Suvarna Sundari
-
ఓటీటీలోకి వచ్చేసిన రెండు తెలుగు సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలు వచ్చిన తర్వాత మూవీ లవర్స్‌కి సినిమాలు చూడటం చాలా సులభమైపోయింది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చాలా సినిమాల్ని ఆదరిస్తున్నారు. ఇందకు తగ్గట్లే ఓటీటీలు కూడా స్టార్ హీరోల మూవీస్‌తో పాటు చోటామోటా చిత్రాల్ని కూడా కొనేస్తున్నాయి. కాకపోతే స్ట్రీమింగ్‌లోకి మాత్రం చాలా ఆలస్యంగా తీసుకొస్తున్నాయి. అలా గతేడాది థియేటర్లలోకి వచ్చిన రెండు సినిమాలు ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీలోకి రిలీజైపోయాయి. (ఇదీ చదవండి: 'మళ్లీ చూస్తానో లేదో'.. కన్నీళ్లు పెట్టిస్తున్న నటి పావలా శ్యామల మాటలు!) జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'సువర్ణ సుందరి'. దాదాపు నాలుగైదేళ్లుగా షూటింగ్ జరుపుకొన్న ఈ చిత్రం.. గతేడాది ఫిబ్రవరిలో థియేటర్లలో రిలీజైంది. సూపర్ నేచురల్ థ్రిల్లర్ కథని సరిగా డీల్ చేయలేదు. దీంతో ఎవరికీ తెలియకుండానే థియేటర్లలోకి వచ్చి వెళ్లిపోయింది. ఇప్పుడు దీన్ని అమెజాన్ ప్రైమ్‌లోకి తీసుకొచ్చేశారు. గతేడాది జూన్‌లో రిలీజైన 'భారీ తారాగణం' సినిమా కూడా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోక వచ్చేసింది. ఐదుగురు వేర్వేరు అమ్మాయిల జీవితాల్లో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? వాటి నుంచి ఎలా బయటపడ్డారు? అనే కాన్సెప్ట్‌తో ఈ మూవీ తీశారు. యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ స్టార్స్ ఎవరూ లేకపోవడంతో జనాల్ని దీన్ని లైట్ తీసుకున్నారు. విచిత్రం ఏంటంటే ఈ రెండింటిని దాదాపు ఏడాది తర్వాత ప్రైమ్‌లోకి తీసుకొచ్చారు. కానీ రెంట్ విధానంలో స్ట్రీమింగ్ అవుతుండటమే విచిత్రంగా అనిపించింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) -
‘సువర్ణ సుందరి’మూవీ రివ్యూ
టైటిల్: సువర్ణ సుందరి నటీనటులు: జయప్రద, పూర్ణ, సాక్షి, ఇంద్ర, రామ్, సాయికుమార్, కోట శ్రీనివాసరావు, నాగినిడు, అవినాష్,సత్యప్రకాశ్ తదితరులు నిర్మాణ సంస్థ: ఎస్ టీమ్ పిక్చర్స్ నిర్మాత: ఎమ్.ఎల్. లక్ష్మీ రచన,దర్శకత్వం: సురేంద్ర మాదారపు సంగీతం: సాయి కార్తీక్ సినిమాటోగ్రఫీ: యెల్లుమహంతి ఈశ్వర్ ఎడిటింగ్: ప్రవీణ్ పూడి విడుదల తేది: ఫిబ్రవరి 3, 2023 కథేంటంటే.. ఈ సినిమా కథంతా.. సువర్ణ సుందరి అనే విగ్రహం చుట్టూ తిరుగుతుంది. 300 ఏళ్ల క్రితం కర్ణాటకలోని కాలక్కల్ సంస్థానంలో త్రినేత్రి అమ్మవారి విగ్రహాలను తయారు చేసే ఓ వ్యక్తి ఆ విగ్రహంలో దుష్టశక్తిని నింపుతాడు. దాని కారణంగా ఆ రాజ్యమే నాశనం అవుతుంది. దీంతో గ్రామస్తులంతా సువర్ణ సుందరి విగ్రహాన్ని భూస్థాపితం చేస్తారు. అయితే 300 ఏళ్ల తర్వాత ఓ వ్యక్తి పొరపాటున ఆ విగ్రహాన్ని బయటకు తీయడంతో అతని ఫ్యామిలీ అంతా చనిపోతుంది. స్వాతంత్రానంతరం ఆ విగ్రహం ఓ పాత బంగ్లా చేరుతుంది. ఆ బంగ్లాలోకి దిగిన కలెక్టర్ భార్య అంజలి(పూర్ణ)కి ఆ విగ్రహం దొరుకుతుంది. ఆమె సువర్ణ సుందరిని టచ్ చేయగానే దుష్టశక్తి ఆమెలో చేరిపోతుంది. దీంతో తన భర్తను, మామను అంజలి చంపేస్తుంది. తన కూతురు విశాలాక్షి (జయ ప్రద)ను కాపాడుకునేందుకు అంజలి ఆ విగ్రహంతో ఆత్మాహుతి చేసుకుంటుంది. కానీ మళ్లీ అంజలి కొన్నేళ్ల తరువాత జన్మిస్తుంది. అలా మళ్లీ అంజలి చేతికే ఆ విగ్రహం దొరుకుతుంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలేంటి? తన తల్లిని కాపాడుకునేందుకు విశాలాక్షి చేసే ప్రయత్నం ఏంటి? సాక్షి (సాక్షి చౌదరి)కి ఆ విగ్రహంతో ఉన్న సంబంధం ఏంటి? ఈ కథలో పోలీస్ ఆఫీసర్ గుణ (సాయి కుమార్) పాత్ర ఏంటి? విగ్రహం వెనుకున్న రహస్యం ఏంటనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. పురాతన బంగ్లా, సంస్థానం.. అందులో దుష్టశక్తి ఉండడం..దాని వల్ల ప్రజలకు హానీ కలగడం..ఈ తరహా కథలను మనం చూశాం. కానీ సువర్ణ సుందరి కథలో కొత్తదనం ఏంటంటే విగ్రహంలోనే దుష్టశక్తి ఉండడం. అది ఎవరి దగ్గర ఉంటే వాళ్లు రాక్షసుల్లా మారిపోవడం.. చుట్టుపక్కల వాళ్లను చంపి ఆ రక్తంతో దాహం తీర్చుకోవడం..ఇది వినడానికే ఆసక్తికరంగా ఉంది కదా.. దర్శకుడు సురేంద్ర అంతే ఆసక్తిగా తెరపై చూపించాడు. కథలో లోపాలు ఉన్నప్పటికీ గ్రాఫిక్స్‌తో వాటిని కప్పిపుచ్చారు. ఫస్టాఫ్ అంతా సువర్ణ సుందరీ విగ్రహం చుట్టే సాగుతుంది. కొన్ని సీన్స్ భయపెడతాయి. మిగతావి సాదాసీదాగా సాగుతాయి. కథ ముందుకు వెళ్తున్న కొద్దీ కాస్త నిదానంగా సాగినట్టు అనిపిస్తుంది. సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. సువర్ణ సుందరి నేపథ్యం తెలిశాక ప్రేక్షకులు ఆశ్యర్యపోతారు. అయితే దర్శకుడు ఎంచుకున్న పాయింట్ గొప్పగా ఉన్నా..మేకింగ్ విషయంలో కాస్త తడబడ్డాడు. కథని ఇంకాస్త బలంగా రాసుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. హారర్ చిత్రాలను ఇష్టపడే వారికి సువర్ణ సుందరి నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. ఈ చిత్రంలో అంజలి రెండు గెటప్పుల్లో కనిపిస్తుంది. ప్రజెంట్ సీన్లలో మోడ్రన్‌గా కనిపిస్తే.. ప్లాష్‌బ్యాక్ సీన్లలో ఎంతో నిండుగా, హుందాగా కనిపిస్తారు. సాక్షి అయితే సెకండాఫ్‌లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ సీన్లో మెప్పిస్తుంది. జయప్రద మరోసారి తన అనుభాన్ని తెరపై చూపించారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఆమె నటన అదిరిపోతుంది. పోలీసు పాత్రలో సాయి కుమార్ ఎప్పటిమాదిరే ఒదిగిపోయాడు. చర్చ్ ఫాదర్‌గా కోట శ్రీనివాసరావు, రాజగురువుగా నాగినీడు, మహారాజుగా అవినాష్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాయి కార్తీక్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు పర్వాలేదు. యెల్లుమహంతి ఈశ్వర్ సినిమాటోగ్రఫీ, విజువల్స్ బాగున్నాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
‘సువర్ణ సుందరి'కి దిల్ రాజు సాయం
సీనియర్ నటి జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘సువర్ణసుందరి’. డాక్టర్ ఎమ్‌వికె రెడ్డి సమర్పణలో ఎస్ టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేంద్ర మాదారపు దర్శకత్వం వహించారు. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఫిబ్రవరి 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఫ్రీ రిలీజ్ ట్రైలర్, డిజిటల్ టికెట్ ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు లాంచ్ చేసి చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. మంచి టెక్నికల్ వాల్యూస్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా చిత్రం మంచి అనుభూతిని ఇస్తుందని ఆశిస్తున్నాం’అని దర్శకుడు సురేంద్ర మాదారపు అన్నారు. కాగా.. ఈ చిత్రంలో ఇంద్ర, రామ్, సాయికుమార్, కోట శ్రీనివాసరావు, నాగినిడు, అవినాష్,సత్యప్రకాశ్ తదితరులు నటించారు. -
జయప్రద థ్రిల్లర్ మూవీ 'సువర్ణ సుందరి' .. రిలీజ్ డేట్ ఫిక్స్
సీనియర్ నటి జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘సువర్ణసుందరి’. సురేంద్ర మాదారపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ చిత్రాన్ని ఎమ్.ఎల్. లక్ష్మీ నిర్మించారు. డాక్టర్ ఎమ్వీకే రెడ్డి సమర్పణలో ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై తెరకెక్కించారు. కరోనా ప్రభావంతో వాయిదా పడిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 3న భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. దర్శకుడు సురేంద్ర మాట్లాడుతూ..' కరోనాలో నిలిచిపోయిన మా మూవీ రిలీజ్‌కు ఇదే సరైన సమయం. ఎందుకంటే ఈ మధ్య వచ్చిన బింబిసారా, కార్తికేయ-2, మసూద చిత్రాలకు ఆడియన్స్ మంచి హిట్ అందించారు. అలాంటి జానర్లో వస్తున్న మా సువర్ణ సుందరి మూవీకి కూడా మంచి విజయాన్ని ఇస్తారనే నమ్మకంతో ఉన్నాం. ఫిబ్రవరి 3న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం. మీరంతా సక్సెస్ ఇస్తారని ఆశిస్తున్నా.' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో ఇంద్ర, రామ్, సాయికుమార్, కోట శ్రీనివాసరావు, నాగినిడు, అవినాష్,సత్యప్రకాశ్ తదితరులు నటించారు. -
‘సువర్ణ సుందరి’ సరికొత్త అనుభూతిని ఇస్తుంది: దర్శకుడు సురేంద్ర
జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం ‘సువర్ణ సుందరి’. చరిత్ర భవిష్యత్తును వెంటాడుతుంది అనేది ట్యాగ్‌లైన్. మాదారపు సురేంద్ర దర్శకత్వంలో ఎమ్.ఎల్. లక్ష్మి నిర్మించిన ఈ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ మూవీ ఫిబ్రవరి 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు సురేంద్ర మాట్లాడుతూ – ‘‘గతానికి భవిష్యత్తుకు మధ్య వారధిలా జయప్రదగారి పాత్ర ఉంటుంది. కరోనా పరిస్థితుల కారణంగా సినిమా లేట్‌గా విడుదలవుతోంది. విజువల్ పరంగా కావొచ్చు, కంటెంట్ పరంగా కావొచ్చు.. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చే చిత్రం ఇది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, సహనిర్మాత: శ్రీకాంత్ పండుగుల. -
మా కష్టం తెరపై కనపడుతుంది
జయప్రద, పూర్ణ, సాక్షీ చౌదరి, రామ్, ఇంద్ర ముఖ్య తారాగణంగా దర్శకుడు ఎం.ఎస్.ఎన్ సూర్య తెరకెక్కించిన చిత్రం ‘సువర్ణసుందరి’. చరిత్ర భవిష్యత్‌ని వెంటాడుతుంది అనేది ఉపశీర్షిక. ఎమ్.ఎల్. లక్ష్మీ నిర్మించారు. ఈ నెల 31న ఈ చిత్రం విడుదల కానుంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం ప్రీ–రిలీజ్ ఈవెంట్లో ఇంద్ర పుట్టినరోజు వేడుకలు జరిగాయి. కేక్ కట్ చేసిన తర్వాత ఇంద్ర మాట్లాడుతూ– ‘‘టీమ్ అందరూ చాలా కష్టపడ్డారు. ఈ టీమ్‌తో మరో సినిమా చేయాలని ఉంది. దర్శక–నిర్మాతల కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. ‘‘సినిమా ఉత్కంఠభరితంగా ఉంటుంది. దర్శకుడు సూర్య చాలా హార్డ్‌వర్క్ చేశారు’’ అన్నారు హీరో రామ్. ‘‘టీమ్ పడిన కష్టం తెరపై తెలుస్తుంది. ఇందులో నాది మంచి పాత్ర’’ అన్నారు పూర్ణ. ‘‘నా కెరీర్లో స్పెషల్ చిత్రం ఇది. గ్లామర్, యాక్షన్, లవ్, థ్రిల్ ఇలా అన్ని అంశాలను దర్శకుడు సూర్య హైలైట్‌గా తెరకెక్కించారు’’ అన్నారు హీరోయిన్ సాక్షి. ‘‘ఇది టెక్నీషియన్స్ చిత్రం. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు థ్రిల్లింగ్‌గా ఉంటుంది. కథ డిమాండ్‌కు తగ్గట్టుగా క్వాలిటీతో సినిమా చేశాం. దాదాపు 45 నిమిషాల గ్రాఫిక్ వర్క్ ఉండటంతో సినిమా విడుదల లేట్ అయింది’’ అన్నారు సూర్య. ‘‘నటీనటుల కష్టం, దర్శకుడు సూర్య టేకింగ్ ఈ సినిమాకు ప్రధాన బలం’’ అన్నారు సంగీతదర్శకుడు సాయి కార్తీక్. -
600 ఏళ్ల క్రితం ఏం జరిగింది?
ఆరువందల సంవత్సరాల క్రితం ఒక రాజు చేసిన తప్పిదం ఏంటి? దాని వల్ల తరతరాల వాళ్లు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘సువర్ణ సుందరి’. ‘చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతోంది’ అనేది ఉపశీర్షిక. జయప్రద, పూర్ణ, సాక్షీచౌదరి ప్రధాన పాత్రల్లో ఎమ్.ఎస్.ఎన్. సూర్య దర్శకత్వంలో తెరకెక్కింది. ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31న తెలుగు, కన్నడలో విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌కు 10 లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ సందర్భంగా ఎం.ఎస్.ఎన్. సూర్య మాట్లాడుతూ– ‘‘సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. ట్రైలర్‌కి మంచి స్పందన రావడంతో చాలా ఆనందంగా ఉన్నాను. ప్రొడ్యూసర్‌తో కాస్త ఎక్కువ ఖర్చుపెట్టించావని చాలామంది అన్నారు. కానీ, స్టోరీ అలా డిమాండ్ చేసింది. ‘అరుంధతి, మగధీర’ టైప్‌లో మా సినిమా ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు థ్రిల్లింగ్‌గా ఉంటుంది’’ అన్నారు. లక్ష్మీ మాట్లాడుతూ– ‘‘అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువే అయింది. అవుట్ పుట్ బాగా వచ్చింది’’ అన్నారు. కెమెరామేన్ ఈశ్వర్ ఎల్లు మహంతి, ఫైట్‌మాస్టర్ రామ్ సుంకర మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్. -
మూడు జన్మల థ్రిల్
జయప్రద, పూర్ణ, సాక్షీ చౌదరి ప్రధాన పాత్రల్లో ఎం.ఎస్.ఎన్. సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సువర్ణసుందరి’. ‘చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతోంది’ అన్నది ఉపశీర్షిక. ఎస్. టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఎం.ఎస్.