Asad Shafiq
-
కొట్టుకున్నంత పనిచేసిన పాక్ క్రికెటర్లు.. ఆఖరికి
Iftikhar Ahmed: పాకిస్తాన్ క్రికెటర్లు ఇఫ్తికర్ అహ్మద్, అసద్ షఫీక్ మైదానంలో గొడవపడ్డారు. ఇఫ్తికర్ ఓవరాక్షన్ చేయడంతో అందుకు షఫీక్ కూడా గట్టిగానే బదులిచ్చాడు. ఈ క్రమంలో వాగ్వాదం ముదిరి ఇద్దరూ కొట్టుకునే స్థితికి వచ్చారు. అంతలో సహచర ఆటగాళ్లు జోక్యం చేసుకుని ఇద్దరినీ విడదీయడంతో గొడవ సద్దుమణిగింది. సింధ్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా కరాచి ఘాజి, లర్కానా చాలెంజర్స్ మధ్య మ్యాచ్ సందర్భంగా బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా కరాచి జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఇఫ్తికర్ అహ్మద్.. బౌలింగ్‌లో అసద్ షషీక్ వరుసగా సిక్సర్, ఫోర్ బాదాడు. ఆ తర్వాత అంటే.. ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్లో ఇఫ్తికర్ అహ్మద్ అద్భుతమైన బంతితో అసద్‌ను అవుట్ చేశాడు. ఈ క్రమంలో అసద్‌ను ఉద్దేశించి ఏవో వ్యాఖ్యలు చేస్తూ అతడి మీదమీదకు వెళ్లాడు. దీంతో అసద్ కూడా గొడవకు సిద్ధమయ్యాడు. ఆన్ ఫీల్డ్ అంపైర్లు, ఫీల్డర్లు వచ్చి ఇద్దరికి నచ్చజెప్పి పక్కకుతీసుకువెళ్లారు. ఇక ఈ మ్యాచ్‌లో కరాచి విధించిన 161 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లర్కానా 92 పరుగులకే ఆలౌట్ అయింది. స్పిన్ఆల్రౌండర్ ఇఫ్తికర్ అహ్మద్‌కు మూడు వికెట్లు దక్కాయి. అంతకంటే ముందు 69 పరుగులు కూడా సాధించాడు. క్షమాపణ చెప్పాడు.. మైదానంలో తాను అలా ప్రవర్తించి ఉండకూడదంటూ ఇఫ్తికర్ అహ్మద్ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. ఈ మేరకు ఎక్స్ వేదికగా.. ‘‘ఈరోజు మైదానంలో నేను ప్రవర్తించిన తీరుకు క్షమాపణలు కోరుతున్నా. నిజానికి నేనలా చేసి ఉండకూడదు. కానీ అప్పుడు ఆ క్షణంలో ఎందుకో అలా చేసేశాను. ఇప్పటికే అసద్ షఫీక్ భాయ్‌ను నేను వ్యక్తిగతంగా సారీ చెప్పాను.మ్యాచ్ ముగిసిన తర్వాత ఆయనతో మాట్లాడాను. ఇద్దరం కలిసి చాలా ఏళ్లు క్రికెట్ ఆడిన విషయాలను గుర్తుచేసుకున్నాం’’ అని 33 ఏళ్ల ఇఫ్తికర్ అహ్మద్ తెలిపాడు. పాక్ తరఫున టెస్టుల్లో రాణించి కాగా పాక్ తరఫున 2010లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన అసద్ షఫీక్.. 2020లో తన చివరి మ్యాచ్ ఆడాడు. పాకిస్తాన్ తరఫున 77 టెస్టుల్లో 466, వన్డేల్లో 1336. టీ20లలో 192 పరుగులు సాధించాడీ 38 ఏళ్ల రైట్‌హ్యాండ్ బ్యాటర్. అతడి ఖాతాలో మూడు టెస్టు వికెట్లు కూడా ఉన్నాయి. చదవండి: Prithvi Shaw: ఎట్టకేలకు టీమిండియా ఓపెనర్ రీఎంట్రీ.. Iftikhar Ahmed got aggressive with Asad Shafiq Was this a bit on the unprofessional side? Who's wrong here? #Iftimania pic.twitter.com/QIqDGdcFSl — Alisha Imran (@Alishaimran111) January 31, 2024 -
అజహర్, అసద్ సెంచరీలు
అబుదాబి: మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ అజహర్ అలీ (134; 12 ఫోర్లు), అసద్ షఫీఖ్ (104; 14 ఫోర్లు) అద్భుత సెంచరీలతో కదం తొక్కారు. ఫలితంగా న్యూజిలాండ్‌తో జరుగుతోన్న చివరిదైన మూడో టెస్టులో పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 348 పరుగులు చేసి 74 పరుగుల కీలక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 139/3తో బుధవారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన పాక్‌ను అజహర్, అసద్ ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 201 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశారు. దీంతో ఓ దశలో పాకిస్తాన్ 286/3తో పటిష్ట స్థితిలో నిలిచింది. కివీస్ బౌలర్లలో విలియమ్ సోమెర్‌విల్లె (4/75), ఎజాజ్ పటేల్ (2/100) చెలరేగడంతో పాక్ 62 పరుగుల వ్యవధిలో చివరి ఏడు వికెట్లు కోల్పోయింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 26 పరుగులు చేసింది. విలియమ్సన్ (14 బ్యాటింగ్) సోమెర్‌విల్లె (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. -
రికార్డు ఛేదన చేజారింది...
