ఉగ్రవాదిలాగా మహిళపై దూకి.. | IS-influenced Malaysian teen holds woman on knife-point | Sakshi
Sakshi News home page

ఉగ్రవాదిలాగా మహిళపై దూకి..

Published Tue, Jan 12 2016 6:51 PM | Last Updated on Sun, Apr 7 2019 4:36 PM

ఉగ్రవాదిలాగా మహిళపై దూకి.. - Sakshi

ఉగ్రవాదిలాగా మహిళపై దూకి..

కౌలాలంపూర్: ఉగ్రవాద భావజాలంలో మునిగిపోయిన పదహారేళ్ల యువకుడు మలేసియాలో హల్ చల్ చేశాడు. కాసేపు పోలీసు అధికారులకు ముచ్చెమటలు పట్టించాడు. ఓ మహిళపైకి దూకి ఆమె గొంతుపై కత్తిపెట్టి చీరేస్తానని బెదిరిస్తూ ఆమె గుండెల్లో రైళ్లు పరుగెత్తించాడు. చివరకు ఏదోలా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. సామాజిక మాద్యమాల్లో విస్తృతంగా ప్రచారమవుతున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద భావజాలంపట్ల ప్రేరేపితుడైన ఓ 16 ఏళ్ల యువకుడు కెదాహ్ రాష్ట్రంలోని సుంగాయ్ పఠానీలోగల మార్కెట్ వద్ద చేతిలో కత్తి తీసుకొని నేరుగా వెళ్లి ఓ మహిళ గొంతుకు పెట్టి బెదిరించాడు.

ఆమెను జిహాదీ జాన్ లాగా తాను కూడా చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఎంతో కష్టపడి ఆ మహిళకు హానీ జరగకుండా ఆ యువకుడిని అరెస్టు చేశారు. అతడి పూర్వపరాలు పరిశీలించగా తరుచుగా సోషల్ మీడియాలో ఉగ్రవాదులకు సంబంధించిన అంశాలను శోధించాడని, ఇస్లామిక్ స్టేట్ ప్రభావంతో తాను కూడా అలాగే చేయగలనని నిరూపించుకునేందుకే ఆ మహిళపై పట్టపగలే ఈ ప్రయోగానికి దిగినట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement