కౌలాలంపూర్ పోలీస్ బాస్గా భారత సంతతి పౌరుడు
కౌలాలంపూర్: మలేషియాలో భారత సంతతి పౌరుడికి అరుదైన గౌరవం దక్కింది. భారత సంతతి సిక్కు పోలీసు అధికారి అమర్ సింగ్ కౌలాలంపూర్ కమిషనర్ ఆఫ్ పోలీసు చీఫ్ గా నియామకం అయ్యారు. తాజుద్దీన్ మహ్మద్ అనే పోలీసు అధికారి స్థానంలో అమర్ సింగ్ అనే భారత సంతతి పౌరుడు కొనసాగనున్నారు.
తాజుద్దీన్ మహ్మద్ సీఐడీలోని వాణిజ్య విభాగ డిప్యూటీ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో ఆయన స్థానంలో భారత సంతతి పౌరుడికి ఈ అవకాశం దక్కింది. గతంలో ఈ పోస్టుకు ఇదే సిక్కు మతానికి చెందిన సంతోఖ్ సింగ్ అనే వ్యక్తి ఎంపికయ్యారు. అమర్ సింగ్ తండ్రి, తాత కూడా పోలీసు అధికారులే. అమర్ తండ్రి ఇషార్ సింగ్ 1939లో మాలే స్టేట్ పోలీసు విభాగంలో చేరారు.