
జయప్రద
సౌత్.. నార్త్ అనే తేడా లేకుండా హీరోయిన్‌గా మంచి పేరు సంపాదించారు జయప్రద. అటు రాజకీయాల్లోనూ సత్తా చాటారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఆమెకు ప్రేక్షకాదరణ తగ్గలేదు. సిల్వర్ స్క్రీన్‌ని ఏలిన జయప్రద ఇప్పుడు స్మాల్ స్క్రీన్‌ని ఏలడానికి రెడీ అయ్యారు. అవును.. ఆమె హిందీ బుల్లితెరపై ఎంట్రీ ఇవ్వబోతున్నారు. తెలుగులో ‘జయప్రదం’ పేరుతో ఆమె టీవీ షో చేసిన విషయం గుర్తుండే ఉంటుంది.
ప్రస్తుతం హిందీలో ‘పర్‌ఫెక్ట్ పతి’ అనే సీరియల్‌లో నటిస్తున్నారు. ఇందులో ఆయూష్ ఆనంద్‌కు తల్లిగా నటిస్తున్నారు జయప్రద. ఈ సీరియల్‌లో తన పాత్ర కీలకంగా ఉండటంతో ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సీరియల్ షూటింగ్ రాజస్థాన్‌లో జరుగుతోంది. ఇందులో జయప్రద లుక్‌తో పాటు క్యారెక్టర్ కూడా డిఫరెంట్‌గా ఉంటుందట. ఈ సంగతి ఇలా ఉంచితే.. దాదాపు పదేళ్ల క్రితం ‘మహారథి’ సినిమాలో నటించారు జయప్రద. ఇప్పుడు మళ్లీ ‘సువర్ణసుందరి’లో ఓ కీ రోల్ చేశారు. ఈ సినిమా తర్వలో రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment