Iftikhar Ahmed
-
పాక్ చెత్త ప్రదర్శన.. సెలక్టర్లపై మాజీ కెప్టెన్ ఫైర్
పాకిస్తాన్ సెలక్టర్ల తీరుపై ఆ జట్టు మాజీ కెప్టెన్ మిస్బా ఉల్ హక్ మండిపడ్డాడు. మిడిలార్డర్లో ఆడే బ్యాటర్లు కనీసం ఒక్కరైనా జట్టులో ఉన్నారా అని ప్రశ్నించాడు.నాణ్యమైన ఆటగాళ్లను జట్టుకు ఎంపిక చేసే అలవాటే లేదా అంటూ మిస్బా సెలక్టర్లను తీవ్రస్థాయిలో విమర్శించాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో లీగ్ దశలోనే నిష్క్రమించిన పాకిస్తాన్.. టీ20 ప్రపంచకప్-2024లోనూ అదే చెత్త ప్రదర్శన కనబరిచింది.గ్రూప్-ఏలో తొలుత అమెరికా.. తర్వాత టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిన బాబర్ ఆజం బృందం సూపర్-8 అవకాశలను సంక్లిష్టం చేసుకుంది. తాజాగా అమెరికా- ఐర్లాండ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో సూపర్-8 రేసు నుంచి పూర్తిగా నిష్క్రమించింది.ఇలాంటి ఫలితాలకు ఎవరు కారణం?ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు బాబర్ బృందం, సెలక్టర్ల తీరును తప్పుబడుతున్నారు. ప్రపంచకప్ టోర్నీకి పూర్తిస్థాయిలో సన్నద్ధం కాకపోవడం వల్లే భారీ మూల్యం చెల్లించారని విమర్శిస్తున్నారు.ఈ నేపథ్యంలో మిస్బా ఉల్ హక్ పాక్ మిడిలార్డర్ బ్యాటర్ల తీరును తూర్పారబట్టాడు. ‘‘మిడిలార్డర్, లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయగల ఆటగాళ్లే లేరు.గత మూడు ప్రపంచకప్ టోర్నీల్లో.. 4, 5, 6 స్థానాల్లో ఎవరు బ్యాటింగ్ చేస్తారనే ప్రశ్న తలెత్తింది. అయినా ఆ సమస్యకు పరిష్కారం కనుగొనలేకపోయారు.అందరూ టాపార్డర్‌లోనే బ్యాటింగ్ చేస్తామంటే.. 4, 5, 6 స్థానాల్లో ఆడేది ఎవరు? బాబర్ ఆజం, ఇఫ్తికార్ అహ్మద్ వంటి అత్యుత్తమ ప్లేయర్లు జట్టులో ఉన్నా స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నారు.జట్టు ఇలా పతనమవడానికి ఎవరిని బాధ్యులను చేయాలి? ఇలాంటి ఫలితాలకు ఎవరు కారణం?’’ అంటూ మిస్బా ఉల్ హక్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.టీ20 ప్రపంచకప్-2024లో పాకిస్తాన్ మిడిలార్డర్ బ్యాటర్లు సాధించిన పరుగులు👉ఫఖర్ జమాన్- అమెరికా మీద- 11 (7) ఇండియా మీద- 13 (8), కెనడా మీద 4 (6).👉ఇఫ్తికార్ అహ్మద్- అమెరికా మీద 18 (14), ఇండియా మీద 5 (9).👉ఆజం ఖాన్- అమెరికాతో మ్యాచ్‌లో గోల్డెన్ డక్👉ఇమాద్ వసీం- ఇండియా మీద 15 (23).👉షాదాబ్ ఖాన్- అమెరికా మీద 40 (25), ఇండియా మీద 4 (7).చదవండి: T20 WC 2024- SA Vs Nepal: నరాలు తెగే ఉత్కంఠ.. ఆఖరి బంతికి! -
కొట్టుకున్నంత పనిచేసిన పాక్ క్రికెటర్లు.. ఆఖరికి
Iftikhar Ahmed: పాకిస్తాన్ క్రికెటర్లు ఇఫ్తికర్ అహ్మద్, అసద్ షఫీక్ మైదానంలో గొడవపడ్డారు. ఇఫ్తికర్ ఓవరాక్షన్ చేయడంతో అందుకు షఫీక్ కూడా గట్టిగానే బదులిచ్చాడు. ఈ క్రమంలో వాగ్వాదం ముదిరి ఇద్దరూ కొట్టుకునే స్థితికి వచ్చారు. అంతలో సహచర ఆటగాళ్లు జోక్యం చేసుకుని ఇద్దరినీ విడదీయడంతో గొడవ సద్దుమణిగింది. సింధ్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా కరాచి ఘాజి, లర్కానా చాలెంజర్స్ మధ్య మ్యాచ్ సందర్భంగా బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా కరాచి జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఇఫ్తికర్ అహ్మద్.. బౌలింగ్‌లో అసద్ షషీక్ వరుసగా సిక్సర్, ఫోర్ బాదాడు. ఆ తర్వాత అంటే.. ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్లో ఇఫ్తికర్ అహ్మద్ అద్భుతమైన బంతితో అసద్‌ను అవుట్ చేశాడు. ఈ క్రమంలో అసద్‌ను ఉద్దేశించి ఏవో వ్యాఖ్యలు చేస్తూ అతడి మీదమీదకు వెళ్లాడు. దీంతో అసద్ కూడా గొడవకు సిద్ధమయ్యాడు. ఆన్ ఫీల్డ్ అంపైర్లు, ఫీల్డర్లు వచ్చి ఇద్దరికి నచ్చజెప్పి పక్కకుతీసుకువెళ్లారు. ఇక ఈ మ్యాచ్‌లో కరాచి విధించిన 161 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లర్కానా 92 పరుగులకే ఆలౌట్ అయింది. స్పిన్ఆల్రౌండర్ ఇఫ్తికర్ అహ్మద్‌కు మూడు వికెట్లు దక్కాయి. అంతకంటే ముందు 69 పరుగులు కూడా సాధించాడు. క్షమాపణ చెప్పాడు.. మైదానంలో తాను అలా ప్రవర్తించి ఉండకూడదంటూ ఇఫ్తికర్ అహ్మద్ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. ఈ మేరకు ఎక్స్ వేదికగా.. ‘‘ఈరోజు మైదానంలో నేను ప్రవర్తించిన తీరుకు క్షమాపణలు కోరుతున్నా. నిజానికి నేనలా చేసి ఉండకూడదు. కానీ అప్పుడు ఆ క్షణంలో ఎందుకో అలా చేసేశాను. ఇప్పటికే అసద్ షఫీక్ భాయ్‌ను నేను వ్యక్తిగతంగా సారీ చెప్పాను.మ్యాచ్ ముగిసిన తర్వాత ఆయనతో మాట్లాడాను. ఇద్దరం కలిసి చాలా ఏళ్లు క్రికెట్ ఆడిన విషయాలను గుర్తుచేసుకున్నాం’’ అని 33 ఏళ్ల ఇఫ్తికర్ అహ్మద్ తెలిపాడు. పాక్ తరఫున టెస్టుల్లో రాణించి కాగా పాక్ తరఫున 2010లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన అసద్ షఫీక్.. 2020లో తన చివరి మ్యాచ్ ఆడాడు. పాకిస్తాన్ తరఫున 77 టెస్టుల్లో 466, వన్డేల్లో 1336. టీ20లలో 192 పరుగులు సాధించాడీ 38 ఏళ్ల రైట్‌హ్యాండ్ బ్యాటర్. అతడి ఖాతాలో మూడు టెస్టు వికెట్లు కూడా ఉన్నాయి. చదవండి: Prithvi Shaw: ఎట్టకేలకు టీమిండియా ఓపెనర్ రీఎంట్రీ.. Iftikhar Ahmed got aggressive with Asad Shafiq Was this a bit on the unprofessional side? Who's wrong here? #Iftimania pic.twitter.com/QIqDGdcFSl — Alisha Imran (@Alishaimran111) January 31, 2024 -
Asia Cup 2023: పసికూనపై ప్రతాపం చూపించిన పాక్.. భారీ విజయం
ఆసియా కప్ 2023లో భాగంగా ముల్తాన్ వేదికగా నేపాల్‌తో ఇవాళ (ఆగస్ట్ 30) జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ 238 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 342 పరుగుల భారీ స్కోర్ చేసింది. బాబర్ ఆజమ్ (131 బంతుల్లో 151; 14 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇఫ్తికార్ అహ్మద్ (71 బంతుల్లో 109 నాటౌట్; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) శతకాలతో విరుచుకుపడగా.. మహ్మద్ రిజ్వాన్ (44) పర్వాలేదనిపించాడు. ఫకర్ జమాన్ (14), ఇమామ్ ఉల్ హాక్ (5), అఘా సల్మాన్ (5) విఫలమయ్యారు. నేపాల్ బౌలర్లలో సోంపాల్ కామీ 2 వికెట్లు పడగొట్టగా.. కరణ్ , సందీప్ లామిచ్చేన్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఇమామ్ ఉల్ హాక్, రిజ్వాన్ రనౌట్లయ్యారు. 343 పరుగుల భారీ లక్ష్యాఛేదనకు దిగిన నేపాల్.. 23.4 ఓవర్లలో 104 పరుగులకు ఆలౌటైంది. షాదాబ్ ఖాన్ (4/27) నేపాల్ పతనాన్ని శాశించగా.. షాహీన్ అఫ్రిది, హరీస్ రౌఫ్ చెరో 2 వికెట్లు.. నసీం షా, నవాజ్ తలో వికెట్ పడగొట్టారు. నేపాల్ ఇన్నింగ్స్‌లో ఆరిఫ్ షేక్ (26), సోంపాల్ కామీ (28), గుల్సన్ షా (13) రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా ఆటగాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. -
Asia Cup 2023: పసికూనపై ప్రతాపం.. ఐదో వేగవంతమైన సెంచరీ
ఆసియా కప్ 2023లో భాగంగా ముల్తాన్ వేదికగా నేపాల్‌తో ఇవాళ (ఆగస్ట్ 30) జరుగుతున్న మ్యాచ్‌లో పాక్ మిడిలార్డర్ బ్యాటర్ ఇఫ్తికార్ అహ్మద్ విధ్వంసకర శతకంతో (71 బంతుల్లో 109 నాటౌట్; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. జట్టు కష్టకాలంలో ఉన్నప్పుడు ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఇఫ్తికార్.. కేవలం 67 బంతుల్లోనే 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసి, వన్డేల్లో పాక్ తరఫున ఐదో వేగవంతమైన సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా బాసిత్ అలీ (67 బంతుల్లో) రికార్డును సమం చేశాడు. వన్డేల్లో పాక్ తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు షాహిద్ అఫ్రిది (37 బంతుల్లో) పేరిట ఉంది. ఆతర్వాత రెండు (45), మూడు (53) ఫాస్టెస్ట్ హండ్రెడ్స్ రికార్డులు కూడా అతని ఖాతాలోనే ఉన్నాయి. పాక్ తరఫున వన్డేల్లో నాలుగో వేగవంతమైన శతకం షర్జీల్ ఖాన్ (61) పేరిట ఉంది. ఇదిలా ఉంటే, ఇఫ్తికార్‌తో పాటు బాబర్ ఆజమ్ (131 బంతుల్లో 151; 14 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా రికార్డు శతకంతో కదంతొక్కడంతో నేపాల్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ భారీ స్కోర్ (342/6) చేసింది. 109 బంతుల్లో 10 బౌండరీల సాయంతో సెంచరీ పూర్తి చేసిన బాబర్.. కెరీర్లో 19వ శతకాన్ని నమోదు చేసి, వన్డేల్లో అత్యంత వేగంగా (102 ఇన్నింగ్స్‌ల్లో) ఈ ఘనత సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అలాగే ఆసియా కప్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన కెప్టెన్‌గా (151), వన్డేల్లో డేవిడ్ వార్నర్ సెంచరీల రికార్డును (19) సమం చేసిన ఆటగాడిగా, సయీద్ అన్వర్ (20) తర్వాత పాక్ తరఫున అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ఆటగాడిగా పలు రికార్డులు నమోదు చేశాడు. ఈ క్రమంలో అతను వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో 15వ స్థానానికి ఎగబాకాడు. -
Asia Cup 2023: శతక్కొట్టిన బాబర్, ఇఫ్తికార్.. పాక్ భారీ స్కోర్
ఆసియా కప్ 2023లో భాగంగా ముల్తాన్ వేదికగా నేపాల్‌తో ఇవాళ (ఆగస్ట్ 30) జరుగుతున్న టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో పాక్ బ్యాటర్లు శతకాల మోత మోగించారు. కెప్టెన్ బాబర్ ఆజమ్ (131 బంతుల్లో 151; 14 ఫోర్లు, 4 సిక్సర్లు) రికార్డు శతకంతో కదంతొక్కగా.. ఆరో నంబర్లో బ్యాటింగ్‌కు దిగిన ఇఫ్తికార్ అహ్మద్ సుడిగాలి శతకంతో (71 బంతుల్లో 109 నాటౌట్; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. ఫలితంగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 342 పరుగుల భారీ స్కోర్ చేసింది. పాక్ ఇన్నింగ్స్‌లో మహ్మద్ రిజ్వాన్ 44 పరుగులతో పర్వాలేదనిపించగా.. ఫకర్ జమాన్ (14), ఇమామ్ ఉల్ హాక్ (5), అఘా సల్మాన్ (5) విఫలమయ్యారు. నేపాల్ బౌలర్లలో సోంపాల్ కామీ 2 వికెట్లు పడగొట్టగా.. కరణ్ , సందీప్ లామిచ్చేన్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఇమామ్ ఉల్ హాక్, రిజ్వాన్ రనౌట్లయ్యారు. బాబర్ రికార్డు శతకం.. ఈ మ్యాచ్‌లో 109 బంతుల్లో 10 బౌండరీల సాయంతో సెంచరీ పూర్తి చేసిన బాబర్.. కెరీర్లో 19వ శతకాన్ని నమోదు చేశాడు. తద్వారా వన్డేల్లో అత్యంత వేగంగా (102 ఇన్నింగ్స్‌ల్లో) 19 సెంచరీలు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అలాగే డేవిడ్ వార్నర్ సెంచరీల రికార్డును (19) సమం చేసి, సయీద్ అన్వర్ (20) తర్వాత పాక్ తరఫున అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఇఫ్తికార్ సుడిగాలి శతకం.. నేపాల్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాక్ భారీ స్కోర్ సాధించడంతో కీలకంగా వ్యవహరించిన ఇఫ్తికార్ అహ్మద్ వన్డే కెరీర్లో తన మొదటి సెంచరీని సాధించాడు. ఇఫ్తికార్ కేవలం 67 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. -
టీమిండియాతో మ్యాచ్ అంటే గల్లీ పోరగాళ్లతో ఆట? నేను ఆ మాట అనలే: పాక్ స్టార్
Asia Cup 2023- India Vs Pakistan: టీమిండియాను ఉద్దేశించి పాకిస్తాన్ బ్యాటర్ ఇఫ్తికర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’(ట్విటర్)లో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. దీంతో భారత జట్టు అభిమానులు అతడిపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ‘‘ఇంత పొగరు, అహంకారం పనికిరాదు.. అసలు టీమిండియా ముందు నువ్వెంత, మీ టీమ్ ఎంత?’’ అంటూ ఘాటైన వ్యాఖ్యలతో కౌంటర్లు ఇస్తున్నారు. ఈ క్రమంలో తాను అసలు ఆ మాటలు అననేలేదంటూ ఇఫ్తికర్ అహ్మద్ సంజాయిషీ ఇచ్చుకున్నాడు. అంతేకాదు.. తాను చేయని వ్యాఖ్యలను తనకు ఆపాదిస్తూ నకిలీ వార్తలు ప్రచారం చేస్తున్న యూజర్లపై నిషేధం విధించాలంటూ ‘ఎక్స్’ అధినేత ఎలన్‌మస్క్‌కు విన్నవించుకున్నాడు. హై వోల్టేజీ మ్యాచ్.. కాగా భారత్- పాక్ మ్యాచ్ అంటే హైప్ ఏ రేంజ్లో ఉంటుందో తెలిసిందే! కేవలం ఆసియా కప్, ప్రపంచకప్ వంటి ఈవెంట్ల నేపథ్యంలోనే దాయాదులు పోటీ పడుతున్న తరుణంలో అంచనాలు మరింత ఎక్కువవుతున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది ఆసియా వన్డే కప్, వన్డే వరల్డ్‌కప్‌లో చిరకాల ప్రత్యర్థుల పోటీ చూసే భాగ్యం అభిమానులకు దక్కింది. ఆరోజే తొలిసారి ఇందులో భాగంగా ఈ దఫా శ్రీలంక వేదికగా సెప్టెంబరు 2న తొలిసారి భారత్- పాక్ మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మ్యాచ్ గురించి ఇరు దేశాల ఆటగాళ్లు చేస్తున్న కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో..‘‘ టీమిండియాతో మ్యాచ్ అంటే.. గల్లీ పోరగాళ్లతో ఆడినట్లే ఉంటది’’ అని ఇఫ్తికర్ అహ్మద్ అన్నట్లు నవాజ్ అనే ఎక్స్ యూజర్ ట్వీట్ చేశాడు. దీంతో అహ్మద్‌పై టీమిండియా అభిమానులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో అతడు వివరణ ఇచ్చుకోకతప్పలేదు. నేను ఆ మాట అనలే.. విద్వేషం రగిల్చకండి ‘‘నేనసలు ఎప్పుడూ ఇలాంటి ప్రకటన చేయలేదు. నేనే కాదు.. ప్రొఫెషనల్ క్రికెటర్ ఎవరూ కూడా ఇలాంటి మాటలు మాట్లాడరు. ఇలాంటి నకిలీ వార్తలు ప్రచారం చేయడం ఆపండి. విద్వేషం రగిల్చేలా వ్యవహరించిన ఈ వ్యక్తి గురించి ఎలన్‌మస్క్‌కు రిపోర్టు చేస్తున్నా. దయచేసి ఈ అకౌంట్‌ను నిషేధించండి’’ అని ఇఫ్తికర్ అహ్మద్ విజ్ఞప్తి చేశాడు. కాగా ఆసియా కప్-2023లో టీమిండియాను ఢీకొట్టబోయే బాబర్ ఆజం జట్టులో 32 ఏళ్ల ఇఫ్తికర్ అహ్మద్‌కు చోటు దక్కిన విషయం తెలిసిందే. చదవండి: తూచ్! నిర్ణయం వెనక్కి.. దేశం కంటే ఏదీ ఎక్కువ కాదు! స్టోక్స్ ఒక్కడేనా? I’ve been made aware of this statement which I’ve never made. In fact, no professional cricketer will make such a statement. Please stop circulating false news & report this individual for spreading hate.@X @elonmusk please ban this account as people are misusing the blue tick. https://t.co/dmgDEfM9jp pic.twitter.com/fExqNRa9Zk — Iftikhar Ahmad (@IftiMania) August 16, 2023