చిందేసిన జయప్రద, జయసుధ
హైదరాబాద్: సీనియర్ నటీమణులు జయప్రద, జయసుధ స్టెప్పులతో పాత రోజులను గుర్తు చేశారు. హుషారుగా డాన్స్ చేసి అలరించారు. మాజీ ఎంపీ జయప్రద తనయుడు సిద్ధార్థ వివాహ వేడుకల్లో భాగంగా మంగళవారం రాత్రి సంగీత్ కార్యక్రమం నిర్వహించారు. శంషాబాద్ లోని సుచిర్ టింబర్ లీఫ్ ప్రాంగణంలో జరిగిన ఈ వేడుకకు సినిమా, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
సమాజ్ వాది పార్టీకి చెందిన మాజీ నేత అమర్ సింగ్, సినీ నటుడు మోహన్ బాబు, ఆయన కుమార్తె మంచు లక్ష్మి, సంగీత దర్శకురాలు శ్రీలేఖ తదితరులు హాజరయ్యారు. నాటి అందాల తారలు జయసుధ, జయప్రద పదం కలిపి ఆటపాటలతో ఈవెంట్ కు జోష్ పెంచారు.
నెల 27న హైదరాబాద్ లో సిద్ధార్థ, ప్రవల్లికా రెడ్డి వివాహం జరగనుంది. సిద్ధార్థ్ జయప్రద సోదరి కుమారుడు. జయప్రద అతడిని దత్తత తీసుకున్నట్లు సమాచారం. సిద్ధార్ధ్ తమిళంలో 'ఉయిరే ఉయిరే' అనే చిత్రంలో హీరోగా నటించాడు. ఈ చిత్రం నితిన్ హీరోగా నటించిన 'ఇష్క్' చిత్రానికి రీమేక్ కాగా అందులో అతడి సరసన హన్సిక కథానాయికగా నటించింది.