శ్రీవారి సేవలో జయప్రద
తిరుమల: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని గురువారం సినీనటి జయప్రద దర్శించుకున్నారు. ఈ రోజు వీఐపీ విరామ సమయంలో జయప్రద కుటుంబ సభ్యులతో కలిసి స్వామి సేవలో పాల్గొన్నారు . దర్శనం అనంతరం ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
మరోవైపు భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఏడుకొండలవాడి దర్శనానికి ఒక కంపార్ట్‌మెంట్‌లో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి, ప్రత్యేక ప్రేవశ దర్శనానికి, కాలినడక వచ్చే భక్తులకు గంట సమయం పడుతోంది. గదులు కూడా సులభంగా దొరుకుతున్నాయి.
బుధవారం సాయంత్రం వరకు అందిన సమాచారం ప్రకారం గదుల వివరాలు:
ఉచిత గదులు : 126 ఖాళీగా ఉన్నాయి
రూ.50 గదులు : 159 ఖాళీగా ఉన్నాయి
రూ. 100 గదులు : 204 ఖాళీగా ఉన్నాయి
రూ. 500 గదులు : 112 ఖాళీగా ఉన్నాయి