డేనైట్ టెస్టులో ఆసీస్ చేతిలో ఓడిన పాక్ అసద్ సూపర్ ఇన్నింగ్స్ వృథా బ్రిస్బేన్: తొలి టెస్టులో పాకిస్తాన్ మొదటి ఇన్నింగ్స్‌లో 142 పరుగులకే కుప్పకూలింది. ఇంకా చెప్పాలంటే 67 పరుగులకే 8 వికెట్లను కోల్పోయింది. మరి అదే పాక్ రెండో ఇన్నింగ్స్‌లో 450 పరుగులు చేసింది. 490 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ ఆ 40 పరుగులు చేస్తే... టెస్టుల్లో అత్యధిక పరుగులు ఛేదించిన జట్టుగా రికార్డు నమోదు చేసేది. కానీ స్టార్క్ అద్భుత బంతి పాకిస్తాన్ ఆశలను కూల్చింది. క్రీజులో పాతుకుపోయిన సెంచరీ హీరో అసద్ షఫీక్ (207 బంతుల్లో 137; 13 ఫోర్లు, 1 సిక్స్)ను అవుట్ చేసి అతను రికార్డు విజయాన్ని దూరం చేశాడు. దీంతో మొదటి డేనైట్ టెస్టులో ఆస్ట్రేలియా 39 పరుగుల తేడాతో విజయం సాధించింది. సోమవారం 382/8 ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజు ఆట కొనసాగించిన పాకిస్తాన్ పరాజయం లాంఛనమే అనిపించింది. కానీ ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ షఫీక్, యాసిర్ షా (66 బంతుల్లో 33; 4 ఫోర్లు) మాత్రం ఆస్ట్రేలియాను వారిగడ్డపైనే వణికించారు. దీంతో చివరి రోజు విజయానికి చేయాల్సిన 108 పరుగుల్లో 67 పరుగులు వచ్చేశాయి. ఈ దశలో స్టార్క్ బౌలింగ్‌లో షఫీక్ అవుట్ కావడంతో పాక్ ఆశలు కోల్పోయింది. -
ఓటమి దిశగా పాక్
బ్రిస్బేన్: ఆస్ట్రేలియా విధించిన 490 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్ పోరాడుతున్నా... బ్రిస్బేన్‌లో జరుగుతున్న తొలి డే నైట్ క్రికెట్ టెస్ట్ మ్యాచ్‌లో ఓటమిని తప్పించుకునే పరిస్థితి కనిపించడంలేదు. ఓవర్‌నైట్ స్కోరు 70/2తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్తాన్ ఆట ముగిసే సమయానికి 8 వికెట్లకు 382 పరుగులు చేసింది. అసద్ షఫీక్ (140 బంతుల్లో 100 బ్యాటింగ్; 10 ఫోర్లు, ఒక సిక్స్), యాసిర్ షా (4 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. పాక్ విజయానికి మరో 108 పరుగులు అవసరం ఉండగా... ఆస్ట్రేలియా మరో రెండు వికెట్లు తీస్తే విజయాన్ని ఖాయం చేసుకుంటుంది. సోమవారం మ్యాచ్‌కు చివరిరోజు. అంతకుముందు అజహర్ అలీ (71), యూనిస్ ఖాన్ (65) అర్ధ సెంచరీలు చేసి పాక్ ఇన్నింగ్స్‌ను నిర్మించారు. అయితే ఈ ఇద్దరూ అవుటయ్యాక పాక్ ఆరు వికెట్లకు 220 పరుగులతో కష్టాల్లో పడింది. కానీ అసద్ షఫీక్... చివరి వరుస బ్యాట్స్‌మెన్ ఆమిర్ (48)తో కలిసి ఏడో వికెట్‌కు 92 పరుగులు... వహాబ్ రియాజ్ (30)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 66 పరుగులు జోడించి పాక్ పోరాటాన్ని కొనసాగించాడు