సావిత్రిలా పేరు తెచ్చుకోవాలి | get name as Savitri says Anushka | Sakshi
Sakshi News home page

సావిత్రిలా పేరు తెచ్చుకోవాలి

Published Wed, Dec 17 2014 3:01 AM | Last Updated on Sat, Sep 2 2017 6:16 PM

సావిత్రిలా పేరు తెచ్చుకోవాలి

సావిత్రిలా పేరు తెచ్చుకోవాలి

ప్రఖ్యాత నటీమణి సావిత్రిలా పేరు తెచ్చుకోవాలన్నది తన ఆశ అంటున్నారు నటి అనుష్క. అభినయంలో సత్తా ఏమిటో అరుంధతి చిత్రంతోనే చాటుకున్నారు. అయితే త్వరలో నటనకు స్వస్తి చెప్పబోతున్నారని, కారణం పెళ్లి పీట లెక్కనునున్నారరన్నది తాజా ప్రచారం. ఇలాంటి పరిస్థితిలో ఈ ముద్దుగుమ్మ మాత్రం నటి ప్రేక్షకుల హృదయాల్లో సరైన స్థానం సంపాదించుకోలేదని మహానటి సావిత్రి లా పేరుసంపాదించుకోవాలని అనడం విశేషం. ఇంకా ఈ బ్యూటీ భావాలేమిటో చూద్దాం. ప్రస్తుత నటీమణులు సీజన్  పండ్లు లాంటి వారేనన్నారు.
 
 ఒక్కో సీజన్‌లో ఒక్కోనటి చిత్రం విజయం సాధిస్తుందన్నారు. తాను మాత్రం జయాపజయాలను సమంగా స్వీకరిస్తానని తెలిపారు. కొన్ని చిత్రాల్లో అందాలారబోస్తూ మరికొన్ని చిత్రాల్లో నటనాభినయాన్ని చాటుతున్నట్లు చెప్పారు. దర్శకుడు చెప్పినట్లు నటిస్తానన్నారు. మరో విషయం ఏమిటంటే విజయం అనేది ఏ ఒక్కరితోనో వచ్చేది కాదని, అది సమష్టి కృషితోనే సాధ్యమన్నారు. నెంబర్‌వన్ స్థానంపై ఆశ లేదన్నారు.  నాటి నటీమణులు సావిత్రి, వాణిశ్రీ, జయసుధ, జయప్రద లాంటి వారు ఇప్పటికి 14 ఏళ్ల కు ర్రాళ్లకు తెలిసేలా చిరస్థాయిగా గుర్తింపు పొందారన్నారు. మరో విషయం ఏమిటంటే వారి కాలంలో ఇప్పటిలా ప్రసార సాధనాలు లేవన్నారు.
 
 అయినా వారు పోషించిన పాత్రలు గుర్తుండిపోయాయని పేర్కొన్నారు. అలాంటిది ఇప్పుడు ట్విట్టర్లు, పేస్‌బుక్ లాంటి పలు ప్రసార సాధనాలున్నా తనతో సహా నేటి నాయికలకు, అభిమానుల్లో అంతగా గుర్తింపు లేదన్నది వాస్తవం అన్నారు. అందువల్లే సావిత్రిలా మంచి పాత్రలో నటించి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నానన్నారు. భవిష్యత్ తరాలు కూడా గుర్తుంచుకునేలా మంచి పాత్రలను ఇక ముందు కూడా పోషించాలని  కోరుకుంటున్నానని వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement