
సీనియర్ నటి జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘సువర్ణసుందరి’. సురేంద్ర మాదారపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ చిత్రాన్ని ఎమ్.ఎల్. లక్ష్మీ నిర్మించారు. డాక్టర్ ఎమ్‌వీకే రెడ్డి సమర్పణలో ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై తెరకెక్కించారు. కరోనా ప్రభావంతో వాయిదా పడిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 3న భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
దర్శకుడు సురేంద్ర మాట్లాడుతూ..' కరోనాలో నిలిచిపోయిన మా మూవీ రిలీజ్‌కు ఇదే సరైన సమయం. ఎందుకంటే ఈ మధ్య వచ్చిన బింబిసారా, కార్తికేయ-2, మసూద చిత్రాలకు ఆడియన్స్ మంచి హిట్ అందించారు. అలాంటి జానర్‌లో వస్తున్న మా సువర్ణ సుందరి మూవీకి కూడా మంచి విజయాన్ని ఇస్తారనే నమ్మకంతో ఉన్నాం. ఫిబ్రవరి 3న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం. మీరంతా సక్సెస్ ఇస్తారని ఆశిస్తున్నా.' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో ఇంద్ర, రామ్, సాయికుమార్, కోట శ్రీనివాసరావు, నాగినిడు, అవినాష్,సత్యప్రకాశ్ తదితరులు నటించారు.
Comments
Please login to add a commentAdd a comment