ఎన్. సూర్య మాట్లాడుతూ– ‘‘మూడు జన్మల కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. కొంతకాలంగా తెలుగులో స్క్రీన్‌ప్లే బేస్డ్ సినిమాలకు ఆదరణ లభిస్తోంది. మా సినిమాలోనూ ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లే ఉంటుంది. విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఏడాది పట్టింది’’ అన్నారు. ‘‘సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో సాంకేతికంగా అద్భుతంగా ఉంటుంది. ప్రస్తుతం సెన్సార్‌కు సిద్ధమైన మా చిత్రాన్ని తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాత లక్ష్మీ అన్నారు. ఇంద్ర, రామ్ మద్దుకూరి, సాయికుమార్, కోట శ్రీనివాసరావు, ముక్తార్ ఖాన్, నాగినీడు, సత్యప్రకాష్, అవినాష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, కెమెరా: ఎల్లు మహంతి. -
మూడు జన్మల కథ
జయప్రద, పూర్ణ, సాక్షీ చౌదరి ప్రధాన పాత్రల్లో సూర్య ఎమ్.ఎస్.ఎన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సువర్ణసుందరి’. ‘చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతోంది’ అన్నది ఉపశీర్షిక. ఎమ్.ఎల్. లక్ష్మీ నిర్మించిన ఈ చిత్రం మార్చి రెండో వారంలో విడుదల కానుంది. సూర్య మాట్లాడుతూ– ‘‘మూడు జన్మల కాన్సెప్ట్‌తో హిస్టారికల్ సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. ఇందులో విజువల్ ఎఫెక్ట్స్‌కే ఏడాది పట్టింది. భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో తెరకెక్కిన మా సినిమా ట్రైలర్‌కు పదిలక్షలు వ్యూస్‌కి పైగా లభించాయి. మార్చి తొలివారంలో పాటలను, రెండోవారంలో సినిమాను తెలుగు, కన్నడ, తమిళ్ భాషల్లో ఒకేసారి విడుదల చేయటానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు’’ అన్నారు. ఇంద్ర, రామ్, సాయికుమార్, కోట తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, కెమెరా: ఎల్లు మహంతి. -
బ్యాగ్రౌండ్ చెప్పుకోలేదు
‘‘నేను విజయవాడలో పుట్టాను. నటనపై ఉన్న ఆసక్తితో మధు ఫిలిం ఇన్స్టిట్యూట్లో శిక్షణ తీసుకున్నాను. నిర్మాత దాసరి కిరణ్‌కుమార్‌గారి కజిన్‌ని. రామదూత క్రియేషన్స్ బ్యానర్ మాదే. కానీ, నెనెప్పుడూ నా బ్యాగ్రౌండ్ చెప్పకుండానే ఆడిషన్స్‌కి వెళ్లాను. ‘వంగవీటి’ సినిమా చేస్తుండగా సూర్యగారు ‘సువర్ణసుందరి’ సినిమాకి చాన్స్ ఇచ్చారు’’ అని హీరో ఇంద్ర అన్నారు. జయప్రద, పూర్ణ, సాక్షీ చౌదరి ప్రధానపాత్రల్లో సూర్య ఎమ్.ఎస్.ఎన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సువర్ణసుందరి’. ఎమ్.ఎల్. లక్ష్మీ నిర్మించిన ఈ చిత్రం మార్చి రెండో వారంలో విడుదల కానుంది. ఈ సినిమాలో హీరోగా నటించిన ఇంద్ర మాట్లాడుతూ– ‘‘రామ్‌గోపాల్‌వర్మగారి దర్శకత్వంలో వచ్చిన ‘వంగవీటి’ చిత్రంలో ఓ ముఖ్య పాత్రను పోషించాను. ‘సువర్ణసుందరి’లో తొలిసారి లీడ్ రోల్ చేశా. ఈ అవకాశం కల్పించిన డైరెక్టర్ సూర్యగారికి రుణపడి ఉంటాను. ఈ చిత్రంలో రెండు స్క్రీన్‌ప్లేలు నడుస్తుంటాయి. ఒకటి పీరియాడికల్, ఇంకోటి ప్రస్తుతం. ఈ రెండు స్క్రీన్ప్లేల మధ్య నాదొక ఫన్ అండ్ రొమాంటిక్ క్యారెక్టర్. ‘సువర్ణసుందరి’ అనే ఓ విగ్రహానికి సంబంధించిన సినిమా ఇది. ఈ చిత్రం విడుదల తర్వాత నాకు మరిన్ని అవకాశాలు వస్తాయనే నమ్మకం ఉంది. ప్రస్తుతం ‘రామచక్కని సీత’ చిత్రంలో లీడ్ రోల్ చేస్తున్నాను. ఓంకార్‌గారి అసిస్టెంట్ శ్రీహర్ష మండాగారితో మరో సినిమా చేశాను’’ అన్నారు. -
భవిష్యత్తుని వెంటాడుతుంది
‘‘సువర్ణసుందరి’ లాంటి సినిమాలు రావడం పరిశ్రమకి చాలా అవసరం. దాని వల్ల కొత్త టెక్నీషియన్స్ పరిచయం అవుతారు. సూర్య రాసుకున్న కథ చాలా బాగుంది. తప్పకుండా ఇది ఓ మంచి సినిమా అవుతుంది’’ అని దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. జయప్రద, పూర్ణ, సాక్షీ చౌదరి ప్రధాన పాత్రల్లో సూర్య ఎమ్.ఎస్.ఎన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సువర్ణసుందరి. ‘చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతోంది’’ అన్నది ఉపశీర్షిక. ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మీ నిర్మించిన ఈ చిత్రం అతి త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ని దర్శకులు బి.గోపాల్ విడుదల చేశారు. డైరెక్టర్ సూర్య మాట్లాడుతూ– ‘‘సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. నటీనటులందరూ నాకు చాలా సహకరించారు. విజువల్ ఎఫెక్ట్స్‌కి ఏడాది పట్టింది. అందుకే సినిమా విడుదల లేట్ అయింది. అయినా అవుట్‌పుట్ మాత్రం చాలా బాగా వచ్చింది’’ అన్నారు. ‘‘సువర్ణసుందరి’ ఎక్స్ట్రార్డినరీ చిత్రం. హీరోయిన్స్ చాలా చక్కగా చేశారు. తెలుగు సినీ పరిశ్రమకు అందగత్తె జయప్రద. ఆవిడ కూడా ఈ చిత్రంలో నటించారు. టీమ్‌కి ఆల్ ద బెస్ట్’’ అని డైరెక్టర్ సాగర్ అన్నారు. ‘‘ఇది చాలా మంచి సినిమా. పాటలు. ఫైట్స్ చాలా బాగా వచ్చాయి’’ అన్నారు సాక్షీ చౌదరి. ‘‘సహనం అంటే అది సూర్యగారి నుంచే నేర్చుకోవాలి. చాలా ఓర్పుగా మంచి నటన రాబట్టుకున్నారాయన’’ అని పూర్ణ అన్నారు. హీరోలు ఇంద్ర, రామ్, రచయిత విజయేంద్రప్రసాద్, రైటర్ ప్రదీప్, స్టంట్ మాస్టర్ రామ్ సుంకర మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, కెమెరా: ఎల్లుమంతి ఈశ్వర్. -
విడుదలకు సిద్ధమైన ‘సువర్ణ సుందరి’
జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘సువర్ణసుందరి’. సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీకి సూర్య ఎమ్.ఎస్.ఎన్ దర్శకుడు. చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతోందన్న ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ తో భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా అతి త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను ప్రముఖ దర్శకులు బి.గోపాల్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ సాగర్ మాట్లాడుతూ... ‘ఇది చాలా ఎక్స్ట్రాడినరీ చిత్రం. హీరోయిన్స్ చాలా చక్కగా చేశారు. మన తెలుగు సినీ పరిశ్రమకు అందగత్తే జయప్రద. ఆవిడ కూడా ఈ చిత్రంలో నటించారు. ఎంటైర్ టీమ్ కి ఆల్ ద బెస్ట్. సాయికార్తిక్ మ్యూజిక్ బావుంది. ఫైట్స్ చాలా బాగా వచ్చాయి.’ అన్నారు. హీరోయిన్ పూర్ణ మాట్లాడుతూ... ‘సహనం అంటే అది సూర్య గారి నుంచే నేర్చుకోవాలి. ప్రతీ ఒక్కరికీ చాలా ఓర్పుగా తమ తమ పాత్రల గురించి చాలా చక్కగా వివరించి ఆయనకు ఏమి కావాలో ఆ అవుట్ పుట్ తెప్పించుకున్నారు. ఫైట్ మాస్టర్‌కి కూడా నా కృతజ్ఞతలు. హీరో రామ్ కూడా మొదట్లో కొంచం భయపడేవారు కాని బాగా నటించారు. సాక్షి మనిద్దరి మధ్య జరిగే చాలా సన్నివేశాలు అన్నీ ఫన్నీగా జరిగిపోయాయి. మా టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్’ అన్నారు. -
బుల్లితెరకు ఎంట్రీ!
సౌత్.. నార్త్ అనే తేడా లేకుండా హీరోయిన్గా మంచి పేరు సంపాదించారు జయప్రద. అటు రాజకీయాల్లోనూ సత్తా చాటారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఆమెకు ప్రేక్షకాదరణ తగ్గలేదు. సిల్వర్ స్క్రీన్‌ని ఏలిన జయప్రద ఇప్పుడు స్మాల్ స్క్రీన్‌ని ఏలడానికి రెడీ అయ్యారు. అవును.. ఆమె హిందీ బుల్లితెరపై ఎంట్రీ ఇవ్వబోతున్నారు. తెలుగులో ‘జయప్రదం’ పేరుతో ఆమె టీవీ షో చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ప్రస్తుతం హిందీలో ‘పర్ఫెక్ట్ పతి’ అనే సీరియల్లో నటిస్తున్నారు. ఇందులో ఆయూష్ ఆనంద్‌కు తల్లిగా నటిస్తున్నారు జయప్రద. ఈ సీరియల్లో తన పాత్ర కీలకంగా ఉండటంతో ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సీరియల్ షూటింగ్ రాజస్థాన్‌లో జరుగుతోంది. ఇందులో జయప్రద లుక్‌తో పాటు క్యారెక్టర్ కూడా డిఫరెంట్‌గా ఉంటుందట. ఈ సంగతి ఇలా ఉంచితే.. దాదాపు పదేళ్ల క్రితం ‘మహారథి’ సినిమాలో నటించారు జయప్రద. ఇప్పుడు మళ్లీ ‘సువర్ణసుందరి’లో ఓ కీ రోల్ చేశారు. ఈ సినిమా తర్వలో రిలీజ్ కానుంది. -
డాటర్ ఆఫ్ పూర్ణ
ఈ మధ్య కాలంలో తల్లి పాత్రల్లో కనిపిస్తోన్న జయప్రద ఇప్పుడు కూతురిగా కనిపించనున్నారు. అది కూడా పూర్ణకి కూతురిగా. రామ్, ఇంద్ర, జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ముఖ్య తారలుగా సూర్య ఎమ్.ఎస్.ఎన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ సువర్ణ సుందరి’. ఎమ్.వి.కె. రెడ్డి సమర్పణలో ఎస్ టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మీ నిర్మించారు. ‘చరిత్ర భవిష్యత్‌ను వెంటాడుతోంది’ అనేది ట్యాగ్‌లైన్. ‘‘టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. హిస్టారికల్ అడ్వెంచర్‌గా రూపొందిన ఈ చిత్రంలో పూర్ణ కూతురిగా జయప్రద నటించారు. ఆమె పాత్ర సినిమాలో హైలైట్‌గా ఉంటుంది. దర్శకుడు సూర్య టేకింగ్, విజువల్ గ్రాఫిక్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తాయి. సాయి కార్తీక్ సంగీతం, ఎలు మహంతి విజువల్స్ సినిమాకు ప్లస్ పాయింట్స్. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం’’ అని పేర్కొంది చిత్రబృందం. కోట శ్రీనివాసరావు, నాగినీడు, సత్య ప్రకాష్ నటించారు. -
యంగ్ హీరోయిన్ కూతురిగా జయప్రద
నాటి తరం నటీమణులంతా తల్లి, అత్త పాత్రలు పోషిస్తుంటే.. సీనియర్ నటి జయప్రద మాత్రం ఇందుకు భిన్నంగా కూతురి పాత్రలో కనిపించనున్నారు. జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి, సాయికుమార్ ప్రధాన పాత్రల్లో ‘సువర్ణ సుందరి’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో జయప్రదకు తల్లిగా యంగ్ హీరోయిన్ పూర్ణ నటిస్తున్నారు. విజువల్ వండర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి ఎమ్ఎస్ఎన్ శివ దర్శకత్వం వహిస్తున్నారు. చరిత్ర భవిష్యుత్తును వెంటాడుతోంది అనేది ఈ చిత్రానికి ఉప శీర్షిక. గతంలో విడుదల చేసిన టీజర్ కూడా ఆకట్టుకునేలా ఉంది. గ్రాండ్ లుక్‌తో హై టెక్నికల్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎస్ టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్ఎల్ లక్ష్మీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్‌లో సినిమా విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం తెలిపింది. నాగినీడు, కోట శ్రీనివాసరావు, ముక్తార్ ఖాన్, అవినాష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఎలు మహంతి, సంగీతం: సాయి కార్తీక్. -
ఈ సువర్ణసుందరి ఎవర్నీ వదలదు
సీనియర్ నటి జయప్రద, పూర్ణ, సాక్షీ చౌదరి, సాయికుమార్ ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న చిత్రం ‘సువర్ణ సుందరి’. చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతోంది. అన్నది ఉపశీర్షిక. సూర్య ఎమ్.ఎస్.ఎన్. దర్శకత్వంలో ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్.లక్ష్మి నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ని హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. ‘ఈ సువర్ణ సుందరి ఎవర్నీ వదలదు’ అంటూ సాగే టీజర్ సినిమాపై ఆసక్తి పెంచుతోంది. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ–‘‘సువర్ణ సుందరి’ టీజర్ రిలీజైన కొద్ది సమయంలోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హిస్టారికల్ అడ్వెంచర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఏ రేంజ్లో ఉంటుందనడానికి టీజర్ చక్కటి ఉదాహరణ. భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోకుండా గ్రాండ్ లుక్‌తో హై టెక్నికల్‌గా రూపొందిస్తున్నాం. త్వరలో పాటలు రిలీజ్ చేయనున్నాం. డిసెంబరులో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. నాగినీడు, కోట శ్రీనివాసరావు, ముక్తార్ ఖాన్, అవినాష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఎలు మహంతి, సంగీతం: సాయి కార్తీక్. -
డూపు లేకుండా!
‘మౌనమేల నోయి..’ అంటూ సున్నితంగా నటించడమే కాదు.. అవసరమైతే డూప్ లేకుండా ఫైట్స్ చేసేస్తారు జయప్రద. ప్రస్తుతం నటిస్తోన్న ‘సువర్ణ సుందరి’లో క్లైమాక్స్ ఫైట్స్‌ని డూప్ లేకుండా చేశారామె. ఫిఫ్టీ ప్లస్ ఏజ్‌లో ఆమె రిస్కీ ఫైట్ చేయడం చిత్రబృందాన్ని ఆశ్చర్యపరిచింది. జయప్రద ముఖ్య పాత్రలో రూపొందుతోన్న ఈ ‘సువర్ణ సుందరి’లో పూర్ణ, సాక్షీచౌదరి, రామ్, ఇంద్ర, సాయికుమార్, నాగినీడు, కోట శ్రీనివాసరావు ఇతర పాత్రధారులు. ‘చరిత్ర భవిష్యత్తును వెంటాడుతుంది’ అన్నది ట్యాగ్ లైన్. సూర్య ఎమ్.ఎస్.ఎన్. దర్శకత్వంలో ఎమ్.ఎల్.లక్ష్మి నిర్మిస్తున్నారు. ‘‘గతానికి భవిష్యత్తుకు మధ్య వారధిగా జయప్రదగారి పాత్ర ఉంటుంది. పూర్ణకి కూతురిగా ఆమె నటిస్తున్నారు. తల్లీకూతుళ్ల మధ్య భావోద్వేగాలు ఈ సినిమాకు హైలైట్. జయప్రదగారిది ఛాలెంజింగ్ రోల్. ఫైట్స్‌ని సవాల్‌గా తీసుకుని చేశారు’’ అన్నారు దర్శకుడు. ‘‘ప్రేక్షకులను థ్రిల్‌కి గురి చేసే చిత్రమిది. త్వరలో టీజర్, నవంబర్‌లో సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు నిర్మాత లక్ష్మి. -
నాలుగు శతాబ్దాల కథ!
చరిత్ర చెప్పే కథలు ఆసక్తికరంగా ఉంటాయి. అందుకే హిస్టారికల్ మూవీస్‌కి స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ప్రస్తుతం నాలుగు శతాబ్దాల నేపథ్యంలో ‘సువర్ణ సుందరి’ అనే చిత్రం రూపొందింది. ఈ నాలుగు శతాబ్దాల చరిత్రలో బయటి ప్రపంచానికి తెలియని ఓ చీకటి కోణం ఈ చిత్రానికి ప్రధానాంశం. సూర్య దర్శకత్వంలో ఎమ్.ఎల్. లక్ష్మీ నిర్మిస్తున్నారు. పూర్ణ, సాక్షి చౌదరి, ఇంద్ర, సాయికుమార్ ముఖ్యతారలు. సూర్య మాట్లాడుతూ– ‘‘ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ మూవీ ఇది. కాలాలకు అనుగుణంగా డిఫరెంట్ లొకేషన్స్‌లో షూట్ చేశాం. నాటి తరాలకు, ఇప్పటి తరానికి మధ్య తేడాను చూపించేందుకు జాగ్రత్తలు తీసుకున్నాం. చిత్రీకరణ పూరై్తంది. హైదరాబాద్‌తో పాటు ముంబైలో కూడా గ్రాఫిక్ వర్క్స్ చేయిస్తున్నాం. త్వరలో సినిమాను రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్.