
జయప్రద
తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ బెంగాలీ ఆడియన్స్‌ను పలకరించడానికి రెడీ అయ్యారు జయప్రద. 2009లో రిలీజైన ‘శేష్ సంగట్’ బెంగాలీలో జయప్రద లాస్ట్ సినిమా. లేటెస్ట్‌గా దర్శకుడు ఆత్వను బోస్ రూపొందించిన ‘ఆత్వజా’ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించారు జయప్రద. కౌషిక్ సేన్, సాహెబ్ భట్టాచార్య నటించిన ఈ చిత్రం నేడు బెంగాలీలో రిలీజ్ కానుంది. ఈ సినిమా గురించి జయప్రద మాట్లాడుతూ – ‘‘తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ బెంగాలీ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. పర్ఫార్మెన్‌కు స్కోప్ ఉన్న రోల్‌తో బెంగాలీ ఆడియన్స్ దగ్గరకు మళ్లీ వెళ్లడం ఎగై్జటింగ్‌గా ఉంది’’ అన్నారు జయప్రద.