కొట్టుకున్నంత పనిచేసిన పాక్ క్రికెటర్లు(PC: X)
Iftikhar Ahmed: పాకిస్తాన్ క్రికెటర్లు ఇఫ్తికర్ అహ్మద్, అసద్ షఫీక్ మైదానంలో గొడవపడ్డారు. ఇఫ్తికర్ ఓవరాక్షన్ చేయడంతో అందుకు షఫీక్ కూడా గట్టిగానే బదులిచ్చాడు. ఈ క్రమంలో వాగ్వాదం ముదిరి ఇద్దరూ కొట్టుకునే స్థితికి వచ్చారు.
అంతలో సహచర ఆటగాళ్లు జోక్యం చేసుకుని ఇద్దరినీ విడదీయడంతో గొడవ సద్దుమణిగింది. సింధ్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా కరాచి ఘాజి, లర్కానా చాలెంజర్స్ మధ్య మ్యాచ్ సందర్భంగా బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
కాగా కరాచి జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఇఫ్తికర్ అహ్మద్.. బౌలింగ్‌లో అసద్ షషీక్ వరుసగా సిక్సర్, ఫోర్ బాదాడు. ఆ తర్వాత అంటే.. ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్లో ఇఫ్తికర్ అహ్మద్ అద్భుతమైన బంతితో అసద్‌ను అవుట్ చేశాడు.
ఈ క్రమంలో అసద్‌ను ఉద్దేశించి ఏవో వ్యాఖ్యలు చేస్తూ అతడి మీదమీదకు వెళ్లాడు. దీంతో అసద్ కూడా గొడవకు సిద్ధమయ్యాడు. ఆన్ ఫీల్డ్ అంపైర్లు, ఫీల్డర్లు వచ్చి ఇద్దరికి నచ్చజెప్పి పక్కకుతీసుకువెళ్లారు. ఇక ఈ మ్యాచ్‌లో కరాచి విధించిన 161 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లర్కానా 92 పరుగులకే ఆలౌట్ అయింది. స్పిన్‌ఆల్‌రౌండర్ ఇఫ్తికర్ అహ్మద్‌కు మూడు వికెట్లు దక్కాయి. అంతకంటే ముందు 69 పరుగులు కూడా సాధించాడు.
క్షమాపణ చెప్పాడు..
మైదానంలో తాను అలా ప్రవర్తించి ఉండకూడదంటూ ఇఫ్తికర్ అహ్మద్ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. ఈ మేరకు ఎక్స్ వేదికగా.. ‘‘ఈరోజు మైదానంలో నేను ప్రవర్తించిన తీరుకు క్షమాపణలు కోరుతున్నా. నిజానికి నేనలా చేసి ఉండకూడదు.
కానీ అప్పుడు ఆ క్షణంలో ఎందుకో అలా చేసేశాను. ఇప్పటికే అసద్ షఫీక్ భాయ్‌ను నేను వ్యక్తిగతంగా సారీ చెప్పాను.మ్యాచ్ ముగిసిన తర్వాత ఆయనతో మాట్లాడాను. ఇద్దరం కలిసి చాలా ఏళ్లు క్రికెట్ ఆడిన విషయాలను గుర్తుచేసుకున్నాం’’ అని 33 ఏళ్ల ఇఫ్తికర్ అహ్మద్ తెలిపాడు.
పాక్ తరఫున టెస్టుల్లో రాణించి
కాగా పాక్ తరఫున 2010లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన అసద్ షఫీక్.. 2020లో తన చివరి మ్యాచ్ ఆడాడు. పాకిస్తాన్ తరఫున 77 టెస్టుల్లో 466, వన్డేల్లో 1336. టీ20లలో 192 పరుగులు సాధించాడీ 38 ఏళ్ల రైట్‌హ్యాండ్ బ్యాటర్. అతడి ఖాతాలో మూడు టెస్టు వికెట్లు కూడా ఉన్నాయి.
చదవండి: Prithvi Shaw: ఎట్టకేలకు టీమిండియా ఓపెనర్ రీఎంట్రీ..
Iftikhar Ahmed got aggressive with Asad Shafiq
— Alisha Imran (@Alishaimran111) January 31, 2024
Was this a bit on the unprofessional side? Who's wrong here? #Iftimania pic.twitter.com/QIqDGdcFSl
Comments
Please login to add a commentAdd a comment