ఆసియా కప్ 2023లో భాగంగా ముల్తాన్ వేదికగా నేపాల్‌తో ఇవాళ (ఆగస్ట్ 30) జరుగుతున్న టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో పాక్ బ్యాటర్లు శతకాల మోత మోగించారు. కెప్టెన్ బాబర్ ఆజమ్ (131 బంతుల్లో 151; 14 ఫోర్లు, 4 సిక్సర్లు) రికార్డు శతకంతో కదంతొక్కగా.. ఆరో నంబర్‌లో బ్యాటింగ్‌కు దిగిన ఇఫ్తికార్ అహ్మద్ సుడిగాలి శతకంతో (71 బంతుల్లో 109 నాటౌట్; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. ఫలితంగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 342 పరుగుల భారీ స్కోర్ చేసింది.
పాక్ ఇన్నింగ్స్‌లో మహ్మద్ రిజ్వాన్ 44 పరుగులతో పర్వాలేదనిపించగా.. ఫకర్ జమాన్ (14), ఇమామ్ ఉల్ హాక్ (5), అఘా సల్మాన్ (5) విఫలమయ్యారు. నేపాల్ బౌలర్లలో సోంపాల్ కామీ 2 వికెట్లు పడగొట్టగా.. కరణ్ , సందీప్ లామిచ్చేన్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఇమామ్ ఉల్ హాక్, రిజ్వాన్ రనౌట్లయ్యారు.
బాబర్ రికార్డు శతకం..
ఈ మ్యాచ్‌లో 109 బంతుల్లో 10 బౌండరీల సాయంతో సెంచరీ పూర్తి చేసిన బాబర్.. కెరీర్‌లో 19వ శతకాన్ని నమోదు చేశాడు. తద్వారా వన్డేల్లో అత్యంత వేగంగా (102 ఇన్నింగ్స్‌ల్లో) 19 సెంచరీలు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అలాగే డేవిడ్ వార్నర్ సెంచరీల రికార్డును (19) సమం చేసి, సయీద్ అన్వర్ (20) తర్వాత పాక్ తరఫున అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.
ఇఫ్తికార్ సుడిగాలి శతకం..
నేపాల్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాక్ భారీ స్కోర్ సాధించడంతో కీలకంగా వ్యవహరించిన ఇఫ్తికార్ అహ్మద్ వన్డే కెరీర్‌లో తన మొదటి సెంచరీని సాధించాడు. ఇఫ్తికార్ కేవలం 67 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment