అమర్ సింగ్‌కు జెడ్ కేటగిరి భద్రత
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ, ములాయం సింగ్ సన్నిహితుడు అమర్ సింగ్కు భద్రత పెంచారు. ఆయనకు జెడ్ కేటగిరి భద్రత కల్పించాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది. అమర్ సింగ్‌కు తక్షణం భద్రతను పెంచాలని కేంద్ర హోం శాఖ ఆదేశించింది.
ఉత్తరప్రదేశ్లో అధికార సమాజ్‌వాదీ పార్టీలో తీవ్ర విభేదాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ వర్గంలో ఆయన బాబాయ్ రాంగోపాల్ యాదవ్, పార్టీ సీనియర్ నేతలు, ఎంపీలు, 200 మందికిపైగా ఎమ్మెల్యేలు ఉండగా.. ములాయం వర్గంలో సోదరుడు శివపాల్ యాదవ్, అమర్ సింగ్‌తో పాటు కొందరు మాత్రమే మిగిలారు. అమర్ సింగ్‌ను అఖిలేష్ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తూ, తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆయనకు భద్రత పెంచారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2008లో అమర్ సింగ్‌కు జెడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించారు. 2014లో కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమర్ సింగ్‌తో పాటు పలువురు ప్రముఖులకు భద్రత తగ్గించారు. ఇటీవల అమర్ సింగ్‌కు వస్తున్న బెదిరింపులను దృష్టిలో ఉంచుకుని కేంద్రం మళ్లీ భద్రత పెంచింది.