
'వారిద్దరూ నన్ను చంపేందుకు కుట్రపన్నారు'
లక్నో: సమాజ్వాదీ పార్టీ మాజీ నేత అమర్ సింగ్, బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ తనను చంపేందుకు కుట్రపన్నారని ఉత్తరప్రదేశ్ సీనియర్ మంత్రి ఆజం ఖాన్ ఆరోపించారు. అమర్ సింగ్, సంగీత్ ఒకే సామాజిక వర్గానికి చెందినవారని, వీరిద్దరూ తనను అంతం చేసేందుకు పథకం రచించారని చెప్పారు. వీరు తాము అనుకున్నది చేయగలరని ఆజం ఖాన్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదిలావుండగా, సోమ్ ఇంతకుముందు ఆజం ఖాన్ నుంచి తనకు ప్రాణహానీ ఉందని అన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలలో ఆజంకు సంబంధముందని ఆరోపించారు. అమర్ సింగ్ కూడా ఆజం ఖాన్ నుంచి తనకు ప్రాణహానీ ఉందని ఆరోపణలు చేశారు.