ఆసియా కప్ 2023 వన్డే టోర్నీ పాకిస్తాన్ వేదికగా ఇవాళ (ఆగస్ట్ 30) లాంఛనంగా ప్రారంభమైంది. ముల్తాన్‌లో జరిగే తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్, నేపాల్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. హాట్ ఫేవరెట్ అయిన పాకిస్తాన్.. చిన్న జట్టు అయిన నేపాల్‌ను తక్కువ అంచనా వేయకుండా పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగుతుంది. పటిష్టమైన పాక్‌కు ఎదురు నిలవడం పసికూన నేపాల్‌కు స్థాయికి మించిన పనే అవుతుంది.
𝐀𝐬𝐢𝐚 𝐂𝐮𝐩 returns to Pakistan after 15 years🏆
— CricTracker (@Cricketracker) August 30, 2023
📸: Disney + Hotstar pic.twitter.com/pMSZcISiDv
తుది జట్లు..
పాకిస్తాన్: ఫకర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), అఘా సల్మాన్, ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, నసీం షా, హరీస్ రౌఫ్
నేపాల్: కుశాల్ భుర్టెల్, ఆసిఫ్ షేక్(వికెట్‌కీపర్), రోహిత్ పౌడెల్(కెప్టెన్), ఆరిఫ్ షేక్, కుశాల్ మల్లా, దీపేంద్ర సింగ్ ఐరీ, గుల్సన్ ఝా, సోంపాల్ కమీ, కరణ్, సందీప్ లామిచానే, లలిత్ రాజ్‌బన్షి
Congratulations and good luck to the Nepal Cricket Team!. pic.twitter.com/oQhkU2CkCm
— CricTracker (@Cricketracker) August 30, 2023
Comments
Please login to add a commentAdd a comment