ఓటమి దిశగా పాక్
బ్రిస్బేన్: ఆస్ట్రేలియా విధించిన 490 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్ పోరాడుతున్నా... బ్రిస్బేన్‌లో జరుగుతున్న తొలి డే నైట్ క్రికెట్ టెస్ట్ మ్యాచ్‌లో ఓటమిని తప్పించుకునే పరిస్థితి కనిపించడంలేదు. ఓవర్‌నైట్ స్కోరు 70/2తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్తాన్ ఆట ముగిసే సమయానికి 8 వికెట్లకు 382 పరుగులు చేసింది. అసద్ షఫీక్ (140 బంతుల్లో 100 బ్యాటింగ్; 10 ఫోర్లు, ఒక సిక్స్), యాసిర్ షా (4 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. పాక్ విజయానికి మరో 108 పరుగులు అవసరం ఉండగా... ఆస్ట్రేలియా మరో రెండు వికెట్లు తీస్తే విజయాన్ని ఖాయం చేసుకుంటుంది.
సోమవారం మ్యాచ్‌కు చివరిరోజు. అంతకుముందు అజహర్ అలీ (71), యూనిస్ ఖాన్ (65) అర్ధ సెంచరీలు చేసి పాక్ ఇన్నింగ్స్‌ను నిర్మించారు. అయితే ఈ ఇద్దరూ అవుటయ్యాక పాక్ ఆరు వికెట్లకు 220 పరుగులతో కష్టాల్లో పడింది. కానీ అసద్ షఫీక్... చివరి వరుస బ్యాట్స్‌మెన్ ఆమిర్ (48)తో కలిసి ఏడో వికెట్‌కు 92 పరుగులు... వహాబ్ రియాజ్ (30)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 66 పరుగులు జోడించి పాక్ పోరాటాన్ని కొనసాగించాడు