట్టేందుకు...

లక్నో: ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త మలుపులు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటి వరకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉండే సంబంధాలను పక్కన పెట్టి ములాయం సింగ్ యాదవ్, అమర్ సింగ్ లు ఏకమయ్యేందుకు చకచకా పావులు కదుపుతున్నారు. 
 
మంగళవారం ఉదయం సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ లక్నోలోని నివాసానికి అమర్ సింగ్ రావడం చర్చనీయాంశమైంది. గతంలో సమాజ్ వాదీ పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించిన అమర్ సింగ్ ను మళ్లీ పార్టీలోకి రప్పించి పటిష్టం చేసే విధంగా ములాయం వ్యూహాలు పన్నుతున్నారు. 
 
ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో అమిత్ సింగ్ వ్యూహాలకు చెక్ పెట్టేందుకు ములాయం, అమర్ సింగ్ లు ఏకమవ్వడమే కాకుండా.. మయావతిని కూడా తమ కూటమిలోకి చేరాలని పిలుపునిస్తున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం అన్ని ప్రధాన పార్టీలను చావుదెబ్బ కొట్టిన సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement