యంగ్‌ హీరోయిన్‌ కూతురిగా జయప్రద | Jayapradha Play Daughter Role In Suvarna Sundari | Sakshi
Sakshi News home page

యంగ్‌ హీరోయిన్‌ కూతురిగా జయప్రద

Published Thu, Aug 2 2018 9:07 AM | Last Updated on Thu, Aug 2 2018 9:14 AM

Jayapradha Play Daughter Role In Suvarna Sundari - Sakshi

నాటి తరం నటీమణులంతా తల్లి, అత్త పాత్రలు పోషిస్తుంటే..  సీనియర్‌ నటి జయప్రద మాత్రం ఇందుకు భిన్నంగా కూతురి పాత్రలో కనిపించనున్నారు. జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి, సాయికుమార్‌ ప్రధాన పాత్రల్లో ‘సువర్ణ సుందరి’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో జయప్రదకు తల్లిగా యంగ్‌ హీరోయిన్‌ పూర్ణ నటిస్తున్నారు. విజువల్‌ వండర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి ఎమ్‌ఎస్‌ఎన్‌ శివ దర్శకత్వం వహిస్తున్నారు. చరిత్ర భవిష్యుత్తును వెంటాడుతోంది అనేది ఈ చిత్రానికి ఉప శీర్షిక. గతంలో విడుదల చేసిన టీజర్‌ కూడా ఆకట్టుకునేలా ఉంది.

గ్రాండ్‌ లుక్‌తో హై టెక్నికల్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎస్‌ టీమ్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎమ్‌ఎల్‌ లక్ష్మీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్‌లో సినిమా విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం తెలిపింది. నాగినీడు, కోట శ్రీనివాసరావు, ముక్తార్‌ ఖాన్, అవినాష్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఎలు మహంతి, సంగీతం: సాయి కార్తీక్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement