Asia Cup 2023- India Vs Pakistan: టీమిండియాను ఉద్దేశించి పాకిస్తాన్ బ్యాటర్ ఇఫ్తికర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’(ట్విటర్)లో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. దీంతో భారత జట్టు అభిమానులు అతడిపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ‘‘ఇంత పొగరు, అహంకారం పనికిరాదు.. అసలు టీమిండియా ముందు నువ్వెంత, మీ టీమ్ ఎంత?’’ అంటూ ఘాటైన వ్యాఖ్యలతో కౌంటర్లు ఇస్తున్నారు.
ఈ క్రమంలో తాను అసలు ఆ మాటలు అననేలేదంటూ ఇఫ్తికర్ అహ్మద్ సంజాయిషీ ఇచ్చుకున్నాడు. అంతేకాదు.. తాను చేయని వ్యాఖ్యలను తనకు ఆపాదిస్తూ నకిలీ వార్తలు ప్రచారం చేస్తున్న యూజర్లపై నిషేధం విధించాలంటూ ‘ఎక్స్’ అధినేత ఎలన్‌మస్క్‌కు విన్నవించుకున్నాడు.
హై వోల్టేజీ మ్యాచ్..
కాగా భారత్- పాక్ మ్యాచ్ అంటే హైప్ ఏ రేంజ్‌లో ఉంటుందో తెలిసిందే! కేవలం ఆసియా కప్, ప్రపంచకప్ వంటి ఈవెంట్ల నేపథ్యంలోనే దాయాదులు పోటీ పడుతున్న తరుణంలో అంచనాలు మరింత ఎక్కువవుతున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది ఆసియా వన్డే కప్, వన్డే వరల్డ్‌కప్‌లో చిరకాల ప్రత్యర్థుల పోటీ చూసే భాగ్యం అభిమానులకు దక్కింది.
ఆరోజే తొలిసారి
ఇందులో భాగంగా ఈ దఫా శ్రీలంక వేదికగా సెప్టెంబరు 2న తొలిసారి భారత్- పాక్ మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మ్యాచ్ గురించి ఇరు దేశాల ఆటగాళ్లు చేస్తున్న కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలో..‘‘ టీమిండియాతో మ్యాచ్ అంటే.. గల్లీ పోరగాళ్లతో ఆడినట్లే ఉంటది’’ అని ఇఫ్తికర్ అహ్మద్ అన్నట్లు నవాజ్ అనే ఎక్స్ యూజర్ ట్వీట్ చేశాడు. దీంతో అహ్మద్‌పై టీమిండియా అభిమానులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో అతడు వివరణ ఇచ్చుకోకతప్పలేదు.
నేను ఆ మాట అనలే.. విద్వేషం రగిల్చకండి
‘‘నేనసలు ఎప్పుడూ ఇలాంటి ప్రకటన చేయలేదు. నేనే కాదు.. ప్రొఫెషనల్ క్రికెటర్ ఎవరూ కూడా ఇలాంటి మాటలు మాట్లాడరు. ఇలాంటి నకిలీ వార్తలు ప్రచారం చేయడం ఆపండి.
విద్వేషం రగిల్చేలా వ్యవహరించిన ఈ వ్యక్తి గురించి ఎలన్‌మస్క్‌కు రిపోర్టు చేస్తున్నా. దయచేసి ఈ అకౌంట్‌ను నిషేధించండి’’ అని ఇఫ్తికర్ అహ్మద్ విజ్ఞప్తి చేశాడు. కాగా ఆసియా కప్-2023లో టీమిండియాను ఢీకొట్టబోయే బాబర్ ఆజం జట్టులో 32 ఏళ్ల ఇఫ్తికర్ అహ్మద్‌కు చోటు దక్కిన విషయం తెలిసిందే.
చదవండి: తూచ్! నిర్ణయం వెనక్కి.. దేశం కంటే ఏదీ ఎక్కువ కాదు! స్టోక్స్ ఒక్కడేనా?
I’ve been made aware of this statement which I’ve never made. In fact, no professional cricketer will make such a statement. Please stop circulating false news & report this individual for spreading hate.@X @elonmusk please ban this account as people are misusing the blue tick. https://t.co/dmgDEfM9jp pic.twitter.com/fExqNRa9Zk
— Iftikhar Ahmad (@IftiMania) August 16, 2023
Comments
Please login to add a commentAdd a comment