Poorna
-
ఎమోషనల్ థ్రిల్లర్‌గా ‘డార్క్ నైట్’
‘‘ప్రస్తుతం థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న చిత్రాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ముఖ్యంగా యువత బాగా చూస్తున్నారు. ఆ నేపథ్యంలో రూపొందిన ‘డార్క్ నైట్’ చిత్రం టీజర్ బాగుంది’’ అని డైరెక్టర్ వీవీ వినాయక్ పేర్కొన్నారు. హీరోయిన్ పూర్ణ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘డార్క్ నైట్’. జీఆర్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ మూవీలో విధార్ధ్, త్రిగుణ్ (అదిత్ అరుణ్), సుభాశ్రీ రాయగురు, రమా ఇతర పాత్రలు పోషించారు. పటోళ్ల వెంకట్ రెడ్డి సమర్పణలో సురేష్ రెడ్డి కొవ్వూరి నిర్మించారు. ఈ సినిమా టీజర్‌ని వీవీ వినాయక్ విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘మా ప్రాంతం నుంచి వచ్చిన సురేష్ రెడ్డిగారు ‘డార్క్ నైట్’ చిత్రంతో నిర్మాతగా పరిచయమవడం సంతోషంగా ఉంది. ఈ సినిమా విజయంతో ఆయన మరిన్ని చిత్రాలు తీసి, తెలుగు పరిశ్రమలో ప్రముఖ వ్యక్తిగా నిలబడాలని ఆశిస్తున్నాను’’ అన్నారు. ‘‘ఎమోషనల్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘డార్క్ నైట్’. జీఆర్ ఆదిత్య ఆద్యంతం ఊహించని ట్విస్ట్‌లతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసేలా ఈ సినిమాని మలిచాడు. మార్చిలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు సురేష్ రెడ్డి కొవ్వూరి. ఈ చిత్రానికి సంగీతం: మిస్కిన్, కెమేరా: కార్తీక్ ముత్తుకుమార్. -
కుమారుడితో కలిసి నటి పూర్ణ సందడి (ఫోటోలు)
-
బొద్దుగా.. ఎంత ముద్దుగా ఉందో.. సంతోషంతో వెలిగిపోతున్న నటి పూర్ణ (ఫోటోలు)
-
నా హృదయంలో చోటిస్తే.. తన జీవితాన్నే ఇచ్చేశాడు: పూర్ణ (ఫోటోలు)
-
కుర్చీ మడతపెట్టి సాంగ్.. నా లుక్ చూసి ట్రోల్ చేస్తారనుకున్నా!
ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు బొద్దుగా తయారవుతుంటారు. ముందు ఎలా ఉన్నా సరే తల్లయ్యాక మాత్రం శరీర సౌష్ఠవమే మారిపోతుంది. సమయమే కొందరిని మళ్లీ మామూలు స్థితికి తీసుకొస్తే మరికొందరు మాత్రం జిమ్, డైటింగ్‌తో సన్నబడి నాజూకుగా అవుతుంటారు. అందరిలాగే డెలివరీ తర్వాత హీరోయిన్ పూర్ణ కూడా బొద్దుగా అయిపోయింది. లావయ్యా.. సాంగ్ చేయగలనా?సరిగ్గా అదే సమయంలో తనకు గుంటూరు కారం మూవీలోని కుర్చీ మడతపెట్టి పాటలో నటించే అవకాశం వచ్చింది. ఆ సమయంలో తన రియాక్షన్ ఎలా ఉందనేది తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టింది. పూర్ణ మాట్లాడుతూ.. శేఖర్ మాస్టర్ నాకు ఫోన్ చేసి కుర్చీమడతపెట్టి పాట ఆఫర్ చేశారు. మాస్టర్, నేనిప్పుడు దున్నపోతులా తయారయ్యాను, ఈ అవతారంలో నేను చేయగలను అనుకుంటున్నారా? అని అడిగాను. ఎందుకంటే ప్రెగ్నెన్సీ తర్వాత చాలా బరువు పెరిగిపోయాను.అదే హైలైట్ చేస్తామనడంతో..నాపై నేనే అపనమ్మకంతో ఉన్నాను. కానీ సినిమా టీమ్, డైరెక్టర్ నా డ్యాన్స్ కన్నా ఎక్స్ప్రెషన్స్ హైలైట్ అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. షూటింగ్‌కు ఒకరోజు ముందు కూడా నేను రావాల్సిందేనా? అని అడిగాను. అందుకు అవునన్నారు. అయితే సోషల్ మీడియాలో నా ఫోటోలు చూసినవాళ్లు పూర్ణ ఏంటి? పందిలా తయారైంది.. అని చులకనగా కామెంట్లు చేసేవాళ్లు. మీరు తిట్టేది తల్లినేఅవి చూసి చాలా బాధపడ్డాను. ఇలా నోటికి ఏదొస్తే అది వాగేవాళ్లు ఒక తల్లిని తిడుతున్నామని ఎందుకు గ్రహించరో? ఈ నెగెటివిటీని దృష్టిలో పెట్టుకునే ఆ సాంగ్‌లో కనిపించేందుకు అంగీకరించాను. ఆశ్చర్యమేంటంటే.. నా పర్ఫామెన్స్ మెచ్చుకున్నవాళ్లే ఎక్కువ. ఇది నా కెరీర్లోనే బెస్ట్‌గా నిలిచిపోయింది' అని పూర్ణ చెప్పుకొచ్చింది. చదవండి: బిగ్‌బాస్ షోలో 'మహారాజ' నటి ఎంట్రీ? -
Poorna Son Hamdan Birthday: పూర్ణ కుమారుడి ఫస్ట్ బర్త్‌డే.. పిల్లాడు భలే క్యూట్.. (ఫోటోలు)
-
రెండు ఓటీటీల్లోకి పూర్ణ నటించిన హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడే
మరో హారర్ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైపోయింది. తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన పూర్ణ నటించిన హారర్ మూవీ ఇది. ఇందులో 'బిగ్‌బాస్ 7' ఫేమ్ శుభశ్రీ కూడా ఓ కీలక పాత్ర చేసింది. తాజాగా స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకుందని, ఒకేసారి రెండు ఓటీటీల్లో రిలీజ్ కానుందని తెలుస్తోంది. ఇంతకీ ఏంటా సినిమా? ఎప్పుడు రాబోతుంది? (ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా) హీరోయిన్గా తెలుగు, తమిళంలో సినిమాలు చేసిన పూర్ణ.. ప్రస్తుతం సహాయ పాత్రలు, డ్యాన్స్ నంబర్స్ చేస్తూ బిజీగా మారింది. మొన్నీమధ్య 'గుంటూరు కారం'లో కుర్చీ మడతపెట్టి సాంగ్‌లో కిరాక్ స్టెప్పులేసి అదరగొట్టేసింది. ఈమె ప్రధాన పాత్రలో నటించిన తమిళ హారర్ మూవీ 'డెవిల్'. ఫిబ్రవరి 2న థియేటర్లలోకి వచ్చింది. ఇప్పుడు నెల తిరగకుండానే టెంట్ కోటా, అమెజాన్ ప్రైమ్‌లోకి స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సులున్నాయి. మార్చి 1 నుంచి రెండు ఓటీటీల్లో 'డెవిల్' స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కథ విషయానికొస్తే.. హేమ(పూర్ణ) అలెక్స్ అనే ఫేమస్ లాయర్ని పెళ్లి చేసుకుంటుంది. కానీ అతడు తన ఆఫీస్‌లోనే పనిచేసే సోఫియా(శుభశ్రీ)తో రిలేషన్షిప్లో ఉంటాడు. ఓరోజు యాక్సిడెంట్ ద్వారా హేమ జీవితంలోకి రోషన్(త్రిగుణ్) వస్తాడు. ఆ తర్వాత ఏమైంది? రోషన్, హేమల బంధం గురించి తెలిసిన అలెక్స్ ఏం చేశాడు? చివరకు ఏమైందనేదే కథ. పూర్ణ యాక్టింగ్ బాగానే చేసినా థియేటర్లలో సినిమా ఫెయిలైంది. ఓటీటీలో కాబట్టి టైంపాస్ కోసమైనా సరే చూసేస్తారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు.. అవేంటో తెలుసా?) -
గుంటూరు కారం సాంగ్.. అలాంటి వారిపై మండిపడ్డ యాంకర్ రష్మీ!
ఈ ఏడాది సంక్రాంతికి సందడి చేసిన చిత్రాల్లో మహేశ్ బాబు నటించిన గుంటూరు కారం ఒకటి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. జనవరి 12న థియేటర్లలో రిలీజైంది. అయితే ఈ చిత్రంలోని కుర్చీని మడతపెట్టి అనే సాంగ్ అభిమానులను ఓ ఊపు ఊపేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పాటలో సీనియర్ నటి పూర్ణ సైతం స్టెప్పులతో అదరగొట్టింది. శ్రీలీల ఎక్కువగా హైలెట్ అయింది. అయితే ఈ పాటకు బుల్లితెర యాంకర్ రష్మీని ఎంపిక చేయాలనుకున్నట్లు ఓ వార్త నెట్టింట వైరలైంది. పూర్ణ ప్లేస్‌లో రష్మీ గౌతమ్‌ను తీసుకోవాలని మేకర్స్ భావించారట. కానీ అందుకు రష్మీ నో చెప్పినట్లు రూమర్స్ వచ్చాయి. అయితే తాజాగా వీటిపై రష్మీ స్పందించింది. ఇలాంటి ఫేక్ వార్తలు ఎలా రాస్తారంటూ మండిపడింది. అంతే కాదు.. ఈ విషయంలో తనను ఎవరూ సంప్రదించలేదని.. అందువల్లే తనను ఎవరు రిజెక్ట్ చేయలేదని తెలిపింది. అంతే కాదు.. ఆ పాత్రలో పూర్ణ అద్భుతంగా చేశారని కొనియాడింది. ఇలాంటి తప్పుడు వార్తలతో నెగెటివిటీని ప్రచారం చేయవద్దని కోరింది. ఎవరు కూడా ఇలాంటి నిరాధారమైన వార్తలను ప్రోత్సహించవద్దని ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం రష్మీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. రష్మీ చివరసారిగా బొమ్మ బ్లాక్ బస్టర్ అనే చిత్రంలో కనిపించింది. అంతే కాకుండా భోళా శంకర్ చిత్రంలో చిరంజీవి పక్కన ఓ పాటలో అలా మెరిసింది. This news is absolutely baseless I was not approached so no scope for rejection Also poorna garu did an absolute fab job no one else could have done it better Fake news like these might bring unwanted negativity towards me kindly do not encourage such news pic.twitter.com/QywBUN76Te— rashmi gautam (@rashmigautam27) February 13, 2024 -
పూర్ణతో సంబంధం అంటగడుతున్నారు.. దర్శకుడి ఆవేదన
ప్రముఖ డైరెక్టర్ మిష్కిన్ సోదరుడు, 'సవరకట్టి' చిత్రం ఫేమ్ ఆదిత్య దర్శకత్వం వహించిన తాజా తమిళ చిత్రం డెవిల్. విదార్థ్, పూర్ణ, అరుణ్, మిష్కిన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి దర్శకుడు మిష్కిన్ సంగీతాన్ని అందించడం విశేషం. హెచ్ పిక్చర్స్ హరి, టచ్ స్క్రీన్ జ్ఞానశేఖర్ కలిసి నిర్మించారు. ఇప్పటి వరకు దర్శకుడిగా, నటుడిగా గుర్తింపు పొందిన ఈయన ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా అవతారం ఎత్తారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న డెవిల్ ఫిబ్రవరి 2న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. డెవిల్ సినిమా కాదు.. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ గురువారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. దర్శకుడు ఆదిత్య మాట్లాడుతూ తనకు సినిమా అంటే చాలా మక్కువ అని అయితే అందులో ఉండాల్సిన నిజాయితీని గురువు మిష్కిన్ నుంచి నేర్చుకున్నానని చెప్పారు. పూర్ణ మాట్లాడుతూ డెవిల్ తనకు కేవలం సినిమా మాత్రమే కాదని, తన జీవితానికి రిలేట్ అయిన ఒక ఎమోషన్ అని పేర్కొన్నారు. నా తమ్ముడని సపోర్ట్ చేయడంలేదు సంగీత దర్శకుడు మిష్కిన్ మాట్లాడుతూ ఈ మూవీ డైరెక్టర్ తన తమ్ముడు కావడంతో తాను అతనికి సపోర్ట్ చేస్తున్నానని కొందరు చెప్పుకోవడం బాధగా అనిపించిందన్నారు. చిత్రంలో పూర్ణ అద్భుతంగా నటించారన్నారు. తమ మధ్య ఏదో ఉందని పుకారు పుట్టిస్తున్నారని, నిజానికి ఆమె తనకు తల్లిలాంటి వారని, వచ్చే జన్మలో పూర్ణ కడుపున పుట్టాలని కోరుకుంటున్నానని మిష్కిన్ పేర్కొన్నారు. ఆయన మాటలు విని భావోద్వేగానికి లోనైన పూర్ణ స్టేజీపైనే ఏడ్చేసింది. View this post on Instagram A post shared by CinemaSpeak (@instacinemaspeak) చదవండి: విడాకులపై నిహారిక కామెంట్లు.. ఘాటుగా రియాక్ట్ అయిన మాజీ భర్త చైతన్య -
గర్భవతిగా ఉన్న నేను ఆ సీన్ చేస్తున్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను: పూర్ణ
టాలీవుడ్లో పూర్ణగా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ అసలు పేరు షమ్నా కాసిమ్.. దక్షిణ భారత చలనచిత్రంలో ఆమె ప్రత్యేక గుర్తింపు పొందారు. మలయాళం ద్వారా కెరీర్ ప్రారంభించిన పూర్ణ అక్కడ షమ్నా కాసిమ్గా గుర్తింపు పొందింది. ఆ తర్వాత తమిళం, తెలుగులో చెప్పుకోదగ్గ పాత్రల ద్వారా అగ్రతారగా నిలిచింది. పూర్ణ మంచి డ్యాన్సర్ కూడా.. ఇప్పటికే పలు డ్యాన్స్ షోస్ ద్వారా కూడా అభిమానులను సంపాదించుకుంది. సినిమాలే కాకుండా బుల్లితెర ప్రపంచంలో కూడా పూర్ణకు ప్రత్యేకమైన స్థానం ఉంది. తన జీవితంలో కొత్త దశను దాటుతోంది. ఇటీవలే తల్లి పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. (ఇదీ చదవండి: 40 ఏళ్ల వయసులో పెళ్లికి రెడీ అయిన శింబు.. అమ్మాయి ఎవరంటే) తన ఇంటికి కొడుకు రాకతో ఆ కుటుంబం సంబరాలు చేసుకుంది. సినిమాలో తన పాత్ర కోసం ఎలాంటి ఛాలెంజ్లనైనా స్వీకరించడానికి ఆమె ఎప్పుడూ సిద్ధంగా ఉందటుంది. ఒకానొక సమయంలో సినిమా కోసం ఆమె జుట్టు కత్తిరించుకోవడం పెద్ద చర్చనీయాంశమైంది. తెలుగులో నాని సినిమా అయిన దసరా షూటింగ్లో తాను ఎదుర్కొన్న సవాళ్ల గురించి పూర్ణ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో పూర్ణ గర్భవతి కాగా సినిమా విడుదల తర్వాత ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. దసరా సినిమా కోసం వర్షంలో రెండు రోజులు షూటింగ్ జరిగిందని గర్భవతిగా ఉన్న తాను ఎంతో ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చింది. ఇందులో ఆమెకు సంబంధించిన చాలా సన్నివేశాలు రాత్రివేళల్లోనే జరిగాయని తెలిపింది. దీంతో రెండు రాత్రులు వర్షంలోనే ఉండాల్సి వచ్చిందని పూర్ణ చెప్పింది. ఆ సమయంలో రాత్రి చాలా చలిగా ఉండటంతో చాలా ఇబ్బంది పడ్డానని తెలిపింది. గర్భవతిగా ఉన్న తనకు చాలా చల్లగా ఉన్న నీళ్లు తీసుకోవడం మరింత సమస్యలు తెచ్చిపెట్టిందని చెప్పింది. గర్భవతి అయిన తనకు ఆ సన్నివేశాల్లో నటించడం చాలా కష్టమైందని పేర్కొంది. కానీ అంత కష్టపడ్డా సినిమాలో తను నటించిన కొన్ని సన్నివేశాలు తొలిగించారని పేర్కొంది. వర్షంలో తడిసిన సన్నివేశాలను చిత్రీకరించిన మేకర్స్ ఆపై తాను చాలా ఇబ్బంది పడటం గమనించి వేడినీళ్లు తెప్పించి పూర్ణపై పోస్తూనే ఉన్నారట. సినిమాలోని మరో సన్నివేశం కోసం రాత్రిపూట నిర్మానుష్యమైన రోడ్డులో పరుగెత్తాల్సి వచ్చిందని అప్పుడు వీధికుక్కల అరుపులు విని భయపడ్డానని, అదృష్టవశాత్తూ అవి తనను కరిచలేదని పూర్ణ చెప్పింది. ఆ సన్నివేశంలో కాళ్లకు చెప్పులు కూడా లేకుండా చిత్రీకరించబడిందని పేర్కొంది. కానీ ఆ సమయంలో పెద్దగా గాయాలు ఏం కాలేదని పేర్కొంది. సినిమా షూటింగ్ సమయంలో మేకర్స్ తనకు ఎంతగానో తొడ్పడ్డారని తెలిపింది. వారి సాయంతోనే గర్భవతిగా ఉన్న తాను సురక్షితంగా సినిమా పూర్తి చేశానని పూర్ణ తెలిపింది. -
విధి రాతను ఎదురించి.. విశ్వ వేదికపై నిలిచి..
అతడికి కాళ్లు లేవు.. కానీ కలలు ఉన్నాయి. ఆ కుర్రాడికి కదలడానికి శక్తి లేదు.. అయితేనేం ఎదగాలనే కాంక్ష ఉంది. యువకుడి చుట్టూ కష్టాల చీకట్లు అలముకున్నాయి.. మరేం కాదు రేపటి వెలుగు కోసం వెతకడం అతడికి తెలుసు. రోడ్డు ప్రమాదంలో కాళ్లు పోగొట్టుకుని కన్నీళ్లు పెట్టిన దశ నుంచి విశ్వ వేదికపై మువ్వన్నెల జెండా పట్టుకుని గర్వంగా ఆనంద భాష్పాలు రాల్చినంత వరకు పూర్ణారావు చేసిన ప్రయాణం సాధారణమైనది కాదు. ఒక్క రోడ్డు ప్రమాదం తన బతుకును మార్చేస్తే.. ఆ మార్పును తన కొత్త ప్రస్థానానికి దేవుడిచ్చిన తీర్పుగా చేసుకున్న నేర్పరి అతడు. శ్రీకాకుళం: ఇండోనేషియాలో ఈ నెల 5నుంచి 10వ తేదీ వరకు జరిగిన ఇంటర్నేషనల్ పారా బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఓ సిక్కోలు కుర్రాడు మిక్స్డ్ డబుల్స్‌లో సిల్వర్, డబుల్స్‌లో బ్రాంజ్ మెడల్ సాధించాడు. ఇంత ఘనత సాధించిన ఆ క్రీడాకారుడికి రెండు కాళ్లు పనిచేయవు. అది కూడా పుట్టుకతో కాదు. అందరిలాగానే బాల్యంలో సరదాగా గడిపి, చక్కగా చదువుకుని, విదేశంలో ఓ ఉద్యోగం వెతుక్కుని కుటుంబాన్ని పోషించేంత వరకు అతను అందరిలాంటి వాడే. కానీ ఓ రోడ్డు ప్రమాదం అతడిని దివ్యాంగుడిని చేసింది. పరిపూర్ణంగా చె ప్పాలంటే రోడ్డు ప్రమాదానికి ముందు పూర్ణారావు వేరు. ప్రమాదం తర్వాత పూర్ణారావు వేరు. టెక్కలి మండలం శ్రీరంగం గ్రామంలో ని రుపేద కుటుంబానికి చెందిన చాపరా లక్ష్మణరావు, మోహిని దంపతుల చిన్న కుమారుడు చాపరా పూర్ణారావు. పూర్ణారావు ఇంటర్ పూర్తి చేసి 2015 సంవత్సరంలో సింగపూర్‌లో ఫైర్ సేఫ్టీలో ఉద్యోగంలో చేరాడు. తన తల్లిదండ్రులను చూసేందుకు 2017 సంవత్సరంలో సొంత గ్రామం వచ్చాడు. మరో రెండు రోజుల్లో సింగపూర్ వెళ్లిపోతున్న తరుణంలో వజ్రపుకొత్తూరు మండలం పూండి సమీపంలో ద్విచక్రవాహనంతో ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో వెన్నుపూసకు తీవ్రంగా గాయం కావడంతో రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. ఆ ప్రమాదం పూర్ణారావు బతుకులో చీకట్లు నింపింది. 2020 వరకు ఇంటిలో మంచానికే పరిమితమయ్యాడు. చిన్నపాటి పాన్‌షాప్ నిర్వహిస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న తల్లిదండ్రులకు పూర్ణారావు పరిస్థితి మరింత ఆవేదనకు గురి చేసింది. ఫేస్బుక్ ద్వారా తెలుసుకుని.. అప్పుడే ఫేస్బుక్లో బెంగళూరులో గల దివ్యాంగుల పునరావాస కేంద్రం గురించి పూర్ణారావు తెలుసుకున్నాడు. స్నేహితుల ఆర్థిక సహకారంతో బెంగళూరులో గల దివ్యాంగుల పునరావాస కేంద్రంలో చేరాడు. అక్కడ మనోధైర్యంపై నేర్చుకున్న అంశాలు అతడిని ఒక లక్ష్యానికి దగ్గర చేశాయి. ఈ క్రమంలో పారా బ్యాడ్మింటన్‌పై ఆసక్తి కలిగింది. యూట్యూబ్‌లో వీడియోలను చూస్తూ సొంతంగా నేర్చుకున్నాడు. తోటి మిత్రులతో కలిసి ప్రతి రోజూ సాధన చేసేవాడు. తొలి ఆటలోనే.. 2020లో కర్ణాటకలో జరిగిన రాష్ట్ర స్థాయి పారా బ్యాడ్మింటన్ పోటీల్లో పూర్ణారావు మొట్టమొదటిగా పాల్గొని గోల్డ్, సిల్వర్ మెడల్ సాధించాడు. దీంతో అతని పట్టుదలకు మెడల్స్ మరింత ప్రోత్సాహాన్నిచ్చాయి. ఆ తర్వాత భువనేశ్వర్‌లో జరిగిన నాల్గో నేషనల్ పారా బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పాల్గొన్నప్పటికీ ఎలాంటి మెడల్స్ రాలేదు. దీంతో కొంత నిరాశ చెందినప్పటికీ, పూర్ణారావు ఆటను కోచ్ ఆనంద్‌కుమార్ గమనించారు. దీంతో మైసూర్లో 2 నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత లక్నోలో జరిగిన ఐదో నేషనల్ పారా బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొని క్వార్టర్స్ ఫైనల్ వరకు వెళ్లాడు. 2023 జూలై నెలలో యుగాండాలో జరిగిన ఇంటర్నేషనల్ పారా బ్యాడ్మింటన్ పోటీలకు సిద్ధమైనప్పటికీ పాస్ పోర్టు సక్రమంగా లేదని ఎయిర్‌పోర్టులోనే ఆపివేశారు. దీంతో పూర్ణారావు తీవ్ర నిరాశతో వెనుతిరిగాడు. మెడల్స్‌తో ఉత్సాహం తాజాగా సెప్టెంబర్ 5 నుంచి 10 తేదీలలో ఇండోనేషియాలో జరిగిన ఇంటర్నేషనల్ పారా బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పూర్ణారావు పాల్గొని మిక్స్డ్ డబుల్స్‌లో సిల్వర్, డబుల్స్‌లో బ్రాంజ్ మెడల్ సాధించడంతో కొత్త ఉత్సాహం వచ్చింది. అతను ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్‌ను సాధించాడు. కర్ణాటక ఓపెన్ స్టేట్ టోర్నమెంట్లో 2 సిల్వర్, ఒక బ్రాంజ్ మెడల్ సాధించాడు. 2002లో విశాఖపట్టణంలో జరిగిన టోర్నమెంట్లో 2 గోల్డ్ మెడల్స్ సాధించాడు. 2023లో విశాఖపట్టణంలో జరిగిన టోర్నమెంట్లో గోల్డ్ మెడల్ సాధించాడు. వీటితో పాటు 2023 మార్చి నెలలో విశాఖపట్టణంలో జరిగిన ఏపీ నేషనల్ ట్రయల్స్ టోర్నమెంట్లో గోల్డ్ మెడల్ గెలిచాడు. పారా ఒలింపిక్సే లక్ష్యం నాకు ఆర్థిక సాయం అందితే పారా ఒలింపిక్స్‌లో పాల్గొని దేశానికి పతకం తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. మరి కొద్ది రోజుల్లో ఖేలో ఇండియా టోర్నమెంట్‌తో పాటు జపాన్‌లో జరగనున్న ఇంటర్నేషనల్ టోర్నమెంట్ లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నా. – చాపరా పూర్ణారావు -
ఆస్ట్రియా వీధుల్లో చిల్ అవుతోన్న కేతిక శర్మ.. బ్లాక్ శారీలో పూర్ణ హోయలు!
►గ్రీన్ డ్రెస్‌లో మెరిసిపోతున్న మధుబాల ►బ్లాక్ శారీలో తన అందంతో కెపెక్కిస్తోన్న పూర్ణ ►గ్రీన్ డ్రెస్‌లో హల్ చల్ చేస్తోన్న అనన్య పాండే ►ఆస్ట్రియాలో చిల్ అవుతోన్న కేతిక శర్మ ►ఫ్లూట్ నేర్చుకుంటోన్న ఆదాశర్మ View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Shamna Kkasim ( purnaa ) (@shamnakasim) View this post on Instagram A post shared by Madhoo Shah (@madhoo_rockstar) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) -
హీరోయిన్ పూర్ణ కొడుకు ఫొటోస్ వైరల్...
-
Actress Poorna Baby Boy Photos: పూర్ణ కొడుకుని చూశారా? ఎంత క్యూట్ ఉన్నాడో (ఫోటోలు)
-
హీరోయిన్ పూర్ణ కొడుకు.. ఎంత ముద్దుగా ఉన్నాడో?
సాధారణంగా సెలబ్రిటీలు చాలావరకు తమ పిల్లల విషయంలో గోప్యత మెంటైన్ చేస్తుంటారు. మీడియా, సోషల్ మీడియాలో ఎక్కడా ఫొటోలు, వీడియోలు రాకుండా జాగ్రత్త పడుతుంటారు. అయితే కొందరు మాత్రం తమ వారసుల్ని చాలా త్వరగానే ప్రపంచానికి పరిచయం చేస్తుంటారు. ఇప్పుడు పూర్ణ కూడా అలానే తన కొడుకుతో ఫొటోలకు పోజులిచ్చింది. నటి పూర్ణ.. కేరళ అమ్మాయి అయినప్పటికీ తెలుగులో హీరోయిన్, రియాలిటీ షోకి జడ్జిగా బోలెడంత పేరు సంపాదించింది. 'శ్రీ మహాలక్ష్మీ' సినిమాతో టాలీవుడ్లో కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ.. సీమటపాకాయ్, అవును తదితర చిత్రాలతో ఆకట్టుకుంది. నాని 'దసరా'లో చివరగా కనిపించింది. అయితే దుబాయికి చెందిన షానిద్ అసిఫ్ అలీని గతేడాది ఈమె పెళ్లి(నిఖా) చేసుకుంది. (ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి థ్రిల్లర్ సినిమా.. కాకపోతే!) తొలుత ఎంగేజ్మెంట్ విషయాన్ని సోషల్ మీడియాలో అనౌన్స్ చేసిన పూర్ణ.. మ్యారేజ్ గురించి ఏం చెప్పలేదు. పెళ్లెప్పుడు అని నెటిజన్స్ అడగడంతో ఆల్రెడీ అయిపోయిందని చెప్పి షాకిచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే అందరిలానే పూర్ణ కూడా కొడుకు విషయంలో గోప్యత పాటిస్తుందని అనుకున్నారు. కానీ ఆ పిల్లాడిని ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ మధ్య భర్తతో కలిసి ఓ పెళ్లికి వెళ్లిన పూర్ణ.. కొడుకుతో కలిసి కెమెరాకు పోజులిచ్చింది. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలని తన ఇన్ స్టాలో షేర్ చేసింది. అవి చూసిన నెటిజన్స్.. పూర్ణ కొడుకు ఎంత ముద్దుగా ఉన్నాడో అని తెగ మురిసిపోతున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Faisal Ak (@faisal_malabar) View this post on Instagram A post shared by Shamna Kkasim ( purnaa ) (@shamnakasim) (ఇదీ చదవండి: ఈ హీరోయిన్ని గుర్తుపట్టారా? ఇలా తయారైందేంటి!) -
అలా ఇలా ఎలా సినిమా రివ్యూ
టైటిల్: అలా ఇలా ఎలా నటీనటులు: పూర్ణ, శక్తి వాసుదేవన్, రాజా చెంబోలు, నాగబాబు, సితార, సీత, షాయాజీ షిండే, రేఖ దర్శకుడు: రాఘవ ద్వారకి నిర్మాత: జి.నాగరాజు విడుదల తేది: 22 జూలై 2023 కథ అను (పూర్ణ) అబద్దం అంటే సహించదు. అబద్దాలు ఆడదు, ఎవరైనా అబద్ధాలు ఆడి మోసం చేసినా అస్సలు ఊరుకోదు.. అలాంటి అను.. సూర్య (శక్తి వాసుదేవన్ )తో ప్రేమలో పడుతుంది. మరో వైపు కార్తీక్ (రాజా చెంబోలు) జైలు నుంచి తప్పించుకుని వస్తాడు. అలా వచ్చిన కార్తీక్.. మిత్రను చంపాలని అనుకుంటాడు? అసలు కార్తీక్ జైలుకి ఎందుకు వెళ్తాడు? మిత్ర ఎవరు? సూర్య ఎవరు? అనుకి, కార్తీక్‌కి ఉన్న లింక్ ఏంటి? ఆమెను మోసం చేసింది ఎవరు? చివరకు అను ఏం చేసింది? అన్నది కథ. నటీనటులు అను పాత్రలో పూర్ణ చాలా బాగా నటించింది. లుక్స్ పరంగానూ మెప్పించింది. ఎమోషనల్ సీన్స్‌లో అయితే ఆమెకు నూటికి నూరు మార్కులు పడ్డాయి. శక్తి వాసుదేవన్ భిన్న పార్శ్వాలను చూపించాడు. కార్తీక్ కారెక్టర్లో రాజా బాగానే మెప్పించాడు. నాగబాబు, బ్రహ్మానందం, అలీ సితార, సీత, షాయాజీ షిండే, రేఖ ఇలా అందరూ చక్కగా నటించారు. ప్రేమ కథల మీద ఇప్పటివరకు చాలా సినిమాలు వచ్చాయి, వస్తూనే ఉన్నాయి. ఇంకా ఎన్ని వచ్చినా కూడా కొత్త పాయింట్‌తో తెరకెక్కిస్తే దాన్ని జనాలు స్వీకరిస్తారు. ప్రేమ, మోసం అనే కాన్సెప్టుల మీద గతంలో బోలెడన్ని సినిమాలు వచ్చినా, ఇందులో దాన్ని కాస్త కొత్తగా చూపించినట్లనిపించింది. విశ్లేషణ ఇంటర్వెల్ వరకు ఒక సినిమాను చూపిస్తే.. తరువాత ఇంకో రకమైన సినిమాను చూపించినట్టు అయింది. ప్రథమార్దం ఫన్నీగా సాగుతుంది. బ్రహ్మానందం, అలీ అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశారు. మొదటి భాగంలో కామెడీకి పెద్ద పీట వేస్తే రెండో భాగంలో మాత్రం కథ మీద దృష్టి సారించారు. సెకండాఫ్‌లో కథ సీరియస్ మోడ్‌లోకి వెళ్తుంది. నెక్ట్స్ ఏం జరుగుతుందా? అనే ఆసక్తిని ప్రేక్షకుల్లో కలిగించడంలో దర్శకుడు కొంత సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు. క్లైమాక్స్ అయితే ఎవరూ గెస్ చేయలేరు. చివర్లో ఇచ్చే ట్విస్ట్ కూడా బాగుంటుంది. సినిమాలో అక్కడక్కడా సాగదీసి బోర్ కొట్టించినా ఇంటర్వెల్, క్లైమాక్స్ ట్విస్టులు మాత్రం బాగానే వర్కౌట్ అయ్యాయి. అయితే సినిమా ఎక్కడా కొత్తగా అనిపించకపోవడం పెద్ద మైనస్ అనే చెప్పాలి. సాంకేతికంగా ఈ సినిమా ఓకే అనిపిస్తుంది. మణిశర్మ పాటలు, సంగీతం మెప్పిస్తాయి. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఇంకొన్ని సీన్లకు కత్తెర పడితే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
ఓటీటీలో ఆకట్టుకుంటోన్న పూర్ణ 'బ్యాక్ డోర్' మూవీ
ఓటీటీలో కంటెంట్ ఓరియెంటెడ్, డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో తెరకెక్కే చిత్రాలకు, బోల్డ్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంటుంది. హీరోయిన్ పూర్ణ నటించిన బ్యాక్ డోర్ సినిమా గత ఏడాది థియేటర్లోకి వచ్చి మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి కూడా వచ్చేసిస సంగతి తెలిసిందే. అమెజాన్ ప్రైమ్‌లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను బాగామెప్పిస్తోంది. ఆర్చిడ్ ఫిల్మ్ స్టూడియోస్ బ్యానర్ మీద బి శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు కర్రి బాలాజీ దర్శకత్వం వహించారు.ఇక ఈ చిత్రంలో పూర్ణ సరసన కొత్త హీరో తేజ నటించారు. రెండే రెండు పాత్రలతో, ఆడవాళ్ళ మనోభావాల్ని, కుటుంబ విలువల్ని, భార్యాభర్తల సంబంధాల్ని, అక్రమ సంబంధాలు వల్ల వచ్చే నష్టాన్ని ఈ చిత్రంలో చూపించారు. చదవండి: రానాతో నెక్ట్స్ మూవీని అనౌన్స్ చేసిన డైరెక్టర్ తేజ రెండు గంటల నిడివి ఉండే ఈ చిత్రంలో రెండే పాత్రలతో సినిమాను నడిపించారు. మెయిన్ లీడ్‌గా పూర్ణ నటించగా, ఆమెకు జోడీగా తేజ డెబ్యూతో ఆకట్టుకున్నాడు. సంగీతం బాగుంది. ఎడిటింగ్ చోట కే ప్రసాద్ తన మార్కుని చూపించారు. ఇలా బ్యాక్ డోర్ సినిమా ఇప్పుడు అన్ని రకాలుగా అమెజాన్ ప్రైమ్‌లో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. -
Actress poorna : ఘనంగా పూర్ణ కొడుకు బారసాల వేడుక (ఫొటోలు)
-
పూర్ణతో నాకు లవ్ ఎఫైర్ ఉంది.. రవిబాబు షాకింగ్ కామెంట్స్
-
పూర్ణతో నాకు లవ్ ఎఫైర్ ఉంది.. కానీ.. : రవిబాబు
సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలు తీయడంలో రవిబాబు దిట్ట. అయితే ఆయన తీసిన సినిమాల్లో ఎక్కువగా పూర్ణ హీరోయిన్గా కనిపిస్తుంది. రవిబాబు వరుసగా ఆమెతో సినిమాలు చేయడంతో వారిద్దరి మధ్య ఏదో ఉందంటూ పుకార్లు షికార్లు చేసేవి. అదంతా ఏమీ లేదని రవిబాబు గతంలో రూమర్స్‌ను కొట్టిపారేసినప్పటికీ ఆ వదంతుల ప్రచారం ఆగలేదు. తాజాగా రవిబాబు డైరెక్షన్లో తెరకెక్కిన అసలు మూవీలోనూ పూర్ణ ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమా ఓటీటీలో రిలీజైంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పూర్ణతో రిలేషన్‌షిప్‌పై స్పందించాడు రవిబాబు. ఆయన మాట్లాడుతూ.. 'పూర్ణతో నాకు లవ్ ఎఫైర్ ఉంది. అలా అన్నానని ఇంకేదో అనుకునేరు. ప్రతి దర్శకుడికీ తన నటులతో అలాంటి అనుబంధమే ఉంటుంది. దర్శకుడు చెప్పినదానికంటే పూర్ణ 200 శాతం యాడ్ చేసి నటిస్తుంది. నా సినిమాల్లో హీరోయిన్ అనగానే అందరికీ మొదట పూర్ణ గుర్తొస్తుంది. కానీ ఆమె కొన్నింటినే ఓకే చేస్తుంది. మరికొన్నింటికి నో చెప్తుంది. ఈ మధ్య నా కొత్త సినిమా వాషింగ్ మెషీన్ కోసం ఆమెను సంప్రదించాను. తను నిర్మొహమాటంగా చేయనని చెప్పేసింది. తను ఒక పాత్రకు సరిగ్గా సరిపోతాను అనుకుంటే మాత్రమే నటిస్తుంది. అంతేతప్ప నాకోసం ప్రత్యేకంగా ఒప్పుకోదు. అలా ఒప్పుకోకూడదు కూడా! అందువల్లే ఆమెకు నచ్చిన సినిమాల్లోనే పూర్ణ నటించింది' అని రవిబాబు చెప్పుకొచ్చాడు. కాగా హిట్‌ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా సెలక్టెడ్‌గా సినిమాలు చేసే రవిబాబు అనసూయ, అవును సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన అవును, అవును 2, లడ్డుబాబు, అదుగో సినిమాల్లో పూర్ణ ప్రధాన పాత్రలు పోషించింది. సీమటపాకాయ్ మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైనప్పటికీ అవును సినిమాతోనే ఎక్కువ పాపులారిటీ తెచ్చుకుంది. అఖండ, దసరా చిత్రాల్లోనూ పూర్ణ ముఖ్య పాత్రలు పోషించింది. గతేడాది వ్యాపారవేత్తను పెళ్లాడిన పూర్ణ ఇటీవలె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. -
ఊహకు అందని అనుభూతి.. నా జన్మ పరిపూర్ణమైంది: నటి ఎమోషనల్
ప్రముఖ నటి పూర్ణ ఇటీవల పండంటి బాబుకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే! ఏప్రిల్ 4న బాబును ఎత్తుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానులతో పంచుకుంది. బాబు పుట్టిననాటి నుంచి అమ్మతనంలోని కమ్మదనాన్ని ఆస్వాదిస్తోంది పూర్ణ. తాజాగా ఆమె తనను ఆపరేషన్ థియేటర్ నుంచి వీల్‌చైర్‌లో మరో గదికి తీసుకువచ్చిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో ఓ గదిని అందంగా ముస్తాబు చేసి బేబీ బాయ్ అని గోడపై బెలూన్లతో డెకరేట్ చేశారు. ఇదంతా చూసిన పూర్ణ సంతోషంలో తేలియాడింది. 'నా జీవితంలో ఈ అనుభూతి ఊహకు అందనిది. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. తనే నా ప్రపంచం. ఇప్పుడు నేను ఒకరికి తల్లినయ్యాను. ఇప్పుడు నేను పరిపూర్ణ స్త్రీగా మారాను' అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌పై నెటిజన్లు స్పందిస్తూ నటికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా పూర్ణ గతేడాది దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త షానిద్‌ను పెళ్లాడింది. కొంతకాలానికే తాను తల్లి కాబోతున్నానంటూ గుడ్‌న్యూస్ చెప్పింది. సీమంతం ఫంక్షన్ కూడా ఘనంగా నిర్వహించగా అందుకు సంబంధించిన ఫోటోలు సైతం షేర్ చేసింది. ఇకపోతే పూర్ణ 'సీమటపాకాయ్' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. రవిబాబు డైరెక్షన్లో వచ్చిన 'అవును', 'అవును 2' సినిమాతో గుర్తింపు సంపాదించుకుంది. అఖండ, దృశ్యం 2 వంటి చిత్రాలతో మంచి మార్కులు కొట్టేసింది. ఓపక్క సినిమాల్లో నటిస్తూనే మరోపక్క బుల్లితెరపై ప్రసారమయ్యే పలు షోలలోనూ మెరిసింది. View this post on Instagram A post shared by Shamna Kkasim ( purnaa ) (@shamnakasim) -
పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ పూర్ణ (ఫొటోలు)
-
బిడ్డకు జన్మనిచ్చిన 'దసరా' నటి.. పిక్స్ వైరల్
సీమటపాకాయ్ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన మలయాళ ముద్దుగుమ్మ పూర్ణ. రవిబాబు డైరెక్షన్లో వచ్చిన అవును సినిమాతో మంచి క్రేజ్‌ను దక్కించుకున్న పూర్ణ ఆ తర్వాత అఖండ, దృశ్యం-2 వంటి చిత్రాలతో మెప్పించింది. అయితే హీరోయిన్గా కంటే బుల్లితెరపైనే ఎక్కువగా పాపులర్ అయిన పూర్ణ దుబాయ్‌కు చెందిన షానిద్ ఆసిఫ్ అలీ అనే వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కొన్ని రోజులకే గర్భం ధరించినట్లు ప్రకటించి ఫ్యాన్స్‌కు షాకిచ్చింది ముద్దుగుమ్మ. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటోంది. ఇటీవలే నాని, కీర్తి సురేశ్ నటించిన దసరా సినిమాలోనూ కనిపించింది. తాజాగా ఆమెకు మగబిడ్డ జన్మించినట్లు పూర్ణ వెల్లడించింది. ఈ మేరకు తన ఇన్‌స్టాలో ఫోటోలు పంచుకుంది. థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఆస్పత్రికి సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతూ ఫోటోలు షేర్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, అభిమానులు పూర్ణకు అభినందనలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా.. గతంలో ఆమె గర్భం ధరించినప్పటి నుంచి సీమంతం వరకు ప్రతి సందర్భంలోనూ తన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. View this post on Instagram A post shared by Shamna Kkasim ( purnaa ) (@shamnakasim) -
Actress Poorna Photos: ‘చమ్కీల అంగీలేసి’ పాటకు బేబీ బంప్‌తో పూర్ణ డ్యాన్స్ (ఫొటోలు)
-
ఏడో నెలలో పూర్ణకు మరో వేడుక.. వీడియో వైరల్
'సీమటపాకాయ్'తో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన నటి పూర్ణ 'అవును', 'అవును 2' చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే సువర్ణ సుందరి చిత్రంతో మరోసారి ప్రేక్షకులను పలకరించింది. ఇకపోతే గతేడాది దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త షానిద్‌ను పెళ్లాడింది. అదే ఏడాది చివర్లో త్వరలో తాను తల్లి కాబోతున్నానంటూ గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవలే ఆమె సీమంతం కూడా ఎంతో వేడుకగా జరిగింది. ప్రస్తుతం పూర్ణకు ఏడవ నెల. కేరళలోని కానూర్ సాంప్రదాయం ప్రకారం ఏడో నెల గర్భవతికి ఓ వేడుక చేస్తారట. ఈ సాంప్రదాయ తంతుకు సంబంధించిన వీడియోను పూర్ణ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో భాగంగా పూర్ణ నడుముకు ఓ తెల్లటి వస్త్రాన్ని కట్టి దాన్ని నల్ల తాడుతో బలంగా ముడివేశారు. అనంతరం కుటుంబ సభ్యులు ఆమెను మనసారా ఆశీర్వదించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పోస్ట్‌పై పలువురు నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తుండగా మరికొందరు మాత్రం పెళ్లై నాలుగే నెలలే అయింది, అప్పుడే ఏడో నెలా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా పూర్ణ పెళ్లి గతేడాది జూన్‌లో అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగింది. కానీ తన పెళ్లి ఫోటోలను మాత్రం అక్టోబర్‌లో షేర్ చేసింది. దీంతో ఆమె అక్టోబర్ నెలాఖరులోనే షాదీ చేసుకుందని నెటిజన్లు పొరపడుతున్నారు. ఇకపోతే 2004లో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పూర్ణ ఇప్పటివరకు 60కు పైగా చిత్రాల్లో నటించింది. అంతేకాక బుల్లితెరపై ప్రసారమయ్యే పలు షోలకు జడ్జిగానూ వ్యవహరించింది. చదవండి: నన్ను ఆదుకున్నాడు.. నేను, నా ఫ్యామిలీ మూడు పూటలా తింటున్నామంటే ఆయనే కారణం -
బేబీ బంప్‌తో నటి పూర్ణ.. ఫొటోలు వైరల్
-
తొలిసారి బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసిన హీరోయిన్
హీరోయిన్ పూర్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సీమటపాకాయ్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది మలయాళ ముద్దుగుమ్మ. అవును సినిమాతో మరింత క్రేజ్ సంపాదించింది. ఆ తర్వాత అఖండ, దృశ్యం-2 వంటి చిత్రాల్లోనూ కనిపించింది. కెరీర్లో బిజీగా ఉన్న సమయంలోనే గతేడాది దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త ఆసిఫ్ అలీని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. (ఇది చదవండి: ఘనంగా హీరోయిన్ పూర్ణ సీమంతం.. ఫోటోలు వైరల్) ఆ తర్వాత హీరోయిన్ గర్భం దాల్చినట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తాజాగా నటి బేబీ బంప్ ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. నా జీవితంలో ఇదే పెద్ద గిఫ్ట్ ఇదేనంటూ ఆమె బేబీ బంప్‌తో ఉన్న చిత్రాలు పంచుకున్నారు. ఇటీవలే పూర్ణ సీమంతం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో ఆమె కుటుంబసభ్యులు, సన్నిహితులు కూడా హాజరయ్యారు.ఈ ఫోటోలను స్వయంగా పూర్ణ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. తాజాగా బేబీ బంప్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by Shamna Kkasim ( purnaa ) (@shamnakasim) -
‘సువర్ణ సుందరి’మూవీ రివ్యూ
టైటిల్: సువర్ణ సుందరి నటీనటులు: జయప్రద, పూర్ణ, సాక్షి, ఇంద్ర, రామ్, సాయికుమార్, కోట శ్రీనివాసరావు, నాగినిడు, అవినాష్,సత్యప్రకాశ్ తదితరులు నిర్మాణ సంస్థ: ఎస్ టీమ్ పిక్చర్స్ నిర్మాత: ఎమ్.ఎల్. లక్ష్మీ రచన,దర్శకత్వం: సురేంద్ర మాదారపు సంగీతం: సాయి కార్తీక్ సినిమాటోగ్రఫీ: యెల్లుమహంతి ఈశ్వర్ ఎడిటింగ్: ప్రవీణ్ పూడి విడుదల తేది: ఫిబ్రవరి 3, 2023 కథేంటంటే.. ఈ సినిమా కథంతా.. సువర్ణ సుందరి అనే విగ్రహం చుట్టూ తిరుగుతుంది. 300 ఏళ్ల క్రితం కర్ణాటకలోని కాలక్కల్ సంస్థానంలో త్రినేత్రి అమ్మవారి విగ్రహాలను తయారు చేసే ఓ వ్యక్తి ఆ విగ్రహంలో దుష్టశక్తిని నింపుతాడు. దాని కారణంగా ఆ రాజ్యమే నాశనం అవుతుంది. దీంతో గ్రామస్తులంతా సువర్ణ సుందరి విగ్రహాన్ని భూస్థాపితం చేస్తారు. అయితే 300 ఏళ్ల తర్వాత ఓ వ్యక్తి పొరపాటున ఆ విగ్రహాన్ని బయటకు తీయడంతో అతని ఫ్యామిలీ అంతా చనిపోతుంది. స్వాతంత్రానంతరం ఆ విగ్రహం ఓ పాత బంగ్లా చేరుతుంది. ఆ బంగ్లాలోకి దిగిన కలెక్టర్ భార్య అంజలి(పూర్ణ)కి ఆ విగ్రహం దొరుకుతుంది. ఆమె సువర్ణ సుందరిని టచ్ చేయగానే దుష్టశక్తి ఆమెలో చేరిపోతుంది. దీంతో తన భర్తను, మామను అంజలి చంపేస్తుంది. తన కూతురు విశాలాక్షి (జయ ప్రద)ను కాపాడుకునేందుకు అంజలి ఆ విగ్రహంతో ఆత్మాహుతి చేసుకుంటుంది. కానీ మళ్లీ అంజలి కొన్నేళ్ల తరువాత జన్మిస్తుంది. అలా మళ్లీ అంజలి చేతికే ఆ విగ్రహం దొరుకుతుంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలేంటి? తన తల్లిని కాపాడుకునేందుకు విశాలాక్షి చేసే ప్రయత్నం ఏంటి? సాక్షి (సాక్షి చౌదరి)కి ఆ విగ్రహంతో ఉన్న సంబంధం ఏంటి? ఈ కథలో పోలీస్ ఆఫీసర్ గుణ (సాయి కుమార్) పాత్ర ఏంటి? విగ్రహం వెనుకున్న రహస్యం ఏంటనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. పురాతన బంగ్లా, సంస్థానం.. అందులో దుష్టశక్తి ఉండడం..దాని వల్ల ప్రజలకు హానీ కలగడం..ఈ తరహా కథలను మనం చూశాం. కానీ సువర్ణ సుందరి కథలో కొత్తదనం ఏంటంటే విగ్రహంలోనే దుష్టశక్తి ఉండడం. అది ఎవరి దగ్గర ఉంటే వాళ్లు రాక్షసుల్లా మారిపోవడం.. చుట్టుపక్కల వాళ్లను చంపి ఆ రక్తంతో దాహం తీర్చుకోవడం..ఇది వినడానికే ఆసక్తికరంగా ఉంది కదా.. దర్శకుడు సురేంద్ర అంతే ఆసక్తిగా తెరపై చూపించాడు. కథలో లోపాలు ఉన్నప్పటికీ గ్రాఫిక్స్‌తో వాటిని కప్పిపుచ్చారు. ఫస్టాఫ్ అంతా సువర్ణ సుందరీ విగ్రహం చుట్టే సాగుతుంది. కొన్ని సీన్స్ భయపెడతాయి. మిగతావి సాదాసీదాగా సాగుతాయి. కథ ముందుకు వెళ్తున్న కొద్దీ కాస్త నిదానంగా సాగినట్టు అనిపిస్తుంది. సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. సువర్ణ సుందరి నేపథ్యం తెలిశాక ప్రేక్షకులు ఆశ్యర్యపోతారు. అయితే దర్శకుడు ఎంచుకున్న పాయింట్ గొప్పగా ఉన్నా..మేకింగ్ విషయంలో కాస్త తడబడ్డాడు. కథని ఇంకాస్త బలంగా రాసుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. హారర్ చిత్రాలను ఇష్టపడే వారికి సువర్ణ సుందరి నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. ఈ చిత్రంలో అంజలి రెండు గెటప్పుల్లో కనిపిస్తుంది. ప్రజెంట్ సీన్లలో మోడ్రన్‌గా కనిపిస్తే.. ప్లాష్‌బ్యాక్ సీన్లలో ఎంతో నిండుగా, హుందాగా కనిపిస్తారు. సాక్షి అయితే సెకండాఫ్‌లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ సీన్లో మెప్పిస్తుంది. జయప్రద మరోసారి తన అనుభాన్ని తెరపై చూపించారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఆమె నటన అదిరిపోతుంది. పోలీసు పాత్రలో సాయి కుమార్ ఎప్పటిమాదిరే ఒదిగిపోయాడు. చర్చ్ ఫాదర్‌గా కోట శ్రీనివాసరావు, రాజగురువుగా నాగినీడు, మహారాజుగా అవినాష్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాయి కార్తీక్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు పర్వాలేదు. యెల్లుమహంతి ఈశ్వర్ సినిమాటోగ్రఫీ, విజువల్స్ బాగున్నాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
ఘనంగా హీరోయిన్ పూర్ణ సీమంతం.. ఫోటోలు వైరల్
హీరోయిన్ పూర్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సీమటపాకాయ్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ మలయాళ ముద్దుగుమ్మ అవును సినిమాతో మంచి క్రేజ్‌ను దక్కించుకుంది. ఆ తర్వాత అఖండ, దృశ్యం-2 వంటి చిత్రాల్లో నటించింది. కెరీర్లో బిజిగా ఉన్న సమయంలోనే గతేడాది దుబాయ్‌కి చెందిన బిజినెస్ మేన్ ఆసిఫ్ అలీని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవలె త్వరలోనే తాను తల్లి కాబోతున్నట్లు చెప్పి గుడ్‌న్యూస్ చెప్పింది. తాజాగా పూర్ణ సీమంతం వేడుకలు ఘనంగా జరిగాయి. కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుకలు జరిగాయి. దీనికి సంబంధించిన ఫోటోలను స్వయంగా పూర్ణ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకోవడంతో పలువురు నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. -
జయప్రద థ్రిల్లర్ మూవీ 'సువర్ణ సుందరి' .. రిలీజ్ డేట్ ఫిక్స్
సీనియర్ నటి జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘సువర్ణసుందరి’. సురేంద్ర మాదారపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ చిత్రాన్ని ఎమ్.ఎల్. లక్ష్మీ నిర్మించారు. డాక్టర్ ఎమ్వీకే రెడ్డి సమర్పణలో ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై తెరకెక్కించారు. కరోనా ప్రభావంతో వాయిదా పడిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 3న భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. దర్శకుడు సురేంద్ర మాట్లాడుతూ..' కరోనాలో నిలిచిపోయిన మా మూవీ రిలీజ్‌కు ఇదే సరైన సమయం. ఎందుకంటే ఈ మధ్య వచ్చిన బింబిసారా, కార్తికేయ-2, మసూద చిత్రాలకు ఆడియన్స్ మంచి హిట్ అందించారు. అలాంటి జానర్లో వస్తున్న మా సువర్ణ సుందరి మూవీకి కూడా మంచి విజయాన్ని ఇస్తారనే నమ్మకంతో ఉన్నాం. ఫిబ్రవరి 3న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం. మీరంతా సక్సెస్ ఇస్తారని ఆశిస్తున్నా.' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో ఇంద్ర, రామ్, సాయికుమార్, కోట శ్రీనివాసరావు, నాగినిడు, అవినాష్,సత్యప్రకాశ్ తదితరులు నటించారు. -
త్వరలోనే తల్లి కాబోతున్న హీరోయిన్ పూర్ణ.. వీడియో షేర్ చేసిన నటి
హీరోయిన్ పూర్ణ అటు వెండితెరతో పాటు ఇటు బుల్లితెరపై కూడా సందడి చేస్తుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం సినిమాల్లో నటించి ఎంతోమంది అభిమానాన్ని సొంతం చేసుకున్న ఈ భామ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన కెరీర్‌ను కొనసాగిస్తుంది. సోషల్ మీడియాలోనూ వరుస ఫోటోషూట్స్‌తో ఫ్యాన్స్‌తో ఎప్పుడూ టచ్‌లో ఉంటోంది. ఇక ఇటీవలె వివాహ బంధంలోకి అడుగుపెట్టిన పూర్ణ తాజాగా గుడ్‌న్యూస్ చెప్పింది. తాను త్వరలోనే తల్లి కాబోతున్నట్లు స్వయంగా ప్రకటించింది. ఈ ఏడాది జూన్ 12న దుబాయ్‌లో వ్యాపారవేత్త ఆసిఫ్ అలీతో పూర్ణ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. అతికొద్ది మంది కుటుంబసభ్యుల సమక్షంలో పూర్ణ పెళ్లి ఘనంగా జరిగింది. తాజాగా తాను తల్లికాబోతున్నట్లు వెల్లడించడంతో పూర్ణ దంపతులకు ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. -
సోషల్ హల్చల్: హన్సిక సూఫీ నైట్, మూన్‌లైట్‌లో జాన్వి కపూర్
► ఒంగోలులో యాంకర్ అనసూయ సందడి ► ఎదపై టాటూ, ముక్కు పుడకతో అనుపమ, కొత్త లుక్ వైరల్ ► ప్యారిస్‌లో ఫరియా చక్కర్లు ► మంచులో తడుస్తున్న శృతి హాసన్ ► హన్సిక సూఫీ నైట్, ఆకట్టుకుంటున్న ఫొటోలు ► స్టార్ హోటల్లో బోల్డ్ బ్యూటీ అరియాన గ్లోరీ, గ్లామరస్ ఫొటోలు వైరల్ ► మూన్‌లైట్‌లో కలవమంటున్న బాలీవుడ్ భామ జాన్వి కపూర్ ► హిట్ 2 బ్యూటీ మీనాక్షి చౌదరి స్టన్నింగ్ లుక్ View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Harnaaz Kaur Sandhu (@harnaazsandhu_03) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by YADAMMA RAJU (@yadamma_raju) View this post on Instagram A post shared by Shamna Kkasim ( purnaa ) (@shamnakasim) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Mahhi ❤️tara❤️khushi❤️rajveer (@mahhivij) View this post on Instagram A post shared by Anjali Pavan 🧿 (@anjalipavan) -
పెళ్లైన మొదటి రోజే నటి పూర్ణకు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన భర్త
సీమటపాకాయ్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన మలయాళ ముద్దుగుమ్మ పూర్ణ. రవిబాబు డైరెక్షన్లో వచ్చిన అవును సినిమాతో మంచి క్రేజ్‌ను దక్కించుకున్న పూర్ణ ఆ తర్వాత అఖండ, దృశ్యం-2 వంటి చిత్రాల్లో నటించింది. అయితే హీరోయిన్గా కంటే బుల్లితెరపైనే ఎక్కువగా పాపులర్ అయిన పూర్ణ ఇటీవలె దుబాయ్‌కు చెందిన షానిద్ ఆసిఫ్ అలీ అనే వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తూనే,కెరీర్లోనూ దూసుకుపోతుంది. ఇదిలా ఉండగా పూర్ణకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. పూర్ణకు ఆమె భర్త షానిద్ కపూర్ పెళ్లైన తొలిరాత్రే సర్ప్రైజ్ చేశాడట. కాస్ట్లీ అండ్ రేర్ డైమండ్ రింగును ఆమెకు బహుమతిగా ఇచ్చాడట. అంతేకాదు ఆ రింగ్ నార్మల్‌గా చూస్తే పూర్ణ పేరు ఉండేలా రివర్స్‌లో చూస్తే షానిద్ పేరు కనిపించేలా ప్రత్యేకంగా డిజైన్ చేశారట. ఇక ఈ గిఫ్ట్ చూసిన పూర్ణ ఆనందానికి అవధులు లేకుండా పోయాయట. ఇప్పటికే పూర్ణకు ఆమె భర్త దాదాపు 170 తులాల బంగారంతో పాటు ఓ లగ్జరీ విల్లాను కూడా ఆమె పేరు మీద గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తెలుస్తుంది. వీటన్నింటి ఖరీదు సుమారు రూ. 30కోట్ల వరకు ఉంటుందని సమాచారం. -
మీరు మోసపోతే , దానికి నా భర్త కారణం కాదు : నటి వార్నింగ్
హీరోయిన్ పూర్ణ ఇటీవలె దుబాయ్‌కు చెందిన షానిద్ ఆసిఫ్ అలీ అనే వ్యాపారవేత్తని పెళ్లాడిన సంగతి తెలిసిందే. రీసెంట్‌గానే తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను బయటపెట్టిన పూర్ణ ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంది. అటు పర్సనల్ లైఫ్‌తో పాటు ప్రొఫెషనల్ లైఫ్‌నూ బ్యాలెన్స్ చేస్తున్న పూర్ణ ప్రస్తుతం రియాలిటీ షోలతో బిజీగా ఉంది. ఇదిలా ఉండగా ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్లు సెలబ్రిటీలను కూడా వదలడం లేదు. వాళ్ల ప్రొఫైల్‌తో సామాన్యుల దగ్గర్నుంచి డబ్బులు గుంజాలని చూస్తున్నారు. తాజాగా ఇదే పరిస్థితి నటి పూర్ణకు సైతం ఎదురైంది. తన భర్త షానిద్ ఆసిఫ్ ఫోటోను వాట్సాప్ డీపీగా క్రియేట్ చేసి ఓ నంబర్ నుంచి కొందరు లావాదేవీలు జరుపుతున్నారని పూర్ణ దృష్టికి వచ్చింది. ఈ విషయంపై స్పందించిన పూర్ణ.. అది తన భర్త నెంబర్ కాదని, ఒకవేళ ఎవరైనా మోసపోతే అందుకు తన భర్త కారణం కాదంటూ ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. -
విక్రమ్‌కు అరుదైన గౌరవం, పూర్ణ భర్త చేతుల మీదుగా ‘చియాన్’కు గోల్డెన్ వీసా
స్టార్ హీరో చియాన్ విక్రమ్ అరుదైన గౌరవం దక్కింది. దుబాయ్ ప్రభుత్వం తాజాగా ఆయన గోల్డెన్ వీసా ఇచ్చింది. ఈ విషయాన్ని నటి పూర్ణ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. తన భర్తతో కలిసి పూర్ణ విక్రమ్ దుబాయ్ గోల్డెన్ వీసా అందిస్తున్న ఫొటోను ఈ సందర్భంగా ఆమె షేర్ చేసింది. కాగా గతంలో కూడా పలువురు భారతీయ నటీనటులకు దుబాయ్ ప్రభుత్వం గోల్డెన్ వీసా ఇచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: అప్పటి వరకు అల్లు శిరీష్ ఎవరో కూడా తెలియదు: అను ఇమ్మాన్యుయేల్ మోహన్ లాల్, మమ్ముట్టి, కమల్ హాసన్, షారుక్ ఖాన్, నటి త్రిష, కాజల్ అగర్వాల్‌తో పాటు తదితర స్టార్ నటులకు ఈ వీసా అందింది. తాజాగా ఈ జాబితాలో విక్రమ్ కూడా చేరటం విశేషం. ఇదిలా ఉంటే నటి పూర్ణ అలియాస్ షమ్మా ఖాసీమ్ ఆమె భర్త షానిద్ ఆసీఫ్ చేతుల మీదుగా విక్రమ్కుగోల్డెన్ వీసా ఇవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది. దీంతో దీనిపై నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్ణ భర్త చొరవతోనే విక్రమ్‌కు గోల్డెన్ వీసా వచ్చినట్లు తెలుస్తోంది. చదవండి: అలా లెక్కలేసుకుని నేను ఇండస్ట్రీకి రాలేదు: అనుష్క శెట్టి పూర్ణ భర్త షానిద్ ఆసీఫ్ అలీ యూఏఈలో బడా వ్యాపారస్తుల్లో ఒకరనే విషయం తెలిసిందే. ప్రస్తుతం అక్కడ ఆయన పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నాడు. అయితే షానీద్ తన కంపెనీ ద్వారా విక్రమ్‌కి గోల్డెన్ వీసా వచ్చేలా చేశాడని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కాగా సినీ, సాహిత్యం, విద్య, కల్చర్ ఇతర రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న వారికి యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాలు అందిస్తుంది. ఈ గోల్డెన్ వీసా ద్వారా ఆరబ్ దేశాల్లో ఎలాంటి పరిమితులు లేకుండా నివసించవొచ్చు. 2019 నుంచి యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాలు మంజూరు చేస్తూ వస్తుంది. View this post on Instagram A post shared by Shamna Kkasim ( purnaa ) (@shamnakasim) -
పెళ్లిలో నటి పూర్ణ వేసుకున్న బంగారం ఎంతో తెలుసా?
‘అవును’ ఫేం పూర్ణ(షమ్నా కాసిమ్) ఇటివలె దుబాయ్‌కి చెందిన ఓ వ్యాపావేత్తతో ఏడడుగులు వేసిన సంగతి తెలిసిందే. నాలుగు నెలల క్రితమే ఆమె పెళ్లి జరగగా ఈ విషయాన్ని లేట్‌గా రివీల్ చేసింది ఈ కేరళ కుట్టి. కేవలం కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో దుబాయ్‌లో తన పెళ్లి వేడుక జరిగినట్లు తెలిపింది. అయితే దీపావళి సందర్భంగా అందరికి సర్ప్రైజ్ ఇస్తూ తన వివాహనికి సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది. ముస్లిం సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వివాహ వేడుకలో పూర్ణ ఒంటినిండా బంగారంతో మెరిసిపోయింది. దీంతో ఆమె వేసుకున్న బంగారం ఎంతనేది సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఇక దీని గురించి ఆరా తీయగా పూర్ణ వేసుకున్న ఆ బంగారు నగలను ఆమె భర్త కానుకగా ఇచ్చినట్లు తెలుస్తోంది. దాదాపు 1700 గ్రాములు(170 తులాలు) బంగారం పెళ్లి కానుకగా పూర్ణకు ఆమె భర్త ఇచ్చాడని సమాచారం. అంతేకాదు బంగారంతో పాటు ఓ లగ్జరీ విల్లా కూడా తన పేరు మీద గిఫ్ట్‌గా ఇచ్చాడట. కాగా దుబాయ్‌కు చెందిన షానిద్ ఆసిఫ్ అలీ అనే వ్యాపారవేత్తతో మే నెల 31న పూర్ణ నిశ్చితార్థం చేసుకుంది. జూన్ 12వ తేదీన దుబాయ్‌లో అత్యంత సన్నిహితుల సమక్షంలో తన వివాహం జరిగిందని రీసెంట్గా అధికారికంగా ప్రకటించింది. కాగా పూర్ణ ప్రస్తుతం ఓ డాన్స్ షోకు జడ్జిగా వ్యవహరిస్తూ బుల్లితెరపై సందడి చేస్తోంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: ఆర్థిక ఇబ్బందులు.. నగలు అమ్మి ఆ గడ్డు పరిస్థితుల నుంచి బయటపడ్డా: ప్రగతి దీపావళి సందర్భంగా కాబోయే భర్తను పరిచయం చేసిన హీరోయిన్ -
వ్యాపారవేత్తతో ఘనంగా హీరోయిన్ పూర్ణ వివాహం (ఫొటోలు)
-
హీరోయిన్ పూర్ణ పెళ్లి ఫోటోలు లీక్.. దుబాయ్‌లో గ్రాండ్‌గా వివాహం
హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి బుల్లితెరపై కూడా అదరగొడుతుంది కేరళ భామ పూర్ణ. సీమ టపాకాయ్,అవును, అఖండ, దృశ్యం-2 చిత్రాల్లో నటించిన పూర్ణ ప్రస్తుతం టాలీవుడ్లో వరుస ఆఫర్స్‌తో దూసుకుపోతుంది. హీరోయిన్గా కంటే బుల్లితెరపై ఓ షోకు జడ్జిగా వ్యవహరించి మరింత పాపులారిటీని సంపాదించుకుంది. ఇక సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే పూర్ణ ఈమధ్యే తనకు పెళ్లయిపోయిందని చెప్పి పెద్ద షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దుబాయ్‌కు చెందిన షానిద్ ఆసిఫ్ అలీ అనే వ్యాపారవేత్తతో మే నెల 31 నిశ్చితార్థం జరగ్గా జూన్ 12వ తేదీన దుబాయ్‌లో అత్యంత సన్నిహితుల సమక్షంలో తన వివాహం జరిగిందని స్వయంగా పూర్ణ రివీల్ చేసింది. తాజాగా ఆమె పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేయగా కాసేపట్లో ఆ ఫోటోలు వైరల్‌గా మారాయి. దీంతో పూర్ణ దంపతులకు పలువురు ప్రముఖులు సహా నెటిజన్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by Shamna Kkasim ( purnaa ) (@shamnakasim) -
జూన్‌లోనే పెళ్లి అయిపోయింది.. ఆ కారణంతో ఎవరూ రాలేకపోయారు!
బహుభాషా నటిగా పేరు తెచ్చుకున్న నటి పూర్ణ. ఇంతకుముందు మలయాళం, తెలుగు, తమిళం భాషల్లో కథానాయకిగా నటించిన ఈ కేరళ భామ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తోంది. పలు టీవీ కార్యక్రమంల్లోనూ పాల్గొంటున్న పూర్ణ ప్రేమ, పెళ్లి గురించి రకరకాల ప్రచారం చాలా కాలంగానే జరుగుతూ వచ్చింది. ప్రేమ పేరుతో ఒక ముఠా తనను మోసం చేసిందని ఆ మధ్య పోలీసులకు కూడా ఫిర్యాదు చేసి వార్తల్లో నిలిచింది. అదేవిధంగా ఈమె ప్రేమలో పడిందని త్వరలో పెళ్లికి సిద్ధమవుతోందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసింది. అలాంటిది ఎట్టకేలకు ఇటీవల తనకు ప్రియుడు ఉన్నాడనే విషయాన్ని ఇద్దరూ దిగిన పొటోలతో సహా సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించింది. ఈమె ప్రియుడు పేరు ఆసీఫ్ అలీ. ఇతను అరబ్ దేశానికి చెందిన వ్యాపారవేత్త. అయితే పూర్ణ, ఆసిఫ్ అలీ ప్రేమ బ్రేకప్ అయిందనే ప్రచారం కూడా ఇటీవల జరిగింది. ఏదేమైనా ప్రస్తుతం పూర్ణ, ఆసీఫ్ అలీ దుబాయ్‌లో ఉన్నారు. దీని గురించి నటి పూర్ణ ఓ భేటీలో పేర్కొంటూ తమ వివాహ నిశ్చితార్థం ఈ ఏడాది మే నెల 31న జరిగిందని జూన్ నెల 12వ తేదీన దుబాయ్‌లో పెళ్లి అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిందని చెప్పింది. దేశ సమస్య కారణంగా పలువురు తమ పెళ్లి వేడుకల్లో పాల్గొనలేక పోయారని, దీంతో త్వరలో కేరళలో వివాహ రిసెప్షన్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. దుబాయ్‌లో ఓ నాట్య పాఠశాలను ప్రారంభించనున్నట్లు చెప్పింది. ఇది తన చిరకాల కోరిక అని నటి పూర్ణ పేర్కొంది. -
చీరకట్టుతో చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తున్న హీరోయిన్ పూర్ణ (ఫొటోలు)
-
Fashion: పూర్ణ కట్టిన ఈ చీర ధర 54 వేలు..! ప్రత్యేకత ఏమిటంటే!
Fashion Collection- Actress Poorna Styling: చిన్న రోల్ ఇచ్చినా సరే తన నటనతో పరిపూర్ణం చేసే నటి పూర్ణ. ఆ పర్ఫెక్షన్ నటనలోనే కాదు అనుసరించే ఫ్యాషన్‌లోనూ ఉండాలనుకుంటుంది. అందుకే ఈ పర్ఫెక్ట్ బ్రాండ్లను ఇష్టపడుతుంది! పెటల్స్బై స్వాతి.. హైదరాబాద్‌కు చెందిన స్వాతి అవసరాల అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ 2019లో ఈ బ్రాండ్‌ను ప్రారంభించింది. తొలుత హాబీగానే మొదలుపెట్టినా తర్వాత జ్యూయెలరీ డిజైన్‌ను సీరియస్‌గానే తీసుకుంది. కుందన్ , జాదూ, జిర్కాన్ జ్యూయెలరీ, గోల్డ్ ఇమిటేషన్ జ్యూయెలరీని తయారు చేయడంలో స్వాతి సిద్ధహస్తురాలు. సంప్రదాయ లుక్‌ను ఇచ్చే నగలే కాకుండా ఇండో వెస్ట్రన్ పద్ధతిలోనూ అభరణాలను డిజైన్ చేస్తోంది. భార్గవి కూనమ్.. .. అంటేనే సంప్రదాయ చేనేత.. చక్కటి రంగుల కలబోత. పరికిణీ – ఓణీ, బ్రైడల్ కలెక్షన్స్, దుపట్టాలకు ఈ బ్రాండ్ పెట్టింది పేరు. డిజైన్, కలర్, నేతే కాదు మృదువైన ఫ్యాబ్రిక్ కూడా ఈ బ్రాండ్‌కు వాల్యూను యాడ్ చేస్తోంది. అందుకే ఆ ధరలను అందుకోగలిగిన వారి దగ్గర్నుంచి సెలబ్రిటీల వరకు అందరికీ భార్గవి కూనమ్ ఫెవరేట్ డిజైనర్. ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైన్‌లో మాస్టర్స్ చేసినా ప్రకృతిలోని రంగులు ఆమెను పడుగు – పేకల వైపు నడిపించాయి. ఆ ప్యాషన్ ఆమెను అందరు మెచ్చే.. అందరికీ నచ్చే డిజైనర్‌గా నిలిపింది. డిజైన్, ఫాబ్రిక్ను బట్టి ధరలు. ఆన్లైన్ లోనూ లభ్యం. బ్రాండ్ వాల్యూ చీర బ్రాండ్: భార్గవి కూనమ్ ధర: రూ. 54,000 జ్యూయెలరీ (కమ్మలు) బ్రాండ్: పెటల్స్ బై స్వాతి ధర: రూ. 2,400 నాకు సంప్రదాయ దుస్తులే ఇష్టం. చీరలు, చుడీదార్లలో సౌకర్యంగా ఫీలవుతాను. పండగలు, ఫంక్షన్స్‌కు వీటినే ప్రిఫర్ చేస్తా. మోడర్న్ దుస్తులు నాకు అంతగా నప్పవు. – పూర్ణ -దీపిక కొండి చదవండి: Handloom Every Day Challenge: చేనేతకు ‘ఐఏఎస్ బ్రాండ్’.. Temple Jewellery: ఆభరణ మోహనం.. రాధాకృష్ణుల రూపు, నెమలి పింఛం అందం! -
పెళ్లి క్యాన్సిల్? ఫోటోతో క్లారిటీ ఇచ్చేసిన హీరోయిన్ పూర్ణ
హీరోయిన్ పూర్ణ గత కొన్నిరోజులుగా ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఇటీవలె దుబాయ్‌కు చెందిన షానిద్ ఆసిఫ్ అలీ అనే వ్యాపారవేత్తతో పూర్ణ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే.దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరో రెండు, మూడు నెలల్లో వివాహం జరగాల్సి ఉండగా పూర్ణ తన నిర్ణయం మార్చుకున్నారని, షానిద్ ఆసిఫ్‌తో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరిగింది. చదవండి: సమంతను కలిస్తే ఏం చేస్తారు? నాగ చైతన్య షాకింగ్ ఆన్సర్ తాజాగా ఈ వార్తలపై నటి పూర్ణ క్లారిటీ ఇచ్చింది. కాబోయే భర్తతో సన్నిహితంగా కలిసి దిగిన ఓ ఫోటోను షేర్ చేస్తూ ఎప్పటికీ నావాడు అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో పూర్ణ పెళ్లిపై వస్తోన్న రూమర్స్‌కి చెక్ పెట్టినట్లయ్యింది. ప్రస్తుతం వీరిద్దరు కలిసి దిగిన ఈ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది. View this post on Instagram A post shared by Shamna Kkasim ( purnaa ) (@shamnakasim) -
షాకింగ్.. హీరోయిన్ పూర్ణ పెళ్లి ఆగిపోయిందా?
హీరోయిన్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పూర్ణ ప్రస్తుతం బుల్లితెరపై కూడా అదరగొడుతుంది. సీమ టపాకాయ్,అవును, అఖండ, దృశ్యం-2 చిత్రాల్లో నటించిన పూర్ణ ప్రస్తుతం టాలీవుడ్లో వరుస ఆఫర్స్‌తో దూసుకుపోతుంది. హీరోయిన్గా కంటే బుల్లితెరపై ఓ షోకు జడ్జిగా వ్యవహరించి మరింత పాపులారిటీని సంపాదించుకుంది. కెరీర్ పీక్స్‌లో ఉండగానే షానిద్ ఆసిఫ్ అలీ అనే వ్యాపారవేత్తను ఎంగేజ్మెంట్ చేసుకొని త్వరలోనే పెళ్ళి పీటలు ఎక్కనుంది. అయితే తాజాగా ఈ అమ్మడికి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అదేంటంటే... పూర్ణ తన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుందట.ఈ ఏడాది చివర్లో పెళ్లి చేసుకోవాలని మొదట డిసైడ్ అయినా ఇప్పుడు ఆ పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. అయితే ఇప్పటికీ పూర్ణ తన సోషల్ మీడియాలో ఎంగేజ్మెంట్ ఫోటోలను డిలీట్ కూడా చేయకపోవడంతో మరి నెట్టింట వైరల్ అవుతున్న వార్తల్లో ఎంతవరకు నిజం ఉందన్నదానిపై సందేహం కలుగుతుంది. దీనిపై పూర్ణ స్వయంగా ఏమైనా ప్రకటన చేయనుందా అన్నది త్వరలోనే తెలియనుంది. -
సీక్రెట్‌గా నటి పూర్ణ నిశ్చితార్థం, ఫొటోలు వైరల్
'అవును' హీరోయిన్ పూర్ణ త్వరలో పెళ్లి పీటలెక్కబోతోంది. దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీని పెళ్లాడబోతోంది. ఇటీవలే గుట్టుచప్పుడు కాకుండా ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. తాజాగా ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. 'కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాను' అంటూ కాబోయే భర్తతో దిగిన ఫొటోను షేర్ చేసింది. దీంతో పలువురు సెలబ్రిటీలు, అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా ఆమె భర్త షానిద్ బడా వ్యాపారవేత్త. జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీలను స్థాపించిన ఆయన వాటికి సీఈవోగా వ్యవహరిస్తున్నాడు. పూర్ణ సినిమాల విషయానికి వస్తే ఆమె ఇటీవల బ్యాక్‌డోర్, అఖండ వంటి చిత్రాలతో మెప్పించింది. పూర్ణ కేరళ నుంచి తెలుగు ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 12 ఏళ్లకు పైనే అయింది. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి సింగిల్‌గా వచ్చిన ఆమె ఎంతోదూరం ప్రయాణించింది. డబ్బే కావాలంటే ఎన్ని సినిమాలైనా చేయొచ్చు కానీ కెరీర్ చాలాకాలం సాగాలంటే మాత్రం మంచి చిత్రాలనే ఎంచుకోవాలి అనే సూత్రాన్ని నమ్ముతూ ఇప్పటికీ ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటోంది పూర్ణ. View this post on Instagram A post shared by Shamna Kkasim ( purnaa ) (@shamnakasim) View this post on Instagram A post shared by 🍁شانيد اسفالي (@shanid_asifali) చదవండి: విక్రమ్ సినిమా నటీనటుల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? -
Akhanda 100 Days Function: కర్నూలులో అఖండ 100 రోజులు వేడుక (ఫొటోలు)
-
అందాలతో కేకపెట్టిస్తోన్న అందాల పూర్ణ (ఫోటోలు)
-
డిఫరెంట్ జానర్లో సినిమాలు తీస్తా: కర్రి బాలాజీ
కర్రి బాలాజీ దర్శకత్వంలో పూర్ణ ప్రధాన పాత్రలో, తేజ త్రిపురాన హీరోగా నటించిన చిత్రం 'బ్యాక్ డోర్'. యూత్‌పుల్ అంశాలతో రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా.. డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ని సొంతం చేసుకుంది. తన తొలి సినిమాని సక్సెస్ చేసిన ప్రేక్షకులు దర్శకుడు కర్రి బాలాజీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘బ్యాక్ డోర్’మూవీని సక్సెస్ చేసిన తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా.నా ప్రతి సినిమాను కూడా డిఫరెంట్ జానర్లో రూపొందిస్తాను. ఈ క్రమంలోనే నా తదుపరి సినిమాను ఆనంద భైరవి పేరుతో మీ ముందుకు తీసుకురానున్నాను. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో అంజలి, రాయ్ లక్ష్మి, మురళి శర్మ, రాశి సహా పలువురు ఫేమస్ యాక్టర్స్ భాగమవుతున్నారు. మణిశర్మ బాణీలు కడుతున్నారు. మరికొద్ది రోజుల్లో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటిస్తాం. ముందు ముందు ఇలాగే ప్రేక్షకులు నన్ను ఆదరించాలని కోరుకుంటున్నా’ అన్నారు. -
‘బ్యాక్ డోర్’మూవీ రివ్యూ
టైటిల్ : బ్యాక్ డోర్ నటీనటులు : పూర్ణ, తేజ త్రిపురాన తదితరులు నిర్మాణ సంస్థ : ఆర్చిడ్ ఫిలిమ్స్ నిర్మాత : బి.శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం : కర్రి బాలాజీ సంగీతం : ప్రణవ్ ఎడిటర్ : చోటా కె. ప్రసాద్ సినిమాటోగ్రఫీ : శ్రీకాంత్ నారోజ్ పూర్ణ ప్రధాన పాత్రలో తేజ త్రిపురాన హీరోగా నటించిన తాజా చిత్రం 'బ్యాక్ డోర్'. కర్రి బాలాజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆర్చిడ్ ఫిలిమ్స్ పతాకంపై బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మించారు. మంచి సందేశంతో పాటు యూత్‌పుల్ అంశాలతో రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం శనివారం (డిసెంబర్ 25)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కి మంచి స్పందన రావడం.. ప్రమోషన్స్ కూడా గ్రాండ్ చేయడంతో ‘బ్యాక్ డోర్’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. ‘బ్యాక్ డోర్’ కథేంటంటే.. అంజలి(పూర్ణ) భర్త ఓ వ్యాపారవేత్త. ఎప్పుడు ఆఫీస్ పనుల్లో బిజీ బిజీగా ఉంటాడు. ఆమె ఇంటి వద్దే ఉంటూ.. ఇద్దరు పిల్లల బాగోగులు చూసుకుంటూ సంతోషంగా జీవితాన్ని గడుపుతుంది. ఓ పెళ్లి వేడుకలో ఆమెకు అరుణ్(తేజ త్రిపురాన)పరిచయం అవుతాడు. అతని మాటలకు అంజలి అట్రాక్ట్ అవుతుంది. అంజలి అందాలకు అరుణ్ ఫిదా అవుతాడు. ఇద్దరు రెగ్యులర్‌గా ఫోన్ మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. భర్త ఆఫీస్‌కి, పిల్లలు స్కూల్‌కి వెళ్లిన సమయంలో అరుణ్‌ని ఇంటికి రప్పించుకుంటుంది. ఆ సమయంలో ఏం జరిగింది? మంచి ఇల్లాలుగా ఉన్న అంజలి గీత దాటిందా లేదా? అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారంటే..? ఈ సినిమాకు హైలైట్ పూర్ణనే. ఇల్లాలు అంజలి పాత్రలో ఆమె అద్భుతంగా నటించింది. వయసు ఏమో హద్దులు దాటమంటుంది.. మనసు ఏమో తప్పని చెప్పుతుంది. ఈ రెండిటి మధ్య నలిగే హౌస్‌వైఫ్‌గా పూర్ణ తన నటనలో అద్భుతమైన హావభావాలు చూపించింది. యువకుడు అరుణ్ పాత్రలో తేజ ఒదిగిపోయాడు. తెరపై చాలా ఉత్సాహంగా కనిపించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే..? పెళ్లయ్యాక మహిళ తన మనసుకు, ఆలోచనలకు ఎలాంటి హద్దులు గీసుకోవాలో తెలియజేసే ఓ మంచి సందేశాత్మక చిత్రమే ‘బ్యాక్ డోర్’. ‘చూపు వెళ్లిన ప్రతి చోటుకి మనసు వెళ్లకూడదు.. అలాగే మనసు చెప్పే ప్రతి మాట మనిషి వినకూడదు’అనే ఒకేఒక డైలాగ్‌తో ఈ సినిమా కథ ఏంటో చెప్పేశాడు దర్శకుడు కర్రి బాలాజీ. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా అన్ని అంశాలను చూపిస్తూనే.. చివరిలో ఓ మంచి సందేశాన్ని ఇచ్చాడు. అటు యువతకు నచ్చేలా, ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్ ఇబ్బంది పడకుండా చక్కటి సినిమాను నిర్మించారు నిర్మాత బి శ్రీనివాస రెడ్డి. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ప్రణవ్ సంగీతం బాగుంది. ‘రారా నన్ను పట్టేసుకుని’అనే రొమాంటిక్ సాంగ్ ఆకట్టుకుంటుంది. నేపథ్య సంగీతం కూడా పర్వాలేదు. శ్రీకాంత్ నారోజ్ సినిమాటోగ్రఫీ ఓకే. అంజలి, అరుణ్ కలిసే ఇంటిమేట్ సీన్స్ ను సినిమాటోగ్రఫర్ శ్రీకాంత్ నారోజ్ బ్యూటిఫుల్ గా పిక్చరైజ్ చేశారు. ఎడిటింగ్‌పై ఇంకాస్త దృష్టిపెట్టాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
‘బ్యాక్ డోర్’ కర్రి బాలాజీకి బోలెడు పేరు తేవాలి!
పూర్ణ ప్రధాన పాత్రలో తేజ త్రిపురాన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'బ్యాక్ డోర్'. కర్రి బాలాజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆర్చిడ్ ఫిలిమ్స్ పతాకంపై బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25 న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం సాయంత్రం ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించింది చిత్ర బృందం. కోలాహలంగా జరిగిన ఈ వేడుకలో ప్రముఖ నటి-నిర్మాత-దర్శకురాలు జీవితా రాజశేఖర్, అడిషన్ ఎస్పీ కె.జి.వి. సరిత ముఖ్య అథితులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘ఈట్ సినిమా... డ్రింక్ సినిమా.. స్లీప్ సినిమాగా’అన్నట్లుగా సినిమానే సర్వస్వంగా భావించే కర్రి బాలాజీకి ‘బ్యాక్ డోర్’ బ్లాక్ బస్టర్ కావాలని అతిధులు ఆకాంక్షించారు. తనకు ‘బ్యాక్ డోర్’వంటి మంచి సినిమా ఇచ్చిన కర్రి బాలాజీకి హీరోయిన్ పూర్ణ కృతజ్ఞతలు తెలిపారు. పూర్ణ కెరీర్ లో ‘బ్యాక్ డోర్’ఓ మైల్ స్టోన్ గా నిలిచిపోతుందని పేర్కొన్న కర్రి బాలాజీ... ప్రి-రిలీజ్ ఈవెంట్ కు పెద్ద సంఖ్యలో విచ్చేసి గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రేజీ చిత్రం వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కులు సొంతం చేసుకున్న కె.ఆర్.ఫిల్మ్ ఇంటర్నేషనల్ అధినేత కందల కృష్ణారెడ్డి మాట్లాడుతూ...‘బ్యాక్ డోర్’ చిత్రానికి గల క్రేజ్ కి తగ్గట్టు... భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా ఈనెల 25న విడుదల చేస్తున్నాం’అన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ పూర్ణ, హీరో తేజ త్రిపురాన, చిత్ర దర్శకుడు కర్రి బాలాజీ, సంగీత దర్శకులు ప్రణవ్, ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న కందల కృష్ణారెడ్డి, ప్రముఖ నిర్మాతలు చదలవాడ శ్రీనివాసరావు, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, డి.ఎస్.రావు, శోభారాణి, నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి తుమ్మల ప్రసన్నకుమార్, ప్రముఖ నటి కరాటే కల్యాణి, ప్రముఖ దర్శకులు వీరశంకర్, అజయ్ కుమార్, సంతోషం సురేష్, ప్రముఖ నటులు అశోక్ కుమార్, రామ్ రావిపల్లి, ఆదిత్య మ్యూజిక్ ప్రతినిధులు నిరంజన్, మాధవ్, పబ్లిసిటీ డిజైనర్ విక్రమ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
Back Door: థియేటర్స్‌లోనే ‘బ్యాక్ డోర్’.. విడుదల ఎప్పుడంటే..?
పూర్ణ ప్రధాన పాత్రలో తేజ త్రిపురాన హీరోగా నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'బ్యాక్ డోర్'. కర్రి బాలాజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆర్చిడ్ ఫిలిమ్స్ పతాకంపై బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మించారు. పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు.. డిసెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ క్రేజీ చిత్రం వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కులు సొంతం చేసుకున్న కె.ఆర్.ఫిల్మ్ ఇంటర్నేషనల్ అధినేత కందల కృష్ణారెడ్డి మాట్లాడుతూ..."బ్యాక్ డోర్" చిత్రానికి గల క్రేజ్ కి తగ్గట్టు... భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా ఈనెల 18న విడుదల చేస్తున్నాం. ఈనెల 15న భారీ స్థాయిలో ప్రి-రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాం" అన్నారు. చిత్రానికి కో-డైరెక్టర్: భూపతిరాజు రామకృష్ణ, సంగీతం: ప్రణవ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: రవిశంకర్. -
వైజాగ్‌లో అఖండ విజయోత్సవం
-
అందాలతో కేకపెట్టిస్తోన్న అందాల పూర్ణ..
-
ప్రియమణిపై అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్
Allu Arjun Shocking Comments On Actress Priyamani: ప్రియమణిపై ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇటీవల ప్రముఖ డ్యాన్స్ షోకు అతిథిగా వచ్చిన బన్నీ ఆ షో జడ్జిలో ఒకరైన ప్రియమణిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కాగా ఈ షో హోస్ట్ ప్రదీప్ అల్లు అర్జున్‌తో ప్రియమణి, పూర్ణలను చూపిస్తూ ఈ బ్యూటిఫుల్ లేడి జడ్జిలకు ఓ స్సెషాలిటీ ఉంది సార్ అనగానే.. ఏంటది అంటాడు బన్నీ. చదవండి: రాజ‘శేఖర్’ మూవీకి ఓటీటీ షాకింగ్ రేట్స్! వెంటనే ప్రదీప్ డాన్స్ బాగా చేసిన వాళ్ళకు ప్రియమణి గారు హగ్ ఇస్తారని, అదే పూర్ణ గారైతే డాన్స్ బాగా చేస్తే బుగ్గ కోరుకుతారనగానే అల్లు అర్జున్.. ఇంకా బాగా చేస్తే ఇంకేం చేస్తారో అంటూ తనదైన శైలిలో కామెంట్ చేశాడు. అలా పూర్ణపై బన్నీ టక్కున కౌంటర్ వేయగానే షోలో ఒక్కసారిగా నవ్వులు పండాయి. ఆ తర్వాత బన్నీతో ప్రియమణి మీతో వర్క్ చేయలేదని నాకు చాలా బాధగా ఉంది బన్నీ అనగానే మీరు అసలు అలా అనుకోవదని, ఇప్పటికీ ఇంకా చాన్స్ ఉందన్నాడు. చదవండి: అన్నయ్యను ఇలా పరిచయం చేస్తాననుకోలేదు: హీరో ఆవేదన మీతో ఎప్పుడైనా వర్క్ చేస్తానని, పైగా ఇప్పుడు ఇంకా సన్నబడి హాట్‌గా తయారయ్యారంటూ బన్నీ అనడంతో ప్రియమణితో సహా అక్కడి వారంతా నోళ్లు వెళ్లబెడతారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ప్రియమణిపై సరదాగా అల్లు అర్జున్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. కాగా బన్నీ పుష్ప ఫస్ట్ పార్ట్ ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇటీవల సమంతతో స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడాడు. త్వరలోనే ఈ మూవీ ట్రైలర్ విడుదల కానున్న నేపథ్యంలో ఇవాళ ట్రైలర్ ట్రీజ్ను విడుదల చేశారు మేకర్స్. ఇక పుష్ప దీ రైజ్ పార్ట్ 1 డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. -
బ్యాక్ డోర్ విడుదల వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే ?
Back Door Movie Postponed: నటి పూర్ణ ప్రధాన పాత్రలో తేజ త్రిపురాన హీరోగా నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'బ్యాక్ డోర్'. ఈ సినిమా విడుదల పలు అనివార్య కారణాలతో వాయిదా పడింది. డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావలసిన ఈ చిత్రం డిసెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రేజీ చిత్రం వరల్డ్ వైడ్‌గా థియేటరికల్ హక్కులు "కె.ఆర్. ఫిల్మ్ ఇంటర్నేషనల్" అధినేత, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, నిర్మాత కందల కృష్ణారెడ్డి సొంతం చేసుకున్న తెలిసిందే. కె.ఆర్.ఫిల్మ్ ఇంటర్నేషనల్ అధినేత కందల కృష్ణారెడ్డి మాట్లాడుతూ 'బ్యాక్ డోర్ చిత్రాన్ని భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు థియేటర్లు లభ్యం కానందున ఈనెల 3కు బదులుగా ఈ నెల 18న విడుదల చేస్తున్నాం. ఈనెల 15న భారీ స్థాయిలో ప్రి-రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాం" అని తెలిపారు. ఈ సినిమాను ఆర్చిడ్ ఫిలిమ్స్ పతాకంపై బి. శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్నారు. -
ఆ కామెంట్లు విని నన్ను నేను మార్చుకున్నా: పూర్ణ
‘‘సెలబ్రిటీలు పబ్లిక్ ప్రాపర్టీ అని నా ఫీలింగ్. ప్రజల వల్లే సెలబ్రిటీలు అవుతాం. వారు పాజిటివ్, నెగిటివ్ కామెంట్లు చేస్తుంటారు.. వాటిని నేను ఒకేలా తీసుకుంటాను. నెగెటివ్ కామెంట్లు విని నన్ను నేను మార్చుకున్నాను’’ అని పూర్ణ అన్నారు. బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అఖండ’. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 2న విడుదల కానుంది. ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటించిన పూర్ణ మాట్లాడుతూ– ‘‘బాలకృష్ణ–బోయపాటిగార్ల కాంబినేషన్లో ఇంత పెద్ద సినిమాలో అవకాశం రావడం ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో పద్మావతి అనే పాత్ర చేశాను. కథలో ప్రాధాన్యం ఉన్న పాత్ర ఇది. నా లక్కీ నంబర్ 5. 2021ని కూడితే 5 వస్తుంది. నాకు ఈ ఏడాది మంచి పాత్రలు వచ్చాయి. హీరోయిన్‌గానే చేయాలని ఫిక్స్ అవ్వలేదు. సినిమాలో నాలుగైదు సీన్లు చేసినా ప్రాధాన్యత ఉండాలనుకుంటాను. శోభన, రేవతి, సుహాసినిగార్లలా ఎలాంటి పాత్రలైనా చేయాలనుకుంటున్నాను. ‘దృశ్యం 2’లో లాయర్‌గా బాగా నటించావని చాలామంది అభినందించారు. కేరళ నుంచి తెలుగు ఇండస్ట్రీకి వచ్చి 12 ఏళ్లు అయింది. ఇండస్ట్రీకి సింగిల్‌గా వచ్చాను. కానీ ఇంతదాకా ప్రయాణించాను. డబ్బే కావాలంటే ఎన్ని సినిమాలైనా చేయొచ్చు. కెరీర్ చాలాకాలం సాగాలంటే మాత్రం మంచి చిత్రాలనే ఎంచుకోవాలి. ముందు నేను కొన్ని తప్పులు చేశాను.. కానీ ఇప్పుడు జాగ్రత్తగా మంచి పాత్రలనే ఎంచుకుంటున్నాను’’ అన్నారు. -
డిసెంబర్ 3న థియేటర్స్‌లో ‘బ్యాక్ డోర్’
పూర్ణ ప్రధాన పాత్రలో తేజ త్రిపురాన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'బ్యాక్ డోర్'. కర్రి బాలాజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆర్చిడ్ ఫిలిమ్స్ పతాకంపై బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ మూవీ వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కులు ‘కె.ఆర్.ఫిల్మ్ ఇంటర్నేషనల్’ అధినేత- ప్రముఖ డిస్ట్రిబ్యూటర్-నిర్మాత కందల కృష్ణారెడ్డి సొంతం చేసుకున్నారు. ఈ చిత్రం విడుదలను పురస్కరించుకుని హైదరాబాద్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్సులు ప్రసన్నకుమార్, మోహన్ వడ్లపట్ల, ప్రముఖ నిర్మాత ఆచంట గోపినాధ్, రావణలంక కథానాయకుడు క్రిష్ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కె.ఆర్.ఫిల్మ్ ఇంటర్నేషనల్ అధినేత కందల కృష్ణారెడ్డి మాట్లాడుతూ...‘బ్యాక్ డోర్’ చిత్రానికి గల క్రేజ్ కి తగ్గట్టు... భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 3న విడుదల చేస్తున్నాం. ఈ చిత్రం హక్కుల కోసం పలువురు పోటీ పడినప్పటికీ... నా మీద నమ్మకముంచిన ‘బ్యాక్ డోర్’ నిర్మాత బి.శ్రీనివాస్ రెడ్డి, దర్శకుడు కర్రి బాలాజీలకు థాంక్స్ తెలియజేస్తున్నాను. దర్శకుడిగా ఈ చిత్రం బాలాజీకి చాలా మంచి పేరు తీసుకురావడం ఖాయం’అన్నారు. ఈ చిత్రానికి కో-డైరెక్టర్: భూపతిరాజు రామకృష్ణ, సంగీతం: ప్రణవ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: రవిశంకర్. -
హీరోయిన్ పూర్ణతో రవిబాబు ఎఫైర్ అంటూ వార్తలు, స్పందించిన నటుడు
Ravi Babu Gave Clarity On Rumours Over Affair With Poorna: సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు ప్రముఖ దర్శకుడు రవిబాబు కేరాఫ్ అడ్రస్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక ఆయన డైరెక్షన్లో పూర్ణ హీరోయిన్గా మూడు సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. రవిబాబు వరసగా ఆమెతో సినిమాలు చేయడం చూసి వారిమధ్య ఎదో నడుస్తోందంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి. అయితే దీనిపై పూర్ణ కానీ, రవిబాబులు కానీ ఇంతవరకు స్పందించలేదు. దీంతో నిజంగానే వీరిద్దరికి ఎఫైర్ ఉందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. చదవండి: ‘మెంటల్’ అంటున్న సమంత, మంటపెట్టేశారన్న సిద్ధార్థ్! ఈ క్రమంలో ఇటీవల ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ రూమర్స్‌పై నటుడు రవిబాబు స్పందించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశాడు. షూటింగ్ పూర్తయిన తర్వాత హీరోయిన్లతో మాట్లాడటం కానీ, వారిని కలవడం కానీ తాను చేయనని చెప్పాడు. విలువలకు తాను ప్రాధాన్యత ఇస్తానన్నారు. ఇక పూర్ణ అభినయం చూసే ఆమెను మూడు సినిమాల్లో తీసుకున్నానని చెప్పాడు. అంతే తప్పా మరో కారణం వల్ల కాదని ఆయన చెప్పుకొచ్చాడు. కాగా రవిబాబు దర్శకత్వంలో ‘అవును’, ‘అవును 2’, ‘లడ్డుబాబు’ సినిమాల్లో పూర్ణ నటించింది. ఈ నేపథ్యంలోనే వీరి మధ్య ఏదో ఉందనే ప్రచారం జరిగింది. చదవండి: బ్రహ్మానందంకు నితిన్ షాక్, ఆ మూవీ నుంచి బ్రహ్మీ తొలగింపు! -
‘బ్యాక్ డోర్' కచ్చితంగా విజయం సాధిస్తుంది: కె.రాఘవేంద్రరావు
పూర్ణ ప్రధాన పాత్రలో తేజ త్రిపురాన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'బ్యాక్ డోర్'. కర్రి బాలాజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆర్చిడ్ ఫిలిమ్స్ పతాకంపై బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్నారు. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని లెజండరీ డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘బ్యాక్ డోర్" టీజర్ కి పది మిలియన్ వ్యూస్ వచ్చాయని విన్నాను. ట్రైలర్ చూశాను. చాలా బాగుంది. దీనికి కచ్చితంగా రెట్టింపు వ్యూస్ వస్తాయి. టీమ్ కి ఆల్ ది బెస్ట్’అన్నారు. రాఘవేంద్రరావు తమ చిత్రం ట్రైలర్ లాంచ్ చేసి, బెస్ట్ విషెస్ చెప్పడం పట్ల దర్శకుడు కర్రి బాలాజీ, హీరో తేజ త్రిపురాన సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, అంబికా రాజా ప్రత్యేక అతిధిలుగా పాల్గొని చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రానికి కో-డైరెక్టర్: భూపతిరాజు రామకృష్ణ, సంగీతం: ప్రణవ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: రవిశంకర్. -
కుర్రకారును కట్టి పడేసే అంశాలతో 'బ్యాక్ డోర్'
పూర్ణ ప్రధాన పాత్రలో తేజ త్రిపురాన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'బ్యాక్ డోర్'. కర్రి బాలాజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆర్చిడ్ ఫిలిమ్స్ పతాకంపై బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్నారు. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని దీపావళి విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి "క్లీన్ యు" సెన్సార్ సర్టిఫికెట్ లభించడం విశేషం. ఈ సందర్భంగా నిర్మాత నిర్మాత బి.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... ‘బ్యాక్ డోర్’లో కుర్రకారును కట్టి పడేసే అంశాలతోపాటు... అన్ని వర్గాలవారిని అలరించే అంశాలు మెండుగా ఉన్నాయి. పూర్ణతోపాటు... హీరో తేజ చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. త్వరలోనే థియేటర్ ట్రైలర్ రిలీజ్ చేసి దీపావళికి సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు. తను నటించిన "బ్యాక్ డోర్" క్లీన్ యు తో రిలీజ్ కానుండడం పట్ల హీరోయిన్ పూర్ణ సంతోషం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి కో-డైరెక్టర్: భూపతిరాజు రామకృష్ణ, సంగీతం: ప్రణవ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: రవిశంకర్. -
సుకుమార్ అలా అనడం హ్యాపీ!
హీరోయిన్ పూర్ణ టైటిల్ రోల్ చేసిన తాజా చిత్రం ‘సుందరి’. ఈ చిత్రంలో అర్జున్ అంబటి ప్రధాన పాత్రధారి. కల్యాణ్ జి గోగన దర్శకత్వంలో రిజ్వాన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న రిలీజ్ కానుంది. అర్జున్ అంబటి మాట్లాడుతూ – ‘‘అర్ధనారి’ సినిమా నటుడిగా నాకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ‘సౌఖ్యం’లో విలన్ రోల్ చేశాను. తర్వాత మరికొన్ని సినిమాలు చేసినా మంచి గుర్తింపు రాలేదు. దీంతో మళ్లీ బుల్లితెరపై ‘అగ్నిసాక్షి’లో నటించాను. ‘దేవత’ సీరియల్ చేస్తున్నాను. కొంతగ్యాప్ తర్వాత ‘సుందరి’తో బిగ్ స్క్రీన్‌పైకి వస్తున్నాను. ఇందులో నటనకు స్కోప్ ఉన్న పాత్ర చేశాను. పాత్ర నచ్చితే క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ చేస్తాను. అల్లు అర్జున్ ‘పుష్ప’లోని ఓ పాత్ర కోసం ఆడిషన్స్ ఇచ్చాను. సెలక్ట్ కాలేదు. ‘సినిమా, సీరియల్ అని కాదు.. యాక్ట్ చేయడం ముఖ్యం’ అని నాతో సుకుమార్‌గారు అన్నారు. అంత పెద్ద డైరెక్టర్ అలా అనడం హ్యాపీ అనిపించింది. ప్రముఖ నటులు ఎస్వీ రంగారావుగారు నాకు స్ఫూర్తి’’ అన్నారు. -
మనసులో మాట బయటపెట్టిన ‘సుందరి’ పూర్ణ
‘‘సుందరి’ చిత్రంలో నేను చేసినది స్టార్ హీరోయిన్స్ స్థాయివారు చేసే పాత్ర.. నేనింకా ఆ స్థాయికి రాలేదు. కానీ నా మీద నమ్మకంతో దర్శక–నిర్మాతలు ఈ సినిమా తీసినందుకు ధన్యవాదాలు. నయనతార నాకు స్ఫూర్తి. ఆమెలా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటించాలని ఉంది’’ అని హీరోయిన్ పూర్ణ అన్నారు. ఆమె లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘సుందరి’. కల్యాణ్ జీ గోగన దర్శకత్వం వహించారు. అర్జున్ అంబటి హీరోగా నటించారు. రిజ్వాన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రిజ్వాన్ మాట్లాడుతూ– ‘‘సుందరి’ సినిమాను థియేటర్స్‌లో విడుదల చేయాలనే ఇన్ని రోజులు వేచి చూశాం. మా చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదలవుతుంది’’ అన్నారు. ‘‘ఎదురుగా ఓ మనిషి ఉంటే సరిగ్గా మాట్లాడటానికి భయపడే ఓ అమ్మాయి అతిగా స్పందిస్తే ఎలా ఉంటుంది? అన్నదే ఈ సినిమా కథ’’ అన్నారు కల్యాణ్ జి గోగన. ఈ కార్యక్రమంలో నటులు అర్జున్ అంబటి, రాకేందు మౌళి, సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి, సహ నిర్మాత ఖుషి పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: బాల్‌రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్: శ్రీవల్లి చైతన్య, సహ నిర్మాత: కె. రామిరెడ్డి. -
పూర్ణ 'సుందరి' సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్
హీరోయిన్గా చేస్తుండటంతో పాటు కీలక పాత్రలు, ప్రత్యేక పాటల్లో నటిస్తూ, బుల్లితెర షోలకు హోస్ట్‌గా చేస్తూ బిజీగా ఉన్నారు పూర్ణ. ఆమె కథానాయికగా నటించిన తాజా లేడీ ఓరియంటెడ్ మూవీ ‘సుందరి’. ‘ది అల్టిమేట్ డెసిషన్ ఆఫ్ యాన్ ఇన్నోసెంట్ లేడీ’ (ఒక అమాయక స్త్రీ అంతిమ నిర్ణయం) అనేది ట్యాగ్‌లైన్. ఆగస్ట్ 13న విడుదల కానున్న ఈ చిత్రాన్ని ‘నాటకం’ ఫేమ్ కళ్యాణ్ జీ గోగన దర్శకత్వంలో రిజ్వాన్ నిర్మించారు. అర్జున్ అంబాటి కీలక పాత్ర చేసిన ఈ చిత్రానికి సంగీతం: సురేష్ బొబ్బిలి, కెమెరా: బాల్‌రెడ్డి, కో–ప్రొడ్యూసర్: ఖుషి, కె రామ్‌రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్: శ్రీ వల్లి చైతన్య. -
గ్లామర్ డాల్ పూర్ణ ఫోటోలు
-
నోరే ఊరేలా... కూరే కావాలా!
టేస్టీ టేస్టీ కూరను రుచి చూపించనున్నారు పూర్ణ. ఫుడ్ మేళా పెట్టారేమో అనుకుంటున్నారా? అదేం కాదు.. ‘బ్యాక్‌డోర్’ సినిమాలో రుచికరమైన కూర నేపథ్యంలో ఓ పాట ఉంటుంది. సినిమాలో నటీనటులు ఎలాగూ టేస్ట్ చేస్తారనుకోండి. పూర్ణ ప్రధాన పాత్రలో కర్రి బాలాజీ దర్శకత్వంలో సతీష్ కుమార్ సమర్పణలో బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘బ్యాక్ డోర్’. ఈ చిత్రంలోని రెండో పాట ‘నోరే ఊరేలా... కూరే కావాలా’ పాటను చెఫ్ సంజయ్ తుమ్మ చేతుల మీదగా విడుదల చేయించారు. ప్రణవ్ స్వరపరచిన ఈ పాటకు చాందిని సాహిత్యం అందించారు. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. -
‘దృశ్యం 2’ సెట్స్‌లో జాయిన్ అయిన మీనా
‘దృశ్యం 2’ సినిమా సెట్స్‌లో జాయిన్ అయ్యారు హీరోయిన్ మీనా. సూపర్ హిట్ మూవీ ‘దృశ్యం’ (2014) సినిమాకు సీక్వెల్‌గా ‘దృశ్యం 2’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తొలి భాగంలో హీరో హీరోయిన్లుగా నటించిన వెంకటేష్, మీనాయే సీక్వెల్లో కూడా చేస్తున్నారు. సోమవారం నుంచి ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు మీనా. ‘‘స్టార్ట్ రోలింగ్.. ‘దృశ్యం 2’ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాను’’ అని పేర్కొన్నారు మీనా. ఈ సినిమాలో నటి పూర్ణ కూడా ఓ కీలకపాత్ర చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మలయాళ మాతృక ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ సినిమాలను డైరెక్ట్ చేసిన జీతూ జోసెఫ్ తెలుగు ‘దృశ్యం 2’తో దర్శకుడిగా తెలుగుకి పరిచయం కానున్నారు. ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. చదవండి: ఈ ఆపరేషన్ నా జీవితాన్ని మార్చేసింది : బిగ్ బీ -
డ్రగ్స్ ఎలా తీసుకోవాలో ఆ నటుడు నేర్పించారు
తెలుగింటి అమ్మాయిలా కనిపించే కేరళ కుట్టి పూర్ణ.. ‘అవును’, ‘లడ్డుబాబు’, ‘అవును 2’ వంటి చిత్రాలతో టాలీవుడ్లో మంచి గుర్తింపు పొందింది. ప్రస్తుతం నెగిటివ్ రోల్ చేయడానికి సైతం రెడీ అయిపోయింది. విజయ్ కుమార్ కొండ దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా నటించిన సినిమా పవర్ ప్లే. కోట శ్రీనివాస రావ్, ప్రిన్స్, అజయ్, పూజా రామ్‌చంద్రన్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రంలో పూర్ణ విలన్‌గా నటించింది. మొదటిసారి నెగిటివ్ రోల్ చేస్తున్న పూర్ణ..ఈ సినిమాలో డ్రగ్స్‌కు బానిసైన వ్యక్తిగా కనపించనున్నారు. సినిమా ప్రమోషన్లలో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన పూర్ణ..ఈ సినిమాతో తాను కొత్తగా కనిపిస్తానని, మొదటిసారి నెగిటివ్ రోల్ పోషిస్తున్నట్లు చెప్పింది. ఇందులో డ్రగ్ అడిక్ట్‌గా కనిపిస్తానని, ఇందుకోసం చాలా కష్టపడ్డానని, డ్రగ్స్ ఎలా తీసుకోవాలో తనకు తెలియక పోవడంతో షూటింగ్ సమయంలో కొంత ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో ముక్కుతో డ్రగ్‌ను పీల్చే సన్నివేశాలు ఉంటాయని, అయితే డ్రగ్స్ ఎలా తీసుకుంటారో తెలియక ఒక్కోసారి ఆ పౌడర్ ముక్కులోకి వెళ్లిపోయేదని తెలిపింది. ఈ క్రమంలో సెట్లో ఉన్న ఓ నటుడు డ్రగ్‌ను ఎలా పీల్చాలో నేర్పించాడని, అది చాలా హెల్ప్ అయ్యిందని చెప్పింది. థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమా నేడు (మార్చి5)న విడుదల అయ్యింది. చదవండి : (రియా.. నిన్ను చాలా మిస్సవుతున్నా: సోనం) (మీపై ఎంత ప్రేమ ఉందో మాటల్లో చెప్పలేను!) -
పూర్ణ ‘బ్యాక్ డోర్’ ఫస్ట్ లుక్ రిలీజ్
‘‘బ్యాక్ డోర్’ సినిమా ఫస్ట్ లుక్ చూస్తే విభిన్నమైన కాన్సెప్ట్‌తో రూపొందినట్లు తెలుస్తోంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి’’ అని హీరో ఆది సాయికుమార్ అన్నారు. పూర్ణ ప్రధాన పాత్రలో, యువ కథానాయకుడు తేజ ముఖ్యపాత్రలో కర్రి బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్యాక్ డోర్’. సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ సమర్పణలో బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని ఆది సాయికుమార్ విడుదల చేశారు. ‘‘ఈ సినిమాతో దర్శకుడిగా బాలాజీకి మంచి పేరు రావాలి’’ అన్నారు దర్శకుడు వీరభద్రం చౌదరి. బి.శ్రీనివాసరెడ్డి, కర్రి బాలాజీ, సెవెన్ హిల్స్ సతీష్ రెడ్డి, తేజ, నిర్మాత తిరుపతిరెడ్డి, పబ్లిసిటీ డిజైనర్ విక్రమ్ రమేష్ తదితరులు ఫస్ట్ లుక్ రిలీజులో పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రణవ్, నేపథ్య సంగీతం: రవిశంకర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రేఖ, కో–ప్రొడ్యూసర్: ఊట శ్రీను. -
నెత్తురోడిన రోడ్లు, హీరోయిన్‌తో లిప్‌లాక్‌లు
లవ్, కామెడీ సినిమాలకు కామా పెట్టి "పవర్ ప్లే"తో థ్రిల్లర్ మూవీ ట్రాక్ ఎక్కాడు హీరో రాజ్ తరుణ్. తన గత చిత్రం 'ఒరేయ్ బుజ్జిగా'ను తెరకెక్కించిన దర్శకుడు విజయ్ కుమార్ కొండ మరోసారి ఈ సినిమాకు డైరెక్షన్ బాధ్యతలు చేపట్టాడు. కానీ ఈ సారి కామెడీ జోలికి పోకుండా విభిన్న కథాంశంతో క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో పవర్ ప్లే చేశారు. ఈ సినిమా ట్రైలర్‌ను గురువారం ఉదయం రిలీజ్ చేశారు. ఒక్క డైలాగ్ లేకుండా సాగిపోయిన ఈ ట్రైలర్లో నేరాలు, ఘోరాలే ఎక్కువగా కనబడ్డాయి. (చదవండి: గుడ్ న్యూస్ చెప్పిన అరియానా.. యంగ్ హీరోతో..) ఇదిలా వుంటే రాజ్ తరుణ్ ఈసారి కూడా హీరోయిన్‌తో లిప్‌లాక్ సీన్లో నటించి మరోసారి రెచ్చిపోయాడు. మరి ఈ పవర్ ప్లేలో చివరికి ఎవరు గెలిచారు? రాజ్ తరుణ్ తన కంటి నుంచి జాలువారిన కన్నీటి బొట్లకు ప్రతీకారం తీర్చుకుంటాడా? లేదా? అన్న విషయాలు తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే! ఇక ఈ పవర్ ప్లేలో హేమల్ ఇంగ్లే కథానాయికగా కనిపించనుండగా పూర్ణ, మధునందన్, కోటా శ్రీనివాసరావు, రాజా రవీంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మహిధర్, దేవేష్ నిర్మిస్తున్నారు. మరోవైపు రాజ్ తరుణ్ 'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు' దర్శకుడు శ్రీనివాస్ గవిరెడ్డితో మరో సినిమా చేస్తున్నాడు. ఇందులో బిగ్‌బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ కీలక పాత్రలో నటిస్తోంది. (చదవండి: పుష్ప’టీమ్‌కు షాక్.. రెండు సీన్లు లీక్) -
బ్యాక్ డోర్‌తో ఇబ్బందులు
హీరోయిన్ పూర్ణ ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం ‘బ్యాక్ డోర్’. నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వంలో బి. శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్నారు. యువ కథానాయకుడు తేజ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం పూర్ణ, తేజలపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ‘‘బ్యాక్‌డోర్’ ఎంట్రీ వల్ల ఎదురయ్యే విచిత్ర పరిణామాల నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది’’ అన్నారు కర్రి బాలాజీ. ‘‘బాలాజీగారు కంప్లీట్ క్లారిటీతో షూటింగ్ చేస్తున్నారు’’ అన్నారు బి. శ్రీనివాస్ రెడ్డి. ‘‘నిర్మాతకు రివార్డులు, దర్శకుడికి అవార్డులు తెచ్చిపెట్టే చిత్రమిది’’ అన్నారు పూర్ణ. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రేఖ, కో–ప్రొడ్యూసర్: ఊట శ్రీను. -
సుందరి కథ
పూర్ణ లీడ్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘సుందరి’. ‘ది అల్టిమేట్ డెసిషన్ ఆఫ్ యాన్ ఇన్నోసెంట్ లేడీ’ అన్నది ఉపశీర్షిక. కల్యాణ్‌జీ గోగన దర్శకత్వం వహిస్తున్నారు. రిజ్వాన్ ఎంటర్టై¯Œ మెంట్ పతాకంపై రిజ్వాన్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రీ లుక్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా రిజ్వాన్ మాట్లాడుతూ– ‘‘మా బ్యానర్లో తెరకెక్కిస్తున్న ‘సూపర్ మచ్చి’ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ‘నాటకం’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు పొందిన కల్యాణ్‌జీ గోగన దర్శకత్వం వహిస్తున్న ‘సుందరి’ సినిమా ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్ ముగింపు దశలో ఉంది. త్వరలో ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేస్తాం’’ అన్నారు. అర్జున్ అంబటి కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి సహనిర్మాతలు: ఖుషి, కె. రాంరెడ్డి, లైన్ ప్రొడ్యూసర్: శ్రీవల్లి చైతన్య, సంగీతం: సురేష్ బొబ్బిలి, కెమెరా: బాల్ రెడ్డి. -
నటి కిడ్నాప్ ప్లాన్: ముఠా అరెస్టు
కొచ్చి: నటి షమ్నా కాసిం (పూర్ణ)ను కిడ్నాప్ చేసి భారీ ఎత్తున డబ్బు దోచుకోవాలని ప్రయత్నించిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 12 మంది సభ్యుల ముఠాలోని ఎనిమిది మందిని అరెస్టు చేశామని మిగతా నలుగురు పరారీలో ఉన్నారని కొచ్చి పోలీస్ కమిషనర్ విజయ్ సఖారే వెల్లడించారు. అలాగే వీరంతా గత మార్చి నెలలో పాలక్కాడ్‌లో ఎనిమిది మంది మోడల్స్ ను బంధించి, డబ్బుల వసూలు చేసిన కేసులో కీలక నిందితులని చెప్పారు. ఈ సందర్భంగా కిడ్నాప్, బెదిరింపునకు ప్రయత్నించిన ముఠా పథకాన్ని విజయ్ సఖారే మీడియాకు వివరించారు. మొదట షమ్నాతో వివాహ ప్రతిపాదన ద్వారా కుటుంబ సభ్యులతో సంబంధాలు ఏర్పరచుకుని, ఆ తరువాత కిడ్నాప్ చేసి, ఒక హోటల్ గదిలో బంధించి పెద్ద ఎత్తున డబ్బు గుంజాలని ప్లాన్ వేశారని వివరించారు. ఈ క్రమంలోనే షమ్నా నుండి ఒక లక్ష 50 వేల రూపాయలు డిమాండ్ చేశారని ఇది విఫలం కావడంతో కిడ్నాప్ ప్రయత్నాలను ముమ్మరం చేశారని తెలిపారు. సినిమా ఆఫర్ల పేరుతో నటీనటుల వివరాలను సేకరించి, బెదిరించి పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేయాలనేది వీళ్ల పథకమని పేర్కొన్నారు. సినిమా ప్రొడ్యూసర్లమని చెప్పి ప్రొడక్షన్ కంట్రోలర్ షాజీ ద్వారా అనేకమంది ప్రముఖుల ఫోన్ నంబర్ తదితర వివరాలను సేకరించినట్టు వెల్లడించారు. షమ్నా, ఇతర మహిళల ఫిర్యాదుల ఆధారంగా ఈ ముఠాపై ఏడు కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు. అలాగే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ హాస్య నటుడు ధర్మజన్ బోల్గట్టిను కూడా పోలీసులు విచారించారు. గ్యాంగ్‌లోని అస్గర్ అలీ తనకు రెండుమూడు సార్లు ఫోన్ చేశాడని బోల్గట్టి మీడియాకు చెప్పారు. ప్రొడక్షన్ కంట్రోలర్ షాజీ తన నంబర్‌ను ఆ గ్యాంగ్‌కు ఇచ్చాడని చెప్పుకొచ్చారు. లాక్డౌన్ సమయంలో తనను సంప్రదించిన ఈ గ్యాంగ్ షమ్ కాసింను పరిచయం చేయాలని అడిగారని బోల్గట్టి వెల్లడించారు. అయితే, ఈ కేసులో సినీ ప్రముఖులకు ఎలాంటి పాత్ర లేదని పోలీసులు స్పష్టం చేశారు. కాగా తెలుగులో సీమ టపాకాయ్, అవును సినిమాల ద్వారా పూర్ణ ప్రేక్షకులకు సుపరిచితమే. -
అలాంటి వారితో జాగ్రత్త : పూర్ణ
‘అలాంటి వారితో జాగ్రత్తగా ఉండండి’ అని నటి పూర్ణ హెచ్చరించింది. ఆమె మాట్లాడుతూ పెళ్లి పేరుతో మోసం చేస్తారని, అలాంటి వారితో కొత్తగా అవకాశాల కోసం వచ్చే నటీమణులు జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. తాను కూడా అలా ఒక వ్యక్తి నుంచి మోసపోయానని చెప్పింది. దక్షిణాదిలో నటిగా మంచి పేరు సంపాదించుకున్న నటి పూర్ణ. ఈమెకు తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తున్నా విషయం తెలిసిందే. ఒక వ్యక్తి ఆమెను పెళ్లి పేరుతో ఇటీవల మోసం చేసే ప్రయత్నం చేయగా ఆమె మేల్కొని పోలీసులకు పట్టించింది. దీని గురించి నటి పూర్ణ తనట్విట్టర్లో పేర్కొంటూ తన బంధువుల స్నేహితుల ద్వారా అన్వర్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడని చెప్పింది. (చదవండి : పోలీసులను ఆశ్రయించిన హీరోయిన్ పూర్ణ) ఆ తర్వాత అతను తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా తమ కుటుంబానికి పరిచయం చేసినట్లు తెలిపింది. అలా వారు ఇటీవల తమ ఇంటికి వచ్చారని చెప్పింది. వారిని ప్రత్యక్షంగా చూడడంతో తమకు అనుమానం కలిగిందని తెలిపింది. వారి వివరాలను అడగ్గా బదులు చెప్పకుండా వెళ్లిపోయారని తెలిపింది. ఆ తర్వాత ఫోన్ చేసి డిమాండ్ చేశారని చెప్పింది.తాము వారు అడిగిన డబ్బు ఇవ్వనడంతో బెదిరించారని, ఇంటి నుంచి బయటికి వస్తావుగా అప్పుడు చెప్తా నీ పని అని బెదిరించారని తెలిపింది. రంగస్థలం వేదికపై పాల్గొనడానికి వస్తావుగా అంటూ బెదిరించారని చెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది. వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేసినట్లు పేర్కొంది. ఇలాంటి వారితో పలువురు అమ్మాయిలు మోసపోయినట్లు తెలిసిందని, ఇప్పటికీ వారి బండారం బయటపడిందని చెప్పింది. రంగుల ప్రపంచమైన సినిమా రంగంలోకి అవకాశాల కోసం పలువురు యువతులు వస్తున్నారని, వారంతా హోటల్లో బస చేస్తూ అవకాశాల వేటలో పడుతున్నారని చెప్పింది. అలాంటి వారు అవకాశాల పేరుతో మోసాలకు దిగే వారితో జాగ్రత్తగా ఉండాలని పూర్ణ హెచ్చరించింది. అవకాశాలను కల్పిస్తామని వచ్చే వారి గురించి తమకు తెలిసిన వారితోగానీ, స్నేహితులతోగానీ చర్చించి మంచి నిర్ణయాన్ని తీసుకోవాలని సూచించింది. -
పోలీసులను ఆశ్రయించిన హీరోయిన్ పూర్ణ
