
‘మౌనమేల నోయి..’ అంటూ సున్నితంగా నటించడమే కాదు.. అవసరమైతే డూప్ లేకుండా ఫైట్స్ చేసేస్తారు జయప్రద. ప్రస్తుతం నటిస్తోన్న ‘సువర్ణ సుందరి’లో క్లైమాక్స్ ఫైట్స్‌ని డూప్ లేకుండా చేశారామె. ఫిఫ్టీ ప్లస్ ఏజ్‌లో ఆమె రిస్కీ ఫైట్ చేయడం చిత్రబృందాన్ని ఆశ్చర్యపరిచింది. జయప్రద ముఖ్య పాత్రలో రూపొందుతోన్న ఈ ‘సువర్ణ సుందరి’లో పూర్ణ, సాక్షీచౌదరి, రామ్, ఇంద్ర, సాయికుమార్, నాగినీడు, కోట శ్రీనివాసరావు ఇతర పాత్రధారులు.
‘చరిత్ర భవిష్యత్తును వెంటాడుతుంది’ అన్నది ట్యాగ్ లైన్. సూర్య ఎమ్.ఎస్.ఎన్. దర్శకత్వంలో ఎమ్.ఎల్.లక్ష్మి నిర్మిస్తున్నారు. ‘‘గతానికి భవిష్యత్తుకు మధ్య వారధిగా జయప్రదగారి పాత్ర ఉంటుంది. పూర్ణకి కూతురిగా ఆమె నటిస్తున్నారు. తల్లీకూతుళ్ల మధ్య భావోద్వేగాలు ఈ సినిమాకు హైలైట్. జయప్రదగారిది ఛాలెంజింగ్ రోల్. ఫైట్స్‌ని సవాల్‌గా తీసుకుని చేశారు’’ అన్నారు దర్శకుడు. ‘‘ప్రేక్షకులను థ్రిల్‌కి గురి చేసే చిత్రమిది. త్వరలో టీజర్, నవంబర్‌లో సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు నిర్మాత లక్ష్మి.
Comments
Please login to add a commentAdd a comment