
Back Door Movie Postponed: నటి పూర్ణ ప్రధాన పాత్రలో తేజ త్రిపురాన హీరోగా నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'బ్యాక్ డోర్'. ఈ సినిమా విడుదల పలు అనివార్య కారణాలతో వాయిదా పడింది. డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావలసిన ఈ చిత్రం డిసెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రేజీ చిత్రం వరల్డ్ వైడ్‌గా థియేటరికల్ హక్కులు "కె.ఆర్. ఫిల్మ్ ఇంటర్నేషనల్" అధినేత, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, నిర్మాత కందల కృష్ణారెడ్డి సొంతం చేసుకున్న తెలిసిందే.
కె.ఆర్.ఫిల్మ్ ఇంటర్నేషనల్ అధినేత కందల కృష్ణారెడ్డి మాట్లాడుతూ 'బ్యాక్ డోర్ చిత్రాన‍్ని భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు థియేటర్లు లభ్యం కానందున ఈనెల 3కు బదులుగా ఈ నెల 18న విడుదల చేస్తున్నాం. ఈనెల 15న భారీ స్థాయిలో ప్రి-రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాం" అని తెలిపారు. ఈ సినిమాను ఆర్చిడ్ ఫిలిమ్స్ పతాకంపై బి. శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment