అజహర్, అసద్‌ సెంచరీలు  | Pakistan march ahead with Azhar Ali, Asad Shafiq tons | Sakshi
Sakshi News home page

అజహర్, అసద్‌ సెంచరీలు 

Published Thu, Dec 6 2018 1:29 AM | Last Updated on Thu, Dec 6 2018 1:29 AM

Pakistan march ahead with Azhar Ali, Asad Shafiq tons - Sakshi

అబుదాబి: మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ అజహర్‌ అలీ (134; 12 ఫోర్లు), అసద్‌ షఫీఖ్‌ (104; 14 ఫోర్లు) అద్భుత సెంచరీలతో కదం తొక్కారు. ఫలితంగా న్యూజిలాండ్‌తో జరుగుతోన్న చివరిదైన మూడో టెస్టులో పాకిస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 348 పరుగులు చేసి 74 పరుగుల కీలక తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సాధించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 139/3తో బుధవారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన పాక్‌ను అజహర్, అసద్‌ ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 201 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశారు.

దీంతో ఓ దశలో పాకిస్తాన్‌ 286/3తో పటిష్ట స్థితిలో నిలిచింది. కివీస్‌ బౌలర్లలో విలియమ్‌ సోమెర్‌విల్లె (4/75), ఎజాజ్‌ పటేల్‌ (2/100) చెలరేగడంతో పాక్‌ 62 పరుగుల వ్యవధిలో చివరి ఏడు వికెట్లు కోల్పోయింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన న్యూజిలాండ్‌ ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 26 పరుగులు చేసింది. విలియమ్సన్‌ (14 బ్యాటింగ్‌) సోమెర్‌విల్లె (1 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement