బాబర్ ఆజం
పాకిస్తాన్ సెలక్టర్ల తీరుపై ఆ జట్టు మాజీ కెప్టెన్ మిస్బా ఉల్ హక్ మండిపడ్డాడు. మిడిలార్డర్‌లో ఆడే బ్యాటర్లు కనీసం ఒక్కరైనా జట్టులో ఉన్నారా అని ప్రశ్నించాడు.
నాణ్యమైన ఆటగాళ్లను జట్టుకు ఎంపిక చేసే అలవాటే లేదా అంటూ మిస్బా సెలక్టర్లను తీవ్రస్థాయిలో విమర్శించాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో లీగ్ దశలోనే నిష్క్రమించిన పాకిస్తాన్.. టీ20 ప్రపంచకప్-2024లోనూ అదే చెత్త ప్రదర్శన కనబరిచింది.
గ్రూప్-ఏలో తొలుత అమెరికా.. తర్వాత టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిన బాబర్ ఆజం బృందం సూపర్-8 అవకాశలను సంక్లిష్టం చేసుకుంది. తాజాగా అమెరికా- ఐర్లాండ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో సూపర్-8 రేసు నుంచి పూర్తిగా నిష్క్రమించింది.
ఇలాంటి ఫలితాలకు ఎవరు కారణం?
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు బాబర్ బృందం, సెలక్టర్ల తీరును తప్పుబడుతున్నారు. ప్రపంచకప్ టోర్నీకి పూర్తిస్థాయిలో సన్నద్ధం కాకపోవడం వల్లే భారీ మూల్యం చెల్లించారని విమర్శిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మిస్బా ఉల్ హక్ పాక్ మిడిలార్డర్ బ్యాటర్ల తీరును తూర్పారబట్టాడు. ‘‘మిడిలార్డర్, లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయగల ఆటగాళ్లే లేరు.
గత మూడు ప్రపంచకప్ టోర్నీల్లో.. 4, 5, 6 స్థానాల్లో ఎవరు బ్యాటింగ్ చేస్తారనే ప్రశ్న తలెత్తింది. అయినా ఆ సమస్యకు పరిష్కారం కనుగొనలేకపోయారు.
అందరూ టాపార్డర్‌లోనే బ్యాటింగ్ చేస్తామంటే.. 4, 5, 6 స్థానాల్లో ఆడేది ఎవరు? బాబర్ ఆజం, ఇఫ్తికార్ అహ్మద్ వంటి అత్యుత్తమ ప్లేయర్లు జట్టులో ఉన్నా స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నారు.
జట్టు ఇలా పతనమవడానికి ఎవరిని బాధ్యులను చేయాలి? ఇలాంటి ఫలితాలకు ఎవరు కారణం?’’ అంటూ మిస్బా ఉల్ హక్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
టీ20 ప్రపంచకప్-2024లో పాకిస్తాన్ మిడిలార్డర్ బ్యాటర్లు సాధించిన పరుగులు
👉ఫఖర్ జమాన్- అమెరికా మీద- 11 (7) ఇండియా మీద- 13 (8), కెనడా మీద 4 (6).
👉ఇఫ్తికార్ అహ్మద్- అమెరికా మీద 18 (14), ఇండియా మీద 5 (9).
👉ఆజం ఖాన్- అమెరికాతో మ్యాచ్‌లో గోల్డెన్ డక్
👉ఇమాద్ వసీం- ఇండియా మీద 15 (23).
👉షాదాబ్ ఖాన్- అమెరికా మీద 40 (25), ఇండియా మీద 4 (7).
చదవండి: T20 WC 2024- SA Vs Nepal: నరాలు తెగే ఉత్కంఠ.. ఆఖరి బంతికి!
Comments
Please login to add a commentAdd a comment