ఆసియా కప్ 2023లో భాగంగా ముల్తాన్ వేదికగా నేపాల్‌తో ఇవాళ (ఆగస్ట్ 30) జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ 238 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 342 పరుగుల భారీ స్కోర్ చేసింది. బాబర్ ఆజమ్ (131 బంతుల్లో 151; 14 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇఫ్తికార్ అహ్మద్ (71 బంతుల్లో 109 నాటౌట్; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) శతకాలతో విరుచుకుపడగా.. మహ్మద్ రిజ్వాన్ (44) పర్వాలేదనిపించాడు.
ఫకర్ జమాన్ (14), ఇమామ్ ఉల్ హాక్ (5), అఘా సల్మాన్ (5) విఫలమయ్యారు. నేపాల్ బౌలర్లలో సోంపాల్ కామీ 2 వికెట్లు పడగొట్టగా.. కరణ్ , సందీప్ లామిచ్చేన్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఇమామ్ ఉల్ హాక్, రిజ్వాన్ రనౌట్లయ్యారు.
343 పరుగుల భారీ లక్ష్యాఛేదనకు దిగిన నేపాల్.. 23.4 ఓవర్లలో 104 పరుగులకు ఆలౌటైంది. షాదాబ్ ఖాన్ (4/27) నేపాల్ పతనాన్ని శాశించగా.. షాహీన్ అఫ్రిది, హరీస్ రౌఫ్ చెరో 2 వికెట్లు.. నసీం షా, నవాజ్ తలో వికెట్ పడగొట్టారు. నేపాల్ ఇన్నింగ్స్‌లో ఆరిఫ్ షేక్ (26), సోంపాల్ కామీ (28), గుల్సన్ షా (13) రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా ఆటగాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment