Sakshi Choudhary
-
జయప్రద థ్రిల్లర్ మూవీ 'సువర్ణ సుందరి' .. రిలీజ్ డేట్ ఫిక్స్
సీనియర్ నటి జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘సువర్ణసుందరి’. సురేంద్ర మాదారపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ చిత్రాన్ని ఎమ్.ఎల్. లక్ష్మీ నిర్మించారు. డాక్టర్ ఎమ్వీకే రెడ్డి సమర్పణలో ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై తెరకెక్కించారు. కరోనా ప్రభావంతో వాయిదా పడిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 3న భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. దర్శకుడు సురేంద్ర మాట్లాడుతూ..' కరోనాలో నిలిచిపోయిన మా మూవీ రిలీజ్‌కు ఇదే సరైన సమయం. ఎందుకంటే ఈ మధ్య వచ్చిన బింబిసారా, కార్తికేయ-2, మసూద చిత్రాలకు ఆడియన్స్ మంచి హిట్ అందించారు. అలాంటి జానర్లో వస్తున్న మా సువర్ణ సుందరి మూవీకి కూడా మంచి విజయాన్ని ఇస్తారనే నమ్మకంతో ఉన్నాం. ఫిబ్రవరి 3న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం. మీరంతా సక్సెస్ ఇస్తారని ఆశిస్తున్నా.' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో ఇంద్ర, రామ్, సాయికుమార్, కోట శ్రీనివాసరావు, నాగినిడు, అవినాష్,సత్యప్రకాశ్ తదితరులు నటించారు. -
కోలా బాలకృష్ణ హీరోగా 'నేనెవరు?'
తెలుగు–తమిళ భాషల్లో సుప్రసిద్ధులైన ఎడిటర్ కోలా భాస్కర్ తనయుడు కోలా బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం ‘నేనెవరు’. సాక్షీ చౌదరి కథానాయికగా నటించారు. నిర్ణయ్ పల్నాటి దర్శకత్వంలో కౌశల్ క్రియేషన్స్ పతాకంపై భీమినేని శివప్రసాద్–తన్నీరు రాంబాబు నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్ణయ్ పల్నాటి, భీమినేని శివప్రసాద్ – తన్నీరు రాంబాబు మాట్లాడుతూ– ‘‘విభిన్న కథతో రూపొందిన చిత్రమిది. లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కోలా భాస్కర్ ఎడిటింగ్ చేసిన చివరి (గత ఏడాది నవంబర్‌లో ఆయన మరణించారు) చిత్రమిది. త్వరలో టీజర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు: పూనమ్ చంద్, కుమావత్, కిరణ్ కుమార్ మోటూరి, కెమెరా: సామల భాస్కర్, సంగీతం: ఆర్.జి.సారథి. -
600 ఏళ్ల క్రితం ఏం జరిగింది?
ఆరువందల సంవత్సరాల క్రితం ఒక రాజు చేసిన తప్పిదం ఏంటి? దాని వల్ల తరతరాల వాళ్లు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘సువర్ణ సుందరి’. ‘చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతోంది’ అనేది ఉపశీర్షిక. జయప్రద, పూర్ణ, సాక్షీచౌదరి ప్రధాన పాత్రల్లో ఎమ్.ఎస్.ఎన్. సూర్య దర్శకత్వంలో తెరకెక్కింది. ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31న తెలుగు, కన్నడలో విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌కు 10 లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ సందర్భంగా ఎం.ఎస్.ఎన్. సూర్య మాట్లాడుతూ– ‘‘సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. ట్రైలర్‌కి మంచి స్పందన రావడంతో చాలా ఆనందంగా ఉన్నాను. ప్రొడ్యూసర్‌తో కాస్త ఎక్కువ ఖర్చుపెట్టించావని చాలామంది అన్నారు. కానీ, స్టోరీ అలా డిమాండ్ చేసింది. ‘అరుంధతి, మగధీర’ టైప్‌లో మా సినిమా ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు థ్రిల్లింగ్‌గా ఉంటుంది’’ అన్నారు. లక్ష్మీ మాట్లాడుతూ– ‘‘అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువే అయింది. అవుట్ పుట్ బాగా వచ్చింది’’ అన్నారు. కెమెరామేన్ ఈశ్వర్ ఎల్లు మహంతి, ఫైట్‌మాస్టర్ రామ్ సుంకర మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్. -
సస్పెన్స్ సుందరి
జయప్రద, పూర్ణ, సాక్షీచౌదరి ప్రధానపాత్రల్లో సూర్య ఎమ్.ఎస్.ఎన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సువర్ణసుందరి’. ‘చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతోంది’ అన్నది ఉపశీర్షిక. ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మి నిర్మించిన ఈ సినిమా ఈనెల 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా సూర్య ఎమ్.ఎస్.ఎన్ మాట్లాడుతూ– ‘‘సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. విజువల్ ఎఫెక్ట్స్‌కి ఏడాది పట్టింది. అయితే సినిమా ఔట్పుట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెలలోనే పాటలను గ్రాండ్‌గా విడుదల చేస్తున్నాం. పబ్లిసిటీ కూడా విభిన్నంగా చేస్తున్నాం’’ అన్నారు. ‘‘భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా సాంకేతికంగా అద్భుతంగా మా సినిమా నిర్మించాం. తెలుగు, కన్నడ, తమిళ్ భాషల్లో ఈనెల 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం’’ అని లక్ష్మి అన్నారు. ఇంద్ర, రామ్ మద్దుకూరి, సాయికుమార్, కోటా శ్రీనివాసరావు, ముక్తర్‌ఖాన్, నాగినీడు, సత్యప్రకాష్, అవినాష్ తదితరులు నటì ంచిన ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీ్తక్, కెమెరా: ఎల్లుమహంతి. -
మూడు జన్మల థ్రిల్
జయప్రద, పూర్ణ, సాక్షీ చౌదరి ప్రధాన పాత్రల్లో ఎం.ఎస్.ఎన్. సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సువర్ణసుందరి’. ‘చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతోంది’ అన్నది ఉపశీర్షిక. ఎస్. టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఎం.ఎస్.ఎన్. సూర్య మాట్లాడుతూ– ‘‘మూడు జన్మల కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. కొంతకాలంగా తెలుగులో స్క్రీన్‌ప్లే బేస్డ్ సినిమాలకు ఆదరణ లభిస్తోంది. మా సినిమాలోనూ ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లే ఉంటుంది. విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఏడాది పట్టింది’’ అన్నారు. ‘‘సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో సాంకేతికంగా అద్భుతంగా ఉంటుంది. ప్రస్తుతం సెన్సార్‌కు సిద్ధమైన మా చిత్రాన్ని తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాత లక్ష్మీ అన్నారు. ఇంద్ర, రామ్ మద్దుకూరి, సాయికుమార్, కోట శ్రీనివాసరావు, ముక్తార్ ఖాన్, నాగినీడు, సత్యప్రకాష్, అవినాష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, కెమెరా: ఎల్లు మహంతి. -
చిన్న సినిమా బతకాలి
‘‘ఇప్పుడు పెద్ద స్థాయిలో ఉన్న ప్రతి నిర్మాత, ప్రతి దర్శకుడు ఒకప్పుడు చిన్న చిత్రాలు తీసినవారే. చిన్న సినిమా బతకాలి. ప్రేక్షకులు చిన్న సినిమాలను సపోర్ట్ చేయాలి. ప్రతి ఆర్టిస్ట్ ప్రచారంలో భాగం అయితేనే ఆ సినిమా స్థాయి ఏంటో ప్రేక్షకుడికి అర్థమవుతుంది’’ అన్నారు నిర్మాత సి.కల్యాణ్. సాక్షీ చౌదరి, అభినవ్ సర్దార్ జంటగా ఆది శేషసాయి రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మ్యాగ్నెట్’. లార్డ్ శివ క్రియేషన్స్‌పై ఎం.శివారెడ్డి నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో ఆది శేషసాయి రెడ్డి మాట్లాడుతూ– ‘‘తల్లిదండ్రులు పట్టించుకోకపోతే పిల్లల జీవితాలు ఎలా నాశనం అవుతాయి? అనేది ముఖ్యకథ’’ అన్నారు. సంగీత దర్శకుడు కిషన్ కావాడియా, కెమెరామేన్ తోట వి. రమణ, పాటల రచయిత మౌనశ్రీ మల్లిక్, రచయిత వెలిగొండ శ్రీనివాస్, డిస్ట్రిబ్యూటర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
బ్యాగ్రౌండ్ చెప్పుకోలేదు
‘‘నేను విజయవాడలో పుట్టాను. నటనపై ఉన్న ఆసక్తితో మధు ఫిలిం ఇన్స్టిట్యూట్లో శిక్షణ తీసుకున్నాను. నిర్మాత దాసరి కిరణ్‌కుమార్‌గారి కజిన్‌ని. రామదూత క్రియేషన్స్ బ్యానర్ మాదే. కానీ, నెనెప్పుడూ నా బ్యాగ్రౌండ్ చెప్పకుండానే ఆడిషన్స్‌కి వెళ్లాను. ‘వంగవీటి’ సినిమా చేస్తుండగా సూర్యగారు ‘సువర్ణసుందరి’ సినిమాకి చాన్స్ ఇచ్చారు’’ అని హీరో ఇంద్ర అన్నారు. జయప్రద, పూర్ణ, సాక్షీ చౌదరి ప్రధానపాత్రల్లో సూర్య ఎమ్.ఎస్.ఎన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సువర్ణసుందరి’. ఎమ్.ఎల్. లక్ష్మీ నిర్మించిన ఈ చిత్రం మార్చి రెండో వారంలో విడుదల కానుంది. ఈ సినిమాలో హీరోగా నటించిన ఇంద్ర మాట్లాడుతూ– ‘‘రామ్‌గోపాల్‌వర్మగారి దర్శకత్వంలో వచ్చిన ‘వంగవీటి’ చిత్రంలో ఓ ముఖ్య పాత్రను పోషించాను. ‘సువర్ణసుందరి’లో తొలిసారి లీడ్ రోల్ చేశా. ఈ అవకాశం కల్పించిన డైరెక్టర్ సూర్యగారికి రుణపడి ఉంటాను. ఈ చిత్రంలో రెండు స్క్రీన్‌ప్లేలు నడుస్తుంటాయి. ఒకటి పీరియాడికల్, ఇంకోటి ప్రస్తుతం. ఈ రెండు స్క్రీన్ప్లేల మధ్య నాదొక ఫన్ అండ్ రొమాంటిక్ క్యారెక్టర్. ‘సువర్ణసుందరి’ అనే ఓ విగ్రహానికి సంబంధించిన సినిమా ఇది. ఈ చిత్రం విడుదల తర్వాత నాకు మరిన్ని అవకాశాలు వస్తాయనే నమ్మకం ఉంది. ప్రస్తుతం ‘రామచక్కని సీత’ చిత్రంలో లీడ్ రోల్ చేస్తున్నాను. ఓంకార్‌గారి అసిస్టెంట్ శ్రీహర్ష మండాగారితో మరో సినిమా చేశాను’’ అన్నారు. -
భవిష్యత్తుని వెంటాడుతుంది
‘‘సువర్ణసుందరి’ లాంటి సినిమాలు రావడం పరిశ్రమకి చాలా అవసరం. దాని వల్ల కొత్త టెక్నీషియన్స్ పరిచయం అవుతారు. సూర్య రాసుకున్న కథ చాలా బాగుంది. తప్పకుండా ఇది ఓ మంచి సినిమా అవుతుంది’’ అని దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. జయప్రద, పూర్ణ, సాక్షీ చౌదరి ప్రధాన పాత్రల్లో సూర్య ఎమ్.ఎస్.ఎన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సువర్ణసుందరి. ‘చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతోంది’’ అన్నది ఉపశీర్షిక. ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మీ నిర్మించిన ఈ చిత్రం అతి త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ని దర్శకులు బి.గోపాల్ విడుదల చేశారు. డైరెక్టర్ సూర్య మాట్లాడుతూ– ‘‘సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. నటీనటులందరూ నాకు చాలా సహకరించారు. విజువల్ ఎఫెక్ట్స్‌కి ఏడాది పట్టింది. అందుకే సినిమా విడుదల లేట్ అయింది. అయినా అవుట్‌పుట్ మాత్రం చాలా బాగా వచ్చింది’’ అన్నారు. ‘‘సువర్ణసుందరి’ ఎక్స్ట్రార్డినరీ చిత్రం. హీరోయిన్స్ చాలా చక్కగా చేశారు. తెలుగు సినీ పరిశ్రమకు అందగత్తె జయప్రద. ఆవిడ కూడా ఈ చిత్రంలో నటించారు. టీమ్‌కి ఆల్ ద బెస్ట్’’ అని డైరెక్టర్ సాగర్ అన్నారు. ‘‘ఇది చాలా మంచి సినిమా. పాటలు. ఫైట్స్ చాలా బాగా వచ్చాయి’’ అన్నారు సాక్షీ చౌదరి. ‘‘సహనం అంటే అది సూర్యగారి నుంచే నేర్చుకోవాలి. చాలా ఓర్పుగా మంచి నటన రాబట్టుకున్నారాయన’’ అని పూర్ణ అన్నారు. హీరోలు ఇంద్ర, రామ్, రచయిత విజయేంద్రప్రసాద్, రైటర్ ప్రదీప్, స్టంట్ మాస్టర్ రామ్ సుంకర మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, కెమెరా: ఎల్లుమంతి ఈశ్వర్. -
చరిత్ర వెంటాడుతోంది
జయప్రద, పూర్ణ, సాక్షీ చౌదరి ప్రధాన పాత్రల్లో సూర్య ఎమ్.ఎస్.ఎన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సువర్ణ సుందరి’. ‘చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతోంది’ అన్నది ఉపశీర్షిక. ఎస్. టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మీ నిర్మించారు. సాయి కార్తీక్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘సాహో సార్వభౌమి’ పాటను విడుదల చేశారు. సాయి కార్తీక్ మాట్లాడుతూ– ‘‘సువర్ణసుందరి’ ఓ భారీ సూపర్ నేచురల్ థ్రిల్లర్. ప్రేక్షకులు థ్రిల్ అయ్యేలా సూర్య ఈ సినిమా తెరకెక్కించారు. నా సినీ కెరీర్లో ఇది ఓ అత్యుత్తమ చిత్రంగా నిలిచిపోతుంది. ఇందులోని అన్ని పాటలు వేటికవే విభిన్నంగా ఉంటాయి. నాకు వ్యక్తిగతంగా ఇష్టమైన పాట ‘సాహో సార్వభౌమి’. మ్యూజికల్‌గా, విజువల్‌గా బాగా వచ్చిన ఈ పాట అందరినీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నా’’ అన్నారు. ‘‘సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కించాం. అతి త్వరలోనే సినిమా విడుదల చేయనున్నాం’’ అన్నారు లక్ష్మీ. ఈ చిత్రానికి కెమెరా: ఎలు మహంతి. -
సాక్షి పసిడి పంచ్
బుడాపెస్ట్: ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో సాక్షి (57 కేజీలు) స్వర్ణ పతకం నెగ్గింది. తుదిపోరులో నికోలినా కాసిక్ (క్రొయేషియా)పై సాక్షి విజయం సాధించింది. మనీష (64 కేజీలు), అనామిక (51 కేజీలు) ఫైనల్స్‌లో ఓడి రజతాలతో సరిపెట్టుకున్నారు. డెస్టినీ గార్సియా (అమెరికా) చేతిలో అనామిక; గెమ్మా (ఇంగ్లండ్) చేతిలో మనీష ఓటమి పాలయ్యారు. ఓవరాల్‌గా ఈ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు 2 స్వర్ణాలు, 2 రజతాలు, 6 కాంస్యాలతో మొత్తం 10 పతకాలు సాధించారు. -
డాటర్ ఆఫ్ పూర్ణ
ఈ మధ్య కాలంలో తల్లి పాత్రల్లో కనిపిస్తోన్న జయప్రద ఇప్పుడు కూతురిగా కనిపించనున్నారు. అది కూడా పూర్ణకి కూతురిగా. రామ్, ఇంద్ర, జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ముఖ్య తారలుగా సూర్య ఎమ్.ఎస్.ఎన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ సువర్ణ సుందరి’. ఎమ్.వి.కె. రెడ్డి సమర్పణలో ఎస్ టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మీ నిర్మించారు. ‘చరిత్ర భవిష్యత్‌ను వెంటాడుతోంది’ అనేది ట్యాగ్‌లైన్. ‘‘టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. హిస్టారికల్ అడ్వెంచర్‌గా రూపొందిన ఈ చిత్రంలో పూర్ణ కూతురిగా జయప్రద నటించారు. ఆమె పాత్ర సినిమాలో హైలైట్‌గా ఉంటుంది. దర్శకుడు సూర్య టేకింగ్, విజువల్ గ్రాఫిక్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తాయి. సాయి కార్తీక్ సంగీతం, ఎలు మహంతి విజువల్స్ సినిమాకు ప్లస్ పాయింట్స్. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం’’ అని పేర్కొంది చిత్రబృందం. కోట శ్రీనివాసరావు, నాగినీడు, సత్య ప్రకాష్ నటించారు. -
యూత్ ఇలా ఉందేంటి రాజా
‘పోటుగాడు’ ఫేమ్ సాక్షీ చౌదరి ప్రధాన పాత్రలో, పర్వీన్ రాజ్, పోసాని కృష్ణ మురళి ముఖ్య తారలుగా రూపొందిన సినిమా ‘యేంటి రాజా యూత్ ఇలా ఉంది’. ఆది శేషసాయి రెడ్డి దర్శకత్వంలో లార్డ్ శివ క్రియేషన్స్ పతాకంపై ఎమ్వీఎస్ సాయి క్రిష్ణారెడ్డి నిర్మించారు. కిషన్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. దర్శకులు సముద్ర, దేవీప్రసాద్, నిర్మాత ‘సింధూరపువ్వు’ కృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సాక్షీ చౌదరి మాట్లాడుతూ– ‘‘ప్రస్తుతం చాలామంది తల్లిదండ్రులు సంపాదన కోసం పరుగులు తీస్తూ పిల్లల పెంపకాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. తల్లిదండ్రుల ఆదరణ కరువైన పిల్లలు ఎలా చెడు దారి పట్టే అవకాశాలు ఉన్నాయో మా చిత్రంలో చూపిస్తున్నాం’’ అన్నారు. ‘‘ఇదొక యూత్‌ఫుల్ ఎంటర్టైనర్. ఈ చిత్రం ద్వారా సొసైటీకి మూడు సందేశాలు ఇస్తున్నా. అవేంటి అన్నది తెరపై చూడాలి’’ అన్నారు ఆది శేషసాయి రెడ్డి. ‘‘సెన్సార్ పనులు పూర్తయ్యాయి. ఫస్ట్ కాపీ సిద్ధంగా ఉంది. త్వరలోనే విడుదల చేస్తాం’’ అని చిత్ర సమర్పకులు నర్రా సుబ్బయ్య అన్నారు. -
డూపు లేకుండా!
‘మౌనమేల నోయి..’ అంటూ సున్నితంగా నటించడమే కాదు.. అవసరమైతే డూప్ లేకుండా ఫైట్స్ చేసేస్తారు జయప్రద. ప్రస్తుతం నటిస్తోన్న ‘సువర్ణ సుందరి’లో క్లైమాక్స్ ఫైట్స్‌ని డూప్ లేకుండా చేశారామె. ఫిఫ్టీ ప్లస్ ఏజ్‌లో ఆమె రిస్కీ ఫైట్ చేయడం చిత్రబృందాన్ని ఆశ్చర్యపరిచింది. జయప్రద ముఖ్య పాత్రలో రూపొందుతోన్న ఈ ‘సువర్ణ సుందరి’లో పూర్ణ, సాక్షీచౌదరి, రామ్, ఇంద్ర, సాయికుమార్, నాగినీడు, కోట శ్రీనివాసరావు ఇతర పాత్రధారులు. ‘చరిత్ర భవిష్యత్తును వెంటాడుతుంది’ అన్నది ట్యాగ్ లైన్. సూర్య ఎమ్.ఎస్.ఎన్. దర్శకత్వంలో ఎమ్.ఎల్.లక్ష్మి నిర్మిస్తున్నారు. ‘‘గతానికి భవిష్యత్తుకు మధ్య వారధిగా జయప్రదగారి పాత్ర ఉంటుంది. పూర్ణకి కూతురిగా ఆమె నటిస్తున్నారు. తల్లీకూతుళ్ల మధ్య భావోద్వేగాలు ఈ సినిమాకు హైలైట్. జయప్రదగారిది ఛాలెంజింగ్ రోల్. ఫైట్స్‌ని సవాల్‌గా తీసుకుని చేశారు’’ అన్నారు దర్శకుడు. ‘‘ప్రేక్షకులను థ్రిల్‌కి గురి చేసే చిత్రమిది. త్వరలో టీజర్, నవంబర్‌లో సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు నిర్మాత లక్ష్మి. -
యువత ఆలోచనలేంటి?
‘పోటుగాడు’, ‘జేమ్స్ బాండ్’ చిత్రాల కథానాయిక సాక్షీ చౌదరి ప్రధాన పాత్రలో ‘ప్లేయర్’ ఫేం పర్వీన్ రాజ్, పూజిత జంటగా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా ఓ చిత్రం తెరకెక్కుతోంది. లార్డ్ శివ క్రియేషన్స్ పతాకంపై శేషసాయి మరుప్రోలు దర్శకత్వంలో ఎంవీఎస్ సాయి కృష్ణారెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘యువతరం ఆలోచనలు ఎలా ఉన్నాయి? వాటి వల్ల జరిగే నష్టం ఏంటి? ఆ ఆలోచనల నుంచి తమ పిల్లల్ని తల్లిదండ్రులు ఎలా కాపాడుకోవాలనే కథాంశంతో తెరకెక్కిస్తున్నాం. ఈ నెలాఖరుకు రెండో షెడ్యూల్ పూర్తి చేస్తాం’’ అని తెలిపారు. ‘‘క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా తెరకెక్కిస్తున్నాం. సాక్షీ చౌదరి పాత్ర ఇందులో ఆకట్టుకునే విధంగా ఉంటుంది. అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కిస్తున్నాం’’ అని నిర్మాత పేర్కొన్నారు. పోసాని కృష్ణమురళి, సప్తగిరి, పూజిత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కిషన్ కవాడియా, కెమేరా: కె.శంకరరావు.