కొచ్చి : ప్రముఖ హీరోయిన్ పూర్ణ పోలీసులను ఆశ్రయించారు. పూర్ణను నలుగురు యువకులు బ్లాక్మెయిల్ చేస్తున్నారంటూ ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన కేరళ పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులను త్రిసూర్‌కు చెందిన శరత్, అష్రఫ్, రఫీక్, రమేశ్‌లుగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. అరెస్ట్ చేసిన నలుగురిని ప్రస్తుతం జ్యూడిషియల్ కస్టడీలో ఉంచినట్టు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయి దర్యాప్తు జరుగుతుందని వెల్లడించారు. పూర్ణకు పెళ్లి సంబంధం తీసుకొచ్చామనే నెపంతో నిందితులు ఆమె ఇంటికి వచ్చినట్టుగా సమాచారం. వారిది కోజికోడ్ అని, పెళ్లి కుమారుడి కుటుంబ సభ్యులమని నిందితులు పూర్ణ కుటుంబ సభ్యులకు చెప్పారు. ఆ తర్వాత వారు పూర్ణకు ఫోన్ చేసి లక్ష రూపాయలు డిమాండ్ చేశారు. లేకపోతే ఆమె కేరీర్‌ను నాశనం చేస్తానని బెదిరించారు. దీంతో పూర్ణ తల్లి ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులు తమ ఇంటి పరిసరాల్లో తిరుగుతూ.. పూర్ణ ఫొటోలు తీస్తున్నారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, తొలుత డ్యాన్సర్‌గా, మోడల్‌గా కేరీర్ ప్రారంభించిన పూర్ణ.. ఆ తర్వాత వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చారు. దక్షిణాదిన పలు చిత్రాల్లో నటించిన పూర్ణ హీరోయిన్‌గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక, తెలుగులో అవును, అవును 2, సీమటపాకాయ్, జయమ్ము నిశ్చయమ్మురా.. వంటి చిత్రాల్లో నటించారు. పూర్ణ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు పలు రియాల్టి షోలకు ఆమె జడ్జిగా వ్యవహరిస్తున్నారు. (చదవండి : పెళ్లికి నేను సిద్ధం : పూర్ణ) -
‘విన్సన్’ పర్వతాన్ని అధిరోహించిన పూర్ణ
సాక్షి, హైదరాబాద్: అంటార్కిటికా ఖండంలో ఎత్తయిన విన్సన్ మసిఫ్ పర్వతాన్ని తెలంగాణకు చెందిన పర్వతారోహకురాలు మాలావత్ పూర్ణ ఈ నెల 26న అధిరోహించింది. ప్రపంచంలోనే ఎత్తయిన ఏడు పర్వతాలను అధిరోహించాలనే లక్ష్యంతో రంగంలోకి దిగిన పూర్ణ.. ఎవరెస్ట్, కిలిమంజారో, ఎల్బ్రస్, అకోన్కాగ్వా, కార్ట్స్నెజ్ పర్వతాలను ఎక్కింది. తాజాగా విన్సన్ మసిఫ్ పర్వతాన్ని అధిరోహించింది. ఇప్పటివరకు మొత్తం ఆరు ఎత్తయిన పర్వతాలను ఎక్కింది. ఉత్తర అమెరికాలోని దెనాలి పర్వతాన్ని అధిరోహించడమే మిగిలి ఉందని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. నిరుపేద గిరిజన కుటుంబం నుంచి వచ్చిన తనకు తెలంగాణ ప్రభుత్వం అందించిన సహకారంతోనే ఈ స్థాయికి వచ్చినట్లు పేర్కొంది. తనకు సహకారం అందించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు, గురుకుల కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌కు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. -
పెళ్లికి నేను సిద్ధం : హీరోయిన్
పెళ్లికి తాను సిద్ధంగా ఉన్నానని అంటోంది నటి పూర్ణ. ఈ మలయాళ భామ మంచి నటి, అంతకంటే మంచి డ్యాన్సరు. వివిధ భాషా చిత్రాల్లో కథానాయకిగా నటించిన పూర్ణ ఇప్పుడు కథానాయకిగానే కాదు పాత్ర బాగుంటే సపోర్టింగ్ రోల్స్ చేయడానికీ సిద్ధం అంటోంది. ఈ మధ్య ‘సువరకత్త’చిత్రంలో చాలా చక్కని నటన ప్రదర్శించి పేరు తెచ్చుకున్న పూర్ణ ప్రస్తుతం ‘బ్లూవేల్’అనే చిత్రంలో పోలీస్ అధికారిణిగా ముఖ్య పాత్ర పోషిస్తోంది. సూర్య కథానాయకుడిగా నటించిన ‘కాప్పాన్’ (తెలుగులో బందోబస్త్) చిత్రంలో చిన్న పాత్రలో మెరిసింది. సాయేషా సైగల్ కథానాయకిగా నటించిన ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా నటి పూర్ణ మీడియా ముచ్చటించారు. కాప్పాన్ చిత్రంలో నటించిన అనుభవం గురించి? కాప్పాన్ చిత్రంలో నటుడు సముద్రఖనికి జంటగా నటించాను. పాత్ర చిన్నదే అయినా సంతృప్తినిచ్చింది. ఇందులో నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను. భారీ చిత్రంలో నటించాలన్న ఆశ కాప్పాన్తో తీరింది. ఎక్కువగా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించడానికి కారణం? చాలా చిత్రాల్లో హీరోయిన్గా నటించాను. అలాంటిది సమీప కాలంలో కథానాయకిగానే నటించాలన్న ఆలోచన మారింది. పాత్రలో కొత్తదనం ఉందనిపిస్తే అది ఎలాంటిదైనా చేయడానికి వెనుకాడటం లేదు. చిత్రంలో అన్ని పాత్రలు ముఖ్యమే అవుతాయి. కొన్ని పాత్రలు కథానాయకి పాత్ర కంటే మంచి పేరు తెచ్చి పెడతాయి. ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలు? తమిళంలో బ్లూవేల్ చిత్రంతో పాటు తెలుగు, మలయాళ భాషల్లో ఒక్కో చిత్రం చేస్తున్నాను. బ్లూవేల్ చిత్రం గురించి? ఇది లో బడ్జెట్లో రూపొందిస్తున్న చిత్రమే కానీ, బ్లూవేల్ గేమ్ గురించి అవగాహన కలిగించే చిత్రంగా ఉంటుంది. ఇందులో పోలీస్ అధికారిణిగా, ఒక బిడ్డకు తల్లిగా నటిస్తున్నాను. చిత్రంలో పోరాట సన్నివేశాల కంటే ఎమోషనల్ సన్నివేశాలు అధికంగా ఉంటాయి. అవార్డుల ఆశతో పాత్రలను ఎంచుకుంటున్నారా? నేనెప్పుడూ అవార్డుల కోసమే నటించలేదు. పారితోషికం కూడా ముఖ్యమే. ఇప్పుడు చిన్న చిన్న పాత్రలకు కూడా మంచి పారితోషికం లభిస్తోంది. నాకు జీవితాంతం నటించాలని ఆశ. అయితే అది నా కుటుంబాన్ని బట్టి ఉంటుంది. కాప్పాన్ చిత్రంలో నా నటన కోసమే సంప్రదించారు. అలాంటి పేరు తెచ్చుకోవాలన్నదే నా ఆశ. పెళ్లెప్పుడు చేసుకుంటారు? పెళ్లి జీవితంలో ముఖ్యమైనది. అందుకు నేను సిద్ధంగా ఉన్నాను. సరైన సమయంలో చేసుకోవాలి. కుటుంబ సభ్యులు ఆ ప్రయత్నంలోనే ఉన్నారు. ఇక ఆ భగవంతుడే నిర్ణయించాలి. నా వివాహ రిసేప్షన్ మాత్రం కచ్చితంగా చెన్నైలోనే ఏర్పాటు చేస్తాను. -
మా కష్టం తెరపై కనపడుతుంది
జయప్రద, పూర్ణ, సాక్షీ చౌదరి, రామ్, ఇంద్ర ముఖ్య తారాగణంగా దర్శకుడు ఎం.ఎస్.ఎన్ సూర్య తెరకెక్కించిన చిత్రం ‘సువర్ణసుందరి’. చరిత్ర భవిష్యత్‌ని వెంటాడుతుంది అనేది ఉపశీర్షిక. ఎమ్.ఎల్. లక్ష్మీ నిర్మించారు. ఈ నెల 31న ఈ చిత్రం విడుదల కానుంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం ప్రీ–రిలీజ్ ఈవెంట్లో ఇంద్ర పుట్టినరోజు వేడుకలు జరిగాయి. కేక్ కట్ చేసిన తర్వాత ఇంద్ర మాట్లాడుతూ– ‘‘టీమ్ అందరూ చాలా కష్టపడ్డారు. ఈ టీమ్‌తో మరో సినిమా చేయాలని ఉంది. దర్శక–నిర్మాతల కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. ‘‘సినిమా ఉత్కంఠభరితంగా ఉంటుంది. దర్శకుడు సూర్య చాలా హార్డ్‌వర్క్ చేశారు’’ అన్నారు హీరో రామ్. ‘‘టీమ్ పడిన కష్టం తెరపై తెలుస్తుంది. ఇందులో నాది మంచి పాత్ర’’ అన్నారు పూర్ణ. ‘‘నా కెరీర్లో స్పెషల్ చిత్రం ఇది. గ్లామర్, యాక్షన్, లవ్, థ్రిల్ ఇలా అన్ని అంశాలను దర్శకుడు సూర్య హైలైట్‌గా తెరకెక్కించారు’’ అన్నారు హీరోయిన్ సాక్షి. ‘‘ఇది టెక్నీషియన్స్ చిత్రం. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు థ్రిల్లింగ్‌గా ఉంటుంది. కథ డిమాండ్‌కు తగ్గట్టుగా క్వాలిటీతో సినిమా చేశాం. దాదాపు 45 నిమిషాల గ్రాఫిక్ వర్క్ ఉండటంతో సినిమా విడుదల లేట్ అయింది’’ అన్నారు సూర్య. ‘‘నటీనటుల కష్టం, దర్శకుడు సూర్య టేకింగ్ ఈ సినిమాకు ప్రధాన బలం’’ అన్నారు సంగీతదర్శకుడు సాయి కార్తీక్. -
సరైన శిక్ష ఏదీ?
బహుభాషా నటీమణుల్లో నటి పూర్ణ ఒకరని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాతృభాష మలయాళం అయినా తమిళం, తెలుగు భాషల్లోనూ నటిగా ఈ బ్యూటీకి మంచి పేరు ఉంది. మునిమాండి విలంగియల్ 3ఆమ్ ఆండు చిత్రం ద్వారా కోలీవుడ్‌కు హీరోయిన్గా రంగప్రవేశం చేసిన పూర్ణ ఆ తరువాత కందకోట్టం, ఆడుపులి, సవరకత్తి, కొడివీరన్ చిత్రాల్లో నటించారు. అయితే ఇటీవల తన బాణీని మార్చుకున్నారు. కథానాయకిగానే నటిస్తానని పట్టుపట్టకుండా నటనకు అవకాశం ఉన్న ఎలాంటి పాత్రనైనా నటించడానికి సిద్ధం అంటున్నారు. మంచి డాన్సర్ అయిన పూర్ణ ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ జరిగింది, జరుగుతోంది, జరగనుంది అంతా ముందే రాసిపెట్టి ఉంటుందనే వేదాంత ధోరణిలో చెప్పుకొచ్చారు. నిజం చెప్పాలంటే తాను సినిమాల్లోకి వస్తానని, కథానాయకినవుతానని ఊహించలేదన్నారు. ఎవరి సపోర్టు లేకుండా ఈ స్థాయికి చేరుకున్నానని అన్నారు. మహిళలకు రక్షణ కల్పిస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నా, స్త్రీ ఒంటరిగా బయట ప్రపంచంలో సేఫ్‌గా తిరిగే పరిస్థితి లేదని పేర్కొంది. తన గురించే చెప్పాలంటే షూటింగ్కుగానీ, వేరే కార్యక్రమానికికానీ తనను ఒంటరిగా పంపడానికి తన తల్లి భయపడుతుందని చెప్పారు. తనతో అమ్మ గానీ, అక్క గానీ వస్తుంటారని తెలిపారు. ఎందుకంటే ఇప్పుడు మహిళలకు జరుగుతున్న సంఘటనలను చూసి వారు భయపడుతుంటారు. తాను డాన్స్ క్లాస్‌కు వెళ్లినా ఎవరో ఒకరు తనకు తోడుగా వస్తారన్నారు. ఇప్పుడు సమాజంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను చూస్తుంటే ఎవరిని నమ్మాలో? ఎవరిని నమ్మకూడదో అర్థం కావడం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మహిళల విషయంలో తప్పు చేసిన వారికి సరైన శిక్ష పడితే తప్పు జరగదని.. అప్పుడే అత్యాచారాలు తగ్గుతాయని అన్నారు. స్త్రీలు ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా బయట తిరగగలుగుతారని చెప్పారు. తప్పు చేస్తే విదేశాల్లో కఠిన శిక్షలు ఉంటాయని, ఇక్కడ అలాంటి పరిస్థితి లేదని నటి పూర్ణ పేర్కొన్నారు. -
విడుదలకు సిద్ధమైన ‘సువర్ణ సుందరి’
జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘సువర్ణసుందరి’. సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీకి సూర్య ఎమ్.ఎస్.ఎన్ దర్శకుడు. చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతోందన్న ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ తో భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా అతి త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను ప్రముఖ దర్శకులు బి.గోపాల్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ సాగర్ మాట్లాడుతూ... ‘ఇది చాలా ఎక్స్ట్రాడినరీ చిత్రం. హీరోయిన్స్ చాలా చక్కగా చేశారు. మన తెలుగు సినీ పరిశ్రమకు అందగత్తే జయప్రద. ఆవిడ కూడా ఈ చిత్రంలో నటించారు. ఎంటైర్ టీమ్ కి ఆల్ ద బెస్ట్. సాయికార్తిక్ మ్యూజిక్ బావుంది. ఫైట్స్ చాలా బాగా వచ్చాయి.’ అన్నారు. హీరోయిన్ పూర్ణ మాట్లాడుతూ... ‘సహనం అంటే అది సూర్య గారి నుంచే నేర్చుకోవాలి. ప్రతీ ఒక్కరికీ చాలా ఓర్పుగా తమ తమ పాత్రల గురించి చాలా చక్కగా వివరించి ఆయనకు ఏమి కావాలో ఆ అవుట్ పుట్ తెప్పించుకున్నారు. ఫైట్ మాస్టర్‌కి కూడా నా కృతజ్ఞతలు. హీరో రామ్ కూడా మొదట్లో కొంచం భయపడేవారు కాని బాగా నటించారు. సాక్షి మనిద్దరి మధ్య జరిగే చాలా సన్నివేశాలు అన్నీ ఫన్నీగా జరిగిపోయాయి. మా టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్’ అన్నారు. -
హీరోను నిజంగానే కొట్టేశాను..
సినిమా: మగ మిత్రులు తనతో సరదాగా మాట్లాడడానికే భయపడుతున్నారని నటి పూర్ణ అంటోంది. ఈ మలయాళీ భామ మాత్రభాషతో పాటు తెలుగు, తమిళం అంటూ దక్షిణాది భాషలన్నింటిలోనూ నటిస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం నాలుగు చిత్రాలు చేతిలో ఉన్నాయి. అయితే కథానాయకి పాత్రల్లోనే నటిస్తానని బెట్టు చేయకుండా పాత్రకు ప్రాధాన్యత ఉంటే నటించడానికి సిద్దం అనడంతో కాళీ లేకుండా నటించేస్తోంది. ప్రస్తుతం విమల్ హీరోగా నటిస్తున్న ఇవనుక్కు ఎంగేయో మచ్చమ్ ఇరుక్కు చిత్రంలో పోలీస్అధికారిణిగా మాస్ పాత్రలో నటిస్తోంది. ఈ సందర్భంగా పలు విషయాలను ముచ్చటించింది. అవేమిటో చూద్దాం. ఇవనుక్కు ఎంగేయో మచ్చమ్ ఇరుక్కు చిత్రంలో పోలీస్ అధికారిగా నటిస్తున్నాను. ఇది ఒక రొమాంటిక్ థ్రిల్లర్ కథా చిత్రం. ఇందులో రౌడీ పోలీస్అధికారిణిగా కనిపిస్తాను. హీరో విమల్‌ను, సింగంపులిని తరిమి తరిమి కొట్టడమే నా పని. అలాంటి సన్నివేశాల్లో చాలాసార్లు వారిని నిజంగానే కొట్టేశాను. దీంతో పాటు బ్లూవేల్ అనే చిత్రంలో నటిస్తున్నాను. ఈ చిత్రంలో తొలి సారిగా ద్విపాత్రాభినయం చేస్తున్నాను. అందులో ఒకటి పోలీస్ పాత్ర కావడం విశేషం. అయితే ఆ పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుంది. అదేవిధంగా మమ్ముట్టితో కలిసి మధురవీరన్ చిత్రంలోనూ నటిస్తున్నారు. అలాగే ఒక తెలుగు చిత్రం చేస్తున్నాను. అందులో నటి జయప్రదకు తల్లిగా, కూతురిగా ద్విపాత్రాభినయం చేస్తున్నాను. నాతో పాటు నటించడానికి వచ్చిన సహ నటీమణులు ఇప్పుడు ఫీల్డ్‌లో లేరు. నేను ఇంకా నటిగా కొనసాగడం సంతోషంగా ఉంది. ఇందుకు కారణం తమిళ ప్రేక్షకుల ఆదరణే. నటనకు అవకాశం ఉన్న పాత్రలే నన్ను వెతుకుంటూ వస్తున్నాయి. ఆ విధంగా సంతోషమే. ఇకపోతే నా శరీరాకృతికి గ్లామర్ సెట్ అవ్వదు. అదేవిధంగా ఇలానే నటించాలన్న నిబంధనలేమీ లేవు. నేనొక క్లాసికల్ డాన్సర్‌ని. చాలా స్టేజ్ ప్రదర్శనలు ఇచ్చాను. ఇవనుక్కు ఎంగేయో మచ్చమ్ ఇరుక్కు చిత్రం కోసం గుండు కొట్టించుకోవడాన్ని ఆశ్చర్యంగా చూస్తున్నారు. అయితే ఈ విషయంలో స్వామికి జుత్తు సమర్పించినట్లుగా నేను భావిస్తున్నారు. మరో విషయం ఏమిటంటే నాకు బాయ్ కట్ హెయిర్‌స్టైల్‌లో చూసుకోవాలన్నది చాలా కాలంగా ఉన్న కోరిక. గుండు కొట్టించుకోవడంతోనే అది సాధ్యం అయ్యింది. ఇప్పుడు మీటూ కలకలం సృష్టిస్తోంది. అయితే మీటూ వ్యవహారానికి నేను మద్దతు పలకను. ఎందుకంటే ఏదైనా ఒక విషయం జరిగితే వెంటనే రియాక్ట్ కావాలి. అంతే కానీ, నెల తరువాత స్పందిస్తే వృథానే. అదే విధంగా మీటూ కారణంగా నా సన్నిహిత మగ మిత్రులు కూడా సరదాగా మాట్లాడడానికి భయపడుతున్నారు. షూటింగ్ స్పాట్లో జాలీగా మాట్లాడుకునే కాలం కొండెక్కింది. ఇది మనల్ని మనమే అసహ్యించుకునే చర్యగా భావిస్తున్నాను. -
మీటూ అంటే స్వీయ అవమానమే
‘‘మీటూ’ ఉద్యమం మీద ఇండస్ట్రీలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. చాలా మంది నటీనటులు ఈ ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తున్నారు. కొందరేమో కొట్టిపారేస్తున్నారు. ‘అవును’ ఫేమ్ పూర్ణ మాత్రం ‘మీటూ అంటే సెల్ఫ్ షేమింగ్’ అంటున్నారు. ఈ విషయం గురించి పూర్ణ మాట్లాడుతూ – ‘‘ఏదైనా సంఘటన జరిగినప్పుడు వెంటనే స్పందించాలి. బయటకు చెప్పాలి. నెల తర్వాత చెప్పినా కూడా అది నిరుపయోగమే. ప్రస్తుతం వస్తున్న కాంట్రవర్సీలు, రిపోర్ట్లు చూసి నా మేల్ ఫ్రెండ్స్ నాతో మాట్లాడటానికి సంకోచిస్తున్నారు, భయపడుతున్నారు కూడా. ఈ ఉద్యమం కేవలం సెల్ఫ్ షేమింగ్ (స్వయం అవమానం) అనిపిస్తోంది నాకు. మనల్ని మనమే అవమానించుకున్నట్టుగా ఉంది’’ అని పేర్కొన్నారు.